12, ఏప్రిల్ 2011, మంగళవారం

దత్త పది - 9 (విల్, పిల్, కిల్, మిల్)

అందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు
కవి మిత్రులారా,
విల్, పిల్, కిల్, మిల్
పై పదాలను ఉపయోగించి మీకు నచ్చిన ఛందస్సులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వర్ణించండి.

31 కామెంట్‌లు:

  1. మాస్టరు గారికి,
    కవి మిత్రులకూ
    బ్లాగు వీక్షకులకు అందరకూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
    ----------------------------------------

    విల్లును విరిచెను చూడగ,
    పిల్లాడా! కాదు? వీడు పిడుగే యన,యిం
    కిల్లాలు జానకని ప్రణ
    మిల్లిరి సీతా ధవునకు మిథిలా వాసుల్!

    రిప్లయితొలగించండి
  2. బ్లాగు వీక్షకులకు అందరకూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


    మారా!మాధవ! రాజకు
    మారా!మా మొరలు వినగ, మమ్ముల బ్రోవన్
    మారామా!చాలును యిక
    మా రామా!వేగ రార మారారి నుతా!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ శ్రీ రామ నవమి
    శుభా కాంక్షలు !

    01)
    ____________________________________

    విల్లు రామయ్య సులువుగా - విఱువ గానె
    పిల్లములు గాగ జానకి - పెద్ద కనులు !
    కిలకిలా రావ ముల్లము - కెలయ బార
    మిలమిల మెరయు హారము - మెడను వైచె !
    ____________________________________
    పిల్లము = తడి కన్ను

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు.
    మాస్టరు గారికి,కవి మిత్రులకూ
    బ్లాగు వీక్షకులకు అందరకూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. పిల్లలు, పెద్దలం దరును వేడుక మీఱఁగఁ జూడఁగా, యదో!
    విల్లును ఫెళ్ళనన్ విరిచె వీరుఁడు; పెండ్లికిఁ దండ్రియాన,నా
    కిల్లిడఁ గావలెన్ యనెను, కీరఁపుఁబల్కుల జాణ,జానక
    మ్మిల్లునుఁ జేరెఁగోసలము,మెచ్చఁగఁమామయు సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  6. శ్రీరాములు
    =======
    విలు విరచిన వానికి, ప్రణ-
    మిలగా నిల జీవ కోటి, మిథిలాత్మజకున్
    కిలకిల కలరవములు నవ
    పిలుపేలా వేగ రమ్ము పెండ్లిని జూడన్.

    రిప్లయితొలగించండి
  7. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, ఏప్రిల్ 12, 2011 10:17:00 AM

    అందరికీ,
    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  8. విల్ ను విరవగ సీతమ్మ వివశ మాయె!
    పిల్ పు కొరకును చూడగ పెదవి వణకె!
    కిల్ కి లుమ్మను చూపుల కీరవాణి!
    మిల్ మి లమ్ముగ జానకి మెరసె శోభ!

    శంకరయ్య గారిచ్చిన పదాల్ని యధా తధంగా వాడేదానికి చేసిన చిరు ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  9. 02)
    ____________________________________

    శంకరు విల్విఱచి , జనకు
    శంకను సొంపిల్లు జేసి - జానకి బడసెన్ !
    శంకరికిని ప్రణమిల్లెను
    కింకిల్లిన పరశురాము - క్షేపము నణచెన్ !
    ____________________________________
    కింకి = కోపము
    క్షేపము = గర్వము

    రిప్లయితొలగించండి
  10. విల్లును విరిచెను రాముఁడు
    పిల్లల మగు మనను గాఁవఁ; వీరునిఁ గనిమిల్
    మిల్లను మెరిసెడి బల్చె
    క్కిళ్ల రమణి యా కిశోరు కిల్లా లయ్యెన్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ రామ నవమి మహోత్సవమున మిత్రులెల్లరికీ సకల శుభములు కలుగు గాక

    రిప్లయితొలగించండి
  12. కిట్టించిన ఇంకో దత్తపది.

    పూనిక శంభు విల్ విఱచి, భూమిజ కన్నులు వెల్గ మిల్ మిలా
    భాను కులాబ్ధి కౌస్తుభము భార్యగ చేకొనె, మెచ్చ సర్వులున్,
    తానయి రాగ పిల్వకనె దర్పము చొప్పున భార్గవుండటన్
    హీనము చేసి శక్తి, తరియింపగ నంపెను శంక లేకిలన్.

