14, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4279

15-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా”
(లేదా...)
“భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో”

17 కామెంట్‌లు:

  1. సుజఘన!వారిజలోచన!
    అజరామరమై వెలుంగు నతివలనేకుల్
    నిజమునకీధరణిపయిన
    భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గజగజ లాడుశత్రువులు కాంతలు యుద్ధము సేయనెంచినన్
      విజయము తథ్యమౌనుగద విస్మయ మొందుచు కాంతురెల్లరున్
      నిజమని నమ్మగావలయు నేర్పరులౌ నళినాక్షులన్ గనన్
      భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో

      తొలగించండి
  2. కందం.

    వి జ యు ని వి జ య ప రం ప ర
    ని జ భు జ మం డి త ప్ర మీ ల ని లు వ గ జే సెన్
    గ జ గ జ వ ణి కిం చి ను డి వె
    భు జ బ ల ము న స తు ల మిం చు పు రు షు డు గ ల డా?
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    ప్రమీలార్జునయుద్ధం సందర్భం.

    రిప్లయితొలగించండి
  3. కందం
    నిజమదె నరకుని గూల్చిన
    విజయము నీవల్లగాదె ప్రియసతి కచటన్!
    'గుజనుడన'., మీ దయఁ జతు
    ర్భుజ! బలమున సతుల మించు 'పురుషుఁడు' గలఁడా?

    చంపకమాల
    కుజనుఁడనంగ నాడు నరకున్ వధియింపగబోవు సత్యకున్
    విజయము దక్కెఁ గాదె వెనువెంటను మీరల ప్రేరణంబునన్
    నిజముగ నేడు మీ దయను నేరచరిత్రుల గూల్చగన్ చతు
    ర్భుజ! బలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో!

    రిప్లయితొలగించండి
  4. గజగజ వణికిరి గదరా
    నిజముగ నాంగ్లేయ దొరలు నెలతను గని నన్
    ప్రజలు ను తి o చిరి ఝాన్సీ
    భుజ బలమున సతుల మించు పురుషుడు గల డా!

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    క్షితిని ఘన*భుజబలమున సతులమించు
    పురుషుఁడు కలడా*యననేల?హరుని విల్లు
    రాముఁడెక్కిడిఫెళఫెళార్భటులు సెలగ
    జానకిని బెండ్లి యాడెగా సంతసమున.

    రిప్లయితొలగించండి

  6. సుజనులు వచించిరట తో
    యజాక్షులుమనో బలమున నధికులు గన భూ
    రిజమున హీనుండ్రైనను
    భుజబలమున, సతుల మించు పురుషుఁడు గలఁడా.


    సుజనులు చెప్పు మాటలివి చోద్యము కాదిది వాస్తవమ్ము భూ
    రిజముఁ మనోబలమ్మునను లేమలె కాదుటె శక్తి వంతులౌ
    నిజము గ్రహింపు మంటి నిది నిక్కము హీనులె యైననేమిరా
    భుజబలమందుఁ , గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో.!

    రిప్లయితొలగించండి
  7. యజమానులె మీరు వశల
    భుజబలమున, సతుల మించు పురుషుఁడు గలఁడా
    నిజముగ , కాపుర మంతను
    సజావుగ నడుపు విధమున జతురిమ జూపన్

    రిప్లయితొలగించండి
  8. స్వజన పరజ నావలిఁ గాం
    చ జగతిని సుమధుర పాక శాస్త్రమ్ములలో
    సృజనా రీతుల సన్నుత
    భుజ బలమున సతుల మించు పురుషుఁడు గలఁడా

    అజునకు నైన శంభునకు నైన బలారికి నైన మత్త సా
    మజ గమ నాంతరంగమున మంత్రము లేరికి నేర్వ వచ్చునే
    నిజమును బల్క శాంతమున నీరజ నేత్రలఁ దక్క నొక్క త
    ద్భుజ బల మందుఁ గాంతలను బూరుషు లెన్నఁడు మించఁ బోరు పో

    రిప్లయితొలగించండి
  9. చం.

    గజిబిజి గ్వాలియర్న మణికర్ణిక పోరెను ఝాన్సి భూమిలో
    ధ్వజినిని నోరుగల్లు పురి దాడులు రుద్రమదేవి నెమ్మదిన్
    విజయమునొంది ధర్మమును బెట్టిన శౌర్య మహల్యబాయిచే
    *“భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో”*

    రిప్లయితొలగించండి
  10. గజగజలాడ శాత్రవుల గర్వము ఖర్వము జేసి మిన్నగా
    విజయములందవచ్చు నతి భీకర యుద్ధములన్ సమర్థులై
    భుజబలమందుఁ, గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో
    నిజ పతి మానసంబెరిగి నెమ్మి చరించు మనోబలంబునన్

    రిప్లయితొలగించండి
  11. విజయమునకు పోరాడుచు
    నిజభుజబల తేజములను నిరుపమ రీతిన్
    నిజముగఁ జూపెను ఝాన్సీ
    భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా

    రిప్లయితొలగించండి
  12. సుజనా! చెప్పుమ యీయది
    భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా
    భుజబలము పురుషుల కుగద
    నిజమరయగ నుండు మిగుల నిశ్చయ మిదియే

    రిప్లయితొలగించండి
  13. అజుని యమేయ సృష్టిఁగన నచ్చెరువౌనిల  నెంచి చూడగా
    సృజన యొనర్చె భామినుల చిత్తము శైలములట్లు భావనన్  
    విజయమునొందు  పూనికను భీమరమందున పోరు సల్పగా
    భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో

    రిప్లయితొలగించండి
  14. భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో
    కుజనుని మాటయే యిదియ గొప్పలు సెప్పుట యెందు చేతనో ?
    భుజబలమందు మించరుగ, బూరుషు లే బలవంతు లెప్పుఁడున్
    సుజనుల మాట యియ్యదియ చోద్యము గాదిదినీవ నేర్వుమా

    రిప్లయితొలగించండి
  15. అజుడాదిగనెవరైనను
    *“భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా”*
    నిజముగ లేనే లేరన
    రుజువులు వలెనాచెపుమికలోకమునందున్


    నిజసతి నుంచె నాలుకను నీరజ సంభవుడెల్ల వేళలన్
    అజపితయుంచెడెందముననక్షరరూపిణియైన భార్గవిన్
    ద్విజమునుదాల్చుధూర్జటి యుతెల్లనిసామియునైన యీశుడున్
    భుజబలమందుగాంతలనుపూరుషులెన్నడుమించబోరుపో

    రిప్లయితొలగించండి