31, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4295

1-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు”
(లేదా...)
“ఆత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్”
(విట్టుబాబు పంపిన సమస్య)

12 కామెంట్‌లు:

  1. తేటగీతి
    హరుని దివ్యాంశ సంభూతు ననిలసుతుని
    రామనామంబునందున రాగమొంది
    భక్తిపారవశ్యమ్మునఁ బలుకుచు పర
    మాత్మ పూనఁగా నూఁగు మహాత్ముదలఁతు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఆత్మలు శుద్ధమై పుడమి నా భగవంతుని దివ్య లీలలం
      దాత్మలు నిల్పి భక్తులుగ నప్పెడు షిర్ఢి పురీశుఁడాదులా
      ధ్యాత్మిక చింతనన్ మసల నద్భుతరీతిని రామ, కృష్ణ ది
      వ్యాత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్

      తొలగించండి
  2. అర్థసాధన కొరకంచు నటమటీడు
    దొంగస్వామియై జనులను దోచు కొనెడు
    కపటి నటన జేసెడివాడు ఖలుడనెఱగి
    ఆత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు?

    రిప్లయితొలగించండి

  3. ఆత్మలు శక్తిహీనమని యార్యులు తాము వచించిరైరి, ప్రే
    తాత్మలు కల్పితమ్ములవి తాంత్రికులెల్లరి సృష్టియంచు శు
    ద్ధాత్మగుణాలనే కలుగు ధార్మికులే వచియించి రెట్టులీ
    యాత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్?

    రిప్లయితొలగించండి
  4. దేవతాంశ ను గల్గిన దివ్యు రాలి
    కాత్మ పూనగ నూగు : మహాత్ము దలతు
    వారి నాదర్శ ముల నెల్ల వదల కుండ
    నాచ రింప గ యత్నింతు నవ్యముగను

    రిప్లయితొలగించండి
  5. ఆలయంబున జాతర యందు దేవి
    యాత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు
    నాతనికి దేవి పయిగల యతులితమగు
    భక్తికచ్చెరువొందుచు బాళితోడ

    రిప్లయితొలగించండి
  6. ఆతడొకయోగిపుంగవు డాత్మవిదుఁడు
    నిరతమాత్మావలోకన నెరపుచుండు
    సచ్చిదానందమునఁ దేలు సవురుతోడఁ
    నాత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు”

    రిప్లయితొలగించండి
  7. ఆత్మవిదుల్ మహీతలమునందు వసించెడు  నిర్మలాత్ములా
    ధ్యాత్మిక బోధనల్సలిపి ధర్మపథంబును జూపునట్టి మా
    హాత్మిక మూర్తులై వెలుగు నామహనీయుల పెంపెరింగి ది
    వ్యాత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్

    రిప్లయితొలగించండి
  8. ధర్మ సంసక్త వర్తన నిర్మలాత్ము
    సర్వ భూత రాసుల యందు సంతత కరు
    ణార్ద్ర చిత్తతన్ లోక కల్యాణ కార
    కాత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు

    ఆత్మ నొకండు నుండుఁ బరమాత్మ వరాఖ్య వెలుంగు చుండి జీ
    వాత్మ కొసంగి సంతతము నంచితమైన స్వతంత్ర భావ జా
    లాత్మక బుద్ధి కర్మ సముపార్జిత భోక్తను జేసి యట్టి య
    య్యాత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:ఉపనిషద్బోధ జేసి యుర్రూత లూపు,
    కర్మయోగమ్ము లో నున్న మర్మ మెల్ల
    నెరుక బరచుచు దనను శ్రీకృష్ణ దేవు
    నాత్మ పూనగా నూగు మహాత్ము దలతు
    (ఆయన ఉపన్యాసం ప్రజలని ఉర్రూత లూపుతుంది.ఆయనని శ్రీకృష్ణుని ఆత్మ ఆవహించిందా?అన్నట్టు కర్మయోగం చెపుతూ ఆనందం తో ఊగి పోతాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఆత్మలు పూనె నంచు,జను లందరి కోర్కెల దీర్తు మంచు పు
    ణ్యాత్ములు భౌతికేచ్ఛలనె యచ్చట,నిచ్చట దీర్చ జాలునే!
    ఆత్మయె సత్య మంచు ఋషు లందరు తెల్పిన జ్ఞాన మిచ్చి ఋ
    ష్యాత్మలు పూన నూగు మహితాత్ముల నేను తలంతు నాత్మ లోన్

    రిప్లయితొలగించండి
  11. (నిన్నటి పూరణ)
    ఆత్మ వివేకులై సతతమా హరి చింతన సాధనంబునం
    దాత్మ ప్రబోధమంది పరమార్థ విచార మహద్ప్రచారమం
    దాత్మ విచక్షణంబిడు సమాదరణీయులు వంద్యులైన ది
    వ్యాత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్

    రిప్లయితొలగించండి