13, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4278

14-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును”
(లేదా...)
“గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా”

43 కామెంట్‌లు:


  1. వెజ్జు డొకచూర్ణ మిచ్చి తవిష జలమున
    కలిపి త్రావుమనగ వ్యాధి గ్రస్తునకట
    కన్న కొడుకు తెలిపె దీని గలుపుటకిక
    గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును.

    రిప్లయితొలగించండి

  2. పిరతాపంబిక మానుమంచు పలికెన్ వెజ్జుండు సంసక్తి నో
    వరితోడన్ గనుమిట్టి చూర్ణమిది నీ ప్రాణంబు రక్షించునే
    దరిమింకన్ విడి ద్వీపితోయమును సంధానించుమా దానికై
    గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తేటగీతి
      సాలు పొడవునఁ చదివిన చదువు నెల్ల
      వాయిదాలను వేయుచు పాఠములను
      రేపనగ పరీక్ష తెరుచు రీతి చూడ
      గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును!

      మత్తేభవిక్రీడితము
      గురువుల్ వత్సరమంత జెప్పిరనగన్ గుర్తుండఁ బాఠాల్ పున
      శ్చరణంబెంచఁగఁ దేలికౌ తరగతిన్ సాఫల్యమెంతేని, సో
      మరులై రేపు పరీక్షయంచన పఠింపన్ జూచెడున్ బోకడన్
      గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. పులుసును తళిగ లోనికి పొర్ల కుండ
    గరిటతోఁ దోడవచ్చు ; సాగరజలమును
    పాత్రనంతను ముంచియె పట్టవచ్చు
    ద్రవపు పరిమాణముల వెంట దారి మారు

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. మత్తేభము
      అరెరే!గాలినిఁగంటితో గనగనౌ,హారాలుగా సర్పముల్
      వర కంఠంబున దాల్చవచ్చు, విషమున్ భక్షింపగా శక్యమౌ
      గరిటందోడగ వచ్చు వార్ధిజలముల్,కామేశ్వరా!వింటివా?
      ధర మూర్ఖాళి మనంబు మార్చుట యసాధ్యంబే యనన్ సజ్జనుల్.

      తొలగించండి
    2. తేటగీతి
      *గరిటతో తోడవచ్చు సాగరజలమును*
      నీటిపై వ్రాయవచ్చును వాటముగను
      గాలిఁగానగ వచ్చును కంటితోడ
      జేరి మూర్ఖుల మనసు రంజింపఁగలమె.

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. తల్లి పాయసము ను వండి తనయు బిలిచి
    యనియె గిన్నె లోనికి దాని ననువు గాగ
    గరిటతో తోడ వచ్చు:సాగర జలమును
    గోర్కె మీరగ నెప్పుడుగ్రోల వలదు

    రిప్లయితొలగించండి
  7. సాగర జలములందున సాగు చున్న
    కప్పలి బొరియనుండిచిప్పిల్లు నీటి
    సంకటమును నివారింప శక్తి కొలది
    గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరినామస్తుతి సల్ప దివ్యపథమే యందున్, సదాభక్తితో
      స్మరియింపన్ లభియించు గాదె వడిగా స్వర్గంబు భక్తాళికిన్
      పరమాత్మే కరుణింప పుణ్యఫలమే ప్రాప్తించు పుణ్యాంబుధిన్
      గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినండనలు.

