10, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4275

11-12-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ”
(లేదా...)
“అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్”

34 కామెంట్‌లు:

  1. తేటగీతి
    తల్లిని మఱపించు గుణములుల్లసిల్ల
    మేటిరచయిత్రి గా మంచిఁ జాటుచుండ
    గౌరవమ్మును జూపుచు గానమున బల
    కొట్టె నత్తను బ్రేమతో కోడలమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ముత్తెము బోలు రూపమున ముద్దులు సిందుచుఁ జాపఁ జేతులన్
      బొత్తిలినందు తమ్ముని సుపుత్రియె వత్తునటంచు నవ్వులన్
      జిత్తము రంజిలన్ రయమె చేకొనఁగన్ భ్రుకుటిన్ శిరమ్ముతో
      నత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. కన్న కూతురు కంటెను కమ్ర ముగను
    మిగుల మమకారము ను జూప మేర లేని
    మంచి యభి మాను రాలు గా మారియు జయ
    గొట్టె నత్తను ప్రేమతో కోడలమ్మ

    రిప్లయితొలగించండి

  3. వయసు మీరిన దైనను పనులవెన్నొ
    చేసి యలసిన ముదుసలి సేదతీరు
    వైళమున జేరి కెడ పాట పాడి చిచ్చు
    కొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ.

    రిప్లయితొలగించండి
  4. వృద్ధయని యత్తను కొడుకువెక్కిరించ
    కొట్టె ; నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ
    సాదరముగ నామంత్రించె సదనము నకు
    మురిసి ముద్దిడె పౌత్రుని ముసలి బామ్మ

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    మంచివారంచు,మనసున్న మగువ యంచు
    సుందరాంగియు, క్షమను వసుంధరంచు
    భూరి దానశీలి యటంచు పొగడుచుఁబడ
    గొట్టె నత్తను ప్రేమతో కోడలమ్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      పెత్తనమంత యిచ్చినది,ప్రేమగ నెప్పుడు నాదు సంతునే
      యెత్తుకు ముద్దులాడు ,పనియేమియు చెప్పక తానెసేయు,నా
      చిత్తమెఱింగి పల్కునని చెప్పుచు నవ్వుచు పూలచెండుతో
      నత్తనుఁగొట్టె కోడలు సమాదరభావము పొంగిపొర్లగన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'వసుంధర + అంచు' అన్నపుడు సంధి లేదు. "వసుంధర యని" అనండి.

      తొలగించండి
    3. శుభోదయం,నమస్సులు,మీ సూచనకు ధన్యవాదములు.

      తొలగించండి
  6. చిత్తము నందు సంతసము సిందులు
    ద్రొక్కచునుండ బ్రేమతో
    పుత్తడి బొమ్మ తా వరుని పూవుల మాలను గొట్టబోయి గ
    మ్మత్తుగ ముచ్చడించు తన మాత స
    మానపు విజ్ఞురాలు మే
    నత్తను గొట్టె కోడలు సమాదర భావము
    పొంగిపొర్లగన్.

    రిప్లయితొలగించండి
  7. చెప్పిన వినక మారాము చేయు చుండ
    విసిగివేసారి కూతురి వీపుపైన
    *“కొట్టె, నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ”*
    పలకరించెను డెందెము పులకరించ

    రిప్లయితొలగించండి
  8. అత్తకు వినోద మందించ నరసి రోజు
    రోజుకు చలన చిత్రాల మోజుపెంచి
    దినదినము పూజలే మరయునటుల చెడ
    గొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ

    రిప్లయితొలగించండి

  9. సత్తువ జచ్చె నాకనుచు సద్గుణ శీలి పలిక్ని ప్రేమతో
    క్రొత్తగ వచ్చినట్టి స్నుష కోరక ముందుటె చెంత బిల్చుచున్
    బెత్తనమంత నీదెయన బేషని మెత్తగ వీపు పైననా
    యత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్.

