23-12-2022 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్”(లేదా...)“శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై”(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సమస్య)
సెకకంటి భక్తుడైననుసకి జానకినపహరింప జలరాశిని దాటి, కర్వరిజాతిలో దర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వికటంబుగ నడ్డుకొనగప్రకటపు భక్తుల, యగడును బడి శాత్రవుడైసఖి గొంపోవ గినిసి దర్శకునిన్ రాముండుగూల్చె రణవీరుండైదర్శకుడు = ద్వారపాలకుడు
సకి సీతన్ గనుగొంటినంచు ముదమున్ సామీరియే పల్కగన్ సెకకంటిన్ సతతమ్ము కొల్చెడి పలాశిన్ గూల్చగా నెంచి మ్రాన్మెకబృందమ్మదె సాహిణమ్ముగను కామిన్ దైత్య వంశంబు దర్శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్.(దర్శకుడు= నేర్పరి)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మత్తేభవిక్రీడితముఅకలంకమ్మగు రాము శౌర్యమును దాయాదుండు దారాదులున్నికరంబెంచియు సీతవీడుమనినన్ నిందించి యుద్ధానఁ జేరికనెంచన్ కపిసేన సాయమున వైరిన్ రావణున్ శాంతి నాశకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్కందంఅకలంక శౌర్యయుతుడైవికటింపగ సంధి చెలఁగి ప్రియసతిఁ గొనఁ బోరుకు దిగి దశముఖు దుర్దర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ప్రకటిత నాటకమందునశకునిగ తనపాత్ర యేమి సరిలే దనగన్వికటాట్టహాసమున దర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
మ.వికలంబయ్యెను సీతఁ బట్టుకొన నావేశంబు శ్రీరామునిన్ వికలాంగున్ బరపెన్ విరాధుడను ప్రావేల్పున్ ధనుష్పాణులైమెకమున్ జంపిన రీతిఁ ద్రవ్వఁ బడువన్ మెత్తంగఁ బాతంగ నా*శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్*.......ఆశకుఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966 సం.విణ.1. తినువాఁడు.2. భోగించువాఁడు, భోగింప చేయువాఁడు.3. వ్యాపించువాఁడు.
క్రొవ్విడి వెంకట రాజారావు: సకటమగు తమికి లోబడి కికురింతను సీతనెత్తి కెరలిన కీలా లకునిన్ దనుజకులపు ద ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై.
వికటించిన వర్తనతోచకచక సీతను హరించు చాంచల్యమతిన్సకటుని రణతంత్ర విమర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
క్రొవ్విడి వెంకట రాజారావు:సకటంబౌ తమి కెంతయున్ వశమునై శాఠ్యమ్ముతో జానకిన్యొకతై నుండగ దొంగిలించి తనతో యుక్తంబు కానట్టిదౌవికటంబౌ విధి దెచ్చినట్టి దనుజున్ పెచ్చారియౌ ధర్మ నాశకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
వికల మనస్కుని రావణుసకలో ర్వీ జను లు మెచ్చసాహ స యు తు డైప్రకటి త క్రూరు దను జ దర్శ కుని న్ రాముండు గూల్చె రణ వీరుండై
మకిలచరిత లంకేశునికకావికల నీతిలేని కర్మల గమనిం చి ,కుపితుడై, ధర్మ విమర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండైప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
సకల గుణ సుసంపన్నుఁడు వికచాంబుజ లోచనుఁడు భువిని సందేహింపక ఖరు స్వీయోద్ధతి దర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై వికలీ భూత సనాతనార్ష మత దుర్భేద్యున్ దశగ్రీవు నాయకళంకాత్ముఁడు రాక్షసాంతకుఁడు నీలాభ్రప్రభా కాయుఁ డావృక సంకాశుని దుష్ట మానసుని నారీలోక మున్యౌఘ నాశకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
