7, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4272

8-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భాదానమునఁ గవలు గల్గిరి సతికిన్”
(లేదా...)
“గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడఁగన్”

15 కామెంట్‌లు:

  1. కందము
    అర్భకురాలికి వచ్చిన
    గర్భము వేఱొక్కవనిత కడుపుననిడగా
    దుర్భర వేదనతో నా
    గర్భాధానమునఁగవలు గల్గిరి సతికిన్.
    గర్భ+ఆధానము=గర్భమునుంచుట

    రిప్లయితొలగించండి
  2. నిర్భయముగబెళ్లా డియు
    నార్భా టపు కాపు రమున నావేద న తో
    నర్భ కు రాలు మరొ కరికి
    గర్భా దానమున గవలు గల్గిరి satikin

    రిప్లయితొలగించండి

  3. ఆర్భాటమ్మున రెండువేల పదిలో యాగష్టు పన్నెండునన్
    గర్భాదానము చేసిరా వధువుకున్ గాలాంత రమ్మందునన్
    గర్భంబున్ ధరియించెనా పిదప నాగష్టందదే రోజనన్
    గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడఁగన్.

    రిప్లయితొలగించండి

  4. అర్భకులము మేమనుకుని
    నిర్భయముగ నిందవేసె నెలతుక పై నా
    దౌర్భాగ్యుండిటుల పలికె
    గర్భాదానమునఁ గవలు గల్గిరి సతికిన్.

    రిప్లయితొలగించండి
  5. నిర్భయముగ సతినికలసె
    గర్భాదానమునఁ , గవలు గల్గిరి సతికిన్
    గర్భము దాల్చగ , నలరుచు
    నార్భాటము జేసె నాతడందరి తోడన్

    రిప్లయితొలగించండి
  6. ఆర్భాటంబుగ సల్పినారట వివాహమ్మక్క చెల్లెండ్రకున్
    నిర్భాగ్యంబున చెల్లి జబ్బుపడగా నిస్సత్తువన్ వేచినన్
    గర్భాదానము తోడనక్క వడిగా గర్భస్థయై చెల్లికిన్
    గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  7. నిర్భీతిన్గలఁబాల్యమందుననుసుస్నేహంబు వైశిష్ట్యమై
    దర్భల్జేర్చుచు చొప్పదండులనుసంధానించి నుయ్యాలలో
    నార్భాటమ్ములబొమ్మలాటననునూహాతీత భావాంబుతో
    గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడఁగన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  8. కం:దుర్భరమగు సిగ్గు కలుగ
    గర్భాదానమున , గవలు కలిగిరి సతికిన్
    గర్భమ్మె దాల్చు శుభసం
    దర్భమ్మే రాదొ!యనుచు దలచన్ పతియే!

    రిప్లయితొలగించండి
  9. శా:ఆర్భాటమ్ముగ   వ్రాయ   నా   నవల లో నందమ్ము   తో సర్వ  సం
    దర్భమ్ముల్ ,  కడు సాజమైన రుచితో, దా వ్రాయ నా గాధలో
    గర్భాధానము,   నాడె కల్గిరి కవల్ కామాక్షికిన్
    జూడగన్
    గర్భాధానపు ఘట్ట మామె కొక సౌఖ్య మ్మిచ్చెనో!కష్టమో!

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. దర్భల పైఁ గూర్చుండియు
      దుర్భర మగు నిష్ఠ తోడఁ దొడర నహో యా
      విర్బావులు మంత్ర మహిమ
      గ ర్భాదానమునఁ గవలు గల్గిరి సతికిన్

      [గర్భ + అదానము = గ ర్భాదానము]

      దౌర్భాగ్యంబ తలంప వేఁడుకల నుత్సాహమ్మునం గాంచుటల్
      నిర్భాగ్యుల్ ధర నేర రెన్నఁ డనినన్ నిక్కంబ స్వీయాత్మ జా
      విర్భావమ్ముల నేర శక్య మగునే విశ్వమ్ములో సోదరీ
      గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ కామాక్షికిం జూడఁగన్

      తొలగించండి
  11. ఆర్భాటంబెంపొందఁగ
    గర్భాదానంబునయ్యె గౌరీ సుతకున్
    గర్భాదాన పుయేటికి
    గర్భాదానమునఁ గవలు గల్గిరి సతికిన్

    రిప్లయితొలగించండి
  12. కందం
    దుర్భర నిందఁ బనిచె సం
    దర్భము కాదనిన వనికి దాశరథి యహో!
    గర్భవతిగఁ దలచక తన
    గర్భాదానమునఁ, గవలలు గల్గిరి సతికిన్

    శార్దూలవిక్రీడితము
    నిర్భాగ్యమ్మున మాద్రి సంతుఁగన సంధింపంగ మంత్రమ్ము సం
    దర్భౌచిత్యము నెంచి కుంతి యొసగన్, దద్దేవ వైద్యుల్ వడిన్
    దౌర్భాగ్యమ్ము దొలంగ వచ్చి కృపతో ధన్యాత్మగన్ జేసెడిన్
    గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడఁగన్

    రిప్లయితొలగించండి