31, మార్చి 2024, ఆదివారం

సమస్య - 4722

1-4-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్”
(లేదా...)
“రాక్షసతత్త్వమే సకల రాజ్యములేలును వాస్తవమ్ముగన్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

35 కామెంట్‌లు:


  1. శిక్షార్హులైన వారలె
    లక్షలు కోట్లు గురిపించి లట్టులు గెలవన్
    శిక్షయె ప్రజలకు నిజమిది
    రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్.

    రిప్లయితొలగించండి
  2. రక్షకుడ నంచు ప్రజపై
    కక్షను పెంచుకొనినట్టి కపట మనుజుడే
    భక్షకునిగ మారగ నా
    రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    రక్షింప శిష్టుల పుడమి
    దక్షతఁ గలిగియు దశావతారుండుగ తా
    నక్షయుఁడన హరి, కూల్చుచు
    రాక్షసతత్త్వమ్మె, యెల్ల రాజ్యములేలున్

    ఉత్పలమాల
    రక్షణఁ జేయ శిష్టుల దురాగతమెంచెడు వారినుండియున్
    దక్షత గల్గి తా నసుర తత్వమెఱింగి దశావతారుఁడై
    యక్షయ దివ్యగాత్రుఁడన నంబుజ నేత్రుఁడు శౌరి, గూల్చుచున్
    రాక్షసతత్త్వమే, సకల రాజ్యములేలును వాస్తవమ్ముగన్

    రిప్లయితొలగించండి
  4. భిక్షువులౌచు నాయకులు వేసెడి కాసుల గోరు పౌరులే
    శిక్షితులైన నేమిర సుశీలము వీడుచు స్వార్థ చిత్తులున్
    రాక్షస జాతి మానవులు రట్టడులన్ గెలిపింపగా నిలన్
    రాక్షసతత్త్వమే సకల రాజ్యములేలును వాస్తవమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  5. లక్షలు కోట్లుపోసి మరి రమ్మును
    బంచియు వోట్లు గొన్నచో
    భక్షణె యాది కార్యమగు పాలక
    వర్గముకెల్ల నిద్ధరన్
    అక్షయమైన పేదరిక మంతము
    జర్గుట నీటి బుడ్గలే
    రాక్షస తత్వమే సకల రాజ్యము
    లేలును వాస్తవంబుగన్.

    రిప్లయితొలగించండి
  6. రక్షణ నిచ్చెడు యేలిక
    భక్షించఁగ పూనుకొనిన వసుమతి యందున్
    రక్షించు వారలెవ్వరు?
    రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్!

    రిప్లయితొలగించండి
  7. లక్షల పైన మోజుబడి లాలసులౌచును కొందరీ భువిన్
    దక్షత లేకయున్ననటు దర్పము చూపుచు రాజ్యమేలగన్
    రక్షణ మాట మర్చుచును రాక్షస బుద్ధిని చూపి దోచగన్
    *“రాక్షసతత్త్వమే సకల రాజ్యములేలును వాస్తవమ్ముగన్”*

    రిప్లయితొలగించండి
  8. రక్షణచేసెదమంచును
    రక్షకులేజగతియందురహదారులలో
    భక్షకులుగమారగ నా
    *“రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్”*

    రిప్లయితొలగించండి
  9. రక్షణ మాత్రమె కాదు వి
    లక్షణమౌ తత్వముండు రాజుల మదిలో
    లక్షల ప్రాణములంగొను
    రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్

    రాక్షస తత్వమే నడుపు రాజులనెన్నడు లోకమందునన్
    శిక్షణ నిచ్చిసైన్యమును శీఘ్రమె సిద్ధముచేయుచుందురే
    లక్షణ మెన్నడున్ బొరుగు రాజ్యము పైబడి యాక్రమించుటే
    రాక్షసతత్త్వమే సకల రాజ్యములేలును వాస్తవమ్ముగన్

