16, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4281

17-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అద్దమందుఁ గాంతు నన్యు నొకని”
(లేదా...)
“అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్”

16 కామెంట్‌లు:

  1. పురమునందు దిరుగు మోస గాళ్ళందరు
    జనుల లొంగబరచు చర్య యందు
    మా గృహముకు వచ్చి మంత్రించి యిచ్చిన
    యద్దమందుఁ గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి
  2. నాదు మానసంబు నవ్యదర్పణమాయె
    తరచి చూడలేరు పరులు నన్ను
    అన్యులెరుగనట్టి యంతరంగమనెడి
    యద్దమందుఁ గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిద్దురపోవు సోమరులు నిత్యము నన్గని భీతినొందరే
      కొద్దిగవిశ్రమించినను గోపము వచ్చని విభ్రమించరే
      హద్దులుమీరనెన్నడును హాయిని గూర్చెడు మానసంబనే
      యద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

      తొలగించండి


  3. పాండుపుత్రుల వన వాసమ్ము ముగిసిన
    పాళమందు పలికె పార్థు డిటుల
    యచ్చర శాపమదియె యబ్రము నన్నునే
    నద్దమందుఁ గాంతు నన్యు నొకని.

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    సరిగ తలదువ్వు కొనుటకు మరియు నుదుట
    దిద్ద తిలకంబు నాముఖ*మద్దమందు
    గాంతు;నన్యునొకని*జూచినంత నేను
    పలుకరింతును చిర్నవ్వు లొలుకగాను.

    రిప్లయితొలగించండి

  5. పెద్దయె కంకుభట్టుగను భీముడు వంటల వల్లభుండు వా
    రిద్దరి సోదరుండగు కిరీటియె మారి బృహన్నలయ్యెనే
    నిద్ధర యందు ప్రాగసరుడింద్రతనూభవుడంత తన్నుతా
    నద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్.

    రిప్లయితొలగించండి
  6. బాహ్యమున గన బడు వాడొక o డుండ గా
    దాగి నట్టి వాడు దర్శన మిడె
    నాకటంచు దెలిపె నంత రంగమనెడు
    నద్ద మందు గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి
  7. సీతను కానలకంపిన శ్రీరాముఁడు రాచనగరులో...

    ఆటవెలది
    అసురుఁ జంపి సీతనగ్ని పునీతగ
    నేలుకొనఁగఁ దెచ్చి యింతలోన
    నిందకు వనికంపి నెలతను నాలోన
    నద్ధమందుఁ గాంతు నన్యునొకని!

    ఉత్పలమాల
    ముద్దియ నగ్నిగుండమునఁ బూవుగ దేలిన జానకీ సతిన్
    వద్దని పంపితిన్ వనికి పాలకుడొక్కని నింద కొప్పుచున్
    నిద్దుర రాని నేను జని నిల్వగ ముందర నాకు నేనుగా
    నద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్!


    రిప్లయితొలగించండి
  8. ఎన్న వింత గాక యున్నె నన్నుం బోలి
    యున్న యన్నర వరుఁ గన్న చెన్ను
    నన్ను నన్ను లందు మిన్న నున్నని చెక్కి
    లద్ద మందుఁ గాంతు నన్యు నొకని

    రద్దులు సేయ కెద్దినము శ్రద్ధగఁ దద్ద సెలంగఁ బెద్ద గో
    మద్దిర! సుద్దు లుద్ధతిని హద్దు లెఱుంగక గ్రుద్ది పల్కుచున్
    బ్రద్దలు కాని శుద్ధమును గ్రద్దనఁ గంటికిఁ బెట్టి నట్టి దౌ
    యద్దము నందుఁ గాంచి నపు డన్యుఁడు గన్పడు నెల్ల వేళలన్

    రిప్లయితొలగించండి
  9. ఆటవెలది.

    మంత్ర గాని మహలు మాయలతోనిండి
    చిత్ర మైన రీతి జిమ్ము ముఖము
    మార్పు తోడ నద్ద మందు ,మరల చూడ
    అద్దమందుఁ గాంతు నన్యు నొకని.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  10. అంతరంగమందు నన్యభావనలుండు
    వ్యక్తపరుచు నొండు బాహ్యమందు
    నిజము తరచి చూడ నిగ్గుదేలకపోదు
    అద్దమందుఁ గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి
  11. ముద్దులు మూటగట్టు నగుమోమొక యద్దము కోమలాంగికిన్
    తద్దయు దీప్తివంతమయి తళ్కులనీనుచునుండు నిచ్చలున్
    యెద్దియొ కారణంబుగన నెన్నఁడుఁ దోచుచునుండు లీలగా
    అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  12. ఉ.

    అద్దపు పొంగు పల్లవము హాస్యము గొల్పును వక్ర బింబముల్
    ముద్దుగ జూడ వింతయిన మోమును దర్పణ మాయగా నగున్
    సద్దును జేయుచున్ భ్రమను సహ్యము గాని విచారణీయమౌ
    *అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్.*

    రిప్లయితొలగించండి
  13. నిద్దురరాదు కర్ణు డాహవము నీల్గిన పిమ్మట నెంచిచూడగా
    హద్దులులేని గర్వమున నా బకవైరి చరించు చుండగా
    గద్దలు రాపులుంగులును కాలుని దూతల రీతినుండ నే
    నద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  14. పగిలిన ముకురమున ప్రతిబింబమిద్దరు
    గాను వింతగాను కానిపింప
    నచ్చెరువున వడిగ నటుయిటుతలతిప్ప
    నద్దమందుగాంతునన్యునొకని

    రిప్లయితొలగించండి