21, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4286

 22-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అభిమన్యుఁడు భారతమున నతివృద్ధుఁ డగున్”
(లేదా...)
“వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్”
(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సమస్య)

32 కామెంట్‌లు:

  1. కందం
    అభినయమున పద్మశ్రీ!
    విభిన్న నటనాకుశలతఁ బేరుగడింపన్
    విభవంపు పాత్రధారిగ
    నభిమన్యుఁడు భారతమున నతివృద్ధుఁ డగున్

    శార్దూలవిక్రీడితము
    సిద్ధమ్మౌనట నెట్టి పాత్రనిడినన్ జేకొట్టగన్ బ్రేక్షకుల్
    బుద్ధిన్ గల్గిన దర్శకుండునగుచున్ మోదింప నిర్మాత తా
    బద్ధుండై యభిమన్యు పాత్రకొదుగన్ బాల్గొన్న వర్గమ్మునన్
    వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్

    (వృద్ధుడు : తెలిసినవాడు)

    రిప్లయితొలగించండి
  2. శా.

    శ్రద్ధావంతులపాండవంబు మనసున్ సంపంగ వ్యూహమ్మునన్
    బద్ధుల్ కౌరవ వీరులందరు మొనన్ బంధించ గంకున్ వడిన్
    క్రుద్ధుండై వెడలెన్ రహస్యమెరిగెన్ గూల్చన్ మహా యోధులన్
    *వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్*.

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఉభయ బలగములన చిఱుత
    అభిమన్యుడు,భారతమున నతి వృద్ధుడగున్
    అభిరూప భక్తమణియున్
    నభోనదీశంతనుల తనయుడు వృషభుడున్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.
    అభిరూపుడు-విష్ణువు.

    రిప్లయితొలగించండి

  4. అభిమరము కేగెద ననుచు
    నభయమొసగి పెద్దలకతడా ద్రోణుండా
    విబుధుని మొన నీగ గలుగు
    అభిమన్యుఁడు భారతమున నతివృద్ధుఁ డగున్.

    (వృద్ధుడు=తెలిసినవాడు)


    కృద్ధుండౌచును తమ్మిమొగ్గరమునన్ గ్రూరాత్ములన్ గూల్చ స
    న్నద్ధుండై యభిమర్దమున్ సలిపి ద్రోణాచార్య పన్నాగమున్
    బ్రద్దల్ సేసెడి వాడతండెకద భీబత్సుండటన్ లేనిచో
    వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్.

    (వృద్ధుడు= తెలిసినవాడు)

    రిప్లయితొలగించండి
  5. అభిమరమున నుసురువిడిచె
    నభిమన్యుఁడు ; భారతమున నతివృద్ధుఁ డగున్
    నభపు నది గంగ సుతుడై
    న భీష్ముడనబడెడి శాంతనవుడే యెరుగన్

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "అభివృద్ధి గణన సేయగ" అనవచ్చు.

      తొలగించండి
    2. సవరణతో...

      శుభకరముగ పద్మమునం
      దభిమన్యు పురోగమించె నద్భుతరీతిన్
      అభివృద్ధిగణన సేయగ
      నభిమన్యుఁడు భారతమున నతివృద్ధుఁ డగున్

      తొలగించండి
  7. సిద్ధింఁబొందగమేనమామకడవాసిన్గాంచె శీలంబునన్
    సిద్ధాంతంబులవీడనాడకను రాశిన్బొందె నైపుణ్యమున్
    యుద్ధంబందున వ్యూహమున్గనగదానొక్కండు, బుద్ధిన్భళా
    వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  8. కం:అభివాదము దన కిడగా
    నభిమన్యుడు ,భారతమున నతివృద్ధు డగున్
    శుభకరుడు భీష్ము డతనికి
    నభివాదము జేయు మంచు నర్జునుడనియెన్
    (అభిమన్యుడు భీష్మునికి ఎదురు పడే సందర్భం ఉన్నదా?అంటే యుద్ధం లో కూడా పెద్దలకి నమస్కరించటం అప్పటి విధానం.నమస్కారబాణాలు వేసుకునే వారు.)

