27, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4291

28-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్షీరాంబుధి తనయ మగఁడు శ్రీకంఠుండౌ”
(లేదా...)
“క్షీరాంభోధి కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ”

18 కామెంట్‌లు:

  1. క్షీరసాగర కన్యకకు దేవతా ప్రముఖులను పరిచయం చేస్తూ, శ్రీహరి....

    కందం
    భారతి మగనిన్ గనుమా!
    వారలె యీ సృష్టి కర్త పద్మాసనుఁడౌ
    సారస నేత్ర గిరిజకున్,
    క్షీరాంబుధి తనయ! మగఁడు శ్రీకంఠుండౌ!


    శార్దూలవిక్రీడితము
    రారమ్మా! స్థితికారుఁడన్ మగని శ్రీలక్ష్మీ! సమీపించు మా!
    వారిన్ జూడుమ భారతీ మగఁడనన్ బద్మాసనుండౌ, సఖీ!
    వీరిన్ గాంచుమ కొండఱేడతని, నీవీరీతి జన్మించితే
    క్షీరాంభోధి, కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ!


    రిప్లయితొలగించండి
  2. నారాయణునికి సతియగు
    క్షీరాంబుధి తనయ ; మగఁడు శ్రీకంఠుండౌ
    గౌరమ్మకు , బొగడవలయు
    వీరిరువురి జంటల , మన విభవము
    కొరకై

    రిప్లయితొలగించండి
  3. ఆరయ నారాయణుడే
    క్షీ రాంబు ధి తనయ మగడు :శ్రీకంఠు o
    డౌ
    నారాయణి పతియు నగుచు
    ధారుణి భక్తు లను గాచు దైవమ్మ య్యెన్

    రిప్లయితొలగించండి
  4. నారాయణుడాయెగదా
    క్షీరాంబుధి తనయ మగఁడు, శ్రీకంఠుండౌ
    గౌరమ్మకు ప్రాణవిభుడు,
    పారాయణియొప్పు పద్మభవునిగృహిణిగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పారావారమొసంగు పెక్కు ఫలముల్ ప్రాప్తమ్ముగావింపగన్
      వీరావేశముతో ప్రయాస పడుచున్ బీభత్స మొప్పారగన్
      క్షీరాంభోధిని జిల్క కేశవునికిన్ స్త్రీరత్నమే చిక్కెనా
      క్షీరాంభోధి, కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ

      తొలగించండి
  5. నారాయణుడే కదరా
    క్షీరాంబుధి తనయ మగఁడు, శ్రీకంఠుండౌ
    గౌరమ్మకు పతి వాణికి
    సారస గర్భుండు వాడె సధ్యంచుడురా.

    (మరొకటి)

    నారాయణుండెవరి పతి?
    సారంగుని బూదిసేసి చండాలికయా
    భైరివిఁ బెండ్లాడె నెవరు?
    క్షీరాంబుధి తనయ మగఁడు, శ్రీకంఠుండౌ.

    (శార్ధూలము)

    ఆ రాయంచయె వాహనమ్ముగల సంధ్యా రాముకున్ పత్నియై
    తా రాజిల్లెనె యుక్తి బ్రహ్మసతి విద్యాదేవియే కాగ నా
    హీరమ్మే తడిమమ్ముగన్ గలిగెడా యిందీవరున్ భార్యయే
    క్షీరాంభోధి కుమారియౌ, గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ

    రిప్లయితొలగించండి
  6. మారజనకుడౌ హరియే
    *“క్షీరాంబుధి తనయ మగఁడు, శ్రీకంఠుండౌ”*
    మారారియు,గిరిజాపతి
    కారణకారణుడుమరియు కాలాంతకుడున్

    మరొక పూరణ

    నారాయణుడేయయ్యెను
    క్షీరాంబుధి తనయ మగఁడు శ్రీకంఠుండౌ”*
    క్షీరాంబుధిలో పుట్టిన
    రేరాజునుదాల్చెసిగను రేయింబవలున్

