5-12-2022 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్”(లేదా...)“పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి”
ధర్మముఁ నిలుప ధరణిని దానవులనుసంహరింపక తప్పదో సత్య వ్రతుడయాడ దనుచు శంకనుమాను యాతు వులకుపూజ్యురాలు తాటకి యని మునులె యనిరి.
సాటియె లేనిమేటి గుణసంపద గల్గిన నీకు వందనంబేటికి సంశయించెదవొ యిజ్యను రక్షణ జేయగోరి యీచోటుకు జేరినట్టి ఘన శూరుడ పుణ్యజనాళి కెల్ల యీతాటకి పూజ్యురాలనుచు, దాపసులెల్లరు గొల్చిరింపుగన్ బోటిని కాటికంపనను భూపతి పంక్తిరథాత్మజుండనే.
తేటగీతిరక్తధారలు గురిపించు ప్రబలమైనరక్కసిని గని యెవరంచు రాముఁడడుగ"బలయుతులగు మారీచ సుబాహువులకుపూజ్యురాలు తాటకి"యని మునులె యనిరి.
ఉత్పలమాల సాటియురారు నీకెవరు సంగరమందునటంచు పల్కగామాటికి మాటికిన్ వివిధ మాయలతో బెదిరించుచుండి,పోరాటము సేయ నాయమను రాముఁడు ద్రుంచెను రాక్షసాళికిన్తాటకి పూజ్యురాలనుచు దాపసులెల్లరుగొల్చిరింపుగన్.
ఉత్పలమాలదీటుగ రామలక్ష్మణులు దిగ్విజయమ్ముగ గావయజ్ఞమున్వేటుకు రామబాణహతి వీడగ ప్రాణము ధన్యురాలటంచాటవిఁ గ్రూర రాక్షసులు నాయమనెంచఁగ వారిపాలిటన్దాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్తేటగీతిమౌనియజ్ఞము గాచిన మాన్యుడైనధర్మమూర్తి రాముని బాణ ధాటికచటఁగూలె, ధన్యురాలన రాక్షసాలి పాలిపూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
కలికి కారణ మయ్యెను కదన మునకుననుచు కొందరు పల్కగా నసు రులకుపూజ్యు రాలు తాటకి యని మునులె యనిరినిజము గాతోచు నయ్యది నిశ్చ యముగ
శాపవశమున రాక్షస సత్వమొందికుంభకర్ణ, రావణులగు కొమరిసుతులకవ్వవై,విజయ జయుల కభవమిడినపూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
యజ్ఞ నాశన మొనరించు యక్షరాక్షసినిగని యెవరీమె తెలుపుమనుచు నడిగెనత్తరమున నగస్త్య మహర్షి భార్యపూజ్యురాలు, 'తాటకి' యని మునులె యనిరి
యక్షవరుఁడు సుకేతున కంచితముగఁ దపము నొనరింప నిష్ఠఁ బెద్ద సమయమ్ము బ్రహ్మ యొసఁగిన ముద్దుల పట్టి యనుచుఁ బూజ్యురాలు తాటక యని మునులె యనిరి చేటొన గూర్ప నిట్లన విచిత్రము మార్పకుమీ చరిత్రమున్ వీటఁ జెలంగు పిల్లలకుఁ బ్రీతినిఁ జెప్పుమ సత్య మెప్పుడుం బాటవ మొప్ప చెప్పుమ యబద్ధము నాడక యే యుగమ్మునం దాటక పూజ్యురా లనుచుఁ దాపసు లెల్లరు గొల్చి రింపుగన్
గాటఁపు దీక్షతోమునుల గాసిలజేయుచు యజ్ఞయాగముల్తాటకి యడ్డగించునెడ తద్దయు శౌర్యగుణమ్ముతోడ ఘోరాటవియందు దాశరధి యాపెకు ముక్తిపథమ్ము జూపనాతాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్
అసురసంహారమొనరింప యవనియందుహరియె శ్రీరామచంద్రుడై యవతరించెనట్టి రాముని చేతిలో నంతమొందెపూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
వేటకు వచ్చిపైబడిన భీకర సింహము రీతి దూకగాచేటునెరుంగలేక, కడు శీఘ్రముగా, గని సంహరింపగానాటిరయమ్ము బాణముల నాతిని, రాముని చేత జచ్చె నాతాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి యట్లు బలుకని మునులకు హాని కలుగు బ్రదుక నీయరు వారిని రాక్ష సులుసు నిర్దయులగుటచేఁ దప్పనిసరి యదియ
తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్ దాటకి కీ విధంబుగను దండముఁబెట్టుచు జీవనంబునున్ దేటపడంగ జేయుటకు దీనపు జీవిత మొందుచుండిరే తాటను దీయుమా సరగు తామస శ్రేష్ఠుడ! కోసలాధిపా!
