15, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4206

16-10-2022 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంటలందు విచ్చె మల్లెపూలు”
(లేదా...)
“మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్”

20 కామెంట్‌లు:

  1. మింటను భానుడేగుచును మిన్నగ వెల్గుల
    నీనుకాలమున్
    జంటలు నొక్కటై మిగుల సంతసమందు విశాఖ
    మాసమున్
    పంటకు నానుకూల్యమని బన్నుగ బెంచగ తోటలందునన్
    మంటలలోన విచ్చుకొనె మల్లెలు జల్లుచు దావులెల్లెడల్

    రిప్లయితొలగించండి

  2. అడవి కేగి మోదుకాకులఁ దెచ్చి వి
    స్తారలగను గుట్టి పార వేసి
    యంకురముల నాట నద్భుతమది చూడు
    మంటలందు విచ్చె మల్లెపూలు.

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    మల్లెపూవువంటి మహిమాన్వితపు నవ్వు
    సీత మోముఁ బాసె చేరి లంక
    రాముఁ జేతఁ గూలి రావణుడున్ గాలె
    మంటలందు, విచ్చె మల్లెపూలు!

    ఉత్పలమాల
    జంటగ రామమూర్తిఁ గొని జానకి నవ్వుల విచ్చె మల్లెలున్
    తుంటరి రావణాధముని దుష్టత బాసెను మోమునవ్వులన్
    వింటిని రామబాణమున వేటుకుఁ గూలిన మోహి కాలఁగన్
    మంటలలోన, విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    శుకపికస్వరములు క్షోభించుచుండెను
    వెన్నెలెండయయ్యె విభుఁడు రాడు
    చెలియ!కాంచితివటె చెలికాని విరహంపు
    మంటలందు విచ్చె మల్లెపూలు.

    ఉత్పలమాల
    తుంటరి మన్మథుండు కడు తుంటరులౌ శశి,గాడ్పు, చైత్రులన్
    వెంటను గొంచు వచ్చి నను వేదనకుంగురిసేయుచుండెనే
    కంటివె నెచ్చెలి!ప్రియుఁడు కావగ రాడయె నీవియోగమన్
    మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁదావు లెల్లడల్.

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    మింటిని నీశ్వరీ కరుణ మెప్పుగ మల్లెలమాలనొందగన్
    దంటగ నత్రి పుత్రుడిడె దక్షునకున్ బహుమానమై తమిన్
    *మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్*
    పంట మనెన్ సతీ సుతయె, ప్రాణము బోయెను భర్గనిందచే.

    ( *కథ: దుర్వాస మహర్షి, భువనేశ్వరి కటాక్షం చేత, మణిద్వీపము నుండి పూలమాలను గ్రహించెను. దక్ష ప్రజాపతి అడుగగా మాలను ఇచ్చెను. దానిని పొరపాటుచే దక్షుడు శయ్యపై ఉంచెను. తరువాత అతనికి సతీదేవి జన్మించెను. ఆ తరువాత శివుని నిందించుట మొదలుగా చేసిన అపరాధములచేత దక్షుని ప్రాణము పోయెను.* )

    రిప్లయితొలగించండి

  6. పంటపొలమ్ముకేగి పలు పత్రములన్ గొని తెచ్చి వాటితో
    నంటల గుట్టి వాటిపయి నాఢకి వేసి ముదమ్ముగాను మా
    యింటివసారలో నిలుప నింపుగ నంకురమందె గాంచర
    మ్మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్.

    రిప్లయితొలగించండి
  7. ఆటవెలది:
    మండుటెండ రేపె మంటలు భువిపైన
    తాళలేక జనులు తల్లడిల్ల
    సాంత్వనంబునీయ చల్లదనమునిచ్చి
    మంటలందు విచ్చె మల్లెపూలు

    ఉత్పలమాల:
    తుంటరి వెల్గుఱేఁడు తన దుస్సహచండ ప్రచండ రశ్ములన్
    మింటిని మంటినొక్కటిగ మేదిని జీవులు తల్లడిల్లగా
    మంటలు రేపుచుండ సుషిమమ్మును పంచగ నెల్లవారికిన్
    “మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్”

