మత్తకోకిల భూమిపై గల రాజు లెల్లరు బొంద నెందరొ భార్యలన్ ధీమతుండగు రాము డొక్కడు దీనికిన్ బ్రతిరూపి యౌ రామచంద్రుని భార్య యొక్కతె ,రాజసంబున నత్త యౌ రామచంద్రుని యత్తగారగు రత్నమాలయె చూడగన్ (జనకమహారాజు భార్య పేరు రత్నమాల.రాజు లందరూ అనేకమంది భార్యలని పొందగా రాముడు ఒక్క భార్యతోనే ఉన్నాడు.కనుక సీత తల్లి ఐన రత్నమాల రాజసం కలిగిన అత్త గారు అనగా నిజ మైన ఠీవి కలిగిన అత్త గారు.ఆమె అత్త కాదు.అత్త గారు.)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరత్నగర్భయౌ భూమాత ప్రాజ్ఞుడైన
రామునకు నత్త యగునట; రమణి సీత
రామునకు భార్యయై తాను రాణజెందె
సుచరితగ లోకమందున సొంపుమీఱ.
రాజు జనకుని దేవేరి రత్నమాల
రిప్లయితొలగించండిరామునకు నత్త యగునఁట ,రమణి సీత
దశరధుని కోడలు, కొడుకు దాశరధికి
ధర్మ పత్ని యగునట కథ నెరుగంగ.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
రిప్లయితొలగించండిపృథ్వి యనగభూదేవియె విష్ణువునకు
దారగావాసిగాంచినను ధరణి యందున
రామునకు నత్త యగునఁట, రమణి సీత
భూమిగర్భమున జనించె నామె గాదె.
మామయంచును ప్రేమగా ధర మానవాళియె పిల్చెడిన్
సోముడైనమృగాంకుడే గద చూపుప్రేమను భూరిగా
భామరోహిణి యోక్కతేగన వాతికిష్టము గావునన్
రామ!, చంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండివాడవాడలఁ దిరుగుచు బ్రతుకనేర్చి
నాటి జానకీరాముల సాటియనఁగ
పగటివేషాలు ధరియింప వరుసఁ జూడ
రామునకు నత్త యగునఁట రమణి సీత!
మత్తకోకిల
భూమిభర్తగ రామునెంచగ ముగ్గురమ్మలుమెచ్చిరే
సేమమెంచిన దాసిమాటకు చిన్న బోయిన 'కైక' యే
స్వామి నెంచుచు కోరగన్ వనవాసమంపఁగ వెంటనే
రామచంద్రుని, 'భార్య' యొక్కతె రాజసంబున భార్యయౌ!
(మొదట ఇచ్చిన వృత్తసమస్య)
మార్చిన తరువాత:
తొలగించండిమత్తకోకిల
ఏమిపుణ్యము సేసినారలొ యింపుగొల్పెడు రూపమై
లేమివల్లను పొట్టకూటికి ప్రీతి దాల్తురు వేషముల్
భూమిఁ దించిరి పుణ్యమూర్తుల పోలివారలు, వావినిన్
రామచంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిజనక మహారాజు పుత్రిక జాయ గాగ
రిప్లయితొలగించండినతని పత్ని యయ్యెను గదా యయ్యెడ గన
రామునికి నత్త యగునట,: రమణి సీత
యయ్యె నా రాముని కి భార్య యవని మెచ్ఛ
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిక్షేమమిచ్చెడి ధర్మ మెంతయు శ్రేష్ఠమౌనటు నిల్పె నా
రామచంద్రుని భార్య యొక్కతె; రాజసంబున భార్యయౌ
భామ సత్యయె నెల్లవేళల పట్టియుంచెను తానుగా
శ్యామసుందరుడైన కృష్ణుని జాణయౌచును సొంపుతో.
ఏకపత్ని వ్రతుండనినెల్లజనులు
రిప్లయితొలగించండిప్రస్తుతించుచు హారతి పట్టుదురుట
*“రామునకు ,నత్త యగునఁట రమణి సీత”*
కుశలవులకళత్రములకు కువలయాన
జాయ యగును గద సుశీల జానకి రఘు
రిప్లయితొలగించండిరామునకు ; నత్త యగునఁట రమణి సీత
కుశలవులను పెండ్లాడెడి కోమ లులకు
మనుజకోటి యందరికామె మాతయేను
మిథిల భూపతి భార్య సుమేధ యగును
రిప్లయితొలగించండిరామునకు నత్త; యగునఁట రమణి సీత
లక్ష్మణ భరత శత్రుజ్ఞులకు వదినియ
దశరథునకు కోడలగును ధరణిపుత్రి
(అశోకవనములో సీతతో రాక్షస స్త్రీల పలుకులు...)
తొలగించండిరామపత్నివి గాకపోయిన రావణుండు హరించునా
రామభద్రుని భృత్యుడేయిక లంకనేదహియించునా
రామపాదము సోకినంతట రాతికొచ్చును జీవమే
రామచంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధరణిఁ జూడగ హరికితా దారగాదె
రిప్లయితొలగించండిధరణిజాతగ లచ్చిమి ధరనుబుట్టె
సవతు లౌదురు గావున సతులిరువురు
రామునకు నత్త యగునఁట రమణి సీత
మత్తకోకిల:
రిప్లయితొలగించండిభామజానకి భూమిపుత్రిగ పత్నియయ్యెను రాముకున్
హేమ కాదొకొ విష్ణుమూర్తికి యెంచి చూడగ పత్నియే
రామచంద్రుడు విష్ణునంశగ రాజిలెన్ భువి నివ్విధిన్
రామచంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీత బ్రతికుండఁ బతిపయిఁ బ్రీతి తోడఁ
తొలగించండిబుట్టఁ గవలు కుశలవులు నట్టడవిని
నొప్పిదమ్ముగ సౌమిత్రి సెప్పె నిట్లు
రామునకు నత్త యగు నఁట రమణి సీత
భామ లౌదురు కన్య లెల్లరు వారు వెర్గిన ధాత్రిలో
భామ లింపుగఁ దల్లు లౌదురు వారు గూడఁగ భర్తలన్
భామ లింపుగ నత్త లౌదురు వారు వొందఁగ బిడ్డలన్
రామ! చంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండితే.గీ:ఆంగ్ల పౌరురా లీ రీతి నభ్యసించె
రిప్లయితొలగించండిరామకథ బ్రేమతోడ "ధరణి స్వయముగ
రామునకు నత్త యగునట, రమణి సీత
యామె పుత్రి యై సహనాన నామె మించె.
మత్తకోకిల
రిప్లయితొలగించండిభూమిపై గల రాజు లెల్లరు బొంద నెందరొ భార్యలన్
ధీమతుండగు రాము డొక్కడు దీనికిన్ బ్రతిరూపి యౌ
రామచంద్రుని భార్య యొక్కతె ,రాజసంబున నత్త యౌ
రామచంద్రుని యత్తగారగు రత్నమాలయె చూడగన్
(జనకమహారాజు భార్య పేరు రత్నమాల.రాజు లందరూ అనేకమంది భార్యలని పొందగా రాముడు ఒక్క భార్యతోనే ఉన్నాడు.కనుక సీత తల్లి ఐన రత్నమాల రాజసం కలిగిన అత్త గారు అనగా నిజ మైన ఠీవి కలిగిన అత్త గారు.ఆమె అత్త కాదు.అత్త గారు.)