28, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4292

29-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు”
(లేదా...)
“సంగరమిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్”
(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో)

31 కామెంట్‌లు:


  1. రక్తపాతమ్ము చిందని రణము తోడ
    సాంఘిక యసమానతలను సంహరించి
    పుడమి లోన శాంతిని నిలుపుటకు జేయు
    సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు.

    రిప్లయితొలగించండి
  2. రంగము సంగతిన్ జనులు రాజ్యము లన్నియు నెర్గినట్టివే
    భంగము సేయు జీవనము, బాధలు దు:ఖము మానవాళికిన్
    సంగరమిచ్చు, సంతసము సత్ఫలమిచ్చు మనుష్యజాతికిన్
    మంగళ దాయకంబగు శమంబు సమన్వయ
    మార్గమెంచిన్

    రిప్లయితొలగించండి
  3. దినదినము దమ దప్పుల దెలుపు చుండ
    చెఱకు పంపు పాలనపయి చేయు చున్న
    సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు,
    విడిచి పెట్టగ నీరీతి పెరుగగలదు

    రిప్లయితొలగించండి

  4. తుంగియె పూర్ణరూపుడయి దోషమునందున చార్వినీనగా
    నంగవిహీనునార్తవశరాళి యఘాతము తాళలేని యే
    కాంగుల సౌరతమ్ము నయగారము, బన్నమె లేనిదైన యా
    సంగరమిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్.

    రిప్లయితొలగించండి
  5. అంధ విశ్వాస ముల నెల్ల నణచి వేయ
    సత్య ధర్మాలు నెలకొల్ప సాహసించి
    మార్పు గోరుచు జేసెడు మహిత మైన
    సంగరమ్ము సంతస ము బ్ర శాంతి నొసగు

    రిప్లయితొలగించండి
  6. చిన్నమాటపట్టింపులే జీవితమున
    కలతలను పెంచి హానిని కలుగచేయు
    సంగరమ్ము,సంతసము బ్రశాంతినొసగు
    జనుల కెల్లను సతతము జగతియందు

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    నిర్మలమ్మగు మానస మర్మమెరిగి
    మదిని యయ్యరిషడ్వర్గ మొదిగియుండి
    బాధలకు గురి చేయఁగ, వాటి గెల్చు
    సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు

    ఉత్పలమాల
    నింగికి నేలకున్ నడుమ నీదగు జీవితమార్గమందు నీ
    వింగిత మన్నదే మఱువ నీర్ష్య నసూయల రెచ్చగొట్టుచున్
    గ్రుంగగ జేయు షడ్రిపులఁ గూడక వాటిని గెల్వ జేసెడున్
    సంగరమిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్

    రిప్లయితొలగించండి
  8. రాజ్య విస్తరణమె మనోరథము కాగ
    పొరుగు రాజ్యము పైబడి పోరు సల్ప
    నంతు చిక్కక కొనసాగి యంతమైన
    సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు

    రిప్లయితొలగించండి
  9. మాటి మాటికిఁ జెలరేఁగి చేటు గూర్ప
    సంగరమ్ములు వర్ధిల్లు సంతతమ్ము
    నంద ఱొక చోటఁ జర్చించి నంతఁ దొలఁగ
    సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు

    భంగము సేయ ధర్మమును భండన భూమి సబాంధవమ్ముగాఁ
    జెంగక కూల్చె రావణుని సీత నిమిత్తము రాముఁ డుగ్రుఁడై
    సంగత మైన దుష్ట జన సంచయ మిద్ధర సత్య ధర్మ యు
    క్సంగర మిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్య జాతికిన్

    రిప్లయితొలగించండి
  10. హత్యలును దోపిడీలతో హానిఁగూర్చు
    ముష్కరుల ఘోర దౌష్ట్యమ్ము ముగియు వరకు
    నిర్విరామంబుగాచేయ నియతి తోడ
    సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు

    రిప్లయితొలగించండి
  11. భంగమొనర్ప సంఘమున భాసిలు శాంతిని దుష్ట శక్తులే
    క్రుంగగజూడ తాలిమిని లొంగక నెల్లరు నొక్క తాటిపై
    నింగియె హద్దుగా నిలిచి నిశ్చలచిత్తముతోడ సల్పగా
    సంగరమిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:దినము దినమెల్ల నెన్నియో పనుల నుండి,
    మానసికశాంతి లోపించ మాపు నందు
    ప్రమద తోడ ననంగ రంగమున జరుగు
    సంగరమ్ము సంతసము బ్రశాంతి నొసగు
    (అనంగరంగం లో సంగరము=శృంగారక్రీడ)

    రిప్లయితొలగించండి
  13. ఉ:"సంగర మిచ్చు దుర్భరవిషాద" మటంచు వచించు నీతికిన్
    భంగముగా నొనర్చె తన వాదము నివ్విధిగన్  ముసోలినీ
    "అంగన గర్భవేదననె యందును సత్ఫల మట్టులే సదా
    సంగర మిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్"
    ("War is to a nation what metarnity is to a woman"  అంటాడు ఇటలీ ఫాసిస్ట్ నియంత ఐన ముసోలినీ.)

    రిప్లయితొలగించండి
  14. భంగురమీ ప్రపంచమిట ప్రాంతము జాతి మతంబులెంచుచున్
    వెంగలివిత్తులైన యెడ ద్వేషముతో నశియింత్రు గాని యే
    సంగరమిచ్చు సంతసము; సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్
    సంగడి సామరస్య మనుషంగము విశ్వజనీన భావనల్

    రిప్లయితొలగించండి