      తొలగించండి
  8. తే.గీ:జన్మకోటిసంపాదితాజ్ఞాన వార్ధి
    యొక్క బోధతో బోవునే!ఊరగాయ
    గరిట తో దోడ వచ్చు ,సాగరజలమును
    తోడ లే వీదుమా భక్తి తోడు కాగ

    రిప్లయితొలగించండి
  9. తే.గీ
    చందమామలో కుందేలు పొంద వచ్చు
    నేతి బీరన నేతిని నెరప వచ్చు
    గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును
    చేరి మూర్ఖుని మనసు రంజింప లేము
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  10. చక్కఁ జేయంగ వచ్చును కుక్కతోక
    గాడిదకు గాన విద్యను గరపవచ్చు
    గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును
    పాలసుని చిత్తమును మార్చ వీలుకాదు

    రిప్లయితొలగించండి
  11. యమున దాటంగ గోష్పద మయ్యెఁ గాదె
    తులసి దళము భక్తి నిడఁగఁ దూఁచెఁ బతిని
    హరిఁ దలంప మనమ్మున నడ్డు గలదె
    గరిటతోఁ దోఁడవచ్చు సాగర జలమును

    హరిఁ బూజింప ఫలంబొ యార్తవమొ తోయం బైనఁ జాలం చనన్
    వర పూజార్థము సన్మనమ్మునను సంభావింప దేవాళినిం
    గర పద్మమ్ముల నచ్చ టిగ్గరిటెడుం గాదేని యీ బిందెఁడున్
    గరిటం దోఁడఁగ వచ్చు వార్ధి జలముం గామేశ్వరా వింటివా

    రిప్లయితొలగించండి
  12. సరిచేయంగను సారమేయమునకున్ సాధ్యంబు లాంగూలమున్
    మరణంబొందిన మర్త్యుకైన మనికిన్ మాన్యంబుగా నీదగున్
    గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా
    సరిచేయందొరఁకొన్న ధాతకయినన్ సాధ్యమ్మె నీ మౌఢ్యమున్

    రిప్లయితొలగించండి
  13. మ:హర!నీ తత్త్వ మెరుంగ శక్య మగునే యజ్ఞాని నౌ నాకు!దెం
    పరినై నీ శతకమ్ము వ్రాసితి గృపా వారాశి వీ,వెట్టులన్
    గరిటన్ దోడగ వచ్చు వార్ధిజలమున్ గామేశ్వరా!వింటివా
    కరుణన్ జూపుచు నాదు నీ శతకమున్ గంగాధరా!శంకరా!
    (ఒక కవి శివుని పై శతకం వ్రాశాడు.నీవు కృపావారాశివి.సముద్రాన్ని గరిట తో తోడట మెంతో నా శతకం అంతే అని శతకం లోనే పద్యం వ్రాశాడు. శంకరా!అనే మకుటం తో.)

    రిప్లయితొలగించండి
  14. ఈ ప్రశ్న వేస్తా రేమో!అని సందేహించాను.మీ శతకం అద్భుతం.మీ ప్రశంసకు ధన్యవాదం.

    రిప్లయితొలగించండి
  15. కురిపింపందగు గుంభ వృష్టి దిగియన్ గూపోదకంబించుకన్
    గిరినెత్తందగు నొక్క సూది మొనపై గీలింప వాటంబుగా
    గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా
    సరికావిట్టి వృథా ప్రలాపము లవశ్యం బీవు వర్జింపుమా

    రిప్లయితొలగించండి
  16. కలియుగాంతము నాటికి కనుమరుగగు
    సకల జీవకోటి,కృశియించు సాగరములు
    మార్పు కలుగుచు మానవ మనము లందు
    గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును

    రిప్లయితొలగించండి
  17. కరిచర్మాంబరధారి శంకరు ననంగారాతి కాలాత్మునా
    గిరిజానాథు ననాదిమధ్యలయునా కేదారు నవ్యక్తునిన్
    పరమేశున్ మది నిల్ప లౌకికములౌ బంధంబు లేపాటికిన్
    గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా

    రిప్లయితొలగించండి
  18. వరవీణా మృదుపాణి భారతి సదా వాగ్రూపమై యుండి తా
    కరమున్ బట్టుక రామ గాథను మహా కావ్యమ్ముగా దీర్చ శ్రీ
    కరమై యొప్ప కిరాతుడల్లె గద! అగ్రాహ్యుండు దీవించగా
    గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా

    రిప్లయితొలగించండి