12-12-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్”(లేదా...)“పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్”
కందంరక్షింపఁ గుజ జటాయువుదక్షతఁ బుష్పకమునడ్డఁ దలిమము తోడన్రాక్షసుడు నరికి, రాలగపక్షమ్ములు దెగిన పక్షి, పైపైకెగసెన్
శార్దూలమురక్షింపంగ జటాయువే యవనిజన్ రాకాసితోఁ బోరె, నిర్దాక్షిణ్యంబుగఁ బుష్పకానఁ జనుచున్ ద్రచ్చెన్ గృపాణమ్ముతో రూక్షమ్మౌ వికటాట్టహాసమున దుర్మోహుండునై, రాలగన్పక్షంబుల్ దెగి పడ్డ పక్షి, యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కందమువృక్షంబునుండిరాలెన్ పక్షమ్ములు దెగిన పక్షి ;పైపైకెగసెన్పక్షమ్ముల నాడించుచువృక్షస్థిత పక్షి బోయ వేటాడు తఱిన్.
శార్దూలమురక్షించంగ జటాయువడ్డుపడ నిర్దాక్షిణ్యుఁడై యాతనిన్ శిక్షించెన్ వివిధాస్త్రశస్త్రముల, నిర్జీవంబుగా మారెగా పక్షంబుల్ దెగిపడ్డ పక్షి; యెగసెన్ పైపైకి మిన్నందగన్ రక్షోనాథుఁడు జానకింగొనుచు శ్రీలంకాపురీ దిక్కుగన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'లంకాపురీ దిక్కునన్' అనడం సాధువు కాదు. "లంకాపురిం జేరగన్" అనండి.
నమస్సులు,మీ సూచనకు ధన్యవాదములు.
రాక్షసులై పగతురు నిర్దాక్షిణ్యము బూనుచు నరదమ్మును వోఢన్ బక్షముబూని కూల్చిన తరి పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్. *(పద్మవ్యూహంలో నిరాయుధుడై యోంటరిగా అభిమన్యుడు చేసిన యుద్ధ సన్నివేశము )*
చక్కని పూరణ. అభినందనలు.
అక్షులు లేనివి యైననుపక్షుల క రణి గ నెగురుచుపగతు ర దునుమన్రక్షణ గా విను వీధినిపక్ష మ్ము లు దెగిన పక్షి పై పై కెగసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దీక్షాతత్పరుడైన దర్శకుడు తాదీసెన్ మహాచిత్రమున్ సుక్షత్రీయుడు రామచంద్ర చరితన్, జూపించెనే యందులో దాక్షిణ్యమ్మది లేని కర్వరి గరుత్మంతమ్ముఁ ఖండింపగా పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్ దీక్షన్ వీడక పోరుసల్పి తుదకున్ త్రెళ్ళెన్ జటాయుస్సటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'క్షత్రీయుడు, జటాయుస్సు' ?
రక్షింపగ సీతమ్మనులక్షింపక తనయసువులు రావణుతోడన్ దీక్షగ సలుపుచు బోరునుపక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్
భిక్షగ నొసగెను కర్ణుడులక్షణముగ తననుగాచు రక్షణ హరువున్ప్రేక్షకులై గనిరెల్లరుపక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్
ఆక్షణమున లంకేశుడుభిక్షాటన యంచు కుజను వెడ్డును జేయన్భిక్షు నెదిరి యశమొందుచుపక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్
రక్షింపన్ ధరణీ సుతన్ ఖగము సంరంభంబుగా రావణున్ పక్షంబుల్ నఖ చూచుకమ్ములను సంభావించి శస్త్రంబుగా దీక్షన్ మార్కొనినంత పక్షయుగమున్ ద్రెళ్ళంగనా పోరులో పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
అక్షోభ్యము తన వారికి స్వక్షేమము తెలుప వ్రాయ సంతోషముగా నక్షయముగ జాబు సెలఁగి పక్షమ్ములు దెగిన పక్షి పైపై కెగసెన్రక్షో నాథుని నే నెఱుంగుదును వే రండంచు వృత్తాంతమున్ సక్షేమంబు దశాస్యు జాడ తెలుపన్ సంపాతి చిత్రమ్ముగా నిక్షిప్తమ్ములు కాఁగ రామ మహిమన్ నీరేజ పత్రాక్షుచేఁ బక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
కం:రక్షింపగ భూజాతనురాక్షసు నెదిరించి పోరి రాముని కృప చే మోక్షపథగామి యౌచున్పక్షమ్ములు తెగిన పక్షి పై పై కెగసెన్.(జటాయువు ఊర్థ్వలోకాలకి పయనించాడనే భావం తో.)
