"కల" అనే పదాన్ని
"స్వప్నం" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
త్రిజటాస్వప్న వృత్తాంతాన్ని
తెలుపుతూ మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
"స్వప్నం" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
త్రిజటాస్వప్న వృత్తాంతాన్ని
తెలుపుతూ మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
త్రిజట జానకి తో పలికిన పలుకులు....
రిప్లయితొలగించండికలవిక రోజులు మంచివి;
కలకలములు రేగి లంక గాలును,రామున్
గలవగ వచ్చును త్వరలో,
కలతను వీడుమ!భవిష్య కాలము నీదే!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
"కలవగ" అనేదానికి "కలువగ" సాధురూపం అనుకుంటాను.
"పతితో, కలయిక కల్గును ... " అంటే ?
రావణుని ఆఙ్ఞ చొప్పున రాక్షస స్త్రీల సమూహము
రిప్లయితొలగించండిసీతను వేధించ సాగిరి !
సీత మనసంత వికలమై ప్రాణ త్యాగము చేయ
నిశ్చయించు కొనెను !
ఆ సమయమున త్రిజట రావణాది రాక్షసులెల్లరూ
మడియుదురని నాకొక స్వప్నము వచ్చినది !
కావున సీతను వేధింపక ఆమెను శరణు వేడుడు
అని చెప్పినది !
అయ్యా ! ఇదీ సంగతి !
01)
___________________________________
వికల మయ్యెను మనసంత - వెలది కపుడు !
త్రిజట మూకల కెల్లర - తెలిపె నిట్లు
సకల రాక్షసుల్ మడియును- సత్య మనుచు
శంకలను మాని సీతను - శరణు గొనుడు !
___________________________________
మాస్టరు గారూ! సరియగు సవరణ సూచించి నందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో....
కలవిక రోజులు మంచివి;
కలకలములు రేగి లంక గాలును,పతితో
కలయిక గల్గును త్వరలో,
కలతను వీడుమ! భవిష్య కాలము నీదే!
సీతతో త్రిజట :
రిప్లయితొలగించండి02)
___________________________________
శంకలను వీడుమిక యని
లంకా పురి కక వికలము - రావణ సహితం !
లంకకు నాకలనము గొని
లంకేశుని సకలము గొను - రాముడు సీతా !
___________________________________
ఆకలనము = సమూహము = కోతుల దండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసీతతో త్రిజట :
రిప్లయితొలగించండి03)
___________________________________
శోకము కలతయు వలదులె
మూకల గొని రాముడంత - మోదము గూర్చున్ !
రాకాసుల కలచి , యణచి
నీ కలతను దీర్చి; గొనును - నిత్యుడు సుమ్మీ !
___________________________________
సుందరకాండలోని 27 వ సర్గ (త్రిజటా స్వప్న వృత్తాంతము) లోనుంచి దత్తపది ఇచ్చినందుకు ఆనందించాను.
రిప్లయితొలగించండిశాస్త్రి గారూ, వసంత మహోదయా! మీ పూరణలూ బాగున్నాయి. ఇద్దరూ కలిపి మంచి "కల" పదాలన్నీ లాగేశారు (నవ్వుతూ)!.
వసంత మహోదయా! "ల" కు "ర" కు యతి కలవదు, నాకు తెలిసిన౦తవరకు. అట్లాగే "సహితం" అని సున్నతో పాదం ముగించటం నియమ బద్ధం కాదనుకొంటా. శంకరయ్య మాష్టారు ఏమంటారో చూద్దాం.
సీతతో త్రిజట :
రిప్లయితొలగించండి04)
___________________________________
సంకల్పము నెఱవేరును
సంకలనము నొందెదీవు - సత్యము సుమతీ !
కుంక లగు లంక నందరు
సంకెలలు కలగు సతతము - జలధిజ వినుమా !
___________________________________
సంకలనము = కలయిక (రామునితో)
కుంక = విధవ
కలవరపడ బోకు,లలన
రిప్లయితొలగించండికలతలు నీకున్ తొలుగును, కలకలముల్ లం
కల బుట్టున్ పలు, కాలు,స
కలమును,కుల కాంతలేడ్చు కాలము వచ్చున్!
చంద్ర శేఖరా !
రిప్లయితొలగించండిధన్య వాదములు !
నాకు తెలిసినంత వరకూ
"ర , ఱ ,ల , ళ " లకు యతి మైత్రి పాటించ వచ్చు !
