తే.గీ:దేవకీ!భావి బలుకగా దివ్యవాణి కంసు డీరీతి పరమనృశంసు డయ్యె నిన్ను నన్ను బ్రేమించుటన్ మున్ను బావ కంసునిన్ మించు సుజనుడు కలడె భువిని?
(కంసుడు దుర్మార్గు డైనా వసుదేవుడు ఇంకా సాత్వికతతో గతం ఆలోచించి ఆశ్చర్యం తో దేవకి తో ఇలా అంటున్నాడు.ఆకాశవాణి భవిష్యత్ గూర్చి చెప్పటం తో కంసుడిలా దుర్మార్గు డయ్యాడు కానీ నిన్ను,నన్ను ప్రేమించే విషయం లో పూర్వం కంసుడంత మంచి వా డున్నాడా?)
ఉ:కంసుని వర్ణనన్ వినగ కమ్మగ నుండ నటించి చెప్పి యా కంసుని మించు, సజ్జనుని గానము భాగవతమ్మునన్ సఖా కంసలి మిత్రు డొక్కనిది కావ్యసుధారస సంగ్రహమ్మునన్ హంస యనంగ జెల్లెడు మహా విబుధుం డన నొప్పు నాతనిన్. (అతడు కంసలి కులానికి చెందిన మిత్రుడు.కంసుడి పాత్రని అతడు నటించి వర్ణించి భాగవత గానం చేస్తే అతడే కంసుణ్ని మించి ఉంటాడు.ఇక్కడ "గానము"అనే దాన్ని "చూడము"అనే అర్థం లో కాక గానమును పద్యం పాడుట అనే అర్థం లో తీసుకున్నాను.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండితల్లిదండ్రులు గారను దల్లడిల్ల
హింసబెట్టిన మామను హీనుఁడనుచు
నంతమొందించెఁ గృష్ణుడు నట్టిరీతి
కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని
ఉత్పలమాల
హింసలు వెట్టియున్ జెరను యెంతగ క్షోభలఁ దల్లిదండ్రి యా
శంసలు గూల్చఁగన్, బెరిగి సాధ్వి యశోదకడన్ సుతుండు మీ
మాంసలకందనట్లు పరిమార్చెను కృష్ణుడు నట్టిరీతిగన్
కంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా!
రిప్లయితొలగించండితనను కడతేర్చు వానిని తనయునిగను
కందురని యెఱంగిన నేమి కరుణ తోడ
నాలుమగలను విడదీయనట్టి వాడు
కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండికంసుడెవండు? క్రూరుడని కారను తండ్రిని బంధిసేసె, నా
హంసుడు దేవకీ సుతుని యంతము జేయగ నెంచినట్టి యా
పాంసను డంచెఱుంగకనె పల్కుచు నుంటివొ చెప్పుమింక నే
కంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా.
తండ్రి బంధించె చెరలోన దనయు దకట
రిప్లయితొలగించండిచంపె చెల్లెలి సంతును జాలి వీడి
కంసుని న్ మించు సుజనుడు గలడె భువి ని
యనుటకన్నను మూర్ఖత యవని గల దె?
తనసహోదరి గర్భాన జననమొందు
రిప్లయితొలగించండితనను వధియించు శిశువని వినబడినను
సోదరిని కడతేర్చని సోదరుండు
కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని
చెల్లెలి కొమరుడె తనకు చేటగునని
రిప్లయితొలగించండివిదితమయ్యు నాపడతిని వ్రేయ కుండ
దేవకీసుతుడుదయిచ దెరపి నిడిన
కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని
తేటగీతి
రిప్లయితొలగించండిహత్యలును దారిదోపిడీలాగడములు
నిత్యకృత్యంబులౌ,యవినీతిపరులు
"కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని"
యంచు స్తుతియించరే వాని నధికముగను.
