6-12-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దారమెత్తె భువి నుదారముగను”(లేదా...)“దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్”
ఆటవెలదిరాక్షసాధముడు హిరణ్యాక్షుఁడు సెలఁగిపుడమినిగొని ముంచ కడలినందునసురుఁ గూల్చి వేగ హర్యవతార కుందారమెత్తె భువి నుదారముగను
ఉత్పలమాలవైరిగ పుట్టియున్ జయుడు బాధలువెట్టుచు లోకులెల్లరిన్ధారుణి జుట్టి చాపవలె నాగపురమ్మున ద్రోసి నంత దైత్యారిగ వేగ గూల్చి కనకాక్షుని హర్యవతారమైన కుందారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఆటవెలదికశ్యపాత్మజుండు కాశ్యపేయంబునుచాప జుట్టి కడలి చాటు దాచధరను కాచ గోరి దామోదరుండు భూదారమెత్తె భువి నుదారముగను.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారు
ఆటవెలదిప్రళయకాలవేళ పాతాళలోకానధరను జుట్ట జుట్టి దాచ,హరియెరాక్షసుని ఖలుని హిరణ్యాక్షు జంప భూదారమెత్తె భువినుదారముగను.
ఉత్పలమాలక్రూర హిరణ్యనేత్రుఁడయొ కుంభిని జుట్టి రసాతలానికే చేరగ, భీకరాకృతిని జీరుచు కోరలతోడ దైత్యుతోపోరొనరించుచున్ హరియె పొంకముతోనయి యౌర!భూరి భూదారము,భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్.
ఉ.దారుణ హింసలన్ గొలుపు ధైత్యుడు భూమినిఁ జుట్టగన్ వడిన్హైరిక రాక్షసుండు కనకాక్షుడజేయుని లోకకంటకున్భారముఁ దాల్చి కోపమున పంకజనాభుడె కోరలొంది కుం*దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్*.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పుడమి ముంచ నెంచి పూనిన రాక్షసున్జంప నవ త రించె చక్ర ధారికావదలచి తాను చేవను జూపి భూదార మెత్తె భువి ను దార ముగను
ప్రళయకాలమందు వసుమతి మునుగంగహరునికడకు దివిజులరుగుదెంచిశరణు వేడ సరసిజాక్షుడు తానె భూదారమెత్తె భువి నుదారముగను
ధారుణి మున్గెనా ప్రళయ ధాటికి పూర్తిగ కాండపృష్ఠమున్సారసగర్భుడున్ మరియు సర్వసురాళియు నాశ్రయించ తానూరడి సేయ భావనుడు నూతనమౌయవతారమెత్త భూదారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
ధన్యవాదాలు గురూజీ 🙏
పుత్తడి పొలిదిండి భూమిని కడలిలోముంచు సమయమందు పుట్టు వడుగుఆఖువుగను మారి యసురుని జంపి భూ దారమెత్తె భువి నుదారముగను.ధారుణి రక్షకుండవని దానిని రక్షణ జేయు మంచు నాధారణుడే వచించె నభిదర్శనుడా పొనిగంటి ద్రుంచుమా భూరి యటంచు వేడగనె పొత్రిగ మారినిశాటు జంపి కుం దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్.
కశ్యప తపసి కొడుకడు హిరణ్యాక్షుడువిపుల నబ్దినందు విసరి వేయహరి వహించిన యొక యవతార మైన కుందారమెత్తె భువి నుదారముగను
అలరసాతలంబు నందున్న యవనినిపెల్లగించి గావ వేదములనుహరియె సూకరముగ నావిర్భవించె! కుందారమెత్తె భువి నుదారముగను
నీరమునందు మగ్నమయి నీల్గుచునున్న ధరాతలమ్మునున్తీరుగ నుద్ధరింపుమని దేవతలెల్లరు కోరగా హరిన్కోరలఁ సాచి భీకరపు ఘుర్ఘురరావము మిన్నుముట్ట కుందారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
భారము నీదె మా సకలబాధ్యత లన్నియు నీవె కావగన్తీరము జేర్చ నేవె, యని తీవ్రముగా మదినెంచ కాడె యాధారము తాను, పూని యవతారము క్రోడము, భక్తలోకమందారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
చూచు వారల మనసు ముదమ్ము వడయంగ సుందర తర ముండ సుదతి యిల్లు ప్రాకటముగ రక్తి వాకిట రంగులు దార మెత్తె భువి నుదారముగను [మెత్తు = పులుము] దారగ భూసతిం గొనఁగఁ దల్చి మహోద్ధతి నెత్తి దర్ప హుం కార మడంప దైత్యునకుఁ గ్రాలు వరాహ మహావతారమున్ భారము గాఁగ దూది వలె వైష్ణవ మాయ సెలంగ శ్వేత కుందారము భూమి నెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
రాక్షసాధముండు రగులుచుఁ బుడమిని చాప చుట్టి వేయ సంద్ర మందు పంది రూప మెత్తి నందుని సుతుఁడు,కు దారమెత్తె భువి నుదారముగను
క్రూరుఁడు రాక్షసాధముఁడు కుంభిని ముంచగ సంద్రమందునన్ నీరము నందుఁ దా మునిగి నెమ్మది పందిగ రూపము నెత్త యంత కుం దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్బౌరులు కూడమె చ్చియును బండుగఁజేసిరి సంతసంబునన్
ఆటవెలది
రిప్లయితొలగించండిరాక్షసాధముడు హిరణ్యాక్షుఁడు సెలఁగి
పుడమినిగొని ముంచ కడలినందు
నసురుఁ గూల్చి వేగ హర్యవతార కుం
దారమెత్తె భువి నుదారముగను
ఉత్పలమాల
తొలగించండివైరిగ పుట్టియున్ జయుడు బాధలువెట్టుచు లోకులెల్లరిన్
ధారుణి జుట్టి చాపవలె నాగపురమ్మున ద్రోసి నంత దై
త్యారిగ వేగ గూల్చి కనకాక్షుని హర్యవతారమైన కుం
దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండికశ్యపాత్మజుండు కాశ్యపేయంబును
చాప జుట్టి కడలి చాటు దాచ
ధరను కాచ గోరి దామోదరుండు భూ
దారమెత్తె భువి నుదారముగను.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువుగారు
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిప్రళయకాలవేళ పాతాళలోకాన
ధరను జుట్ట జుట్టి దాచ,హరియె
రాక్షసుని ఖలుని హిరణ్యాక్షు జంప భూ
దారమెత్తె భువినుదారముగను.
