సప్త రుషి మండలాన్ని సందర్శింప జేసిన శాస్త్రిగారి పూరణ,మిస్సన్న గారి రెండు పూరణలు, ముఖ్యంగా ఏకాక్షర పూరణ నేను లోగడ చేసిన పూరణను గుర్తుకు జేసింది ,జిఎస్ యెన్ హెచ్చరిక పూరణ లు బాగున్నాయి .మీకు అభినందనలు
నా పూరణలో మూడవ పాదంలో చిన్న టైపాటు దొర్లింది , "దునుమును నీవేడున్నను ''సరియైనది .
మిస్సన్న గారూ, ప్రశంసనీయమైన పూరణలు. అభినందనలు. పద్యంలో "కనులుండియు", "జనులే" అంటే ఇంకా బాగుంటుంది కదా. మీ ఏకాక్షర పూరణ చాలా బాగుంది. కాకపోతే పూర్తిగా అర్థం చేసికొనలేని మంద బుద్ధిని. కాస్తా వివరిస్తారా?
హనుమచ్ఛాస్త్రి గారూ, అద్భుతమైన పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ, మంచి పూరణ. అభినందనలు. సవరించిన తర్వాత కూడా గణదోషం ఏర్పడింది. పాదాద్యక్షరం గురు వయింది. పైన లఘువు లున్నాయి. "తన నరములు జివ్వు మనుట తధ్యము కుమతీ!" అనడమే సబబు.
పీతంబర్ గారూ, ప్రశస్తమైన పూరణ. అభినందనలు. "మిమ్ము, జగదీశ్వరుడే దునుమును మీ రేడున్నను" అంటే ఇంకా బాగుంటుందేమో?
సత్యనారాయణ గారూ, రాజకీయాలను కడిగేసారు. మంచి పూరణ. అభినందనలు.
మందాకిని గారూ, "కృష్ణప్రమ"ను చక్కగా ఆవిష్కరించారు. పూరణ బాగుంది. అభినందనలు. "తననూ నేఁ ప్రే మింతును" లో "నూ" అభ్యంతరం. "మనసారగ ప్రేమితును" అందాం. రెండవ పూరణ కూడా బాగుంది. కాని "అనుదిన మూనే గొల్చితి" అన్నప్పుడు కూడా "మూ" అభ్యంతరమే. "అనుదినమును నే గొల్చితి!" అంటే సరి.
అనగా అనగా ఒకనాడు ఒక రాజు మీద అలిగిన అష్ట లక్ష్ములు ఒక్కొక్కరూ ఆ రాజుతో చెప్పి వెళ్ళిపో సాగారట ! "అలాగే తల్లీ నీ దయ " అని చెప్పి ఏడుగురిని సాగనంపిన
ఆ నృపుడు , దైర్య లక్ష్మిని మాత్రం " తల్లీ నీవున్నావన్న ధైర్యం తోనే అందరినీ వదలు కున్నాను ! నువ్వు కూడా వెళ్ళి పోతే ఎలాగు "! అని , ఆమెను ప్రార్థించి వెళ్ళకుండా ఆపుకున్నాడట ! ఆమె సంతోషించి వెనుతిరిగి లోనికి వెళ్ళిందట !
ఆమె వెనుకే మిగిలిన ఏడుగురూ కూడా తిరిగి వచ్చారట ! వెళ్ళి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం విస్తుబోయి చూస్తున్న భూపాలునితో " మహారాజా దైర్య లక్ష్మి ఉన్న చోటే మేమూ ఉంటాం ! ఆమెను విడచి మేము కూడా ఉండలేము ! అందుకే తిరిగి వచ్చాము " అని చెప్పి అష్ట లక్ష్ములూ లోనికి వెళ్ళి పోయారట ! అదీ సంగతి !
కన్ను గానని కామము తో ఒళ్ళు తెలియని మోహము తో విరటుని కొలువు కూటం వరకూ ద్రౌపది వెంటబడి వేధించిన కీచకుని బారినుండి రక్షించు వారు లేరా యని సభాసదులను ప్రార్థించిన సందర్భం :
నా మొదటి పూరణకు ప్రేరణ ఈ పద్యం ! ఇది అన్నగారు సావిత్రి నటించిన "దేవత " సినిమా లోనిది ! చివరి రెండు పాదాలూ youtube వీడియో లో cut అయిపోయినవి ! గాన గంధర్వుడు ఘంటసాల వారు ఎంతో ఆర్ద్రత తో పాడారు ! ఎంత అంటే --ఆకాశ మంత ! చెప్పలేం వినాలి మరి ! వింటేనే తెలుస్తుంది ! _______________________________________
*సీ* జగమెల్ల పరికించు - చల్లని జాబిల్లి సుదతి సీతను నీవు - చూడ లేద !
