26, డిసెంబర్ 2022, సోమవారం

సమస్య - 4290

27-12-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోషంబులు లేక యుంట దోషము గాదే!”
(లేదా...)
“దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్”
(విట్టుబాబు పంపిన సమస్య)

31 కామెంట్‌లు:


  1. వేషమది చూడగా మన
    భాషయె తెలియని విదేశ పండిత పాత్రన్
    పోషించు తరి నటుని వా
    గ్దోషంబులు లేక యుంట దోషము గాదే?

    రిప్లయితొలగించండి
  2. వేషము చంద్రుని దైనను
    బోషణ తారా శశాంకమున రక్తిఁగొనున్
    దూషణకు వెరచి కథ నా
    దోషంబులు లేక యుంట దోషము గాదే?

    ఉత్పలమాల
    వేషము నంది చంద్రునిగ వింతగ తా గురుపత్ని బొందెడున్
    బోషణ తత్కథాగమన భూషణమౌఁగద రక్తిగట్టగన్!
    దూషణలెంచుచున్ గథను తోయజవైరికి నంటినట్టిదౌ
    దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్!

    రిప్లయితొలగించండి
  3. భాషను పల్కలేని పశుపాలక వృత్తిని జేయు వానిగా
    వేషము వేసె పండితుడు వింతయదేమన ప్రేక్షకాళియే
    భేషని మెత్తురంచు కృత విద్యుని వోలెను పేరువాఱె, వా
    గ్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  4. వేషము ధరించిన నటుడు
    భాష ను జక్కగబలుకగ పలువురు మెచ్చన్
    బో షించి న దరి యే వా
    గ్దో షo బు లేక యుంట దోషము గాదే!

    రిప్లయితొలగించండి
  5. తోషముగా గానమ్మును
    దోషరహితముగనుపాడ దుష్కరమైనన్
    భేషననెల్లరు విని ని
    ర్దోషంబులు లేక యుంట దోషము గాదే!

    రిప్లయితొలగించండి
  6. శోషితదానవుండు మధుసూదను డండగ కౌరవేంద్రతా
    శేషవిభూతిఁ బాండవుల చేతి కొసంగెను జేరదీసి సం
    తోషము నింపె, యుద్ధమున దోషుల నంపెను దేవభూమి, ని
    ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్.

    దేవభూమి -స్వర్గము

    రిప్లయితొలగించండి
  7. దోషములనంతములు సం
    తోషము లభియించు పరుల దోషము లెంచన్
    దోషములెంచెడి మదికిన్
    దోషంబులు లేక యుంట దోషము గాదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దోషములెన్నియో కలవు దోహలులై గణియించినన్ భువిన్
      దోషము లేనివారలను దుర్భర రీతిని గాంచుచున్ సదా
      దోషము లెంచిచూచి పరితోషము బొందుట పాడిగాదె, ని
      ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. ద్వేషమధికముగ నుండియు
    నాషామాషీ విధముగ నన్యుడు విధిగన్
    భాషను నేర్వగ ,లక్షణ
    దోషంబులు లేక యుంట దోషము గాదే

    రిప్లయితొలగించండి
  9. వేషమువైచె పామరుఁడు వేడుక సూరిగ నాటకమ్మునన్
    భేషనిరెల్ల వీక్షకులు పేరిమిఁ బల్కు తెరంగు గాంచి సం
    తోషము నొందెఁ బామరుఁడు దోషములెంచని కారణాన ని
    ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  10. భాషలు వేఱైనను నిజ
    వేషము లూనినఁ గడింది ప్రీతిని నొకచో
    రోషము దోషము గాదే!
    దోషంబులు లేక యుంట దోషము గాదే!

    ద్వేషము వీడ కుండుటయు వేగిరపాటు వహించి యుంటయున్
    వేషము నందు నించుకయుఁ బేరిమి సక్కఁదనమ్ము స్వచ్ఛతల్
    భాషల యందు మార్దవపుఁ బల్కులు డెందము నందు సుంత యేఁ
    దోషము లేక యుండుటయె దోష మటంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  11. కం:దోషముల నెన్నగా కుజ
    దోషమ్ముల గల్గు వరుల తో పెండిలి త
    ద్దోష సహితలకు శ్రేయము
    దోషంబులు లేక యుంట దోషము కాదే!
    (కుజదోషం ఉన్న వారికి కుజదోషం ఉన్న వారి తోనే పెండ్లి చెయ్యా లని జ్యోతిష్యులు చెపుతారు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:భాషన పట్టులేక,యొక భావము చక్కగ జెప్ప లేకయున్
    దోషశతమ్ము తో నొకడు తోచిన రీతిన వ్రాసి దానిలో
    దోషము లెంచుమన్న నొక దోషము నెన్నక,దిద్దినట్టి యే
    దోషము లేక యుండుటయె దోష మటంచు వచింత్రు పండితుల్.

    రిప్లయితొలగించండి
  13. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
    "భాషను పట్టులేక" అనండి.

    రిప్లయితొలగించండి
  14. భూషణముల్ సమస్త సుఖ భోగము లెన్ని లభించినన్ మదిన్
    దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్
    వైషయికానురక్తి విడి భాగవతోత్తములై చరింప సం
    తోషము శాశ్వతంబగును దూరమగున్ భవ సంచితాఘముల్

    రిప్లయితొలగించండి