    రిప్లయితొలగించండి
  8. వృక్షములు దరికొను వేడిమి పుట్టించు
    మంటలందు ; విచ్చె మల్లెపూలు
    కాక వచ్చె ననుచు కడు కౌతు కమునొంది
    దేని కేది శుభమొ తెలియ నొప్పు

    రిప్లయితొలగించండి
  9. నవవసంత రుతువునందు వివాహమై
    మల్లెమొగ్గలిడినమంచమందు
    పవ్వళించియున్న జవ్వనుల యొడలి
    మంటలందు విచ్చె మల్లెపూలు

    రిప్లయితొలగించండి
  10. మసిగ మారె శిరము మండుచుఁ గాలుచు
    మంటలందు, విచ్చె మల్లిపూలు
    తెల్ల వారు సరికి తెల్లటి రంగులోఁ
    జూడ ముచ్చ టాయెఁ జూపులకును

    రిప్లయితొలగించండి
  11. కంటిని రావణాసురుని గాలుచు ,మండుచుఁ బేలుచుండుటన్
    మంటలలోన, విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్
    బంటను నిండుగాఁబొదలు బారులు దీర్చుచుఁజూడముచ్చటై
    మింటను దాకు నట్లుగను మిన్నగఁ దావులు సల్లె యయ్యెడన్

    రిప్లయితొలగించండి
  12. జనుల కనులు గప్పి చతురత తో పలు
    వింత పనులు జూపు వేళ యందు
    మంత్ర తంత్ర గాని మాయంపు మహిమతో
    మంట లందు విచ్చె మల్లె పూలు

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:పాప యొకతె కాల్చ ప్రమిదతో కాకర
    వత్తి రవ్వ లలరె పాప మురియ
    దాని గాంచ చిన్న దాని నవ్వుల యందు,
    మంట లందు విచ్చె మల్లె పూలు

    రిప్లయితొలగించండి
  14. ఉ:మంటలు దెచ్చు నెండ లని మాటికి మాటికి దిట్టు చుందు మా
    మంటల లోనె తీయనగు మామిడి పండ్లు లభించె క్రొత్తవౌ
    జంటల కింపు గూర్చ సరసత్వము బెంచగ తీవ్ర మైన యా
    మంటల లోన విచ్చుకొనె మల్లెలు సల్లుచు దావు లంతటన్.
    (మల్లెలు,మామిడి పళ్లు రెండూ వేసవి లోనే లభిస్తాయి కదా!)

    రిప్లయితొలగించండి
  15. వింత వింత లెన్నొ చింతింప దేవుని
    సృష్టి లోన నెఱుఁగఁ గష్ట మౌను
    వీఁకఁ జెరుగు చుండ వేసవి నిప్పులు
    మంట లందు విచ్చె మల్లె పూలు

    అంటు కొనంగ నిప్పు కని యాజ్యము వోసిన భంగి దోఁపగాఁ
    గంటికిఁ గున్కు రాక నిసిఁ గాఱియ నందఁ గరం బెడంద పు
    ట్టింటికి నేఁగ స్వీయ సతి హెచ్చఁగ నా విరహంపు టగ్ని యా
    మంటల లోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావు లెల్లడల్

    రిప్లయితొలగించండి
  16. మదిని కోర్కె రేగి మారుడు తలపడ
    కామ భావనలవి కదులుచుండ
    నచ్చి నట్టి వాడు మెచ్చితనను చేర
    “మంటలందు విచ్చె మల్లెపూలు”

    రిప్లయితొలగించండి
  17. కంటకమయ్యెలోకులకు కాంతనుచేకొని సంచరించగా
    జంటగ జీవితాంతమును చక్కగ నుండను కోరపెద్దలన్
    తుంటరివారుగాకసరితోడుగ మెల్గుడి పెండ్లియాడనన్
    “మంటలలోన విచ్చుకొనె మల్లెలుసల్లుచుఁదావులెల్ల డల్”

    రిప్లయితొలగించండి
  18. కంటికి నింపుగూర్చు చెలి, గాదిలి పత్నిగఁ జేరి యిక్కకున్
    వంటలతోడఁ దృప్తినిడి, పంచుచుఁ బ్రేమము భర్త కిచ్ఛతో
    కొంటెగ చూచుచున్ జనగ కోర్కెనుఁ దీర్చగ, మారుతూపులన్
    మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్

    రిప్లయితొలగించండి