తే.గీ:వందలుగ నున్న భారత ప్రజలు కలసి లక్షలుగ సొమ్ము గూర్చి శ్రీలంక యందు రామునకు గుడి కట్టిరి ప్రేమ మీర రాము డుదయించె రావణు రాజ్య మందు (నేటి శ్రీలంకే రామాయణం లోని లంక అనే అనేకుల అభిప్రాయాన్ని గ్రహించి వ్రాసినది.)
ఉ:భూమిని ధర్మ రక్ష కయి ,భూమికి నల్లుడు గా వెలుంగు శ్రీ రాముడు పుట్టె, రావణుని రాజ్యము నందున ధర్మరక్ష కై రాముని పక్షమై నిలచి ,రావణు నన్న యటంచు మూర్ఖమౌ ప్రేమను దాల్చ జాలని విభీషణుడున్ వెలుగొందె ధీరుడై.
ఈమహి రాక్షసాధిపతి యిష్టము వచ్చిన క్రూరచర్యలున్ ప్రేమను వీడి సజ్జనుల పీడల పాలొనరించ గాంచియున్ క్షేమము గూర్చ వారలకు జెచ్చర దుష్టుల సంహరించగా రాముడు పుట్టె , రావణుని రాజ్యము నందున ధర్మ రక్షకై
రాముని నమ్మి నంతటనె, లంకకు రాజును సేయ, తన్మహో ద్ధామ కరంబుచే నభయ దానము నొంద, విభీషణున్ గనన్ రామ జపంబునన్ సతము రాజిలు నా హనుమంతుడిట్లనెన్ రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై.
తేటగీతి
రిప్లయితొలగించండితామరసనేత్ర సీత వదలనటంచు
జాతిసేమమ్ము వీడిన జారగుణుని
పట్టి కామాంధకారమ్ము బాపు రవిగ
రాముఁ డుదయించె రావణు రాజ్య మందు
ఉత్పలమాల
తామరసాక్షి సీతఁగొని దారయు తమ్ముడు నెందరెంచినన్
సేమము వీడ మోహమున, సేతువుఁగట్టియు సాగరంబునన్
కామమునంధకారముగ గప్పఁగ భాస్కరుఁడౌచుఁ ద్రుంపగన్
రాముఁడు పుట్టె రావణుని, రాజ్యమునందున ధర్మరక్షకై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితే.గీ:వందలుగ నున్న భారత ప్రజలు కలసి
రిప్లయితొలగించండిలక్షలుగ సొమ్ము గూర్చి శ్రీలంక యందు
రామునకు గుడి కట్టిరి ప్రేమ మీర
రాము డుదయించె రావణు రాజ్య మందు
(నేటి శ్రీలంకే రామాయణం లోని లంక అనే అనేకుల అభిప్రాయాన్ని గ్రహించి వ్రాసినది.)
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధర్మ రక్షణ సేయగ ధాత్రి యందు
రిప్లయితొలగించండిరాముడు దయించె :రావణు రాజ్యమందు
మెలగు దానవుల న ణ చి చెలగె గాదె
నరుడు గా దాను మహితుఁ డై వ రలె నవని
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిఉ:భూమిని ధర్మ రక్ష కయి ,భూమికి నల్లుడు గా వెలుంగు శ్రీ
రిప్లయితొలగించండిరాముడు పుట్టె, రావణుని రాజ్యము నందున ధర్మరక్ష కై
రాముని పక్షమై నిలచి ,రావణు నన్న యటంచు మూర్ఖమౌ
ప్రేమను దాల్చ జాలని విభీషణుడున్ వెలుగొందె ధీరుడై.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభామను చెరపట్టిన యట్టి కాముకుడను
పడనడచనెంచి కడలికి పాలి గట్టి
భండనము సేయగ ప్రచండ భాను డగుచు
రాముఁ డుదయించె రావణు రాజ్యమందు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభామకు చెప్పుచుండె పతి పావన మైన చరిత్ర యంచు నీ
భూమిని ధర్మమున్ నిలుప భూపతి పంక్తి రథాత్మజుండె యై
రాముఁడు పుట్టె, రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై
ప్రేమగ సుద్దులెన్నియొ విభీషణుడే వచియించె నన్నకున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈమహి రాక్షసాధిపతి యిష్టము వచ్చిన
రిప్లయితొలగించండిక్రూరచర్యలున్
ప్రేమను వీడి సజ్జనుల పీడల పాలొనరించ
గాంచియున్
క్షేమము గూర్చ వారలకు జెచ్చర దుష్టుల
సంహరించగా
రాముడు పుట్టె , రావణుని రాజ్యము
నందున ధర్మ రక్షకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావని తెలుపగ పుడమిపట్టిజాడ
రిప్లయితొలగించండిసేతు నిర్మాణ మొనరించి శీఘ్రగతిని
దండయాత్రకు కదలి కోదండపాణి
రాముఁ డుదయించె రావణు రాజ్యమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిత్రిజట స్వప్నవృత్తాంతంబు తెలిపెనిట్లు
రాముఁడుదయించె రావణు రాజ్యమందు
లంక కూలెను జలధిలో, రాక్షసాళి
చచ్చె,జానకి పతిఁగాంచి మెచ్చెననుచు.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికోసలాధీశు ముద్దుల కొమరికి రఘు
రిప్లయితొలగించండిరాముఁ డుదయించె ; రావణు రాజ్యమందు
వేదవతి పుట్టె నొకయర విందమందు
వారిరువురికి మనువయ్యె వైభవముగ
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిరాముని నమ్మి నంతటనె, లంకకు రాజును సేయ, తన్మహో
ద్ధామ కరంబుచే నభయ దానము నొంద, విభీషణున్ గనన్
రామ జపంబునన్ సతము రాజిలు నా హనుమంతుడిట్లనెన్
రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅసుర సంహారమొనరింప నవనియందు
రిప్లయితొలగించండిరాముఁ డుదయించె, రావణు రాజ్యమందు
నంకురముపడె సీతాపహరణతోడ
దేవదేవుని లీలలు తెలియ దరమె!
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిప్రబల దుర్మార్గము కడింది లంక లోనఁ
రిప్లయితొలగించండిదనరి రక్షింప ధర్మము నిన కులమునఁ
బుడమిని హరి ఘోర వినాశము వొడఁగాంచ
రాముఁ డుదయించె రావణు రాజ్యమందు
భామను గొంట గైకొని నెపమ్ముగ వెన్నుని భక్తితోడ స
ర్వామర లోకమా యజుని నబ్జజు ముందిడి దీన చిత్తతన్
ధీమతిఁ గోర రావణు వధింప మహా నగరం బయోధ్యలో
రాముఁడు పుట్టె రావణుని రాజ్యము నందున ధర్మ రక్షకై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికామము కండ్లుగప్పి పరకాంతను దొంగిలు రావణాసురున్
రిప్లయితొలగించండిబాములపెట్ట వారిధికి వారధికట్టి యతిక్రమించి లంకలో
భామనుఁగాచి దుర్మతిని భండనమందున నేలఁగూల్చగా
రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై
అవనిజనుగొనిపోవగ నసురవరుడు
రిప్లయితొలగించండివానరులసహాయముతోడ వార్ధి కట్టి
దుష్టుడౌ వాని నడచంగ దురము నందు
రాముడుదయించెరావణురాజ్యమందు
కామము తోడ రాక్షసుడు కాననమందున వంచనమ్ముతో
రిప్లయితొలగించండిసామిగ రూపుదాల్చుచును సాధ్వి శిరోమణి రూపుగాంచుచు న్
నేమముదప్పి సాగగను నిక్కమెరింగుచు వాని చంపగన్
రాముడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై
దుష్ట కార్యము లొనరించు దురితుఁ డైన
రిప్లయితొలగించండిరావ ణాసురున్ మర్దింప పూనుకొనుచు
రాముఁ డుదయించె రావణు రాజ్యమందు
లంక సుఖియించె రావణు లయమ గుటకు
కాముని ప్రేరణంబున నకార్యముఁ జేసిన రాక్షసాధమున్
రిప్లయితొలగించండిబీచమ డంచఁదాభువికి ప్రీతినిఁ జేయగ మానవాకృతిన్
రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై
సేమముఁదోడ భూప్రజలు చీకును జింతయు లేక యుండిరే
దత్త వర గర్వి మాయావి దారుణుం డ
రిప్లయితొలగించండిమిత్ర సూదనుం డసురుండు మేఘనాధుఁ
డమర సంచయ హనన కార్య నిచ యావి
రాముఁ డుదయించె రావణు రాజ్య మందు
[నిచయ + అవిరాముఁడు; అవిరాముఁడు విరామము లేనివాఁడు]
ధామము వీడి మాధవుఁడు ధాతృ స దేవమునీంద్ర సంఘ సు
త్రామ ముఖాది నిర్జరులు ప్రార్థన సేయ దశాస్య పాలితం
బీ మహి ధర్మహీనమె యహీన విధమ్ము సెలంగ నిత్యమున్
రాముఁడు పుట్టె రావణుని రాజ్యము నందున ధర్మ రక్షకై