8 వ గణం "స " గాని " గా " గాని ఉండాలి !
" సహితం " కూడ దనుకొంటే " సహితమ్ " అంటే సరి గదా !
ర, ఱ యతి మైత్రి చెల్లెడి ఒక వర్గము, అలాగే ల, ళ యతి మైత్రి చెల్లె ఇంకొక వర్గము. నాలుగు అక్షరాలూ కలిప ఒక వర్గము కాదని నా భావన. చూద్దాం మాస్తారేమంటారో.
రిప్లయితొలగించండిత్రిజట రాక్షస స్త్రీలతో :
రిప్లయితొలగించండి05)
___________________________________
కలకంఠి హింస కూడదు !
కలహంసల రథము నెక్కి - కమలాక్షి జనున్ !
కలకలము మాను డికయని
కలశస్తనులను కసిరెను - కాంత త్రిజటయే !
___________________________________
కలకలము = గోల = అల్లరి
వికలముఁజెందినిట్లుఁగడువేదనఁబొందుటపాడిగాదుమా
రిప్లయితొలగించండిసకలశుభంబులున్కలుగుసైఁపగఁజాలనటంచుబేల,నీ
వుకలవరమ్ముచెందకుము,పూవు వలెన్సుకుమారివీవుభా
మ.కలడురాముడంచుననెమైత్రినిసీతనుగాంచి జాలితో
చంద్రశేఖరా !
రిప్లయితొలగించండిఅది ప్రాసకు సంబందించినంత వరకూ !
యతికి నాలుగూ ఒకటే వర్గము !
వ్రతమది కమ్మనౌ కలవరమ్మది. రావణు కాలుఁ జేర్చె,నా
రిప్లయితొలగించండిశ్రిత ప్రియుఁడైన యా సకల శ్రేయకరుండగు సర్వ వ్యాపియౌ
నుత విధి వశ్యుఁడౌ, కలచు నొవ్వు దమించు రఘూద్వహుండు.పూ
జ్యతను సతీ! యికన్ కలదు సౌఖ్యము భూమిజ! కాంచుమింకపై.
మది కమ్మనౌ కలవర
మ్మది. రావణు కాలుఁ జేర్చె, నాశ్రిత ప్రియుఁడై
విధి వశ్యుఁడౌ, కలచు నొ
వ్వు దమించు రఘూద్వహుండు పూజ్యతను సతీ!
కలవరమ్మది. రావణు కాలుఁ జేర్చె,
సకల శ్రేయకరుండగు సర్వ వ్యాపి,
కలచు నొవ్వు దమించు రఘూద్వహుండు.
కలదు సౌఖ్యము భూమిజ! కాంచుమింక!
చంద్రశేఖర్ గారూ, ఈ లింకు చూడండి.
రిప్లయితొలగించండిhttp://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF
ర - ల యతిమైత్రి .......
రిప్లయితొలగించండిఛందశ్శాస్త్రంలో లాక్షణికులు "అభేద యతి"ని చెప్పినారు. "వబయోరభేదః", "లడయోరభేదః", "రలయోరభేదః" అని చెప్పడం వల్ల వ-బలకు, ల-ళ-డలకు, ర-లలకు యతిమైత్రి చెప్పబడింది.
ర-ల యతిమైత్రిని అప్పకవి, అనంతుడు, చిత్రకవి పెద్దన, కూచిమంచి తిమ్మకవి ఒప్పుకోలేదు. కాని లింగమగుంట తిమ్మన, రమణకవి, కస్తూరి రంగకవి, వేంకటరాయకవి ఒప్పుకున్నారు.
ర-ల యతికి పూర్వకవుల ప్రయోగాలు ....
1. శా. లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతురే (శ్రీనాథుని కాశీఖండము - 6.210)
2. సీ. రాజకుమారుఁ డే*లంగఁగలఁడు (శ్రీనాథుని మరుత్తరాట్చరిత్రము)
3. కం. లక్ష్మేక్షు రసాబ్ది సుట్టి*రా విలసిల్లున్ (భాగవతము - 5 - 2.61)
4. కం. వి | లీనత నేపారు చంద్ర*రేఖయుఁ బోలెన్ (భాస్కర రామాయణము - యుద్ధ. 2323)
5. కం. రభసంబున నతని శరము*లను గడు నొంచెన్ (భారతము - ద్రోణ. 2.73)
ఏతావాతా నేను చెప్పే దేమంటే ర-ల లకు యతిమైత్రి కూర్చవచ్చు. (దీనిని కొందరు పండిత మిత్రులు విభేదించవచ్చు)
కలడని నీయెడ, వీరము
రిప్లయితొలగించండికలవాడని,పోరునందుకలికిని గెలవన్
గలడని నేనే నమ్మితి
కలవరమేలానదోనికభవితఁగనుమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిత్రిజట జానకి తో పలికిన పలుకులు....