వికచాంభోరుహ లోచనుండు పెనుపౌ వీరుండు రాముండనిన్వికలంబొందగజేసి బాణహతితో వేధించుచున్ రావణున్సకియౌ జానకి శోక కారకుని విశ్వంబందునన్ శాంతినాశకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
కం:వికటింపగ క్రూరత్వముప్రకటించుచు సోదరునిది పాప మ్మను, భ్రాతకు దీవ్రయుద్ధభయ ద ర్శకునిన్ రాముండు కూల్చె రణవీరుండై
అకలంకమ్ముగ ద్వారపాలకులుగా నర్చించిశ్రీనాథునిన్సుకముల్ బొందుచు మౌని శాపమున నీ క్షోణీతలమ్మున్ భయానకరూపమ్మున బుట్టె శాపవశమున్ నక్తంచరుండైన దర్శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మ:వికటస్వాంతుని,ధర్మదూరుని,సగర్విన్,యుద్ధకారకునిన్,సాధ్వుల మానముల్ జెరచు క్రూరత్వమ్ము జేదాల్చు వంచకునిన్,రావణు మూర్ఖతాభరితు వాంఛామగ్నునిన్,బంధునాశకునిన్ గూల్చెను రామచంద్రుడు రణోత్సాహైకశీలున్ ఖలున్
సుకుమారియైనసీతనుపెకలించుకు వసుధతోడ వెడలిన దుష్టున్చకితమనస్కుని కువిమర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
ప్రకటంబౌ నిజ శౌర్య దీప్తి చెలగెన్ భవ్యాశ్వినేయుండహాసకటుండా కురునాథు మామకుని దుస్తంత్రాధిమూలంబునౌశకునిం గూల్చెను; రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్మకరాంకారి కటాక్షలబ్ధ విభవోన్మాదిన్ దశగ్రీవునిన్
రిప్లయితొలగించండిసెకకంటి భక్తుడైనను
సకి జానకినపహరింప జలరాశిని దా
టి, కర్వరిజాతిలో ద
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికటంబుగ నడ్డుకొనగ
రిప్లయితొలగించండిప్రకటపు భక్తుల, యగడును బడి శాత్రవుడై
సఖి గొంపోవ గినిసి ద
ర్శకునిన్ రాముండుగూల్చె రణవీరుండై
దర్శకుడు = ద్వారపాలకుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసకి సీతన్ గనుగొంటినంచు ముదమున్ సామీరియే పల్కగన్
సెకకంటిన్ సతతమ్ము కొల్చెడి పలాశిన్ గూల్చగా నెంచి మ్రా
న్మెకబృందమ్మదె సాహిణమ్ముగను కామిన్ దైత్య వంశంబు ద
ర్శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్.
(దర్శకుడు= నేర్పరి)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమత్తేభవిక్రీడితము
తొలగించండిఅకలంకమ్మగు రాము శౌర్యమును దాయాదుండు దారాదులున్
నికరంబెంచియు సీతవీడుమనినన్ నిందించి యుద్ధానఁ జే
రికనెంచన్ కపిసేన సాయమున వైరిన్ రావణున్ శాంతి నా
శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
కందం
అకలంక శౌర్యయుతుడై
వికటింపగ సంధి చెలఁగి ప్రియసతిఁ గొనఁ బో
రుకు దిగి దశముఖు దుర్ద
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిప్రకటిత నాటకమందున
రిప్లయితొలగించండిశకునిగ తనపాత్ర యేమి సరిలే దనగన్
వికటాట్టహాసమున ద
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమ.
రిప్లయితొలగించండివికలంబయ్యెను సీతఁ బట్టుకొన నావేశంబు శ్రీరామునిన్
వికలాంగున్ బరపెన్ విరాధుడను ప్రావేల్పున్ ధనుష్పాణులై
మెకమున్ జంపిన రీతిఁ ద్రవ్వఁ బడువన్ మెత్తంగఁ బాతంగ నా
*శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్*
.......
ఆశకుఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
సం.విణ.
1. తినువాఁడు.
