ఆ శివ సన్నిధానమున నైహిక చింతన మంతరించి స ర్వేశుని జేరుటెట్లట వసించుటదెట్లట శాశ్వతంబుగా నా శివమూర్తి నైక్యమగు నాత్మ పథంబది పొందుటెట్లనన్ కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా
ఉ:ఆశల నన్ని వీడి యిక నాత్మవిచారణ జేయ సిద్ధుడై దేశపు జ్ఞానపీఠ మగు దివ్యపురమ్మని నిశ్చయించుకన్ కాశికి బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా! దేశము మెచ్చు తత్త్వయుత దీప్తకవిత్వసుధన్ రచించగన్. (ఆయన కాశీ లో జ్ఞానం సంపాదించాడు కానీ తిరిగి దాన్ని కూడా కవిత్వం లో పెట్టి మెప్పు పొందా లనే కోరిక కలిగింది.దానినే పూర్వవాసన అంటారు.)
రిప్లయితొలగించండిఅబ్జ పథసింధులో స్నానమాడి పిదప
విశ్వనాథుని దర్శించి పేరు గన్న
కాలభైరవ స్వామినే కనవలెనని
కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె.
ప్రియమయిన దానిని నెఱిగ విడిచెదరట
రిప్లయితొలగించండికాశి కేగిన ; కవికిఁ గాంక్షలు సెలంగె
విశ్వనాధుని పయిన గవితలు వ్రాయ
కాశి క్షేత్ర మహిమ యిది కాంచు మయ్య
తేటగీతి
రిప్లయితొలగించండికదలి భారత సాహిత్యకారులెల్ల
పాల్గొన కవి సమ్మేళన పర్వమందు
దక్షుడని పేరుఁ బొందెడు తపనమీర
కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె!
ఉత్పలమాల
ఈశుని సన్నిధానమున నింపుగఁ బండితిఁ బంచ రమ్మనన్
రాశిగఁ బాలుపంచుకొను ప్రాజ్ఞుల మధ్య కవీశ్వరుండుగన్
దేశము నందుఁ గీర్తిగొను దివ్యమనోరథపూపుటందునన్
కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా!
ఉ.
రిప్లయితొలగించండిఈశుని జేరు వైభవము నీహ్యము భోక్తగ నన్నపూర్ణకై
దేశమునందు భీష్మసువు తీర్చును కోర్కెలు వారణాసిలో
రాశుల నొప్పు పాపములు రాక్షస తత్త్వపు నష్టి గోరగా
*కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా!*
విశ్వ నాథుని దర్శింప విపుల మైన
రిప్లయితొలగించండిపద్య కావ్యము వ్రాయగా వాంఛ గలిగి
కాశి కేగిన కవికి కాంక్ష లు సెలంగె
చుట్టె శ్రీ కార మచట నే శీఘ్ర ముగను
Sir !yathi missed in last line.
తొలగించండి
రిప్లయితొలగించండిఏ సిరులెందుకింక పరమేశ్వర సన్నిధి జేరి భూరి వి
శ్వాసము తోడ గొల్చెదను శంభుని నిర్వృతి కోసమై సదా
యా సితికంఠుడే యొసగు నక్షయమంచు నటన్ వసింపగా
కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా.
కాశికేనము లేనట్టి కవివరునికి
రిప్లయితొలగించండిక్లేశములు తొలగినవట కాశిలోన
రాశులుగ పద్య కావ్యాల రచన జేయ
కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె
సర్వ సంగముల్ త్యజియించి శర్వు చెంత
రిప్లయితొలగించండిశేషజీవితముఁ గడుపఁ జేరఁ గాశి
ముక్తిధామము పైనను రక్తి కలిగి
కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె
కాశికిఁబోయి శంకరుని కన్నులఁ జూచుచు శేష జీవితం
రిప్లయితొలగించండిబా సితికంఠు సన్నిధిని యాశల నుజ్జన చేయనెంచి తా
గాసిలు సత్కవీంద్రునకు కావ్యము వ్రాయగ కోర్కెపుట్టె హా!
కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా!
కవి వరేణ్యుల మార్కొని యవితథముగ
రిప్లయితొలగించండిస్వీయ గౌరవ మెల్లెడ వెలయ నెంచి
సభల గెలువంగఁ బాండిత్య సంగర జిత
కాశి కేఁగిన కవికిఁ గాంక్షలు సెలంగె
ఆశల నెల్ల వీడి మది నంబరకేశు భజించి భక్తితో
నాశలు పిక్కటిల్లగ మహాత్ముని గొప్పతనమ్ముఁ జాటఁగా
నీశునిఁ బద్యగద్యముల నింపొసగం బొగడంగ నాత్మలోఁ
గాశికి వెళ్ళి నట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా
ఈశుని సేవ జేయక తనీప్సితముల్ నెర
రిప్లయితొలగించండివేరవంచు తా
నీశుని దర్శనార్థమయి యేమని చెప్పుదు
తీర్థయాత్రలున్
లేశము చింతవంతలను లెక్కొనరించక
తిర్గుచున్ సదా
కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట
మయ్యె నక్కటా
ఆ శివ సన్నిధానమున నైహిక చింతన మంతరించి స
రిప్లయితొలగించండిర్వేశుని జేరుటెట్లట వసించుటదెట్లట శాశ్వతంబుగా
నా శివమూర్తి నైక్యమగు నాత్మ పథంబది పొందుటెట్లనన్
కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా
తే.గీ:కవిత లందు విరక్తుడై, కాంక్ష లుడిగి,
రిప్లయితొలగించండిజ్ఞానులన్ గూడి యాత్మవిజ్ఞాన మంద
కాశి కేగిన కవికి గాంక్షలు సెలంగె
విశ్వనాథు పై శతకమ్ము వెలయ జేయ.
ఉ:ఆశల నన్ని వీడి యిక నాత్మవిచారణ జేయ సిద్ధుడై
రిప్లయితొలగించండిదేశపు జ్ఞానపీఠ మగు దివ్యపురమ్మని నిశ్చయించుకన్
కాశికి బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా!
దేశము మెచ్చు తత్త్వయుత దీప్తకవిత్వసుధన్ రచించగన్.
(ఆయన కాశీ లో జ్ఞానం సంపాదించాడు కానీ తిరిగి దాన్ని కూడా కవిత్వం లో పెట్టి మెప్పు పొందా లనే కోరిక కలిగింది.దానినే పూర్వవాసన అంటారు.)