    రిప్లయితొలగించండి
  7. మరొక పూరణ

    నారాయణుడిని నెవ్వరు,
    తారకుజంపమదినెంచి దాలిచెవనుమా
    మేరువునేవిల్లుగనా
    క్షీరాంబుధితనయ మగఁడు శ్రీకంఠుండౌ

    రిప్లయితొలగించండి
  8. నారాయణుండు నీ పతి
    నీరజ పత్రేక్షణ! విను నిశ్చల మతినిన్
    వారక ప్రమథగ ణాలికి
    క్షీరాంబుధి తనయ! మగఁడు శ్రీకంఠుండౌ

    క్షీరాంభోధి యొసంగ విష్ణునకు నా శ్రీ లక్ష్మినిన్ భార్యగా
    నా రాశిన్ జనియింపఁ శంకరునకున్ హాలాహలం బీయఁగం
    బారావారము తోడఁ జెప్పె నిటులన్ వాక్యాలి శైలేంద్రుఁడే
    క్షీరాంభోధి! కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ

    రిప్లయితొలగించండి
  9. కం:క్షీరాబ్ధి జిలుక హరి యగు
    క్షీరాంబుధి తనయ మగడు, శ్రీకంఠుండౌ
    నౌరా విషమున్ మ్రింగియు
    తేరగ నీ జగతి గాచు ధీరుడు హరుడే.

    రిప్లయితొలగించండి
  10. శా:ఓరీ!పద్యము చక్కగా చదువుమా!ఒక్కింత యర్థమ్ము తో
    "క్షీరాంబోధికుమారి యౌ గిరిజకున్ శ్రీకంఠుడే భర్త యౌ"
    నే రీతిన్ ? సవరించు,శ్రీహరికి నెంతే ప్రేమతో పత్నిగా
    క్షీరాంబోధి కుమారి యౌ,గిరిజకున్ శ్రీకంఠుడే భర్త యౌ.
    (ఒక పిల్లాడు పద్యం లో ఒక పాదాన్ని అడ్డగోలుగా బట్టీ పడుతుంటే తండ్రి అర్థవంతం గా చదవ మంటున్నట్లు.)

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. నీరజగర్భుఁడు హరియౌ
      క్షీరాంబుధి తనయ మగఁడు, శ్రీకంఠుండౌ
      నారయ పతిగాగిరిజకు
      గౌరీపతి హరియు సతముగాచుత జనులన్

      తొలగించండి
  12. నారాయణుఁడే సుమ్మీ
    క్షీరాంబుధి తనయ మగఁడు, శ్రీకంఠుండౌ
    యారయ గౌరీ మాతకు
    మారారియు,చర్మధరుఁడు మగఁడా యెగదా

    రిప్లయితొలగించండి
  13. క్షీరాంభోనిధిఁ శేషతల్ప శయనున్ సేవించు నర్ధాంగియే
    క్షీరాంభోధి కుమారియౌ, గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ
    సారంగమ్ముఁ సుఖాసనంబు గదురన్ సారస్వతా ధ్యాయియౌ
    నీరేజేక్షణవాణి దారయగుగా నీరేరుహాద్భూతుకున్

    రిప్లయితొలగించండి
  14. క్షీరాంభోధి కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ
    పారావారముఁజిల్కగాఁగలుగునా పాషాణ మాశంభుఁడే
    వీరావేశము తోడ మ్రింగగ వెసన్ విష్ణుండుఁ దాలక్ష్మినిన్
    క్షీరాంభోధికుమారి నయ్యెడ గ్రహిం చెన్ భార్యగానత్తఱిన్

    రిప్లయితొలగించండి
  15. వైరుధ్యార్ధములెంచబోకుమిదె నిర్వాదంబు సద్గ్రాహ్యమౌ
    క్షీరాంభోధి మథించు వేళ ప్రభవించెన్ లక్ష్మి యర్ధాంగియౌ
    నా రాజీవదళాక్షు వక్షవిలసద్వ్యక్తార్యయై యెన్నగా
    క్షీరాంభోధి కుమారియౌ; గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ

    రిప్లయితొలగించండి