    రిప్లయితొలగించండి
  10. రక్షణ కల్పించి జనుల
    దక్షత పాలింతు ననుచు ద నుజుని వోలె న్
    భక్షణ సేయుట మొదలిడి
    రా క్షస తత్త్వమ్మె యెల్ల రాజ్యము లేలున్

    రిప్లయితొలగించండి
  11. రక్షణ నిచ్చు యేలికలు ప్రాపు వహింపక స్వార్థ బుద్ధితో
    భక్షణ చేయబూని పరిపాలన సల్పగ దిక్కెవండికన్
    కక్షలు పెచ్చరిల్లి పలుగాకులు విచ్చలుగా చరింపగన్
    రాక్షసతత్త్వమే సకల రాజ్యములేలును వాస్తవమ్ముగన్

    రిప్లయితొలగించండి
  12. కం॥ రక్షణ నొసఁగఁగఁ బ్రజలకు
    దక్షతతో దుష్టులఁగని దండించఁ దగున్
    దక్షత రాక్షస గుణమన
    రాక్షస తత్వమ్మె యెల్ల రాజ్యము లేలున్

    ఉ॥ రక్షణ సేయఁగన్ బ్రజల ప్రాణము మానము సంపదాదులన్
    దక్షత తోడ దుష్టులకు దండనఁ గాంచు సమర్థుఁడే తగున్
    శిక్షణ నిచ్చి సర్వులకు ఛిద్రముఁ జేయఁగ దౌష్ట్యముల్ భువిన్
    రాక్షసతత్వమే సకల రాజ్యము లేలును వాస్తవమ్ముగన్

    రిప్లయితొలగించండి
  13. కం:అక్షర శూన్యత కలిగిన,
    భక్షణకును,మద్యమునకు,పైకముకు సదా
    యీక్షించు ప్రజలు పెరిగిన
    రాక్షసతత్త్వమ్మె యెల్ల రాజ్యములేలున్”

    రిప్లయితొలగించండి
  14. ఉ:శిక్ష నొసంగి శత్రువుల చి త్తొనరించిన చంద్ర గుప్త! యీ
    రాక్షసమంత్రి శత్రు వనరా దత డెన్నడు రాజ్య భక్తి యన్
    పక్షపు మంత్రియే యతని వర్జితు జేయకు శిష్య!స్వచ్ఛ మౌ
    రాక్షసతత్త్వమే సకలరాజ్యము లేలును వాస్తవమ్ముగన్.
    (చంద్ర గుప్తుడు నందులని నిర్మూలించాడు.నందుల మంత్రి పేరు రాక్షసుడు.చాణక్యుడు చంద్రగుప్తునితో"ఈ రాక్షసమంత్రి శత్రు వని భావించకు.అతడు రాజ్యపు మేలు కోరే వాడు.అతణ్ని నీవు నిస్సందేహం గా మంత్రిగా ఉంచుకో అని సలహా ఇచ్చాడు.అలాంటి తత్త్వమే రాజ్యానికి అవసరమని చెప్పాడు.చంద్రగుప్తుడు గురువు సలహాని పాటించాడు.)

    రిప్లయితొలగించండి
  15. దక్షత లేని విభుండు వి
    పక్ష విహీనము సెలంగి పాలింపంగా
    నీ క్షితి నిస్సంశయముగ
    రాక్షస తత్త్వమ్మె యెల్ల రాజ్యము లేలున్


    శిక్షలు దాఁకు నింగిని నశింతురు లోకులు దారుణమ్ముగా
    నక్షయమై నిరంతరము నగ్ని నిభమ్ముగఁ బ్రజ్వరిల్లఁగా
    నీ క్షితి లో రజో గుణ మహీనము సత్వ రజో తమస్సులన్
    రాక్షస తత్త్వమే సకల రాజ్యము లేలును వాస్తవమ్ముగన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రక్షణ చేసెడు దొరలే
    శిక్షించుచు కక్ష తోడ చేటని తలచన్
    దక్షత కల్గిన వారిని;
    రాక్షస తత్వమ్మె యెల్ల రాజ్యములేలెన్.

    రిప్లయితొలగించండి