ఉత్పలమాలచేటును గూర్చె ఋత్విజులు చేసెడి యాజికి రక్కసీడులున్దీటుగ గూల్చు శీఘ్రముగ తీవ్ర శరమ్ముల తోడ రాఘవా,తోటి నిశావిహారులకు, దుష్ట సుబాహు దళాల వారికిన్తాటకి పూజ్యురాలనుచు, తాపసు లెల్లరు గొల్చిరింపుగన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
ఉ.దీటుగ రాక్షసుల్ తపము దేవతలన్ గెలవంగఁ జేయుడిన్కోటలు దేశముల్ విడిచి కోరికగా నమరత్వమున్ భువిన్పోటున దైత్యతాపసులు పోడిమి నొందిన మాంసభక్షకుల్ *తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్*.
మాటుననుండియాగమునమాయలచేయుచునట్టహాసమున్చీటికిమాటికిన్ మునుల చిత్తము లాగగ చంపెవీడకన్తాటకి పూజ్యురాలనుచు దాపసులెల్లరుగొల్చిరింపుగన్సాటియులేనివీరుడనిజానకిరామునినెల్లవారలున్
రిప్లయితొలగించండిధర్మముఁ నిలుప ధరణిని దానవులను
సంహరింపక తప్పదో సత్య వ్రతుడ
యాడ దనుచు శంకనుమాను యాతు వులకు
పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి.
రిప్లయితొలగించండిసాటియె లేనిమేటి గుణసంపద గల్గిన నీకు వందనం
బేటికి సంశయించెదవొ యిజ్యను రక్షణ జేయగోరి యీ
చోటుకు జేరినట్టి ఘన శూరుడ పుణ్యజనాళి కెల్ల యీ
తాటకి పూజ్యురాలనుచు, దాపసులెల్లరు గొల్చిరింపుగన్
బోటిని కాటికంపనను భూపతి పంక్తిరథాత్మజుండనే.
తేటగీతి
రిప్లయితొలగించండిరక్తధారలు గురిపించు ప్రబలమైన
రక్కసిని గని యెవరంచు రాముఁడడుగ
"బలయుతులగు మారీచ సుబాహువులకు
పూజ్యురాలు తాటకి"యని మునులె యనిరి.
ఉత్పలమాల
తొలగించండిసాటియురారు నీకెవరు సంగరమందునటంచు పల్కగా
మాటికి మాటికిన్ వివిధ మాయలతో బెదిరించుచుండి,పో
రాటము సేయ నాయమను రాముఁడు ద్రుంచెను రాక్షసాళికిన్
తాటకి పూజ్యురాలనుచు దాపసులెల్లరుగొల్చిరింపుగన్.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిదీటుగ రామలక్ష్మణులు దిగ్విజయమ్ముగ గావయజ్ఞమున్
వేటుకు రామబాణహతి వీడగ ప్రాణము ధన్యురాలటం
చాటవిఁ గ్రూర రాక్షసులు నాయమనెంచఁగ వారిపాలిటన్
దాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్
తేటగీతి
మౌనియజ్ఞము గాచిన మాన్యుడైన
ధర్మమూర్తి రాముని బాణ ధాటికచటఁ
గూలె, ధన్యురాలన రాక్షసాలి పాలి
పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
కలికి కారణ మయ్యెను కదన మునకు
రిప్లయితొలగించండిననుచు కొందరు పల్కగా నసు రులకు
పూజ్యు రాలు తాటకి యని మునులె యనిరి
నిజము గాతోచు నయ్యది నిశ్చ యముగ
శాపవశమున రాక్షస సత్వమొంది
రిప్లయితొలగించండికుంభకర్ణ, రావణులగు కొమరిసుతుల
కవ్వవై,విజయ జయుల కభవమిడిన
పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