రిప్లయితొలగించండిఉత్సాహ:-
కలత వలదు నెలత నీకు, ఖరకర కులజుండు నీ
తలపు తెలిసి శరధి దాటి తరలి వచ్చి కలయు నీ
వలపు ఱేడు కలహమందు వైరి తతుల గూల్చు తో
కల గమి తన వెంట రాగ కయ్యమునకు జానకీ!!
మాస్టారూ, సమగ్ర వివరణకు ధన్యవాదాలు. అప్పకవీయం నా ఆధారం. మీవివరణ వల్ల ఇంకొంచెం వెసులుబాటు కలిగింది. నా పూరణ:
రిప్లయితొలగించండికలభ సుందర దంతపు కాంతులీను
వేయి కలహంస లూన్చిన వెలుఁగు జిమ్ము
శిబికల చని శ్రీరాముడు సిరులొలికెడి
శుభ్ర సీతను కలసిన శుభముఁ గంటి.
చింతా వారి పూరణలు అనుపమానం, అద్భుతం. గర్భిత ఉపజాతి పద్యరచన మీ ముద్ర. నమోవాక్కాలు. మీ పూరణల ద్వారా నేను యెన్నో మెరుగులు దిద్దుకొ౦టున్నాను.
రిప్లయితొలగించండిధన్యవాదాలతో,
బుధజన విధేయుడు,
చంద్రశేఖర్
చక్కని పూరణలు చేసిన కవిమిత్రులందరకూ అభినందనలు.
రిప్లయితొలగించండికిశోర్ గారి ధార సరేసరి.
మందాకిని గారి ధాటి పెరుగుచున్నది.
చింతా వారి 3 ఇన్ 1 పద్యం మేటియైనది.
చంద్ర శెఖర్ గారి పూరణ సొగసైనది.
జీ యస్ యన్ గారి పూరణ 'క్రొత్త ఉత్సాహా'నిచ్చింది.
పీతాంబర్ గారి పూరణ కలకలాన్ని సృష్టించింది.
త్రిజట రాక్షస స్త్రీలతో :
రిప్లయితొలగించండి06)
___________________________________
*ద్వి*
కలకల నాపుడో- కలుషాత్ములార
కలకంఠి కంటను - కన్నీరు వలదు !
*ద్వి*
ధైర్యమ్ము కలవాడు - ధర్మాత్ము డతడు
కార్యమ్ము నెఱవేర్చి - కలకంఠి గొనును !
___________________________________
కలక = నింద = ఆక్షేపము
కలహంసలు కోరెడినడ
రిప్లయితొలగించండికల కలికిరొ!నేడుకంటిఁగరుణామూర్తిన్;
కలహమునందుగెలిచినీ
కలతలుదీర్చునకళంక ఘనకీర్తునిగాన్.
శాస్త్రిగారు,
ధన్యవాదాలు.మీరన్నట్టు అందరి పూరణలూ అలరించాయి. ఎంతైనా శీఘ్రంగా పూరణ చేస్తున్నది ఎక్కువసార్లు మీరేననిపిస్తున్నది.
కలదు శుభంబు జానకికి, గాంచితి స్వప్నమునందు, రామునిన్
రిప్లయితొలగించండిగలసి యయోధ్య కేగినది, గాడిద నెక్కెను రాజు రావణుం-
డలదుక తైలమున్, వికలమై చన లంకను గాల్చె కోతి శం-
కల విడనాడి మైథిలిని గారవ మొప్పగ చూడు డందరున్.
కవిమిత్రులందరి పూరణలద్వారా పలుసార్లు త్రిజటా స్వప్న వృత్తాంతం చదివిన ఫలం అందరికి కలగాలని శ్రీరాముని ప్రార్ధిస్తూ,ఫలశ్రుతి:
రిప్లయితొలగించండిశ్రుత్వాతు త్రిజటా స్వప్నం దుస్స్వప్నో నశ్యతి ధ్రువమ్.