    రిప్లయితొలగించండి
  9. ప్రభ వించిన ఘన వీరుo
    డభి మన్యుడు భారతమున : నతి వృద్ధుం దగన్
    సభ లో భీష్ముడు దాయల
    రభసను మాన్ఫంగజూచె రక్షణ సేయన్

    రిప్లయితొలగించండి
  10. ఇభ నిభ బలుండు శూరుఁడు
    నభోనదీ సూను నాయనయె నిర్జర స
    న్నిభుఁ డైన బాహ్లికుఁడు, కా
    దభిమన్యుఁడు, భారతమున నతి వృద్ధుఁ డగున్

    ఇద్ధాత్రిం గృప కుంభసంభవజ రాధేయాస్త్ర శిక్షాక రై
    కేద్ధస్కంధుల ధార్తరాష్ట్రులను దేవేంద్రాత్మపౌత్రుం డహో
    యుద్ధప్రాభవ విద్య లందు నరి వీరోగ్రుండు నిక్కమ్ముగా
    వృద్ధుం డందరి కంటె భారతమునన్ వీరాభిమన్యుం డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనంతచ్ఛందస్సౌరభము. పూరు వంశ వర్ధనము. పుట: 427. పద్యము: 34.

      పద్మనాభము.
      ఛందము: వికృతి
      త త త త త త త గగ
      ప్రాస కలదు; యతి 13

      వీరుండు నా భీమ సేనాఖ్యు పుత్రుండు ప్రీతిం బ్రదీపుండు నవ్వాని పుత్రుం
      డా రాజ నామప్రతీపుండు దేవాపి యా శంతనుం డింక నా బాహ్లికుండున్
      వా రా ధరా నాథు పుత్రత్రయం బయ్యెఁ బార్థుండుగా శంతనుం డయ్యె ధాత్రిన్
      వీరుండునై శంత నాత్మోద్భవుం డయ్యె భీష్ముండు గాంగేయ దేవవ్రతుండే

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు సర్వశ్రేష్ఠంగా ఉన్నవి. అభినందనలు.
      మీ పద్మనాభ వృత్తం అద్భుతంగా ఉన్నది.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  11. శా:"మద్ధీశక్తికి దోచె సత్కథ యసామాన్యమ్ము గా నుత్తముల్
    వృద్ధుం డందరి కంటె భారతమునన్ ,వీరాభిమన్యుండగున్,
    యుద్ధంబందును నీతి దప్పని వదాన్యుండైన కర్ణుండు యా
    వద్ధర్మంబును భారత"మ్మనె నిజాం ప్రజ్ఞన్ విచారించుటన్
    (భారత గాధ అంతా విన్న నైజాం నవాబు నాకు భారతం లో బాగా నచ్చింది ముగ్గురు."ఏక్ బూఢా,ఏక్ లడకా ఔర్ కర్ణ్ కీ రాజనీతి"అన్నాడు.నవాబు కూడా భీష్ముడు అన లేదు.ఏక్ బూఢా అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  12. బద్ధుండా కురు వంశ రక్షణకు నిర్వాదంబు భీష్ముండెగా
    వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్
    యుద్ధంబందతి పిన్న గాని ఘనుడా వ్యూహంబు ఛేదించుటన్
    సిద్ధంబై నడిపించె సేనల నధిక్షేపించుచున్ వైరులన్

    రిప్లయితొలగించండి
  13. రభసమ్ముగ రణమందున
    నభిముఖుడై కౌరవులకు నాభీలముగా
    విభవము నొంటిగ జూపిన
    యభిమన్యుఁడు భారతమున నతివృద్ధుఁ డగున్

    రిప్లయితొలగించండి
  14. అభిమానించెను కృష్ణుని
    నభిమన్యుడుభారతముననతివృద్ధుడగున్
    విభవముచూపుచురణమున
    ప్రభలనుచిమ్ముచునుపోరెబాలుండైనన్

    రిప్లయితొలగించండి