    రిప్లయితొలగించండి
  13. సీ ||
    వీఁడటే దశరథు పెద్దభార్యకుఁ గడు
    అర్మిలిఁ గల్గిన అర్భకుండు !
    వీఁడటే బువ్వకుఁ బిలువ రాతిరిఱేని
    తెమ్మని బిగిసిన తెంపరోఁడు !
    వీఁడటే గౌతముఁ వెలఁదికి శాపఁపు
    యంకిలి దీర్పిన అందగాఁడు !
    వీఁడటే కొండొక విల్లును తెగద్రుంపి
    జానకి నందిన సక్కనోఁడు !
    గీ ||
    వీఁడు ఈ భువి నసలైన వీరవరుడు !
    వీఁడు మాయమ్మ కుఁ దగిన పెండ్లికొడుకు !
    వీఁడు సూర్యవంశమునకు వెలుగుఱేఁడు !
    వీఁడు మమ్మేల వచ్చిన విమలయశుఁడు !

    (పోతరాజుకు పాదాభివందనాలతో)

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రులకు నమస్కృతులు.
    చాలాకాలం తర్వాత ఇచ్చిన "దత్తపది"కి మంచి స్పందన వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. మీ ఉత్సాహాన్ని చూసి ఇకనుండి వారానికి ఒకటో, రెండో దత్తపదులను కూడా ఇవ్వాలనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  15. హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    శబ్దాలంకార శోభితమైన మీ రామస్తుతి మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.

    మందాకిని గారూ,
    మనోహరమైన వృత్తంతో విందు చేసారు. మీ కంద పద్యం ఇంకా బాగుంది. అభినందనలు.
    అన్నట్టు మీరు కోరినట్లుగా "వందే మాతరం"లో దండకం వ్రాసాను. చూసారా?

    మిస్సన్న గారూ,
    మీ రండు పూరణలూ ప్రశస్తంగా, మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు.

    వెంకటప్పయ్య గారూ,
    చాలా బాగుంది మీ ప్రయోగం. చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. రవి గారూ,
    ఎంట మనోహరమైన పద్యం చెప్పారు. ధన్యుల మాయ్యాము. ధన్యవాదాలు.

    చక్కని పదసంపదతో
    మక్కువతో సీసపద్యమణి నొసఁగిన నీ
    కక్కఱతో వందనముల
    లెక్కకు మిక్కిలిగ నిడఁ గలిగె నిచ్ఛ రవీ !

    సనత్ శ్రీపతి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. సనత్ గారూ, నా పద్యానికి మాతృక మీకు తెలుసని అనుకుంటున్నాను. శంకరయ్య మాస్టారు గారికి తప్పక తెలిసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారు,
    ధన్యవాదాలు.
    మా వల్లకాదయ్యా రామయ్యా అను పేరుతో వచ్చిన మెయిల్ చూసి నేను దండకం గా రూపొందిస్తే బాగుంటుందని భావించి సూచించిన మాట నిజమే. అయితే అది రాసింది నాగేంద్రకుమార్ గారు కదా? మీరు ఏ దండకం గురించి ప్రస్తావిస్తున్నారో నాకు తెలియటం లేదు.

    రిప్లయితొలగించండి
  19. రవి చెప్పిన సీసము కడు మనోహరముగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  20. మదాకిని గారూ,
    ఆ దండకాన్ని వ్రాసింది నేనే. దానిని మీకోసం యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. అయినా వందేమాతరంలో దండకం క్రింద నా పేరు, బ్లాగు అడ్రసు ఇచ్చాను చూడలేదా?