హింస యతిశయించెను నేడు హీనమైన
రిప్లయితొలగించండికృత్యములఁ జేయు వారలు కెరలుకొనిరి
పుడమిఁ నిండిన దుష్టులన్ బోల్చి చూడ
కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని
మున్నడుగక యేల మరణమ్ము నెఱిఁగింప
రిప్లయితొలగించండివలసి వచ్చెను మధురాధి పతికి నిట్టు
లకట యాకాశవాణి పలుకక యున్నఁ
గంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని
కంసుని మించు దుర్జనునిఁ గానము భాగవతమ్ము నందుఁ దా
ధ్వంసము సేయఁగాఁ దొడఁగె బాలుర నెల్లరఁ బ్రాణ భీతినిన్
హంస నిభుండు కృష్ణ నిర తాత్ముఁడు ఘోర కుటుంబ భార భా
గంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా
[భార భాక్ + అంసుని = భార భాగంసుని; భాక్ = పొందినది; అంసము = మూపు]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమన్నించండి.వసుదేవుడు (సహదేవుడు కాదు.)
రిప్లయితొలగించండితే.గీ:దేవకీ!భావి బలుకగా దివ్యవాణి
రిప్లయితొలగించండికంసు డీరీతి పరమనృశంసు డయ్యె
నిన్ను నన్ను బ్రేమించుటన్ మున్ను బావ
కంసునిన్ మించు సుజనుడు కలడె భువిని?
(కంసుడు దుర్మార్గు డైనా వసుదేవుడు ఇంకా సాత్వికతతో గతం ఆలోచించి ఆశ్చర్యం తో దేవకి తో ఇలా అంటున్నాడు.ఆకాశవాణి భవిష్యత్ గూర్చి చెప్పటం తో కంసుడిలా దుర్మార్గు డయ్యాడు కానీ నిన్ను,నన్ను ప్రేమించే విషయం లో పూర్వం కంసుడంత మంచి వా డున్నాడా?)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిదేవకీ వసుదేవుల తేరులోన
తీరుగ కొనిపోవుతరిని తెలియ మృత్యు
వార్త చంపక చెరనుంచి బ్రతుకు నొసగె
*“కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని
పాంసనుడై చెలంగుచును బాలల చంపగ నెంచుచు న్నప
రిప్లయితొలగించండిధ్వంసముచేసి సోదరిని బావను త్రోసెను బందిగమ్ము నా
శంసుడునై వికుంఠమును చప్పున జేరగ పోరి శౌరితో
కంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా
అసనారె
హింసకు నాలవాలమయె నీభువి యక్కట! యగ్గలంపు వి
రిప్లయితొలగించండిధ్వంసము మానవాళి భవితవ్య వినాశనకారి యయ్యె నా
ధ్వంసమొనర్చు దుర్మతుల దౌష్ట్యమనంతము పోల్చి చూడగా
కంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా!
హంతకుఁడు లేడు పుడమిని యరయ గాదె
రిప్లయితొలగించండికంసునిన్ మించు ,సుజనుఁడు గలఁడె భువిని
విష్ణు భక్తుఁడు ప్రహ్లాదు పేరు గలుగు
మఱియొ కఁడుగలడె చెపుమ మధుర వాణి!
ఉ:కంసుని వర్ణనన్ వినగ కమ్మగ నుండ నటించి చెప్పి యా
రిప్లయితొలగించండికంసుని మించు, సజ్జనుని గానము భాగవతమ్మునన్ సఖా
కంసలి మిత్రు డొక్కనిది కావ్యసుధారస సంగ్రహమ్మునన్
హంస యనంగ జెల్లెడు మహా విబుధుం డన నొప్పు నాతనిన్.
(అతడు కంసలి కులానికి చెందిన మిత్రుడు.కంసుడి పాత్రని అతడు నటించి వర్ణించి భాగవత గానం చేస్తే అతడే కంసుణ్ని మించి ఉంటాడు.ఇక్కడ "గానము"అనే దాన్ని "చూడము"అనే అర్థం లో కాక గానమును పద్యం పాడుట అనే అర్థం లో తీసుకున్నాను.)