11, డిసెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4276

12-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు”
(లేదా...)
“పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే”

(ఆముదాల మురళి గారి 200వ అష్టావధానంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిచ్చిన సమస్య)

34 కామెంట్‌లు:

  1. మంచి కవియని పేరొంద మథనబడుచు
    వ్రాయఁ బూనె నొ కండి ల పద్య ములను
    వచ్చె నొక సభ కతని దౌ భావ రహిత
    పద్య విముఖులట విజయ వాడ ప్రజలు

    రిప్లయితొలగించండి
  2. భావపూరితములయినపద్దియముల
    నాలకించెదరట వార లాదరమున
    ప్రాస యతులను కూర్చక వ్రాయు బూతు
    *“పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు”*

    రిప్లయితొలగించండి

  3. పద్యమునకు పట్టము గట్టు ప్రజలు మెండు
    గను గలిగిన జనాళియె గాని వార
    లింపుగ జనరంజకముఁ బఠింప నట్టి
    పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు.


    పద్యకవీంద్రులన్న కడు ప్రశ్రయ మందున గారవించెడిన్
    వేద్యులు జ్ఞానపూర్ణులు వివేకము గల్గిన నేమి వారలే
    హృద్యముగా పఠింపని కవీంద్రుల గాత్రము నుండి వచ్చెడిన్
    బద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే.

    రిప్లయితొలగించండి
  4. అరయగ తెలుగు పద్యము కందము నిడు
    నీమమౌ యతి ప్రాసల నేర్వ లేక
    మిగుల వెతనొంది , గద్యమే మేల టంచు
    పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు

    రిప్లయితొలగించండి
  5. పద్యము రసభరితమైన హృద్యమనరె!
    చోద్యమనరె! రుచికర నైవేద్యమనరె!
    రసికత కరవైనకవులు ప్రతిలిఖించు
    పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యము హృద్యమై తనర పాఠక లోకపు మెప్పునొందదా!
      పద్యము చోద్యమై యలర పాటవ సిద్ధికి తన్మయించరా!
      ఆద్యమునంతమున్ గన నిరర్థకమై రసహీనమైనవౌ
      పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. ఆటవెలది
    బళి!యరసికులెల్ల *పద్యవిముఖులట,
    విజయవాడ ప్రజలు*విబుధవరులు,
    సరసులు,సుముఖులు, రసజ్ఞులు,విజ్ఞులు
    పద్య కవితలు బహు హృద్యమనరె.

    ఉత్పలమాల
    పద్యముభారతీసతికి పండిత వర్యులుపెట్టినట్టి నై
    వేద్యము తెల్గువారలకు వీనులవిందును జేయునట్టిదౌ
    ఖాద్యము,రాజ్యమేలదె యఖండ మహీవలయంబునందునన్
    పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విననిచ్చగింపరే?

    రిప్లయితొలగించండి
  7. పద్య రచనమ్ము జేసిన హృద్యముగను
    సద్యశంబునుఁబొందుట సాధ్యమగును
    చోద్యమెట్లగు పోఁడిమి శూన్యమైన
    పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు

    రిప్లయితొలగించండి
  8. సద్యశమొంద పద్యకవి చక్కని చిక్కని చొక్కటమ్ములౌ
    పద్యములన్ రచింపనగు పల్వురు మెచ్చెదరట్టి పద్యముల్
    చోద్యముకాదొకో చెలువు శూన్యములై రసహీనమైనవౌ
    “పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే”

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    విశ్వనాథ వారి కవిత్వ విభవమంది
    పులకరించెడు నలవాటు మోదమొసఁగ
    నింపుగూర్పవన రసవిహీనమైన
    పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు

    ఉత్పలమాల
    విద్యకు రూపమై పటిమ వేడ్కగ జూపగ విశ్వనాథుఁడే
    సద్యశమందుచున్ బలుక సత్కవివర్యులు గర్ణపేయమౌ
    హృద్య విశేష భావములనింపుగఁ దద్రసహీనమైనవౌ
    పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే

    రిప్లయితొలగించండి
  10. నిత్య వేశ్యాంగనా జన భృత్య నరులు
    సంత తానంద మగ్న విశ్రాంత జనులు
    నిత్య విత్తాంతరంగ వాణిజ్య పరులు
    పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు

    చోద్యము కాఁగఁ బ్రాస కయి శుష్కప దావళి నింపఁ బాదముల్
    పద్యము లందహో యతికి వ్యర్థ పదమ్ములు నింపు చుండ సం
    వేద్యమ పండితోత్తములు విజ్ఞులు విస్తృత మున్న నేలలోఁ
    బద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:విశ్వనాథయు,జంధ్యాల,వేదుల యును
    జాషువాయు తీర్చిన పద్య సాహితికిని
    పరవశించుట నేడు త్వద్భావరహిత
    పద్యవిముఖు లట విజయవాడ ప్రజలు
    (ఒక కవిని గూర్చి ఒక విమర్శకుడు పలికినట్లు.)

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:ఘంటసాల వారి లలిత గానమునకు
    సంతసింతురు గాని,యా షణ్ముఖి వలె
    సాగ లాగి పాడిన, నట్టి రాగభరిత
    పద్యవిముఖు లట విజయవాడ ప్రజలు

    రిప్లయితొలగించండి
  13. ఉ:పద్యము లచ్చు వేయు మన పత్రిక లో నవి చెల్ల వందు వే!
    పద్యకవిత్వ మీ నగరి ప్రాభవ మందుట నీ వెరుంగవే!
    విద్య గలట్టి నేల ,యిట వెల్గిరి గాదె శతావధానులే
    పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే!
    (పద్యాలు పత్రికలలో ఇస్తే మా పత్రికలో పద్యాలు నడవవు అని సంపాదకు లంటూ ఉంటారు.అలాంటి పత్రిక వారితో ఒక కవి యొక్క సంభాషణ.)

    రిప్లయితొలగించండి
  14. ఉ.

    సేద్యపు కట్టఁ దెల్లదొర చేయగఁ గర్షకులైరి శ్రీకరుల్
    విద్యకు విశ్వనాథ కవి పేరునుఁ దెచ్చినవాడు లేడిటన్
    గద్యములే నవోదయము, గర్వులు నాస్తిక ముఖ్యులుండగా
    *పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే*!

    రిప్లయితొలగించండి
  15. పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు
    పద్యపు విలువ తెలియని వారు కాన
    విముఖు లుగ నుంట సహజము వెంకటేశ!
    మెల్ల మెల్లగ నేర్పిన నుల్లమలరు

    రిప్లయితొలగించండి
  16. పద్యము రాగ రంజిత సుభాషిత సూక్తుల
    మేళమై సదా
    పద్యము హృద్యమై హృది ప్రభావిత
    మౌనటు సేయగావలెన్
    పద్యము సార హీనమయి భావము సక్కగ
    లేనియట్టి యా
    పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగించరే

    రిప్లయితొలగించండి
  17. పద్యమె కల్పవృక్షమన వన్నెలు దిద్దిన విశ్వనాథుడే
    సద్యశమున్ గడించుటకు స్థావరమౌచు రహించ నియ్యెడన్
    హృద్యము లైన భావములు, ప్రీతిని గొల్పెడి శైలి లేనివౌ
    పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే!

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.

    రమ్యమైన పద్యములకు బ్రహ్మరథము
    పట్టుదురు గాని బెజవాడ ప్రజలు మిగుల
    హృద్యముగ లేనివి రసవిహీనమైన
    పద్య విముఖులట విజయవాడ ప్రజలు.

    రిప్లయితొలగించండి
  19. హృద్యపు రాగముల్ గలిపి యింపగు కైతల కోవెలందు నై
    వేద్యము భంగి వాణి కిడు విజ్ఞులు మెప్పును పొంద, సాహితీ
    విద్యకు దూరమై బ్రతుకు వెంకలి మూకలు వ్రాయునట్టి యా
    పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
    అసనారె

    రిప్లయితొలగించండి