24, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4229

25-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాంబారా రసమ హితము సంతసములిడున్”
(లేదా...)
“సాంబారా రసమా హితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్”

33 కామెంట్‌లు:

  1. శంభో శంకర! హర! అన
    లాంబకుడా! యస్థిమాలి! రాజధరుండా!
    యంబకు దేహార్థమిడిన
    సాంబా! రార సమహితము సంతసములిడున్”*

    రిప్లయితొలగించండి
  2. సాంబారన్నము రసమును
    తాంబూలప్రీతి గనిన తమిళుల తెఱగే
    సంబందీకులనడిగెద
    సాంబారా రసమ హితము సంతసములిడున్

    రిప్లయితొలగించండి
  3. అంబా రమణా రార త్ర
    యంబకదేవా తలచిన యంతన్ వరముల్
    సంబరముగా నొసంగెడు
    సాంబా రారసమహితము సంతసములిడున్

    రిప్లయితొలగించండి
  4. అంబలి త్రాగెడు వానిని
    సాంబారా రసమ హితమ సంతస మిడున్
    లంబోదరు నడుగ ననియె
    సంబరముగరెండు వలయు చవి యొసగంగన్

    రిప్లయితొలగించండి
  5. అంభోజాక్షియు నిట్లనె
    సంబారములెల్ల తెండు చయ్యనఁజని బో
    నంబందున్ దినుటకునై
    సాంబారా?రసమా ?హితము సంతసములిడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      సంబారంబులు పెండ్లి యింటనిడగా శాల్యాన్నముంగూరలన్
      అంభోజాక్షులు వండివంటలనహో! యాపైన వడ్డించుచున్
      సాంబారా?రసమా?హితంబగు రుచిన్ సంతోషముంగూర్చెడిన్
      తాంబూలంబులు స్వీకరింపుడనగా తద్భోజనాంతంబునన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. కందం
    డంబమున స్వార్థమెగయగ
    కుంభిని నసమానతలకు గొడవలెగసె నా
    లంబనమీవనఁ 'బంచఁగ'
    సాంబా! రార! 'సమ హితము', సంతసము లిడున్

    శార్దూలవిక్రీడితము
    డంబమ్ముల్ భువి స్వార్థచింతనమునన్ ఠారెత్త మామధ్యనన్
    జంబంబై యసమానతల్ వెరిగె, విశ్వాసమ్ముతో గొల్వ నా
    లంబమ్మీవనఁ బంచుమయ్య !దయలూరంగన్ సమానత్వమున్
    సాంబా! రార! సమాహితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  7. అంబర కేశుఁడ! యోయన
    లాంబక!కామారి!యజుఁడ! యంతక హరుడా!
    యంబకు సగభా గమిడెడు
    సాంబా!రా రసమ హితము సంతసములిడున్

    రిప్లయితొలగించండి

  8. శంభోశంకర వైద్యనాథ భవుడా చంద్రార్థ చూడామణీ
    సంభగ్నుండవు ఫాలలోచనుడవో సావిత్రుడా సంజుడా
    గంభీరాకృతి గల్గినట్టి నిను నేగండ్లారగా కాంచినన్
    సాంబా! రార! సమాహితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్.

    రిప్లయితొలగించండి
  9. సంబర మీనాడు గనుక
    నంబలి పంచగ దలచితి నందున నుంచన్
    జంబా లువిడిచి చెప్పుము
    సాంబారా రసమ హితము సంతసములిడున్

    రిప్లయితొలగించండి
  10. శంభో శంకర! చర్మవాసుఁడ!హరా!సాకార రూపుండ! యో
    సాంబా!రా ర!సమా హితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్
    గంభీరంబగు నీదు రూపము దగన్ గండ్లారఁ గాంచంగ నా
    లంబంబీయుమ చంద్ర శేఖర!వడిన్ లౌల్యంబు నేపారగన్

    రిప్లయితొలగించండి
  11. అంబా! దయగొనుమమ్మా!
    శంభునితోగూడిరమ్ము సరగున నాయా
    లంబన మీవేగద యో
    సాంబా! రార! సమహితము సంతసములిడున్

    రిప్లయితొలగించండి
  12. అంబన్ దేహము నందు దాల్చిన త్రినేత్రా, గంగ నీ నెత్తిపై
    బింబించంగ; జనాళి కార్తికమునన్ బ్రేమన్ సమర్పించు యీ
    సాంబారన్నము, భక్ష్యముల్, ఘృతమునున్ సంప్రీతి భక్షించగా
    సాంబా! రార! సమాహితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్!
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  13. మరొక పూరణ
    డా బల్లూరి ఉమాదేవి

    శంభోశంకరనమ్మితిన్ ని నుమదిన్ శంకల్ వడిన్ బాపగా
    అంభోధీసుతకాంతమిత్రుడనుపల్కాలించి నీనామమీ
    జంబూద్వీపమునందువీడకజపించంగామతిన్నివ్వగా
    సాంబా రారసమా హితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్”

    రిప్లయితొలగించండి
  14. అంబర మంటెడు భంగని
    సంబరపడు చుండి యుండ సంతతమును దా
    నంబలి కుడువఁగ వానికి
    సాంబారా రసమ హితము సంతసము లిడున్

    సంబోధించుచుఁ బిల్చు చుంటి నిను నో సన్మిత్రమా ప్రీతితో
    నంబారావము నాలకించి మదిలో నానందముం బొంది తా
    నంబా యంచును దల్లినిం గదియు నా యాదూడ చందమ్మునన్
    సాంబా రార సమాహితం బగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  15. అంభోజాసన వాసవాది దివిజుల్ అర్చింత్రు నిత్యంబు నిన్
    శంభోశంకర భక్తవల్లభమదిన్ శాంతిన్ ప్రసాదించి నా
    శంబొందంగ మదీయ పాపచయమున్ స్వాస్థ్యమ్ము జేకూర్చగన్
    సాంబా! రార! సమాహితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  16. సంబంధ బాంధవ్యములని
    సంబర పడిపోయిరాగ సంబడు, వారల్‌
    యంబలి పోసియిటులనిరి
    “సాంబారా, రసమ, హితము,సంతసములిడున్”

    రిప్లయితొలగించండి
  17. అంబా !యాకలివేయుచున్న దనుచున్ యాచించనోపేద, రా !
    తాంబాలమ్మునువేసి వడ్డనలనే తాంబూలమున్నిచ్చి పై
    చెంబుల్‌నిండుగ చల్లబోసెదనురా ! చింతేలరా ! రమ్మురా !
    “సాంబారా ! రసమా ! హితంబగు రుచిన్, సంతోషమున్ గూర్చెడిన్”

    (ఆకలితో వచ్చిన పేదవాని కుటుంబానికి సరిపడా వడ్డించిన దొడ్డ తల్లి )

    రిప్లయితొలగించండి