శా:రక్షింపన్ భరతోర్వి లౌకికత కే రాజ్యమ్మటంచున్ మహాకక్షన్ దా ప్రతిపక్షసంఘటన తో కాల్ద్రువ్వు నా నేత యేపక్షమ్ముల్ తెగి పడ్డ పక్షి, యెగసెన్ పైపైకి మిన్నందగన్దీక్షన్ బూనిన హిందు వాదము మహాతేజమ్ముతో నెన్నికన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అయ్యా!ధన్యవాదం.
రక్షింపగ సీతమ్మనురాక్షసునెదిరించి పోరి రాఘవు నచ్చో వీక్షించి వార్త తెలుపుచు*“పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రక్షింపంగ మహీజ మిన్నెగసి దా లంకేశు వారింప నిర్దాక్షిణ్యంబుగ ద్రుంచి గూల్చెనటులా దైత్యుండయో, మీదటన్ ప్రక్షాళ్యంబొనరించి రామ కర సంస్పర్శంబు మోక్షంబిడన్పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
కందం
రిప్లయితొలగించండిరక్షింపఁ గుజ జటాయువు
దక్షతఁ బుష్పకమునడ్డఁ దలిమము తోడన్
రాక్షసుడు నరికి, రాలగ
పక్షమ్ములు దెగిన పక్షి, పైపైకెగసెన్
శార్దూలము
తొలగించండిరక్షింపంగ జటాయువే యవనిజన్ రాకాసితోఁ బోరె, ని
ర్దాక్షిణ్యంబుగఁ బుష్పకానఁ జనుచున్ ద్రచ్చెన్ గృపాణమ్ముతో
రూక్షమ్మౌ వికటాట్టహాసమున దుర్మోహుండునై, రాలగన్
పక్షంబుల్ దెగి పడ్డ పక్షి, యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికందము
రిప్లయితొలగించండివృక్షంబునుండిరాలెన్
పక్షమ్ములు దెగిన పక్షి ;పైపైకెగసెన్
పక్షమ్ముల నాడించుచు
వృక్షస్థిత పక్షి బోయ వేటాడు తఱిన్.
శార్దూలము
తొలగించండిరక్షించంగ జటాయువడ్డుపడ నిర్దాక్షిణ్యుఁడై యాతనిన్
శిక్షించెన్ వివిధాస్త్రశస్త్రముల, నిర్జీవంబుగా మారెగా
పక్షంబుల్ దెగిపడ్డ పక్షి; యెగసెన్ పైపైకి మిన్నందగన్
రక్షోనాథుఁడు జానకింగొనుచు శ్రీలంకాపురీ దిక్కుగన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'లంకాపురీ దిక్కునన్' అనడం సాధువు కాదు. "లంకాపురిం జేరగన్" అనండి.
నమస్సులు,మీ సూచనకు ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిరాక్షసులై పగతురు ని
ర్దాక్షిణ్యము బూనుచు నరదమ్మును వోఢన్
బక్షముబూని కూల్చిన తరి
పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్.
