6, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4271

7-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్”
(లేదా...)
“జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్”

23 కామెంట్‌లు:

  1. సమభావము సమదృష్టియు
    సమయోచిత నిర్ణయములు సద్వర్తనమున్
    తమవని భావింప సమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమరముసేయనేల యిట శాంతివి ఘాతము సల్పనేలనో
      విమలమనోహరంబయిన పెక్కువగల్గిన నాయకాళికిన్
      సమయమువచ్చి యెన్నికలుచక్కని రూపమునొందగా సమా
      జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్

      తొలగించండి
  2. సముచిత కృత్యములు సలిపి
    సమాయో చిత నిర్ణయాలు సత్వరచర్య ల్
    ప్రమదము గూర్చుచు ను సమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమ కూర వలెన్

    రిప్లయితొలగించండి
  3. రావణ వధానంతరము హనుమ సీతామాతతో..

    కందం
    కుమిలితివెంతయొ మాతా!
    ప్రమోదమున్ వీడి లంకఁ, బౌలస్త్యుఁడటన్
    సమసెన్ నీ చిత్త సరో
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్!

    చంపకమాల
    ప్రమదము వీడితే పొగిలి రావణుఁడుంచఁగ లంక మాతరో!
    సమసెను రాక్షసుండనిని, శౌర్య సుశోభిత రామచంద్రుడున్
    దమరి నయోధ్యఁ జేర్చు నిక ధన్యతఁ జెందఁగ మీ మనస్సరో
    జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్

    రిప్లయితొలగించండి
  4. కుమతులనణచుచుసతతము
    మమతలు పంచెడు మదిగల మనుజుల ద్వారా
    సుమధురమైనట్టిసమా
    జమునకుసౌఖ్యమ్ముశాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి
  5. కందము
    జమునకు మహాజవంబ
    బ్జమునకు రవికిరణ దీప్తి ,ప్రభవించిన భూ
    జమునకు ఫలవృద్ధి, సమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      జమునకు స్వచ్ఛతాగుణ లసజ్జవదీర్ఘతరంగముల్, సరో
      జమునకు బాలభానుకర సంగవిచిత్రపు వర్ణశోభ, భూ
      జమునకు పత్ర పుష్ప ఫల సౌరభ వైభవముల్ బళీ!సమా
      జమునకు శాంతిసౌఖ్యములు సత్వరమే సమకూరగావలెన్.

      తొలగించండి
    2. చం:అమలిన మైన నవ్వు,ముఖ మందున తేజము గల్గి దర్శకో
      త్తముల ప్రశంసలన్ బడసి,దైవము నెన్నడు మ్రొక్కుచుండి,యు
      త్తమమగు ప్రేక్షకాదరణ దాలిచి,యెన్నిక గెల్వ గోరు మా
      జమునకు శాంతిసౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్.
      (జమునకు అన్యార్థం ఇవ్వక సినిమాలలో నటించి,ఎన్నికలలో పోటీ చేసిన జమున గూర్చే పూరణ చేశాను.)

      తొలగించండి
    3. కం:అమితధనాసక్తియె చి
      త్తములకు సౌఖ్యమ్ము నిడునె?ధర్మము చే ,ను
      త్తమ తత్త్వము వలన, సమా
      జమునకు సౌఖ్యమ్ము ,శాంతి సమకూర వలెన్

      తొలగించండి

  6. కుమతుల యాటలు కట్టుచు
    ప్రమదలు మాత్రుసములను భావన గలయా
    సుమతియె రేడగుచు సమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్.


    ప్రమదలు మాతృతుల్యులను భావనకల్గిన సత్యవంతులౌ
    సుమతులు త్యాగమూర్తులు విశుద్ధ గుణాత్ములు సంభృతశ్రుతుల్
    కుమతుల దుష్టచర్యలను కూల్చెడు ధీరులు నేతలై సమా
    జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్.

    రిప్లయితొలగించండి
  7. అమిత వెతనొంది యెదిగిన
    సుమధురమౌ స్వరముతోడ సుపరితుడయినన్
    సమకాలపు గాయక రా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి
  8. సమకాలమందు నెనికల
    సమరము నందున పోటీ సలిపిన కారున్
    సముచితముగ గెలుచు సరో
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి
  9. క్రమముగ వననిర్మూలన
    సమయించును పుడమియొక్క సమతుల్యంబున్
    శమమొసఁగ నెల్లరకు భూ
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి
  10. కమ లాయ తాక్షు కారు
    ణ్యమున నిరంతరము వడయ నానందమ్మున్
    సముచిత మీ జీవ సమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూర వలెన్

    స మదము తన్నదీ మణి విచార విహీన తిరస్కరింపఁ జెం
    త మసలు మంచు నాజ్ఞ నిడఁ దద్బల రాముఁడు బల్లిదుండు సాం
    త్వమున నమర్షమే చెలఁగ వాహిని కీయఁగ ఘోర శాపమే
    జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరఁగా వలెన్

    రిప్లయితొలగించండి
  11. తమతమ భాష సంస్కృతి మతమ్ములె గొప్పగ దల్చు దుష్ప్రవృ
    త్తమతుల నింద్యచింతనలు దల్చిన భీతియె గల్గు నక్కటా!
    విమలమనోవికాసగతవిశ్వసమైక్యసమాజచిత్తకం
    జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్

    రిప్లయితొలగించండి
  12. ప్రమదముతోడ కర్షకుడు పంటపొలమ్ముల చేయ సేద్యమున్
    చెమటను చిందజేయుచును చేకురవేలనొ మంచి రాబడుల్
    కమల దయా సముద్రయయి కాంచగ నిత్యము రైతు చిత్సరో
    జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్

    రిప్లయితొలగించండి
  13. కందం
    సమతా మమతా విలువల్
    సుమనస భావము లరిగిన సుడిపడు వేళన్
    సుమధుర కలల సమసమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూర వలెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  14. మమతలు నింపుచుఁ బ్రజలకు
    విమలం బగు మనసుతోడ విశ్వముఁ గనుచున్
    సమతా భావమున సమా
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి
  15. చం.

    క్రమముగ బచ్చడిన్ బులుసు కమ్మని యప్పడముల్ పొడుల్ ఘృతం
    బమరిన పప్పు వంటకము హాళిగ భోక్తలు భోజనంబునన్
    సమరమె కుక్షిలో మసటు సంధి నజీర్తిని బొంద, నంత్రకూ
    *జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్*

    ........
    అంత్రకూజము =
    ప్రేగులు ఆర్చుట, ప్రేగులలోని ధ్వని.

    రిప్లయితొలగించండి
  16. క్రమముగ వననిర్మూలన
    సమయించును పుడమియొక్క సమతుల్యంబున్
    శమమొసఁగ నెల్లరకు భూ
    జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్

    రిప్లయితొలగించండి