2. భోగించువాఁడు, భోగింప చేయువాఁడు.
3. వ్యాపించువాఁడు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసకటమగు తమికి లోబడి
కికురింతను సీతనెత్తి కెరలిన కీలా
లకునిన్ దనుజకులపు ద
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికటించిన వర్తనతో
రిప్లయితొలగించండిచకచక సీతను హరించు చాంచల్యమతిన్
సకటుని రణతంత్ర విమ
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసకటంబౌ తమి కెంతయున్ వశమునై శాఠ్యమ్ముతో జానకిన్
యొకతై నుండగ దొంగిలించి తనతో యుక్తంబు కానట్టిదౌ
వికటంబౌ విధి దెచ్చినట్టి దనుజున్ పెచ్చారియౌ ధర్మ నా
శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికల మనస్కుని రావణు
రిప్లయితొలగించండిసకలో ర్వీ జను లు మెచ్చసాహ స యు తు డై
ప్రకటి త క్రూరు దను జ ద
ర్శ కుని న్ రాముండు గూల్చె రణ వీరుండై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమకిలచరిత లంకేశుని
రిప్లయితొలగించండికకావికల నీతిలేని కర్మల గమనిం
చి ,కుపితుడై, ధర్మ విమ
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
సకల గుణ సుసంపన్నుఁడు
రిప్లయితొలగించండివికచాంబుజ లోచనుఁడు భువిని సందేహిం
పక ఖరు స్వీయోద్ధతి ద
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
వికలీ భూత సనాతనార్ష మత దుర్భేద్యున్ దశగ్రీవు నా
యకళంకాత్ముఁడు రాక్షసాంతకుఁడు నీలాభ్రప్రభా కాయుఁ డా
వృక సంకాశుని దుష్ట మానసుని నారీలోక మున్యౌఘ నా
శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండివికచాంభోరుహ లోచనుండు పెనుపౌ వీరుండు రాముండనిన్
రిప్లయితొలగించండివికలంబొందగజేసి బాణహతితో వేధించుచున్ రావణున్
సకియౌ జానకి శోక కారకుని విశ్వంబందునన్ శాంతినా
శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:వికటింపగ క్రూరత్వము
రిప్లయితొలగించండిప్రకటించుచు సోదరునిది పాప మ్మను, భ్రా
తకు దీవ్రయుద్ధభయ ద
ర్శకునిన్ రాముండు కూల్చె రణవీరుండై
అకలంకమ్ముగ ద్వారపాలకులుగా నర్చించిశ్రీనాథునిన్
రిప్లయితొలగించండిసుకముల్ బొందుచు మౌని శాపమున నీ క్షోణీతలమ్మున్ భయా
నకరూపమ్మున బుట్టె శాపవశమున్ నక్తంచరుండైన ద
ర్శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మ:వికటస్వాంతుని,ధర్మదూరుని,సగర్విన్,యుద్ధకా
రిప్లయితొలగించండిరకునిన్,సాధ్వుల మానముల్ జెరచు క్రూరత్వమ్ము జేదాల్చు వం
చకునిన్,రావణు మూర్ఖతాభరితు వాంఛామగ్నునిన్,బంధునా
శకునిన్ గూల్చెను రామచంద్రుడు రణోత్సాహైకశీలున్ ఖలున్
సుకుమారియైనసీతను
రిప్లయితొలగించండిపెకలించుకు వసుధతోడ వెడలిన దుష్టున్
చకితమనస్కుని కువిమ
ర్శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై
ప్రకటంబౌ నిజ శౌర్య దీప్తి చెలగెన్ భవ్యాశ్వినేయుండహా
రిప్లయితొలగించండిసకటుండా కురునాథు మామకుని దుస్తంత్రాధిమూలంబునౌ
శకునిం గూల్చెను; రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్
మకరాంకారి కటాక్షలబ్ధ విభవోన్మాదిన్ దశగ్రీవునిన్