తా.త్రిజటా స్వప్న వృత్తాంతము విన్నచో దుస్వప్న దోషము తప్పక నశించును.
మిత్రులందరి పూరణలూ
రిప్లయితొలగించండిముచ్చటగా నున్నవి !
ఆర్యా! చంద్ర శేఖరా! ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ!సహృదయులైన మీ ప్రశంసలను ఆశీస్సులుగా స్వీకరిస్తున్నాను. మీకు నా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఇట్లు
భవదీయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండినిన్న చితా వారి ఇంటిలో సమావేశమైన కవిమిత్రు లందరూ మీ పద్యధారను ప్రశంచించారు. గన్నవరపు నరసింహ మూర్తి గారు మిమంల్ని కలవాలనుకొని మీకు మెయిల పెట్టారట. మీనుండి ప్రతిస్పందన రాలేదని బాధ పడ్డారు.
మీ ఆరు పూరణలూ ప్రశతంగా ఉండి అలరించాయి. అభినందనలు.
మొదటి పూరణలో "మూకల కెల్లర" అన్నది "రాక్షసాంగనలకు" అనీ, "మడియును" అనేది "చత్తురు" అంటే బాగుంటుందని నా సలహా.
రెండవ పూరణలో "లంకా పురి కక వికలము - రావణ సహితం " అనేది "లంక కకావికల మగును రావణు తోడన్" అని ఉంటే సరి.
మూడవ పూరణలో "నిత్యుడు" అన్నదాన్ని "నిజమిది" అంటే?
నాల్గవ పూరణలో "జలధిజ" - "జానకి" అయితే?
ఐదవపూరణలో "కలశస్తనులా"? బాగుంది.
ఇక ఆరవ పూరణ .... నా బ్లాగులో మొట్టమొదట్ ద్విపద వ్రాసిన ఘనత దక్కించుకున్నారు.
వసంత కిశోరా! ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
బహు బాగున్నవి మీ పూరణలు. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
మీ ఉత్సాహ పద్యం నాలో కడుంగడు ఉత్సాహాన్ని నింపింది. ధన్యవాదాలు.
"తోకల గమి" ప్రయోగం భేష్!
చంద్ర శేఖర్ గారూ,
అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ పూరణ శ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు.
శంకరార్యా !
రిప్లయితొలగించండిమీకూ , కవిమిత్రులందరికీ
కృతఙ్ఞతలు !
ఇందరు కవిమిత్రుల ప్రశంస లందుకోవడం
నా అదృష్టం !
శంకరుల దయ
శంకరాభరణం బ్లాగు పుణ్యమే
దానికి కారణం !
మీ చక్కని సవరణలకు
ధన్యవాదములు !
కాని "మూకల"ను తొలగిస్తే
"కల" తప్పుతుంది గదా !
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండినిన్నటి మీ ఆత్మీయ ఆతిథ్యానికి ధన్యవాదాలు. మీ ఇంట్లో కవిమిత్రులతో సమావేశం నాకు ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగించింది. నాపై మీ ప్రేమానురాగాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
ఇక మీ గర్భకవితాప్రాశస్త్యాన్ని వ్యాఖ్యానించడానికి నేనెంతవాణ్ణి. మీ పద్యం నా శంకరాభరణానికే అభరణ మయింది. మరోసారి ధన్యవాదాలు.
వసంత కిశోరా,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
"మూకల" విషయంలో మీరే కరెక్టు.
గురువు గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమాన్యులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి కవిత మీరన్నట్లు బ్లాగుకే ఆభరణం.
వసంత మహోదయా అభినందనలు.
అంతర్జాలం దూర దూరాన ఉన్న వారినెందరినో దగ్గరికి చేరుస్తోంది.
భావ సారూప్యం గల వారి మైత్రి చిరకాలం వర్ధిల్లుతుంది.
శంకరాభరణ కవి మిత్రులు భౌతికంగా కూడ కలసి ఆనందాన్ని పంచుకోవడం నిజంగా అదృష్టం.
చంద్ర శేఖరా మీ పూరణ మహర్షి వాల్మీకి శ్లోకానికి ఇంచుమించు సరిసాటి.
తే. గీ.
రిప్లయితొలగించండికోతిమూ(కల) కధి నాయకుండు తాను
పీడ(కల)ల పోగొట్టు కపీశ్వరుండు
స(కల )శాస్త్రాలు నేర్చిన స్వామి యతడు
(కల)డు కలడయ్య ప్రతి కవి కలములోన !!