23, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4228

24-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ”
(లేదా...)
“భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ”

20 కామెంట్‌లు:


 1. *(ఆంజనేయుడు రావణునితో పలికిన మాటలుగా)*

  పాలకుడవీవు గద పర
  స్త్రీలను తరతీపరివయి తెచ్చితివే! శా
  స్త్రాలనెఱంగిన నీవిక
  భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ.

  రిప్లయితొలగించండి
 2. కందం
  మేలుల్ గూర్పెడు వాడని
  కాలాత్ముని భక్తిఁ గొల్వఁ గరుణించు సదా
  కూలన్దోయఁగ నన్యుల
  భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

  శార్దూలవిక్రీడితము
  కాలాతీతుని స్తోత్రపర్వముగ భక్త్యాత్మమ్ముగన్ వేడగన్
  మేలుల్గూర్చును లోకులెల్లరకు సంప్రీతిన్, గుతంత్రమ్మునన్
  గూలన్జేయుమటంచు నన్యులనహో! కోరంగ స్వార్థమ్మునన్
  భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ!

  రిప్లయితొలగించండి
 3. కందం
  ఫాలాక్షున్ శశిధరునిన్
  భోళా శంకరుని గొల్వ మూఢత్వంబౌ
  నా?లలనా!గళసీమన్
  హేలగ హాలా హలంబు నెవ్వఁడు దాల్చెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భోళాశంఖరుఁడేదొ యిచ్చుననుచున్ బూజింప మూఢత్వమౌ
   నీలాగున్ వచియింప పాడియగునా?యీశుండు భక్షించియున్
   హేలన్ హాలహలంబు బ్రోచె జగముల్,హింసించె దైత్యాళులన్
   ప్రాలేయాచల కన్యకాపతిని సంప్రార్థించుటే శ్రేయమౌ.

   తొలగించండి
 4. శ్రీలను నిచ్చును మెండుగ
  భోళాశంకరునిఁ గొలువ, మూఢత్వంబౌ
  భోళా శంకరు గూరిచి
  హేళనగా మాటలాడ,హేయము మఱియున్

  రిప్లయితొలగించండి

 5. ఆలిన్ బానిస యంచునెంచుచు సుఖంబాషించు చున్ నిత్యమున్
  శూలన్ గోరుచు వేశ్యవాటికలకే సొమ్మంత వెచ్చించుచున్
  గాలిగ్రుడ్డుగ మారి సంపదలనాకాంక్షించుచున్ దీనవై
  భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ.

  రిప్లయితొలగించండి

 6. నీలగళుండగు పశుపతి
  బోళాశంకరుని గొలువ మూఢత్వంబౌ
  నా? లలన కార్తికమ్మున
  నా లింగాకారుఁ గొల్వ నభవమె దక్కున్.

  రిప్లయితొలగించండి
 7. వేళ గడచి దేవళముకు
  తాళము వైచిన తదుపరి దర్శనమొందన్
  తాళంబును విరిచి పిదప
  భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

  రిప్లయితొలగించండి
 8. భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ
  భోళా శంకరు గూర్చి నీచముగ వాపోవంగ భావ్యంబునే
  భోళా శంకరుఁడేయి డున్ గద సిరుల్ బూజింప నెమ్మోముతో
  హేళన్ జేయుట యుక్త మేచెపుమ హో హేయంబుగాఁ దోచదే?

  రిప్లయితొలగించండి
 9. కూళులె లాభము నొందిరి
  భోళాశంకరునిఁ గొలువ ; మూఢత్వంబౌ
  నాళీకజుని కొలువగనె
  తేలికగ వరములిడునను దీవస ముండన్

  రిప్లయితొలగించండి
 10. వేళాకోళమ యెవ్విధి
  భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ?
  ఫాలాక్షుని నెరనమ్మిన
  హేలగ సిరిసంపదలిడు, నిచ్చును పరమున్

  రిప్లయితొలగించండి
 11. శ్రీలక్ష్మీపతి వాసుదేవుడిలఁ కాచేనంచు శ్రీలందగా
  పాలించేనని వైష్ణవుల్, యిటను శైవారాధ్యులే భక్తినిన్
  భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ
  గా! లోకంబున పూజకున్ ఫలము నిష్కామార్థ తత్వమ్మెగా||

  రిప్లయితొలగించండి
 12. తాళమున భజించ వలెను
  భోళా శంకరుని గొలువ :మూఢ త్వంబౌ
  వేళా కోళము సేయుచు
  ఫాలా క్షుని దూషణంబు వల దందురు గా

  రిప్లయితొలగించండి
 13. వేళాపాళయులేకను
  కూళులతో తిరిగితగని కోర్కెలతోడన్
  వ్యాళధరుండైన భవుని
  భోళాశంకరుని కొలువు మూఢత్వంబౌ

  రిప్లయితొలగించండి
 14. మేలా దక్షా! పంతము?
  ఫాలాక్షుడులేని మఖము పావనమగునే?
  ఏల కలిగెనీ ద్వేషము
  భోళాశంకరునిఁ గొలువ? మూఢత్వంబౌ!

  రిప్లయితొలగించండి
 15. కేళీ లీలను గొల్చిన
  ఫాలాభీలాంబకుండు వరము లొసంగుం
  జాలుం జా లీ పల్కులు
  భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

  వేళాకోళపు టా కళాసమును సంప్రీతిన్ ధరించెం గదా
  తాళం జాలక త్రాగుఁడీ విస మనన్ ధైర్యమ్మునం ద్రాగఁడే
  తాళధ్వాన సమేత నర్తకు నహో ధర్మంబె వా రిట్లనన్
  భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ

  రిప్లయితొలగించండి
 16. గురువుగారికి,కవిపండితులకు దీపావళి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 17. వేళాపాళలెరుంగక
  తూలుచు తాగుచు తిరుగుచు దొమ్మర వాడల్
  మేలని గుడులను తిరుగుచు
  “భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ”

  రిప్లయితొలగించండి
 18. కాలాతీతముగాక ముందు కుడువన్ కామాతురుండై చనున్
  చాలాకీగను త్రాగకల్లు సురు లే సఛ్ఛీలు రైత్రాగలే ?
  జూలాయించుచు దెల్పు ధూర్తుడుసదా జూదమ్ము లోమున్గుచున్
  “భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ”

  రిప్లయితొలగించండి