20, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4285

21-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్”
(లేదా...)
“చేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళంబందునన్”

(మొన్న శ్రీకాకుళంలో లలితాదిత్య శతావధానంలో నేనిచ్చిన సమస్య)

29 కామెంట్‌లు:

  1. కందం
    చీకాకులు దెప్పించిరి
    శ్రీకాకుళమునఁ గవులకుఁ, జేసి రవమతిన్
    కేకలు పెట్టెడి యల్లరి
    మూకల గనిబుద్ధినెఱప మొఱకు పలుకులన్..
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి

  2. చేకొనిరి, వ్రేకదనమును
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి, రవమతిన్
    చేకూరు నంచు దలచిన
    మాకు లభించిన వలనుకు మనసుప్పొంగెన్.


    సాయంబెంతయొ చేసిరే మిగుల యుత్సాహం బునే జూపుచున్
    మాయామోహమెఱుంగనట్టి జనులా మాన్యుండ్రటన్ సత్కవిన్
    హేయంబైన కవిత్వమున్ కుకవులన్ హీనాత్ములన్ దప్పకన్
    జేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళంబందునన్.

    రిప్లయితొలగించండి
  3. శ్రీకాంతునిదేవళమున
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేజేలనినన్
    శ్రీకరుడేబొంకెనుగద
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. 'న్యాయం' అనడం వ్యావహారికం. సవరించండి.

      తొలగించండి
    3. సవరణలతో....

      హేయంబౌగద మూర్ఖులైన జనులే హేరంబమున్ బోలుచున్
      మాయోపాయముతో చెలంగి పలుదుర్మార్గంబులన్ సల్పుచున్
      చేయం జూచి రవజ్ఞనున్; గవులకున్ శ్రీకాకుళంబందునన్
      హాయింగూర్చిరి విజ్ఞులైన జనులేహాసంబు చిందించుచున్

      తొలగించండి
  4. మోకరిలె ను రసిక తతులు
    శ్రీకా కు ళ మున గవులకు : జేసి ర వ మతుల్
    కేకలు వేయుచు మూర్ఖత
    కాకుల వలె గోల సేయ కనలిరి గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభోదయం గోవర్ధన్ గారూ!
      చివరి పాదంలో గణభంగం. "కనలిరి గాదా" అంటే సరి!

      తొలగించండి
  5. కందం
    కాకుల తోలండనుచున్
    మూకల దిద్దగ వధాని, పోకిరులగుచున్
    చీకాకులు కలిగింపగ
    శ్రీకాకుళమునఁ గవులకుఁ, జేసి రవమతిన్

    శార్దూలవిక్రీడితము
    తోయంబుల్ గొనఁ జిక్కనట్లరచునే తోలింపఁ గాకమ్ములన్
    శ్రేయంబౌ మనకన్ వధాని చెణుకుల్ జెల్లంగ నోర్మూసిరే
    ప్రాయంబందున రేగుచున్ యువకులున్ ప్రశ్నించి చీకాకుగన్
    జేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళంబందునన్

    రిప్లయితొలగించండి
  6. ఏకవి నైనను గాంచగ
    మోకరిలి నమస్సులొసగు పురజను లుండన్
    యే కారణముండినదో
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్

    రిప్లయితొలగించండి
  7. కాకుల గోలగ కుమతులు
    యేకాగ్రత భంగపరచి యిడుముడిపాటున్
    జీకాకు కలుగ జేయుచు
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభోదయం గోవర్ధన్ గారూ!
      'కుమతులు + ఏకాగ్రత' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "కాకుల గోలగను కుమతు । లేకాగ్రత..." అందామా?

      తొలగించండి
  8. తోఁకల జాడించుచు నట
    భీకరముగఁ గుక్క లఱవఁ బేరిమి చెడునే
    యే కాలమ్మునఁ గరికిన్
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్

    శ్రేయం బయ్యె జయింపఁ బండితులకుం జిత్రంపు టా భూమి లో
    నాయా రీతుల సర్వ శాస్త్రముల విద్యా పాటవం బెన్నఁగా
    సాయంకాలము వేసి ప్రశ్నల నహో సంక్లిష్ట వాక్యమ్ములం
    జేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళం బందునన్

    రిప్లయితొలగించండి
  9. కందము
    శ్రీకర సత్కారంబులు
    శ్రీకాకుళమునఁగవులకుఁజేసిర,వమతిన్
    శోకించిరిగా కుకవుల్
    లేకయె పాండిత్యగరిమ లేశంబైనన్.

    రిప్లయితొలగించండి
  10. కం:"శ్రీకాకుళమున విప్లవ
    మే కావలె,వచనకవిత లెంచక నేలా
    మాకీ యవధానము"లని
    శ్రీకాకుళమున గవులకు జేసి రవమతిన్
    (శ్రీకాకుళం ఒక నక్సలైట్ విప్లవ కేంద్రం.విప్లవ కవులకి వచనకవిత్వాలే ఇష్టం.కాబట్టి ఈ పద్యాలు,అవధానాలు ఇక్కడెందుకు?వచనకవిత్వం చెప్పక?అని మాట్లాడినట్లు.)

    రిప్లయితొలగించండి
  11. శా:శ్రీయున్ వస్త్రసముచ్చయమ్ము నొసగన్ చింతించ కేపాటి,యం
    దీయన్ సాయము సద్వధాని లలితాదిత్యాఖ్యుకున్,మేలునే
    చేయన్ జూచి, రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళమ్మందునన్
    జేయన్ జూడరు విజ్ఞు లౌటను యశశ్రీమూర్తులౌ సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  12. కాకుల వోలెను గోలలు
    మూకుమ్మడిఁ జేయుచుండి మూర్ఖ జనంబుల్
    జీకాకు లొనరఁజేయుచు
    శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్

    రిప్లయితొలగించండి
  13. మాయోపాయముతో వధానినని సన్మానంబు నాశించు ట
    న్యాయంబైనను వంచకత్వమున దానా వేదికన్ జేరగా
    వైయాత్యంబున వాని గుర్తెరిగి దుర్వ్యాపార గర్హ్యంబుగా
    చేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళంబందునన్

    రిప్లయితొలగించండి
  14. హేయంబొందు విధంబువర్తిలి యటన్ హీనాతి హీనంబుగా
    చేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళంబందునన్
    గాయల్గట్టెలు కొట్టు వారలె గడున్ గర్వాతి రేకంబుతోఁ
    దోయంబుల్వెదజల్లె వేదిక పయిన్ దుర్మార్గ రీతిన్ వెసన్

    రిప్లయితొలగించండి
  15. బాకాతోస్వాగతమును
    *“శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి ర,వమతిన్”*
    పీకలవరకును త్రాగుచు
    కాకులవలెచేసిరచట గలభా కుజనుల్

    రిప్లయితొలగించండి