30, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 157

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు.

12 కామెంట్‌లు:

  1. అమ్మ సోనియ యొసగదు యాదరమ్ము
    అకట! రోసయ్య కిచ్చిరె యాసనమ్ము
    క్రింద దింపగ దానెక్క కిరణు డెవడు ?
    కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు !

    రిప్లయితొలగించండి
  2. మరో పూరణండీ :

    మత్సరమ్మున జెలరేగు మదిని నెటులొ
    పంజరమ్మున బిగియింప పక్షి వోలె
    వెతల గాసిలు విదురుడ వేయు నేల
    కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు

    రిప్లయితొలగించండి
  3. సుతుడు లేని యెడల లేవు గతులు యనెడి
    మాట నేడు పొసగదు ముమ్మాటికి నిల
    కందెఱ వలె గాచెడు సుత కంటె ఎటుల
    కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకు మేలు?

    రిప్లయితొలగించండి
  4. బ్రతుకు నల్లేరుపైసాగు బండికాదు,
    వేదనమిగిల్చి,బాధించి,వెతలపాలు
    జేసి,కంటకులై కంపు జేయు వారి
    కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!

    రిప్లయితొలగించండి
  5. సుతుల నూర్వుర బడసిన సుఖమ దేమి
    కపటులై పర్వు మాయుచు కన్న వారి
    కొంప కొల్లేరుఁ జేసెడి! కొడుకె మేలు
    ధర్మజుని రీతి యొక్కడు తనువు గడుప !

    రిప్లయితొలగించండి
  6. పీతంబార్ గారి పద్యంబాగున్నది కాని భావం కొంచెం క్లిష్టంగా ఉన్నట్లున్నది.
    మురళీమోహన్ గారి పద్యం, నరసింహ మూర్తిగారి రెండవ పద్యం చాల బాగున్నాయి. గురువుగారి సూచన మేరకు ఈ నా వ్యాఖ్య. తోటి మిత్రులు నా పద్యం గురించి కూడా వ్యాఖ్యానిమ్చరూ?

    రిప్లయితొలగించండి
  7. ఎన్నగాను మేల్గీడులవెట్లు తెలియు
    పోల్చి చూడ వలయు గదా తేల్చి చెప్ప
    తల్లిదండ్రుల త్రెక్కొను తనయు కంటె
    కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు.
    మనవి: గ్రుడ్డి కంటె మెల్ల మేలు అన్నట్లు.

    రిప్లయితొలగించండి
  8. మరొక పూరణండీ :

    ఒరుల దొరతన మోర్వక నుద్యమించి
    ఉప్పు జేయగ గాంధీజి, యుర్వి ననిరి
    "కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు
    పరుల నింటను బోషించు బ్రతుకు గంటె "

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారి మూడు పూరణలు, కోడీహళ్ళి మురళీ మోహన్, మంద పీతాంబర్, మిస్సన్న, చంద్రశేఖర్ గారల పూరణలు చూసాను. అందరికీ అభినందనలు. జనగామలో పెళ్ళికి వెళ్ళే తొందరలో మీ పద్యాలను విశ్లేషించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  10. నా పూరణ .....
    కన్నవారికి సత్కీర్తి గలుగునట్లు
    సర్వ సద్గుణోపేతుఁడై సకల జనుల
    మెప్పు పొందు సుతుని గాక చెప్పు నెవఁడు
    కొంప కొల్లేరుఁ జేసెడి సుతుఁడె మేలు.

    రిప్లయితొలగించండి
  11. మాష్టారు గారు,
    నా సూచన మన్నించి అద్భుతమైన పూరణ అందించినందుకు కృతజ్ఞతలు. మీ పూరణ నన్ను భాషా, సాహిత్య పరంగా చాలా ఆనందింపజేసింది. ఇదే రకంగా కొనసాగించగలరని భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి