3, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4268

4-12-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏమేమీ పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా”
(లేదా...)
“ఎవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు”

27 కామెంట్‌లు:

  1. తేటగీతి
    జాతి వైరంబు మరచియు జంతువితతి
    ఋషి తపోవనంబుల సంచరించు చుండె
    నెవ్విధిఁ?బులి పిల్లలను లాలించె లేళ్ళు
    కలిసి తిరుగాడె బిల్లులు నెలుకలౌర!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      ఏ మాత్రంబును జాతివైరమది యూహింపంగనేలేముగా
      శ్రీమంతంబగు కణ్వమౌని మహిమంజెన్నారు తత్ప్రాంతమం
      దేమేమీ!పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించె,నా
      హా!మండూకము సర్పసంతతులతో నాటాడసాగెంగదా.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. లవకుశుల పరాక్రమము విని శ్రీరాముడు....

    శార్దూలవిక్రీడితము
    ఆ మౌనీంద్రుని యాశ్రమాన హరిణాలా యమ్మలన్ గాంచినన్
    సామర్థ్యమ్మును గాంచగా లవకుశుల్ శార్దూలముల్! ధీరులై
    రామాశ్వమ్మునె యడ్డగించి యనిలో లక్ష్మన్ననోడించిరా?
    యేమేమీ! పులిపిల్లలన్ గదిసి లేల్లీరీతి లాలించెనా?

    తేటగీతి
    ఆశ్రమందుననమ్మలు హరిణములన
    నందు పెరిగిన లవకుశులశ్వమడ్డి
    లక్ష్మణాఖ్యునాప పులులై రాముడాడె
    నెవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏 సవరించిన తేటగీతి:

      ఆశ్రమమ్మందునమ్మలు హరిణములన
      నందు పెరిగిన లవకుశులశ్వమడ్డి
      లక్ష్మణాఖ్యునాప పులులై రాముడాడె
      నెవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు?

      తొలగించండి
  3. మనది కలికాల మన్నది మరచి పోయి
    పలుకు చుంటివో ! పరులపై పగలు పెరుగు
    గాన , నీవు జెప్పవలదు కథలనింక,
    నెవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు ?

    రిప్లయితొలగించండి
  4. పులికి జింకకును గలదు పుడమిని గన
    గొప్ప గ విరోధమని యుండ గుదురు నెచట
    నెవ్విధి బులి పిల్లలను లాలించె లేళ్ళు?
    తెలివి గల వాడు ప్ర శ్నిం చె తెలుపు డనుచు

    రిప్లయితొలగించండి

  5. ఆ మున్యాశ్రమ మందు బాలకులు యాగాశ్వమ్మునే నిల్పుచున్
    సౌమిత్ర్యానుజు బంధిసేయుటదియాశ్చర్యంబదే యంచు నా
    రాముండచ్చెరు వొందుచున్ పలికె నాజేంద్రుండా వేగుతో
    ఏమేమీ పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా.


    ఆశ్రమములోన నివసించెడర్భకుండ్రు
    రామ తురగము భందింతురా విచిత్ర
    మదియె వారలు వీరులే యని యొకడనె
    ఎవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు

    రిప్లయితొలగించండి
  6. మృగనయన శిక్షణమ్మున మృగములెల్ల
    చేరె నొద్దిక నొకచోట, వీరవనిత!
    యెవ్విధిఁ బులిపిల్లలను లాలించె! లేళ్ళు
    మరియు కుందేళ్ళ నాడించి మనసుదోచె!

    రిప్లయితొలగించండి
  7. ఏమాయాశ్రయ ఛాయలందు నిరవై యేపారు సౌహార్ద! మా
    హా! మౌనీంద్రు నికాయమందు తగులమ్మత్యద్భుతంబే గనన్
    క్షేమంబచ్చట నివ్వటిల్లి విరిసెన్ స్థేయంబుగా, కానిచో
    నేమేమీ పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా!

    రిప్లయితొలగించండి
  8. శ్రీమంతంబుననామెకోసమనిసుశ్రీకార సంరంభమైఁ
    బ్రేమోద్దీపితజంతుజాలమచటన్బేర్మిన్మహానందమై
    సామాన్యంబుగనాశకుంతలయెశ్రీసాద్వీమణీ!మంజరీ!
    ఏమేమీ ?పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  9. బెదర కుండఁగ నుండంగఁ బిల్ల లెల్ల
    రక్షణం బొసఁగఁ దలంచి యా క్షణమునఁ
    దెంపు మది నూని భృశము గాండ్రింప నచట
    నెవ్విధిఁ బులి, పిల్లలను లాలించె లేళ్లు

    శ్రీమంతుండు దయార్ద్ర దృష్టిఁ గన సంప్రీతిన్ సహస్రాక్షుఁడే
    భూమీ నీర నభశ్చరావలికి సంపూర్ణమ్ము శాబాలిపైఁ
    బ్రే మస్వాంతము జీవ కోటి కడరున్ విశ్వమ్ములో నెన్నఁగా
    నేమేమీ పులి పిల్లలన్ గదిసి లే ళ్లీరీతి లాలించెనా

    [అన్వయము: పులి లేళ్లు పిల్లలన్ గదిసి]

    రిప్లయితొలగించండి
  10. శా.

    *ఏమేమీ పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా*
    సామీప్యంబున జంతుజాలము, సముల్ సర్వేశుడీక్షించగన్
    వ్యామోహంబు సవిత్రికిన్ శిశుకముల్ పాల్ద్రాగ నానందమే
    భామా లీలలు బాల బాలికలకున్ బ్రాప్తమ్ము గ్రాహ్యంబగున్.

    రిప్లయితొలగించండి
  11. కర్ణుని తపోవన ముగన గనబడు గద
    యెవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు
    జాతి వైరము లేకుండ సహజ మైన
    ప్రేమ భావమ్ముఁ గలుఁగుచుఁ బ్రీతినుండె

    రిప్లయితొలగించండి
  12. ఏమేమీ పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా
    భామా! కంటివె నీవు వాటిని వెసన్ వారింప లేదేకదా
    యేమాత్రంబును జాతి వైరమును నూ హింపంగ లేకుండగా
    నామౌనీశ్వరుఁడట్లు పెంచెను సుమా యాజంతు జాలంబులన్

    రిప్లయితొలగించండి