యజ్ఞ నాశన మొనరించు యక్షరాక్ష
రిప్లయితొలగించండిసినిగని యెవరీమె తెలుపుమనుచు నడిగె
నత్తరమున నగస్త్య మహర్షి భార్య
పూజ్యురాలు, 'తాటకి' యని మునులె యనిరి
యక్షవరుఁడు సుకేతున కంచితముగఁ
రిప్లయితొలగించండిదపము నొనరింప నిష్ఠఁ బెద్ద సమయమ్ము
బ్రహ్మ యొసఁగిన ముద్దుల పట్టి యనుచుఁ
బూజ్యురాలు తాటక యని మునులె యనిరి
చేటొన గూర్ప నిట్లన విచిత్రము మార్పకుమీ చరిత్రమున్
వీటఁ జెలంగు పిల్లలకుఁ బ్రీతినిఁ జెప్పుమ సత్య మెప్పుడుం
బాటవ మొప్ప చెప్పుమ యబద్ధము నాడక యే యుగమ్మునం
దాటక పూజ్యురా లనుచుఁ దాపసు లెల్లరు గొల్చి రింపుగన్
గాటఁపు దీక్షతోమునుల గాసిలజేయుచు యజ్ఞయాగముల్
రిప్లయితొలగించండితాటకి యడ్డగించునెడ తద్దయు శౌర్యగుణమ్ముతోడ ఘో
రాటవియందు దాశరధి యాపెకు ముక్తిపథమ్ము జూపనా
తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్
అసురసంహారమొనరింప యవనియందు
రిప్లయితొలగించండిహరియె శ్రీరామచంద్రుడై యవతరించె
నట్టి రాముని చేతిలో నంతమొందె
పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
వేటకు వచ్చిపైబడిన భీకర సింహము రీతి దూకగా
రిప్లయితొలగించండిచేటునెరుంగలేక, కడు శీఘ్రముగా, గని సంహరింపగా
నాటిరయమ్ము బాణముల నాతిని, రాముని చేత జచ్చె నా
తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యురాలు తాటకి యని మునులె యనిరి
రిప్లయితొలగించండియట్లు బలుకని మునులకు హాని కలుగు
బ్రదుక నీయరు వారిని రాక్ష సులుసు
నిర్దయులగుటచేఁ దప్పనిసరి యదియ
తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్
రిప్లయితొలగించండిదాటకి కీ విధంబుగను దండముఁబెట్టుచు జీవనంబునున్
దేటపడంగ జేయుటకు దీనపు జీవిత మొందుచుండిరే
తాటను దీయుమా సరగు తామస శ్రేష్ఠుడ! కోసలాధిపా!
ఉత్పలమాల
రిప్లయితొలగించండిచేటును గూర్చె ఋత్విజులు చేసెడి యాజికి రక్కసీడులున్
దీటుగ గూల్చు శీఘ్రముగ తీవ్ర శరమ్ముల తోడ రాఘవా,
తోటి నిశావిహారులకు, దుష్ట సుబాహు దళాల వారికిన్
తాటకి పూజ్యురాలనుచు, తాపసు లెల్లరు గొల్చిరింపుగన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ఉ.
రిప్లయితొలగించండిదీటుగ రాక్షసుల్ తపము దేవతలన్ గెలవంగఁ జేయుడిన్
కోటలు దేశముల్ విడిచి కోరికగా నమరత్వమున్ భువిన్
పోటున దైత్యతాపసులు పోడిమి నొందిన మాంసభక్షకుల్
*తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్*.
మాటుననుండియాగమునమాయలచేయుచునట్టహాసమున్
రిప్లయితొలగించండిచీటికిమాటికిన్ మునుల చిత్తము లాగగ చంపెవీడకన్
తాటకి పూజ్యురాలనుచు దాపసులెల్లరుగొల్చిరింపుగన్
సాటియులేనివీరుడనిజానకిరామునినెల్లవారలున్