24, డిసెంబర్ 2022, శనివారం

దత్తపతి - 191

25-12-2022 (ఆదివారం)
సిలువ - చర్చి - యేసు - క్రీస్తు
ఈ పదాలను ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో
విష్ణుస్తుతి వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. శ్రీశ! నీ కారణమున భా'సిలు వ'రమగు
    సర్వ విశ్వము చందన 'చర్చి'తాంగ!
    'యే సు'మమ్ములతోడ నర్చించగలనొ?
    ప్రీతిఁ గాపాడుమయ్య చ'క్రీ! స్తు'తులివె.

    రిప్లయితొలగించండి
  2. కం.

    ఏయే సుముఖులు? భక్తిని
    ఛాయను భాసిలు వనితలు? చక్రీ ! స్తుతులన్
    కాయము చందన చర్చిత
    మాయెను వైకుంఠ పురిని నందము గనుమా ?

    రిప్లయితొలగించండి
  3. దేవ భాసిలు వరదాయి దివ్యమూర్తి
    బహు విధాల చర్చించియు వందన మిడి
    యే సుమంబుల గోరెదో యెఱుక లేక
    పూజ లోన చక్రీ స్తుతమొన ర సేతు

    రిప్లయితొలగించండి

  4. గంధసార చర్చిత దేహ క్రతువు నీదు
    బాసిలు వదనముగనిన పాపహరము
    ధర్మి! జపమదియే సుఫథమ్మటంచు
    తెలుసుకొంటిని చక్రీ స్తుతింతు నెపుడు.



    గంధసార *చర్చి* త దేహ క్రతువు నీదు
    బా *సిలు వ* దనముగనిన పాపహరము
    ధర్మి! జపమది *యే సు* ఫథమ్మటంచు
    తెలుసుకొంటిని చ *క్రీ స్తు* తింతు నెపుడు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీధరుడు భాసిలు వనిత సిరిని గూడి
    చారు శీలుడు చందన చర్చితుండు
    కౌస్తుభమణియే సురుచిర కాంతులీను
    సుమతి నిడుము చక్రీ స్తుతి సుమము లివియె
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  6. యేసుమంబులతోగొల్తు వాసుదేవ!
    సర్వజనపాల చందనచర్చితాంగ!
    పరమపదమున భాసిలు వరమునిమ్ము
    దేవ దేవేశ చక్రీస్తుతింతు నిన్ను

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఓచక్రీ! స్తుతిజేయుదున్ ఘనముగా యోచించి నీలీలలన్,
    ఆచారీ! విను, యేసుమమ్ములసరిన్ యర్చించ రావచ్చునో
    సూచింతున్, దొర చర్చితాంగ! నిను సంశ్లోకించు మార్గమ్ములన్
    శ్రీచూర్ణంబు నొసంగి భాసిలు వహిన్ శ్రేష్ఠంబుగా దెల్పెదన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజా రావు గారికి నమస్కారం.
      పూరణ బాగున్నది కానీ రెండవ పాదం లో ఆచారీ!అనే సంబోధన ఏ అర్థం తో వేశారో తెలియ లేదు సర్ ! .వైష్ణవులకి ఆచారి అనే పేరు ఉంటుంది కాబట్టి విష్ణువుని కూడా ఆచారి అన్నారా ?విను+ఏ సుమమ్ముల అన్నప్పుడు విను యేసుమమ్ముల అని యడాగమం రాదు.నినున్+అర్చించ అన్నప్పుడూ యడాగమం రాదు.

      తొలగించండి
    2. ధనికొండ వారికి నమస్సులు. ఆచారీ అనుటలో మీరు చెప్పినది కరక్టు. యడాగమాల విషయంలో మీ సూచనలకు ధన్యవాదములు. సరిగా గమనించలేకపోయినాను.

      తొలగించండి
  8. స్రుక్కులుడుగ నీ
    సేవ’యే సు’లువనుకొని
    నొప్పుగ సుగంధ ‘చర్చి’తమొనర జేసి
    తెరపి లేకుండ చ’క్రీ ! స్తు’తించెద నిను,
    నీ ఘనత భా’సి లువ’ రకు నీమముంచి

    రిప్లయితొలగించండి
  9. జనులు సంత"సిలు వ"రముల నిడవయ్య
    రంగ!చందన"చర్చి"త మంగళాంగ!
    "యే సు"రుచిర కీర్తనలతో చేసికొందు
    పాదపూజ చ"క్రీ! స్తు"తివ్రతుడ నేను

    రిప్లయితొలగించండి
  10. నుత గుణ చర్చిత చక్రీ
    స్తుతియింతును భాసిలు వయసున ననురక్తిన్
    సతతము నీ రక్ష నరసి
    మతియే సునిశితము కాఁగ మాధవ! నిన్నున్

    రిప్లయితొలగించండి
  11. సిలువ-చర్చి-యేసు-క్రీస్తు
    సిరియే భాసిలు వక్ష మందుసతిగా శ్రీమంతువే నీవు జె
    చ్చర మత్తేభము గాచు నీ కృప సదా చర్చింతు రీ సత్కవుల్
    సరియే !సుందర రూపు నిన్ వదలి మోక్షప్రాప్తి నే గోరుచున్
    జరియింపన్ ,స్తుతియింప నెవ్వరినొ యో చక్రీ స్తుతింతున్ నినున్!

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    గాసిలు వరాంగమున్ దయఁ గావ శ్రీశ!
    కావ్య చర్చితమౌ లీల కమలనాభ!
    కుజన సంహారమదియే సుగుణ శరణ్య!
    కూర్మిఁ జక్రీ! స్తుతింతు వైకుంఠవాస!

    రిప్లయితొలగించండి
  13. గాసిలు వచనముల తోడ గౌరవమ్ము
    నిడక భార్యతో చర్చించి వెడలగొట్టై
    కొడుకు, నీప్రేమ యేసుఖమిడుపుడమిని
    తిరపు భక్తిని చక్రీ స్తుతింతునిన్ను
    అసనారె

    రిప్లయితొలగించండి
  14. పరగ క్షీరాబ్ధి భాసిలు వర శుభాంగ
    జలరుహోదర చందన చర్చి)తాంగ
    శుభద నీ పద సేవయే సుపథమనుచు
    తిరముగా నమ్మి చక్రీ స్తుతింతునెపుడు

    రిప్లయితొలగించండి
  15. మనమునందుభాసిలు వరమాధవుండు
    గంధచర్చితాంగుడగుచు కరుణ చూప
    కంబుపాణియౌహరియే‌సు గతినొసంగు
    ననుచుచక్రీ స్తుతింతునే ననవరతము.



    రిప్లయితొలగించండి