    రిప్లయితొలగించండి
  10. ఆమె మేనత్తకు సమవయస్కురాలు
    కలిసి యాటల పాటల మెలుగువారు
    కొంటెతనముగ మేనత్త వెంటబడఁగ
    కొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ

    రిప్లయితొలగించండి
  11. నత్త మొత్తమ్ము నందొక్క నత్త కెత్తఁ
    జిత్త మందు నత్తఱి వీస మెత్తు ప్రేమ
    నత్త నత్తను మెత్తగ హత్తుకొనఁగఁ
    గొట్టె నత్తనుఁ బ్రేమతోఁ గోడలమ్మ

    మెత్తని మాట లత్తఱి నిమిత్తము లెంచి సదుత్తరమ్ము నే
    యుత్తల మాత్మ నత్తుకొన కుత్తమ వృత్త సమగ్ర చిత్త సం
    విత్తము నౌ విధం బిడఁగఁ బ్రీతిని నంత భుజమ్ము పైన మే
    నత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు వృత్త్యనుప్రాసతో అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ఎన్ని కలలోన నిలబడె నెగువసభకు
    చెలగిజైతన్యవంతులజేఱదీసి
    కరమువిజయంబుమనకంచుకరముకరము
    గొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:అందముగ నున్న స్త్రీ గని నంత లోకు
    లచ్చముగ లక్ష్మి వలె నున్న దనుట జూచి
    "వాణి వలె నని పల్క లెవ్వార" లనుచు
    కొట్టె నత్తను ప్రేమతో కోడలమ్మ
    (ఎవరైనా అందం గా ఉంటే లక్ష్మీదేవి లాగా ఉన్నా వంటారు కానీ సరస్వతి లాగా ఉన్నా వనరు కదా!అది చూసి సరస్వతికి వింతగా అనిపించింది.అత్త గారైన లక్ష్మిని చిన్నగా కొట్టింది.ఈర్ష్యతో కాదు.ప్రేమతో.)

    రిప్లయితొలగించండి
  14. అత్తయు కోడలున్గలిసి యాటల పాటల నొక్కజట్టుగా
    చిత్తమువచ్చురీతిఁగడు చెల్వముగా చరియించు బాలికల్
    పొత్తుగ మేనకోడలికి పూవుల మాలనుఁగూర్చ కొప్పునం
    దత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్

    రిప్లయితొలగించండి
  15. చిత్తము దోచునట్లుగను చెయ్దము లెల్లయు నాచరించుచున్
    కొత్తగ వచ్చి నెల్లరకు కూరిమి పంచగ పల్కెహాయిగా
    పెత్తనమిచ్చెతిన్ గొనవె బిడ్డలెమేమన నవ్వి మెత్తగా
    *“అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్”*

    రిప్లయితొలగించండి
  16. మత్తుకు బానిసై కడునమానుష వర్తన పెచ్చరిల్లగా
    చిత్తుగఁ ద్రాగి గ్రామమున చేయుచు పైబడి పెక్కు దౌష్ట్యముల్
    విత్తము కోరుచున్ సతము వేదన పెట్టెడి నాథుఁ, గావగా
    నత్తనుఁ, గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్

    రిప్లయితొలగించండి
  17. ఉ:ఎత్తక యత్త పేరు ,తన కిష్టము వచ్చిన చిత్ర గాధనే
    యెత్తుక, "యత్త లంద రతి హీనత జూతురు కోడలమ్మలన్
    చెత్త తనమ్ము వారి" దని చెప్పి సమత్వము ,దెప్పు లాటతో
    నత్తను గొట్టె కోడలు సమాదరభావము పొంగి పొర్లగన్
    (స్త్రీల తెలివి తేటలు ఇలా ఉంటాయి.అత్తని సరాసరి తిట్టక ఏదో సినిమా కథ ఎత్తుకొని అత్తలు కోడళ్లని పెట్టే బాధలు చెప్పి,సమత్వం చెప్పి దెప్పిపొడుపుతో అత్తని కొట్టంది.)

    రిప్లయితొలగించండి
  18. పద్యమె కల్పవృక్షమన వన్నెలు దిద్దిన విశ్వనాథుడే
    సద్యశమున్ గడించుటకు స్థావరమౌచు రహించ నియ్యెడన్
    హృద్యము లైన భావములు, ప్రీతిని గొల్పెడి శైలి లేనివౌ
    పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే!

    రిప్లయితొలగించండి