    శ్రీలక్ష్మి! దేవీ! కృపాపూర్ణవై నీవు మాకోసమై మర్త్యలోకమ్మునన్ బుట్టి యీ మానవస్త్రీలకున్ మేటి స్త్రీధర్మమున్ నేర్పగా నెంచి కష్టమ్ము లెన్నింటినో పొందినావమ్మ! దుష్టాత్ముడౌ రావణుండట్లు బంధించి దూషింపగా పంక్తిమాసంబు లేరీతి నీవుంటివో? జీర్ణమైనట్టి యా పట్టుపుట్టమ్మునే గట్టి కూర్చుంటివా? నీదు కేశమ్ములన్ పాశరూపమ్ముగా జేయుచున్ నీ మెడన్ జుట్టి ప్రాణమ్ము త్యాగమ్ము సేయంగ యోచించితే తల్లి! యావేళ నీవెంతగానో మనోక్షోభనే పొంది యల్లాడినావమ్మ, ఆ యాంజనేయుండు నీజాడకై వచ్చి నిన్జూచి యో మాత నీ యాన నే నీక్షణమ్మే హవిస్సున్ పవిత్రమ్ముగా మోయు నా యగ్నిహోత్రుం బలెన్ నిన్ను గొంపోయి యా రాము సాన్నిధ్యమున్ జేర్చెదన్ రమ్మటంచన్న వద్దంచు వారించి స్త్రీధర్మమున్ నీవు పాటించినావే, దయారాశి, నీ వెట్టి రూపమ్ములన్ స్వీకరింపంగ నొప్పున్, భవద్భక్తులైనట్టి మా కోరికన్ నీవు మన్నించి సీతాస్వరూపమ్ము నింకెప్పుడున్ బూని కష్టమ్ములన్ బొందవద్దమ్మ, యా గాథలన్ మేము చూడంగలేమమ్మ, మమ్మందరన్ శోకవారాశిలో ముంచవద్దమ్మ, నీ పాదపద్మమ్ములే మాకు దిక్కమ్మ, మా ప్రార్థనల్ నీవు మన్నింపవమ్మా, రమాదేవి, పద్మాలయా, మాధవీ, సింధుకన్యా, నమస్తే నమస్తే నమస్తే నమః
    ................................ కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి
  21. రవి గారి పద్యం మంజుల మనోజ్ఞంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  22. మాస్టరుగారూ!కరుణ, భక్తి రసాత్మకమైన సీతామాత దండకాన్ని రచించి మాకు పఠించే అదృష్టాన్ని కలుగజేసినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ,
    సీతాదండకం మహత్తరంగా ఉన్నది.
    ఐతే నేను చూసింది,ప్రస్తావించిందీ రాముని దండకం గురించి.

    రిప్లయితొలగించండి
  24. రవీజీ !
    రమ్యమైన పూరణ !
    ధన్యవాదములు !

    శంకరార్యా !
    చక్కని దండకం !
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  25. ఆసక్తి కలవారికి ఈ లంకె.
    http://indrachaapam.blogspot.com/2011/04/blog-post_14.html

    పెద్దలు, శంకరయ్య గారు మన్నించాలి. మీ బ్లాగును ఇలా వాడుకున్నందుకు.

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందరి పద్యాలు రమణీయంగా ఉన్నాయి .గురువు గారి దండకం చాలా బాగుంది

    విల్ ద్రుంచిన రఘు రాముకు ,
    పిల్ పించిన మునుల సాక్షి, పెద్దల సాక్షిన్ ,
    కిల్ కిల పల్కుల సీతకు
    మిల్ మిల మెరియంగ పెండ్లి మిథిలన జరిగెన్ !

    రిప్లయితొలగించండి
  27. "కిల్ కిల పల్కుల సీతకు
    మిల్ మిల మెరియంగ పెండ్లి మిథిలన జరిగెన్ !"
    మంద పీతాంబార్ గారూ పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  28. పద్యం పోస్ట్ చేసిన తర్వాత ప్రాస తప్పిందనే సందేహం కలిగింది మిత్రులెవరైనా స్పందించండి.

    రిప్లయితొలగించండి
  29. పీతాంబర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    అయితే ప్రాస తప్పిన విషయాన్ని నేను ప్రస్తావించే లోగా మీరే గుర్తించారు. ఏం ఫరవా లేదు ... కొద్దిగా సవరిస్తే నిర్దోషం .....
    విలు ద్రుంచిన రఘు రాముని
    పిలిపించిన మునుల సాక్షి, పెద్దల సాక్షిన్ ,
    కిలకిల పల్కుల సీతకు
    మిలమిల మెరియంగ పెండ్లి మిథిలను జరిగెన్ !

    రిప్లయితొలగించండి