29, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4234

30-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్”
(లేదా...)
“లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్”

31 కామెంట్‌లు:

  1. కందం
    భక్ష్యము సాత్వికమెంచుచు
    సాక్ష్యము భగవంతుఁడనఁగ సద్గతిఁ జూపన్
    గక్ష్య సుగమనమ్మౌ ని
    ర్లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్

    ఉత్పలమాల
    భక్ష్యము సాత్వికమ్మనగ పాటిగనొప్పగ స్వీకరించుచున్
    సాక్ష్యము దైవమై సతము సద్గతి జూపెడు నమ్మకంబునన్
    గక్ష్యను సత్పథమ్మునిచి గౌరవమందుచు గమ్యమంద ని
    ర్లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్

    రిప్లయితొలగించండి

  2. లక్ష్యమె వానికి పేదల
    రక్ష్యమ్ము, సతతమువారి రక్షణ కొరకై
    భక్ష్యములనిడుటలో ని
    ర్లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్.

    రిప్లయితొలగించండి
  3. సాక్ష్యము లేదని యెంచక
    భక్ష్యము సేయక నెవరిని వంచించకయే
    కక్ష్యనధి గ మించక ని
    ర్ల క్ష్య రహితుని మెచ్చె దరు స ల క్షణు డంచున్

    రిప్లయితొలగించండి

  4. లక్ష్యమె కూటిపేద పరి రక్షణయే పరమాత్మసేవగా
    భక్ష్యములున్ దుకూలముల పంచుచు కీరితి గోరకుండ తా
    సాక్ష్యమదేలయంచు పలు సాయము చేయుటలోన నెప్డు ని
    ర్లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    వీక్ష్యము జానకి జాడయె
    లక్ష్యము హనుమంతునకును లంకకరుగుటే
    సాక్ష్యము భూతంబులె,ని
    ర్లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుడంచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      సాక్ష్యము పంచభూతములె సంద్రము దాటియు లంకకేగగా,
      లక్ష్యము సీత జాడఁగని క్రమ్మఱ వచ్చియు శ్రోతృపాళికిన్
      భక్ష్యముగా వచించుటయె పావని చేసిన కృత్యమౌర!ని
      ర్లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁడంచును మెత్తురీధరన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. లక్ష్యముతోఁబనిఁ జేయుచు
    భక్ష్యంబులుబంచఁదగును భక్తిని మిగులన్
    లక్ష్యము విషయము లోని
    ర్లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్

    రిప్లయితొలగించండి
  7. కక్ష్యకు పిలచి యతిథులకు
    భక్ష్యము లిడగనె , చెడెనని పలికిన గూడన్
    సాక్ష్యము సంపాదించెడి
    లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్

    రిప్లయితొలగించండి
  8. కక్ష్యను వీడక నెపుడును
    కక్ష్యకములలో తిరిగెడు కరువలిపట్టిన్
    లక్ష్యంబుపైనిలుప ని
    ర్లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్

    రిప్లయితొలగించండి
  9. లక్ష్యము పైనెన్నడు ని
    ర్లక్ష్యము లేకున్న మేలు రహి సాధింపన్
    వక్ష్యంబెట్లగు నట్లన
    లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్

    (వక్ష్యము=చెప్పదగినది)

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    సాక్ష్యము జెప్పు మానవుడు సభ్యత గల్గిన సత్యవాదియై
    కక్ష్యను ధర్మ మార్గమని కామిత రూప్యము లాశ వీడుచున్
    వీక్ష్యము దుర్మదాంధ చెడు వీడుచునా పురుషార్థముల్ దెసన్
    *లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్.*

    రిప్లయితొలగించండి
  11. దాక్ష్యము ధైర్యము నిత్యా
    పేక్ష్యములే మానవులకు వృధ్యర్థములై
    వీక్ష్యమ లే శాప్రాపిత
    లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్

    సాక్ష్యము కాఁగ సంతతము సత్య చరిత్రకు మానవాళికిన్
    దాక్ష్యము మీఱఁ గార్యముల ధైర్యము తోడుత సర్వ మాన వా
    పేక్ష్యము శుద్ధ వృత్తమున వెల్గుచుఁ జంచల బుద్ధి సంత తా
    లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీ ధరన్
    [సంతత + అలక్ష్యము = సంత తాలక్ష్యము]

    రిప్లయితొలగించండి
  12. సాక్ష్యము లెన్నియో గలవు సాధన జేసిన కార్యసిద్ధియున్
    లక్ష్యములన్ని జేకురు పరంపర వృద్ధిఘటించునంచు గాన్
    కక్ష్యను వీడబోకు నిజగౌరవమందున లేసమైన ని
    ర్లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్

    కక్ష్య = పయనించవలసిన మార్గము.

    రిప్లయితొలగించండి
  13. లక్ష్యము గల్గినయున్న సలక్షణుడంచును
    మెత్తురీధరన్
    లక్ష్యముతోడచేసిన విలక్షణ కార్యము
    లన్ని సాధ్యమౌ
    సాక్ష్యము లెన్నయో కలవు సన్మతితో చరియించువారి ని
    ర్లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుడంచును
    మెత్తురీధరన్

    రిప్లయితొలగించండి
  14. లక్ష్యమునూహించియుతాన్‌
    దాక్ష్యమును వహించి గెల్వ ధరణిని వీరుల్‌
    లక్ష్యముజేయరితరమున
    "లక్ష్య రహితు మెచ్చెదరు, సలక్షణుఁ డంచున్”

    రిప్లయితొలగించండి
  15. లక్ష్యము లేని జీవనము లంగరు వేయని నావ చందమౌ
    గక్ష్యను దృష్టియందునిచి గాటపు పూనికతో మనంబునన్
    రక్ష్యపు మార్గమందుజని లక్ష్యముఁజేర పరిక్రమించు ని
    ర్లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్

    రిప్లయితొలగించండి
  16. లక్ష్యహుడౌచుతా నెపుడు లక్ష్యము పైగురిపెట్టు వాడిలన్
    సాక్ష్యము గీక్ష్యమంచు తను వీక్ష్యము జేయక మూర్ఖుడై చనున్
    ఈక్ష్యములందునే మనసు నెప్పుడు నిల్పుచు దక్కి నన్నిటన్
    “లక్ష్యము లేని వ్యక్తిని, సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్”

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.

    లక్ష్యమ్మును సాధించగ
    లక్ష్యముపై మనసుపెట్ట రాణింతురుగా
    వీక్ష్యము కాబోదది; ని
    ర్లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుడంచున్.
    (వీక్ష్యము=ఆశ్చర్యము)

    రిప్లయితొలగించండి