17-10-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సానినిఁ గని సుకవివరుఁడు సంతసమందెన్”(లేదా...)“సానినిఁ గాంచి పొందెఁ గడు సంతసమున్ సుకవీంద్రుఁ డొప్పుగన్”
కందంశ్రీనిగమవేద్యురాలిని జ్ఞాననిధిని,వాణిని,సురసన్నుత వీణాపాణిని విద్దెలకే దొర సానినిఁగని సుకవివరుఁడు సంతసమొందెన్. ఉత్పలమాల శ్రీనిగమాంత వీథుల చరించెడు శ్వేత దుకూలధారిణిన్ జ్ఞాననిధిన్ కరాబ్జవిలసత్ వర పుస్తక వల్లకీయుతన్ వాణిని,చారుహాసిని, సుభాషిణి, నాల్గుమొగాల వాని మేల్ సానినిఁగాంచిఁబొందెఁగడు సంతసమున్ సుకవీంద్రుఁడొఫ్పుగన్.
కందందీనునిగ కాళిదాసలఁబూనికనేర్వన్ దలంచి పూర్ణ సువిద్యల్మానిత భక్తిఁ గొలచి నాసానినిఁ గని సుకవివరుఁడు సంతసమందెన్ఉత్పలమాలపూనికఁ గాళిదాసు భువిఁ బూర్ణ సువిద్యలు నేర్పునందగన్దానుగ నార్తితోఁ బిలువ దైన్యత జంద్రకళావతంసనున్మానిత భక్తికిన్ మురిసి మాత ప్రసన్నత ముందునిల్వ నాసానినిఁ గాంచి పొందెఁ గడు సంతసమున్ సుకవీంద్రుఁ డొప్పుగన్
వాణిని మదిలో నిలుపుచుతానారంభించెను ఘనతర కావ్యంబున్మానసమున కైతల దొరసానినిఁ గని సుకవివరుఁడు సంతసమం దెన్
కందం
రిప్లయితొలగించండిశ్రీనిగమవేద్యురాలిని
జ్ఞాననిధిని,వాణిని,సురసన్నుత వీణా
పాణిని విద్దెలకే దొర
సానినిఁగని సుకవివరుఁడు సంతసమొందెన్.
ఉత్పలమాల
శ్రీనిగమాంత వీథుల చరించెడు శ్వేత దుకూలధారిణిన్
జ్ఞాననిధిన్ కరాబ్జవిలసత్ వర పుస్తక వల్లకీయుతన్
వాణిని,చారుహాసిని, సుభాషిణి, నాల్గుమొగాల వాని మేల్
సానినిఁగాంచిఁబొందెఁగడు సంతసమున్ సుకవీంద్రుఁడొఫ్పుగన్.
కందం
రిప్లయితొలగించండిదీనునిగ కాళిదాసలఁ
బూనికనేర్వన్ దలంచి పూర్ణ సువిద్యల్
మానిత భక్తిఁ గొలచి నా
సానినిఁ గని సుకవివరుఁడు సంతసమందెన్
ఉత్పలమాల
పూనికఁ గాళిదాసు భువిఁ బూర్ణ సువిద్యలు నేర్పునందగన్
దానుగ నార్తితోఁ బిలువ దైన్యత జంద్రకళావతంసనున్
మానిత భక్తికిన్ మురిసి మాత ప్రసన్నత ముందునిల్వ నా
సానినిఁ గాంచి పొందెఁ గడు సంతసమున్ సుకవీంద్రుఁ డొప్పుగన్
వాణిని మదిలో నిలుపుచు
రిప్లయితొలగించండితానారంభించెను ఘనతర కావ్యంబున్
మానసమున కైతల దొర
సానినిఁ గని సుకవివరుఁడు సంతసమం దెన్