1, ఏప్రిల్ 2024, సోమవారం

సమస్య - 4723

2-4-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్”
(లేదా...)
“జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

47 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

వేరగుభావములేకను
తోరపుబంధంబుతోడదోసిలలినిండన్
విరులనునిచ్చియునటపూ
జారులగనిముక్తిగోరిసల్పిరినతులన్

BMahalakshmi చెప్పారు...

దోసిలి

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నీరజ నేత్రుఁడన నలం
కార ప్రియుఁడని, సభక్తి మాలల గొనుచున్
దీరుచ నాగమ విధిఁ బూ
జారులఁ గని, ముక్తిఁ గోరి సల్పిరి నతులన్!

ఉత్పలమాల
నీరజ నేత్రునిన్ మిగులు నిర్మల భక్తిని కోవెలందలం
కార ప్రియుండుగన్ దలఁచి మాలల గైకొని పెక్కురీతులన్
దీరుచ, నాగమంపు విధి దివ్యమనోహరు, మందిరానఁ బూ
జారులఁ గాంచి, వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో!

విరించి చెప్పారు...

వారలె నిజమైన నిరా
కారునకున్ భక్తులకును కల్పము నందున్
వారధులని నమ్ముచు పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్.



సూరుడు తూర్పుదిక్కు పొడచూపక ముందునె నిద్ర లేచుచున్
జేరెదరైరి కోవెలకు చిన్మయరూపుని కొల్వనెంచి ని
స్తారము గోరువారికట ధర్మపథమ్మును చూపునట్టి పూ
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో.

lakshmisita kanukolanu చెప్పారు...

కందం
జేరిరి నీగుడి ముంగిట
గోరిరి భక్తిగ వరములు గుట్టుగ మదిలో
తీరుగ పూవులు నిడి బూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తీరును గోర్కె ల టంచును
నేరుగ కోవెలకు వెడలి ని శ్చ ల భక్తిన్
హారము ల నొసo గిరి పూ
జారుల గని : ముక్తి గోరి సల్పిరి నతుల న్

రామోక్తం చెప్పారు...

కారాటవి జని భరతుడు
శ్రీ రాముని పాదుకలను చేకొని రాగా
బారులుగ పురజనులు పై
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్

పైజారులు : పాదరక్షలు

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sitharamayya Solasa చెప్పారు...

వారందరు దేవళమును
జేరి, తెలియక నఘములను జేసితి మనుచున్
భైరవునకు దెల్పుడని పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్

M.B.G.TILAK చెప్పారు...

దారుణిపై పూజారులు
వారధులై నిల్తురనెడి భక్తుల తలపే
వారికి మన్ననలిడ పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్

కోరిన వెల్లపొందుటకు కొల్తురు దేవుని భక్తులిచ్చటన్
నేరుగ పూజలన్ జరుపు నేరుపు కల్గిన వారు పూజకుల్
వారధి కట్టుచుంద్రు గద భక్తులు వేల్పుల మధ్యనిల్చి పూ
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కోరిన వాంఛితమ్ములనుకూలముగా నెరవేరు నిచ్చతో
జేరిరి దేవళమ్మునకు శ్రీహరి భక్తులు పూజ సల్పగన్
ద్వారము వద్ద నిల్చి సుమ దామములన్గొనితెచ్చి భక్తిఁ పూ
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చేరిరి భక్తవరేణ్యులు
కోరి హరిని పూజ సేయ కోవెల కడకున్
ద్వారముకడ నిలబడి పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ చేరుచు దేవాలయమును
నేరుగఁ బండుగ యటంచు నేమము తోడన్
దీరుగ భగవంతుని పై
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నుతులన్

ఉ॥ ఘోరముఁ జేసెఁ దల్లియనిఁ గోరఁగ మన్ననఁ దమ్ముఁడట్టులన్
మీరను తండ్రి యానతిని మీరకు నీవు నటంచుఁ దెల్పఁగన్
గోరెను బాదరక్షలను గుర్తుగ భక్త జానాళి మ్రొక్కఁ బై
జారులఁ గాంచి వందనములు సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో

పైజారులు లేక పైజాఱులు చెప్పులు నిఘంటువు సహాయమండి
(శ్రీ రాముని వనవాస సమయంలో అతని పాదరక్షలను అయోధ్యవాసులు కొల్చినారని అండి)
చిన్న చిన్న తప్పులండి

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

భారము వేసి వేల్పుపయి భ్రార్ధన
జేయుచు చిత్తశుద్ధితో
జేరిరి యేడుకొండలకు శ్రీహరి
దర్శన ప్రాప్తికోసమై
ద్వారము లోపలన్ హరిని ప్రస్తుతి
జేయుచున్న పూ
జారుల గాంచివందనము సల్పిరి
భక్తులు ముక్తి కాంక్షతో.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఊరి శివాలయమును వ్యా
పారము నాశనము జేయ, భక్తులు గుడిలో
తీరని వేదన బడు పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్”
(ఇక్కడ ముక్తి అంటే వారి వేదన నుంచి విముక్తి.)

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

సారము దెల్సి జీవనపు సారము మోక్షమనెంచి కృష్ణునిన్
జేర శమించు తాపములు జింతలు మాయు తలంపుతో సదా
చారులు గోకులమ్ము జనె సర్వుని సందిట భామలుండె నా
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:కోరక హెచ్చు దక్షిణలు,కోపము జూపక పేద వారి పై
చేరిన భక్త కోటికి విశిష్టపురాణకథల్ వచించి,సం
సారుల బాధలన్ వినుచు,చక్కని జ్ఞానము నిచ్చు నట్టి పూ
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్ష తో

Dhanikonda Ravi Prasad చెప్పారు...

(3)ఉ:వేరు మతమ్ము లయ్యు,ఋషివిద్యయె శ్రేష్ఠ మటంచు,ముక్తికిన్
యోగమె మార్గమం చెరుగు యూసఫు,లక్ష్మణశాస్త్రి,శారదా,
జారుల గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్ష తో
వారలొనర్చు యత్నములు వారికి సత్ఫల మీయ గోరుచున్
(యూసఫ్ అనే ముస్లిం ,లక్ష్మణశాస్త్రి,శారద అనే హిందువులు,జార్ అనే క్రైస్తవుడు కూడా ఋషివిద్య గొప్పదని ముక్తి మార్గాన్ని ఎంచుకొన్నారు.వారి ముక్తి ప్రయత్నం సఫలం కావాలని భక్తులు వందనము చేశారు.పూజారిని పెట్టకుండా మరొక ప్రయత్నం.)

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వారని రక్తిని భక్తులు
దూర నివాసు లరుదెంచి తూర్ణం బంతన్
నారాయణునకు మును పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్


దారలఁ గూడి యున్న వర దాతల మువ్వుర స్వీయ మందిర
ద్వార వరాంగణమ్ములను దాఁటి రయమ్మున సంభ్రమమ్ములం
బార విహీన హర్షమునఁ బద్మభ వాచ్యుత రాజ భృన్మనో
జారులఁ గాంచి వందనము సల్పిరి భక్తులు ముక్తికాంక్షతో

[రాజ భృన్మనోజారి = చంద్రుని ధరించిన శివుఁడు]

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ధన్యవాదం గురువు గారు !

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ధన్యవాదం గురువు గారు !

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ధన్యవాదం గురువు గారు !

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

హారతు. లొసగుచు స్వామికి
కోరకమడిమాన్యములనుకూరిమితోడన్
తీరుగపూజసలుఫుపూ
జారులగనిముక్తిగోరిసలిపిరిపూజల్


ఊరికి మేలుగూర్చగను నూరక మాటలనాడకన్వడిన్
కూరిమితోడచేయుచునుకోవెలకార్యములెల్లవేళలన్
జేరుగవచ్చుభక్తులకు శీఘ్రమె పూజలనాచరించుపూ
జారులగాంచివందనముసల్పిరిభక్తులుముక్థికాంక్షతో


కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

కోరుచు కోర్కెల నెన్నో
యారాధన చేయు భక్తు లాలయమందున్
బారులు తీరిచి యా పూ
జారులఁ గని ముక్తిఁ గోరి సల్పిరి నతులన్.