25, డిసెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4289

26-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుందరి వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ”
(లేదా...)
“సుందరి నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్”
(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సంస్కృత సమస్య 

'సుందరి రాకాసి నాత్ర సందేహః')

20 కామెంట్‌లు:

  1. కందం.
    అందరి మనసులు దోచిన
    సౌందర్య సొగసు కిలాడి,చక్కని రూపున్
    విందు గొలుపు చూడ్కికి,మరి
    సుందరి వెన్నెలవె యనుట చోద్యం బెటులౌ!

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  2. పరమశివుడు భస్మాసుర సంహారము తర్వాత మోహినితో...

    కందం
    "తెందెగ పరుగిడునెస న
    న్నందెడు బూదిపొలదిండి నణచితె ప్రియ! ని
    స్సందేహమ్ముగ నాకన
    సుందరి! వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ?"

    ఉత్పలమాల
    "తెందెగ పార బూదిపొలదిండి వడిన్నను వెంటనంటగన్
    చిందుచు సోయగమ్ము దన చేతనె తానట భస్మమందెడున్
    సందడి జేసితే! మిగుల సంతస మందతి నాపథమ్మునన్
    సుందరి! నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్"

    రిప్లయితొలగించండి

  3. డెందము గెలిచిన సఖి నీ
    మందస్మితవదన మదియె మల్లెల కన్నన్
    సుందరమై రుచులీనగ
    సుందరి వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ.


    అందము పోహణించ వశమా? ప్రియ భామిని రాత్రివేళ పా
    ణిందము ద్రుంచి కాంతినిడు నీధ్రుని మించిన సోయగమ్మనన్
    సందియమేల? డెందము రసాన్వయమౌచు కవిత్వధోరిణిన్
    సుందరి నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్.

    రిప్లయితొలగించండి
  4. అందమునన్ జక్కని దై
    యందరి మెప్పును బడసియు నలరెడు మగువన్
    బొందికగా నుతి యించుచు
    సుందరి వెన్నలవె యనుట చోద్యం బెటు లౌ?

    రిప్లయితొలగించండి
  5. ముందుగ తనయను గాంచక
    గందర గోళము పడగనె కాక జనించెన్
    బృందము నందా మెను గని
    “సుందరి వెన్నెలవె” యనుట చోద్యంబెటులౌ

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సుందరుడగు చంద్రునివలె
    క్రందుకొనుచు కైపు నిడెడి కలికివి నీవై
    డెందము లూగించెడి యో
    సుందరి! వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ?

    అందముతోడ క్రాలుకొను నబ్జుని రూపున కైపు నిచ్చుచున్
    చందగురీతి డెందములు చల్లన జేసియు నుల్లసంబునన్
    సందడిగూర్చి నెక్కొనెడి చంద్రముఖీ! విను నాదు మాటలన్
    సుందరి! నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచింపగన్.

    రిప్లయితొలగించండి
  7. అందము నీదు పేరు కలహంసవలెన్ చలనంబు సత్యమే!
    చందనవర్ణమా తనువు చంచలనేత్రవు గాని తోషమున్
    చిందగనీవు, నవ్వవు, విచిత్రవిలాసము మానసంబు నో
    *“సుందరి నీవు వెన్నెలవె!? చోద్యము గాదిటులన్ వచించినన్”*

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  8. ముందుగ కూతునిన్ గనక బొందిన నివ్వెర నొందు చుండగన్
    గందర గోళమొందగనె కాక జనించె మనస్సునందునన్,
    బృందము నందు కూతురిని వీక్షణ మొందగ నెంచె నిట్లుగన్
    “సుందరి నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్”

    రిప్లయితొలగించండి
  9. సుందరమౌ రూపము గల
    యిందువదన! శీతలత్వ మిడుచు కనులకున్
    విందులు సేయునినుంగని
    సుందరి వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ

    రిప్లయితొలగించండి
  10. సుందరమగు నీరూపం
    బందమునకు భాష్యమాయె నద్భుతరీతిన్
    డెందము నలరించిన యో
    సుందరి వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ

    రిప్లయితొలగించండి
  11. అందమురాసిపోసినది యాననమందున నద్భుతంబుగా
    సందడిచేసె నా మదిని సారసలోచన నీదు రూపమే
    విందుగ నిండుచందురుని వెన్నెల జిల్కెడు మోముఁ గాంచ నో
    సుందరి! నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్

    రిప్లయితొలగించండి
  12. మందునకు నెవ్వ రున్నను
    ముందుం గామప్రకోపములు నిత్యమ్మున్
    డెందమ్ము నాక్రమింపఁగ
    సుందరి వెన్నెలవె యనుట చోద్యం బెటులౌ

    మంద సమీర సన్నిభము మానిని నీ వచ నాలి వీవ ని
    ష్యంద శరీర చందనము చారు తరంబు సెలంగ సంత తా
    నంద విలాస శుద్ధ దరహాస విరాజిత చంద్ర వన్ముఖీ
    సుందరి నీవు వెన్నెలవె చోద్యము గా దిటులన్ వచించినన్

    రిప్లయితొలగించండి
  13. అందముఁజిందగానచట నంబరమంటిన సంబరంబులో
    బృందము గోపకాం తలటు వేకువ జామున మేలమాడుసూ
    యందము నాదినాదనుచు నల్లరిబెట్టుచుఁ జిందులేయుచున్
    సుందరి నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  14. అందములోన చందురుని యానన
    తుల్యము నీదుమోము నీ
    వందరితోడ సల్లగ మహా వినయంబుగ
    మెల్గు తీరు మా
    కందరికెల్ల నిన్నుగన నాదర భావము
    గల్గుచుండు నో
    సుందరి నీవు వెన్నెలవె చోద్యముగాదిటులన్
    వచిచించినన్

    రిప్లయితొలగించండి
  15. కం:అంద మనగ నీయది యే,
    సుందర మౌ నీదు నవ్వు జ్యోత్స్న యె, నీ పే
    రందముగ "వెన్నెల"యె యట
    సుందరి! వెన్నెలవె యనుట చోద్యం బెటు లౌ ?
    (ఆ అమ్నాయి నవ్వు ఒక వెన్నెల.ఆమె పేరు కూడా వెన్నెల.అందులో ఆశ్చర్య మేముంది?కొంద రమ్మాయిలకి వెన్నెల అనే పేరు ఉండటం నేను చూశాను.)

    రిప్లయితొలగించండి
  16. ఉ:అందము జిందు నీ ముఖము నందలి యా చిరు నవ్వు వెన్నెలన్
    విందుగ బొందు చుంటి సఖి!"వెన్నెల"యంచునె పేరు దాల్చ నే
    మందురు?"జ్యోత్స్న"యన్న ఘన మయ్యెనె సంస్కృతనామ మౌట చే ?
    సుందరి! నీవు వెన్నెలవె ,చోద్యము కా దిటులన్ వచించినన్
    (నీ నవ్వు వెన్నెల లాగా ఉన్నది.వెన్నెల అనే పేరు కాక "జ్యోత్స"అనే సంస్కృతం పే రెందుకు ?నువ్వు వెన్నెలవే.అచ్చ తెనుగు లో పిలుస్తాను.)

    రిప్లయితొలగించండి
  17. డెందము దోచిన హితుడే
    నందముగా చెంత చేరి యాదర మొప్పన్
    నందమ్మధికమ్మవగా
    *సుందరి వెన్నెలవె తినుట చోద్యంబెటులౌ*

    రిప్లయితొలగించండి
  18. అందపు మోము చందురుని కగ్రజ వీవు సుధాబ్ధి పుత్రి మా
    కుం దగు నీ కటాక్ష మొనగూర్చు శమంబు శుభంబులన్ జగత్
    సుందరి నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్
    కందువ వేంకటేశ్వరుని గాదిలి రాణివి మమ్ము గావుమా

    రిప్లయితొలగించండి