ఉత్పలమాల
తొలగించండిక్రూర హిరణ్యనేత్రుఁడయొ కుంభిని జుట్టి రసాతలానికే
చేరగ, భీకరాకృతిని జీరుచు కోరలతోడ దైత్యుతో
పోరొనరించుచున్ హరియె పొంకముతోనయి యౌర!భూరి భూ
దారము,భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిదారుణ హింసలన్ గొలుపు ధైత్యుడు భూమినిఁ జుట్టగన్ వడిన్
హైరిక రాక్షసుండు కనకాక్షుడజేయుని లోకకంటకున్
భారముఁ దాల్చి కోపమున పంకజనాభుడె కోరలొంది కుం
*దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్*.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపుడమి ముంచ నెంచి పూనిన రాక్షసున్
రిప్లయితొలగించండిజంప నవ త రించె చక్ర ధారి
కావదలచి తాను చేవను జూపి భూ
దార మెత్తె భువి ను దార ముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రళయకాలమందు వసుమతి మునుగంగ
రిప్లయితొలగించండిహరునికడకు దివిజులరుగుదెంచి
శరణు వేడ సరసిజాక్షుడు తానె భూ
దారమెత్తె భువి నుదారముగను
ధారుణి మున్గెనా ప్రళయ ధాటికి పూర్తిగ కాండపృష్ఠమున్
తొలగించండిసారసగర్భుడున్ మరియు సర్వసురాళియు నాశ్రయించ తా
నూరడి సేయ భావనుడు నూతనమౌయవతారమెత్త భూ
దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపుత్తడి పొలిదిండి భూమిని కడలిలో
ముంచు సమయమందు పుట్టు వడుగు
ఆఖువుగను మారి యసురుని జంపి భూ
దారమెత్తె భువి నుదారముగను.
ధారుణి రక్షకుండవని దానిని రక్షణ జేయు మంచు నా
ధారణుడే వచించె నభిదర్శనుడా పొనిగంటి ద్రుంచుమా
భూరి యటంచు వేడగనె పొత్రిగ మారినిశాటు జంపి కుం
దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికశ్యప తపసి కొడుకడు హిరణ్యాక్షుడు
రిప్లయితొలగించండివిపుల నబ్దినందు విసరి వేయ
హరి వహించిన యొక యవతార మైన కుం
దారమెత్తె భువి నుదారము
గను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅలరసాతలంబు నందున్న యవనిని
రిప్లయితొలగించండిపెల్లగించి గావ వేదములను
హరియె సూకరముగ నావిర్భవించె! కుం
దారమెత్తె భువి నుదారముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీరమునందు మగ్నమయి నీల్గుచునున్న ధరాతలమ్మునున్
రిప్లయితొలగించండితీరుగ నుద్ధరింపుమని దేవతలెల్లరు కోరగా హరిన్
కోరలఁ సాచి భీకరపు ఘుర్ఘురరావము మిన్నుముట్ట కుం
దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభారము నీదె మా సకలబాధ్యత లన్నియు నీవె కావగన్
రిప్లయితొలగించండితీరము జేర్చ నేవె, యని తీవ్రముగా మదినెంచ కాడె యా
ధారము తాను, పూని యవతారము క్రోడము, భక్తలోకమం
దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచూచు వారల మనసు ముదమ్ము వడయంగ
రిప్లయితొలగించండిసుందర తర ముండ సుదతి యిల్లు
ప్రాకటముగ రక్తి వాకిట రంగులు
దార మెత్తె భువి నుదారముగను
[మెత్తు = పులుము]
దారగ భూసతిం గొనఁగఁ దల్చి మహోద్ధతి నెత్తి దర్ప హుం
కార మడంప దైత్యునకుఁ గ్రాలు వరాహ మహావతారమున్
భారము గాఁగ దూది వలె వైష్ణవ మాయ సెలంగ శ్వేత కుం
దారము భూమి నెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిరాక్షసాధముండు రగులుచుఁ బుడమిని
రిప్లయితొలగించండిచాప చుట్టి వేయ సంద్ర మందు
పంది రూప మెత్తి నందుని సుతుఁడు,కు
దారమెత్తె భువి నుదారముగను
క్రూరుఁడు రాక్షసాధముఁడు కుంభిని ముంచగ సంద్రమందునన్
రిప్లయితొలగించండినీరము నందుఁ దా మునిగి నెమ్మది పందిగ రూపము నెత్త యంత కుం
దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్
బౌరులు కూడమె చ్చియును బండుగఁజేసిరి సంతసంబునన్