2, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4267

3-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్”
(లేదా...)
“మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు”

31 కామెంట్‌లు:

  1. అక్రమార్జన యందు దా నాశ పడుచు
    పెక్కు దురిత మ్ము లన్ జేసి విఱ్ఱ వీగు
    మూర్ఖుడు కపట భక్తి తో మోజు తోడ
    మునుగ గౌతమిలో నెట్లు మోక్ష మబ్బు?

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    పరుల పీడించు వైనమ్ము వంటబట్టి
    దోచు బుద్ధిఁ గలిగి నిద్రలేచుమొదలు
    పుష్కరమ్మున కొకమారు పుణ్యమనుచు
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు?

    చంపకమాల
    అనయము తోడివారలకు హానిఁ దలంచెడు స్వార్థబుద్ధితో
    మొనకొని దోచినన్యులను మోదమునందెడు హీనచిత్తమై
    తనరుచు పుష్కరమ్మనఁగఁ దానట పుణ్యము నందగోరుచున్
    మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా! 🙏

      వాట్సప్ సూచనలమేరకు సవరించిన పూరణలు:

      తేటగీతి
      పరుల పీడించు నైజమ్ము వడసి మిగుల
      దోచు బుద్ధిఁ గలిగి నిద్రలేచుమొదలు
      పుష్కరమ్మున కొకమారు పుణ్యమనుచు
      మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు?

      చంపకమాల
      అనయము తోడివారలకు హానిఁ దలంచెడు స్వార్థబుద్ధితో
      మొనకొని దోచి యన్యులను మోదమునందెడు హీనచిత్తమై
      తనరుచు పుష్కరమ్మనఁగఁ దానట పుణ్యము నందగోరుచున్
      మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్?

      తొలగించండి
  3. చం.

    అనువున పాలకుల్ పురమునందలి చెత్తను త్రాగునీటిలో
    చనువుగ బంపగన్ మురికి జార నశుద్ధత కాల్వలందునన్
    పునుకలు మైలవస్త్రములు పుల్లలు, మూర్ధజపూర్ణమౌ తటిన్
    *మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్ !*

    రిప్లయితొలగించండి

  4. చేపలను పట్టి యమ్ముచున్ జీవనమ్ము
    గడుపు గంగపుత్రుడువాడు కటికపేద
    బ్రతుకు తెరువంచు దలచుచున్ బ్రతి దినమ్ము
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు?

    రిప్లయితొలగించండి

  5. ధనమును పొందనెంచుచు నధర్మపథమ్ముఁ జరించువాడు దూ
    షణముల దప్ప యెన్నడును సత్కృతులన్న నెఱుంగనట్టి పాం
    సనుడు విహారమందు సరసమ్ముల నాడుచు దేవదాసితో
    మునిఁగిన వాఁడు మూర్ఖుఁడగు, మోక్షము దక్కున గౌతమీ నదిన్?

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది
    రామ!రామ! రామ!రామా!యటంచును
    భక్తితోడఁగాంచ భద్రగిరిని
    కలుగు ముక్తి"మునుగ గౌతమిలో; నెట్లు
    మోక్షమబ్బు"ను దృఢదీక్షలేక?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      ఘన తమకంబునన్ దిగి,యఖాతమునందున నీదులాడుచున్
      *మునిగిన వాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున?గౌతమీనదిన్ *
      పనివడి చేసి స్నానములు భద్రగిరీంద్రునిపై వసించు రా
      ముని,జనకాత్మజంగొలువ పుణ్యము మోక్షము కల్గుఁదప్పకన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. పదవి కైప్రాకులాడెడి పాడు జబ్బు
    నేత యై దండుకొనునవినీతి డబ్బు
    మంచి కరువైన నడవడి మనసు గబ్బు
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తనరుచు పాపకార్యములఁ దక్కొని జన్మముకొక్కనాడిటన్
      గొనగొని పుణ్యమొందుటకు గొబ్బున మానస మందుకోరుచున్
      దనకిక దోషముల్తొలగి తప్పక ధన్యత నొంద నమ్ముచున్
      మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. తాపము భరించలేకుండి తటినికేగి
    జలకమాడబోవగ గాలు జారినంత
    మునుఁగ గౌతమిలో , నెట్లు మోక్షమబ్బు !
    జీవితమునుండి పూర్తిగ స్వేచ్ఛదప్ప

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి:
    అక్రమార్జన చేయుచు వక్రగతుల
    పేదసాదల రక్తముఁబీల్చి సిరులు
    మూటగట్టుచు పాపమున్ మూటగట్టి
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల:
    అనవరతంబు నాశ్రితుల నారడి వెట్టుచు నక్రమంబుగా
    ధనమునుదోచి సంపదల దండిగ నార్జనచేసి పాప సం
    హననముఁగోరి యాత్రలకు నాదటఁ జూపుచు తీర్థమందునన్
    మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు, మోక్షము దక్కున గౌతమీ నదిన్?

    రిప్లయితొలగించండి
  11. మనుజుల తనువులఁ గల చెమటలు నింక
    దుమ్ము నిత్యమ్ము నక్కటఁ గ్రమ్మ మలిన
    ములు సెలంగఁ గరం బబ్బు ముఱికి గాని
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్ష మబ్బు

    కనక విభూషణమ్ములను గైతవ వృత్తి నొసంగ నెన్నియున్
    ఘన కలుషాత్ముఁ డెన్నఁడును గైటభ మర్దను గాంచ నేర్చునే
    మనమున భక్తి నిల్పకయె మానవ ఘాతకఁ డెన్ని మార్లునున్
    మునిఁగిన వాఁడు మూర్ఖుఁ డగు మోక్షము దక్కున గౌతమీ నదిన్

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    పాపములనేకమొనరించి వచనము విని
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు?
    సతతము హరి నామ జపము సలిపిన కలి
    లోన దొరుకు కైవల్యము జ్ఞాని రీతి.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  13. పాప కార్యము లెన్నియో వడయు చుండి
    మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు
    మునుగ గౌతమి నేరికి ముక్తి రాదు
    దైవ సేవయే ముక్తిని నావహించు

    రిప్లయితొలగించండి
  14. మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్
    వినఁదగు మాట చెప్పిరిట వేనకు వేలుగ మూల్య మేయిదిన్
    గనుచును వేంక టేశ్వరుని గంటల మేరకు చేయ సేవనున్
    వినుముర మోక్ష మబ్బునని వేదవి దుల్ పలు కంగ వింటివే

    రిప్లయితొలగించండి