*(పద్మవ్యూహంలో నిరాయుధుడై యోంటరిగా అభిమన్యుడు చేసిన యుద్ధ సన్నివేశము )*
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఅక్షులు లేనివి యైనను
రిప్లయితొలగించండిపక్షుల క రణి గ నెగురుచు
పగతు ర దునుమన్
రక్షణ గా విను వీధిని
పక్ష మ్ము లు దెగిన పక్షి పై పై కెగసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదీక్షాతత్పరుడైన దర్శకుడు తాదీసెన్ మహాచిత్రమున్
సుక్షత్రీయుడు రామచంద్ర చరితన్, జూపించెనే యందులో
దాక్షిణ్యమ్మది లేని కర్వరి గరుత్మంతమ్ముఁ ఖండింపగా
పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
దీక్షన్ వీడక పోరుసల్పి తుదకున్ త్రెళ్ళెన్ జటాయుస్సటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'క్షత్రీయుడు, జటాయుస్సు' ?
రక్షింపగ సీతమ్మను
రిప్లయితొలగించండిలక్షింపక తనయసువులు రావణుతోడన్
దీక్షగ సలుపుచు బోరును
పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభిక్షగ నొసగెను కర్ణుడు
రిప్లయితొలగించండిలక్షణముగ తననుగాచు రక్షణ హరువున్
ప్రేక్షకులై గనిరెల్లరు
పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆక్షణమున లంకేశుడు
రిప్లయితొలగించండిభిక్షాటన యంచు కుజను వెడ్డును జేయన్
భిక్షు నెదిరి యశమొందుచు
పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరక్షింపన్ ధరణీ సుతన్ ఖగము సంరంభంబుగా రావణున్
రిప్లయితొలగించండిపక్షంబుల్ నఖ చూచుకమ్ములను సంభావించి శస్త్రంబుగా
దీక్షన్ మార్కొనినంత పక్షయుగమున్ ద్రెళ్ళంగనా పోరులో
పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅక్షోభ్యము తన వారికి
రిప్లయితొలగించండిస్వక్షేమము తెలుప వ్రాయ సంతోషముగా
నక్షయముగ జాబు సెలఁగి
పక్షమ్ములు దెగిన పక్షి పైపై కెగసెన్
రక్షో నాథుని నే నెఱుంగుదును వే రండంచు వృత్తాంతమున్
సక్షేమంబు దశాస్యు జాడ తెలుపన్ సంపాతి చిత్రమ్ముగా
నిక్షిప్తమ్ములు కాఁగ రామ మహిమన్ నీరేజ పత్రాక్షుచేఁ
బక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికం:రక్షింపగ భూజాతను
రిప్లయితొలగించండిరాక్షసు నెదిరించి పోరి రాముని కృప చే
మోక్షపథగామి యౌచున్
పక్షమ్ములు తెగిన పక్షి పై పై కెగసెన్.
(జటాయువు ఊర్థ్వలోకాలకి పయనించాడనే భావం తో.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా:రక్షింపన్ భరతోర్వి లౌకికత కే రాజ్యమ్మటంచున్ మహా
రిప్లయితొలగించండికక్షన్ దా ప్రతిపక్షసంఘటన తో కాల్ద్రువ్వు నా నేత యే
పక్షమ్ముల్ తెగి పడ్డ పక్షి, యెగసెన్ పైపైకి మిన్నందగన్
దీక్షన్ బూనిన హిందు వాదము మహాతేజమ్ముతో నెన్నికన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅయ్యా!ధన్యవాదం.
తొలగించండిరక్షింపగ సీతమ్మను
రిప్లయితొలగించండిరాక్షసునెదిరించి పోరి రాఘవు నచ్చో
వీక్షించి వార్త తెలుపుచు
*“పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరక్షింపంగ మహీజ మిన్నెగసి దా లంకేశు వారింప ని
రిప్లయితొలగించండిర్దాక్షిణ్యంబుగ ద్రుంచి గూల్చెనటులా దైత్యుండయో, మీదటన్
ప్రక్షాళ్యంబొనరించి రామ కర సంస్పర్శంబు మోక్షంబిడన్
పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి