తే.గీ:"పంట తగ్గిన ధర హెచ్చు పలుకు"ననుచు నమెరికా రైతు మది నెంతొ యాశ జెందె పంట బెంచెడు వర్షము వచ్చు ననుచు కర్షకుం డేడ్చె నింగి మేఘముల గాంచి (భారతదేశం లో విత్తనం వేస్తూ రైతు పంట బాగా పండాలని కోరుకుంటాడు.అమెరికా రైతు పంట తగ్గిపోయి రేటు పెరగా లని కోరుకుంటాడు అనేది ఒక సామెత.)
పంట యంతయుఁ గళ్ళపు ప్రాంత మందె
రిప్లయితొలగించండియుండ , యేమిజే యగలేక యోర్మి లేమి
కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి
పంట నాశన మగునను భయముఁదోడ
పంట లెండుట గమనించి బాధ పడుచు
రిప్లయితొలగించండికర్ష కుండే డ్చె నింగి మే ఘముల. గాంచి
గగన మంతయు నిండియు కాంక్ష బెంచి
మాయ మగు చుండె నేలకో మభ్య పెట్టి
ఉ.
రిప్లయితొలగించండిశీర్షములెత్తుచున్ గవులు శ్రేష్ఠపు కావ్యములందజేయగన్
ఘర్షణ నొంది పేదరిక కాపులవోలె కుటుంబ బాధ్యతల్
వర్షము లేక, పోతన, జవన్, సిరి నాథుడు వేడు రీతిలో
*“కర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్”*
తేటగీతి
రిప్లయితొలగించండిఆరుగాలము శ్రమియించి నధికముగను
సస్యమును చేతికిని వచ్చు సమయమందు
కుంభవృష్టిగా వానలు కురియుచుండ
కర్షకుండేడ్చె నింగి మేఘములఁగాంచి.
ఉత్పలమాల
తొలగించండివర్షములెక్కువంగురవ పండిన పత్తియు పోవునంచు నా
కర్షకుఁడేడ్చెమేఘములఁగాంచియు;శ్రావణమాసమందునన్
హర్షమునొందె కప్పలు,విహాయసమందున నొప్పె కొంగలా
కర్షితులైరి దంపతులు కాంచన కేతకి సౌరభాలకున్.
తేటగీతి
రిప్లయితొలగించండివరుస మూడేళ్లు కరువుతో బాధపడియు
నార్తి దీర్చెడు వర్షంపుటాశలుడుగ
శ్రావణంబైనఁ గురువక సాగి పోవ,
కర్షకుం డేడ్చె, నింగి మేఘములఁ గాంచి
ఉత్పలమాల
వర్షము మూడు వర్షములు బాధను గూర్పగఁ గా టకాన ని
ష్కర్షను నార్తిదీర్చునని స్వాంతమునందున నమ్మియుంట సం
ఘర్షణఁ జిన్కు రాల్చకనె క్రాలుచు నింగిని సాగిపోవగన్
గర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్
వర్షము వచ్చుచో సెనగ పంటలు నాశన మౌను భీతితోఁ
రిప్లయితొలగించండిగర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్
గర్షకు లెల్లవారలును గాయము లొందుచు ఱేయి ప్రొద్దులన్
వర్షము బారి నొందుచును బంటలు బండు విధంబుఁజేతురే
వర్షముల రాకకయి కృషీవలుడు యెదురు
రిప్లయితొలగించండిచూచుచుండగ నతనికి చూపడె నొక
యతి పలుచని కాదంబిని యాక సమున,
కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి
రిప్లయితొలగించండితొలిదినములందె వానలు తొల్కరించె
ననుచు బీజవాపనసేసె నదువకాపు
చేతి కందెడు పంటలే చెడునటంచు
కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి.
వర్షము తాను ముందుగనె వాగులు వంకలు నింపెనంచు నీ
వర్షము మోదమందుచును పంటలు వేయ, ఫలించు వేళలో
వర్షము తొల్కరించినను పైరులు నాశన మౌనటంచిలన్
గర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపంట చేతి కందు నటంచు పరవశించ
రిప్లయితొలగించండికుంభవృష్టిగ వానలు కురిసి నంత
దిక్కుతోచని స్థితిలోన తెల్ల బోయి
కర్షకుండేడ్చె నింగి మేఘముల గాంచి
తెరపి నీయక వానలే కురియుచుండ
రిప్లయితొలగించండివాగు వంకలే పొరలుచు వరదలెత్తె
నీట మునిగిన వరిచేలు వీటిబోవ
కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి
ఏటికేడాది కష్టించి పాటుపడిన
రిప్లయితొలగించండికుంభవృష్టిగ వానలు కురిసి రైతు
వెన్ను విరిచెను పంటలు మన్నుఁ గలిసి
కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి
వర్షము పెల్లుగా కురిసి వాగులు వంకలు పొంగి పొర్ల ను
రిప్లయితొలగించండిత్కర్షపు సస్యముల్ మునిగె గంగను రైతును క్రుంగదీయుచున్
హర్షముఁ గూర్చు వర్షమిటు లక్కట దుఃఖపు హేతువై చనన్
కర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణ మాసమందునన్
తర్షము తీర్చ వర్షములు తద్దయు ప్రీతిని దుక్కి దున్ని సం
రిప్లయితొలగించండిహర్షముతోడ సాకుచు నయమ్మున నారుల, నాట నెంచ సం
ఘర్షణతోడ తప్పుకొని గాడ్పు కతమ్మున పోవు చుండగా
కర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్
ఘర్షణము సెలరేఁగెను గాంచ మదిని
రిప్లయితొలగించండివర్షము లధికం బగుటను వంతతో న
మర్ష మంత విజృంభింప మానసమునఁ
గర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి
మర్షము క్రుంగె నేమొ మఱి మర్త్యుల పైనఁ గడింది వజ్రికిన్
ధర్షణ మిట్లు మిక్కుటము దా నిడ మా యపరాధ మెద్దియో
వర్షము కుండ పోత వలె వారక కుర్యఁగఁ దిర్గి యింకనుం
గర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణ మాస మందునన్
వర్షము లేమిచే మిగుల పచ్చని సస్యము
రిప్లయితొలగించండిలెండిపోయెడిన్
వర్షము వచ్చిహెచ్చుగను పైరులు పంటలు నాశమయ్మెడిన్
వర్షము లేకపోయినను వచ్చిన రైతుకు
దు:ఖభారమే
కర్షకుడేడ్చె మేఘముల గాంచియు శ్రావణ మాసమందునన్.
ఉ:వర్షము నీక యే నిరుడు భళ్లున మోతలె తెచ్చుండగా
రిప్లయితొలగించండికర్షకు డేడ్చె మేఘముల గాంచియు శ్రావణ మాస మందునన్
వర్షము చాలు లెమ్మనగ బాయని యిప్పటి వృష్టి తీరుతో
కర్షకు డేడ్చె మేఘముల గాంచియు శ్రావణ మాస మందునన్.
తే.గీ:"పంట తగ్గిన ధర హెచ్చు పలుకు"ననుచు
రిప్లయితొలగించండినమెరికా రైతు మది నెంతొ యాశ జెందె
పంట బెంచెడు వర్షము వచ్చు ననుచు
కర్షకుం డేడ్చె నింగి మేఘముల గాంచి
(భారతదేశం లో విత్తనం వేస్తూ రైతు పంట బాగా పండాలని కోరుకుంటాడు.అమెరికా రైతు పంట తగ్గిపోయి రేటు పెరగా లని కోరుకుంటాడు అనేది ఒక సామెత.)
వర్షమా ! హర్షమాగను వరుణ దేవ
రిప్లయితొలగించండివరుస నాలుగు నెలలుగా తరుచుగాను
వచ్చి పోవుచు నున్నారు వదలుమనుచు
“కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి”
వర్షమువచ్చుచుండగనిపంపలు హెచ్చుగ పండునంచుతా
రిప్లయితొలగించండిహర్షముతోడనుండనదియాగక మారతుఫానుగానుసం
ఘర్షణతోడనిండగనుకన్నులనీరదిదిక్కుతోచకన్
కర్షకుడేడ్చెమేఘముల గాంచియు శ్రావణమాసమందునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదర్శకుడై తనాకసము దర్శన మివ్వగ పొంగిపోవుచున్
రిప్లయితొలగించండిస్పర్షగ వానచుక్కలుగ జల్లులు సందడిజేయగానుతా
హర్షమునొందె తర్షకుడు యంతనె మబ్బులు మాయమవ్వగన్
“కర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్