ప్రతి చరా చరముల - పయనించు చిరు గాలి జానకి నెట నైన - కాన లేద
వసంత్ కిశోర్ గారూ, మీ ఐదు పూరణలూ పంచరత్నాలై శోభిస్తున్నాయి. మొదటి పూరణలో రాముడు, రెండవ పూరణలో రాధ, నాల్గవ పూరణలో ద్రౌపది ప్రస్తావన బాగుంది. మూడవ పూరణ అద్భుతంగా ఉంది. ఇక ఐదవ పూరణ ఉత్తమోత్తమం. అందులో "నను" చేర్చిన విధానం బాగుంది. వేసుకొండి "ఐదు వీరతాళ్ళు" మూడవ పూరణకు మూడు, ఐదవ పూరణకు రెండు .......
గురువుగారూ భయ పడ్డంతా అయింది. ఏది జరగ కూడదను కొన్నానో అదే జరింగింది. క్లిష్టమైన పద్యాలకు అర్థం చెప్పమంటే ఎలాగండీ (నవ్వుతూ). మీరే మంద బుద్ధులైతే మాలాటి మందమంద బుద్ధుల గతేంటి? ఏదో బానే ఉంది కదా అని పద్యం వ్రాసేశా నంతే............
అయినా నా భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
నాకూ, నానిగాడికీ, నైనాకూ, నీనాకూ నానో కారంటే చాలా ఇష్టమై పోయింది. వాళ్ళకా విషయం చెప్తూ నానో మోజులో పడ్డారని నేను మిమ్మల్ని ఏమీ అనను. నన్నూ, మిమ్మల్నీ కూడా నానో పడేసింది అని చెప్పాను అంతే. సింపుల్.
కృష్ణకు నిండు సభలో అవమానం జరిగే సందర్భంలో
రిప్లయితొలగించండిపెద్దల నుద్దేశించి వికర్ణు డిలా అన్నాడు:
వినుడీ ద్రౌపది కెగ్గును
కనులుండీ చూడకున్న కాదిది ధర్మం-
బనరే రేపీ జనులున్
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
(ఆకాశంలో సప్తర్షి మండలం అమరిక గాలిపటం లా అనిప్పిస్తుంది)
రిప్లయితొలగించండివినువీధుల వెదకితి మిము
కనుగొన;సప్తర్షులార! గాలి పటములా
ఘనముగ నుండగ జూచితి
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!
నిను నే నననో నానీ!
రిప్లయితొలగించండినిను నే ననఁ నైన! నిన్ను నననే నీనా!
నను నూనెను నానో, నిను,
నిను, నిను, నిను, నిన్ను, నిన్ను, నిన్నును నిన్నున్.
(గతంలో ఒక సమస్యకు పీతాంబర్ గారనుకొంటా యిలాంటి పూరణ చేశారు.
ఆ స్ఫూర్తి తో. ఏమైనా అర్థం అవుతోందంటారా?)
ననునను ననున న్నన గను,
రిప్లయితొలగించండినిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
యని కులుకులాడి పిలచిన,
తన్నరములు జివ్వు మనుట తధ్యము కుమతీ!
నాల్గవ పాదం సవరణతో:
రిప్లయితొలగించండిననునను ననున న్నన గను,
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
యని కులుకులాడి పిలచిన,
నానరములు జివ్వు మనుట నరకము కుమతీ!
ధనమే పరమావదిగా
రిప్లయితొలగించండిజనులను హింసించ, నిన్ను, జగదీశ్వరుడే
దునుమును నేవేడున్నను
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నుని నిన్నున్!
హనుమచ్ఛాస్త్రి గారి సప్తర్షి పూరణ లెక్కకు సరిగ్గాసరిపోయింది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనతా! జగనా! కిరణా!
రిప్లయితొలగించండిఘనమగు బాబూ! తెరాస! కమ్యూనిస్టా!
కొణిదల! వదలరు జనులిక
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!
మిస్సన్న గారూ!చంద్రశేఖర్ గారూ!పీతాంబర్ గారూ!జీ యస్ యన్ గారూ! మీ మీ పూరణలు బాగున్నవి.
రిప్లయితొలగించండిమిము మిము మిమ్ము మిమ్ము ... అభినందించుచున్నాను.
గణపతి! కరుణా సింధో!
రిప్లయితొలగించండిననుగనవా! కావఁరాననకుమా! మరువక
ననుదిన మూనే గొల్చితి!
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
గణదోషము ఏదో ఉన్నట్టుంది. కానీ తెలియటం లేదు.
సప్త రుషి మండలాన్ని సందర్శింప జేసిన శాస్త్రిగారి పూరణ,మిస్సన్న గారి రెండు పూరణలు, ముఖ్యంగా ఏకాక్షర పూరణ నేను లోగడ చేసిన పూరణను గుర్తుకు జేసింది ,జిఎస్ యెన్ హెచ్చరిక పూరణ లు బాగున్నాయి .మీకు అభినందనలు
రిప్లయితొలగించండినా పూరణలో మూడవ పాదంలో చిన్న టైపాటు దొర్లింది , "దునుమును నీవేడున్నను ''సరియైనది .
మందాకిని గారు,
రిప్లయితొలగించండికంద పద్యంలో 2 మరియు 4 పాదాలు గురువుతో అంతమవ్వాలి. అనగా "సగణము" కాని "గగ" కాని రావాలి. మీ పద్యములో రెండవ పాదములో, ఆ నియమము తప్పినది.
కనిఁసతు లయలుకఁ కృష్ణుఁడు
రిప్లయితొలగించండివినుమని పలికెన్, "మనంబుఁ వెలితిని విడుమా!
తననూ నేఁ ప్రే మింతును
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
ధన్యవాదాలు సత్యనారాయణ గారూ!
ఇప్పుడు సరిదిద్దాను.
గణపతి! కరుణా సింధో!
ననుగనవా! కావఁరాననకుమా! దేవా!
ననుదిన మూనే గొల్చితి!
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిప్రశంసనీయమైన పూరణలు. అభినందనలు.
పద్యంలో "కనులుండియు", "జనులే" అంటే ఇంకా బాగుంటుంది కదా.
మీ ఏకాక్షర పూరణ చాలా బాగుంది. కాకపోతే పూర్తిగా అర్థం చేసికొనలేని మంద బుద్ధిని. కాస్తా వివరిస్తారా?
హనుమచ్ఛాస్త్రి గారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
మంచి పూరణ. అభినందనలు.
సవరించిన తర్వాత కూడా గణదోషం ఏర్పడింది. పాదాద్యక్షరం గురు వయింది. పైన లఘువు లున్నాయి.
"తన నరములు జివ్వు మనుట తధ్యము కుమతీ!" అనడమే సబబు.
పీతంబర్ గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
"మిమ్ము, జగదీశ్వరుడే
దునుమును మీ రేడున్నను" అంటే ఇంకా బాగుంటుందేమో?
సత్యనారాయణ గారూ,
రాజకీయాలను కడిగేసారు. మంచి పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
"కృష్ణప్రమ"ను చక్కగా ఆవిష్కరించారు. పూరణ బాగుంది. అభినందనలు.
"తననూ నేఁ ప్రే మింతును" లో "నూ" అభ్యంతరం. "మనసారగ ప్రేమితును" అందాం.
రెండవ పూరణ కూడా బాగుంది. కాని "అనుదిన మూనే గొల్చితి" అన్నప్పుడు కూడా "మూ" అభ్యంతరమే. "అనుదినమును నే గొల్చితి!" అంటే సరి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
సీత జాడ నరయక
"హా సీతా " యని పిచ్చి వానివలె
పరితపించుచూ అడవిలో
శ్రీరాముడు :
01)
_____________________________________
తనసతి జాడను కనుగొన
కనుపించిన పక్షి , జంతు - గణముల నడిగెన్ !
వనమున చెట్టును పుట్టను
నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
_____________________________________
పొదల మాటున దాగిన
రిప్లయితొలగించండివెన్న దొంగను
వెతుకుతూ రాధ :
02)
______________________________________
కనిపించని గోపాలుని
వనమున వృక్షముల కెల్ల - ప్రణతిడి యడిగెన్ !
వినయము , యమునా తటినే
నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
______________________________________
*** అష్ట లక్ష్ముల కథ ***
రిప్లయితొలగించండిఅనగా అనగా ఒకనాడు
ఒక రాజు మీద అలిగిన అష్ట లక్ష్ములు
ఒక్కొక్కరూ ఆ రాజుతో చెప్పి వెళ్ళిపో
సాగారట !
"అలాగే తల్లీ నీ దయ " అని చెప్పి
ఏడుగురిని సాగనంపిన
ఆ నృపుడు , దైర్య లక్ష్మిని మాత్రం
" తల్లీ నీవున్నావన్న ధైర్యం తోనే అందరినీ
వదలు కున్నాను ! నువ్వు కూడా వెళ్ళి పోతే ఎలాగు "!
అని , ఆమెను ప్రార్థించి వెళ్ళకుండా ఆపుకున్నాడట !
ఆమె సంతోషించి వెనుతిరిగి లోనికి వెళ్ళిందట !
ఆమె వెనుకే మిగిలిన ఏడుగురూ కూడా తిరిగి వచ్చారట !
వెళ్ళి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం
విస్తుబోయి చూస్తున్న భూపాలునితో
" మహారాజా దైర్య లక్ష్మి ఉన్న చోటే మేమూ ఉంటాం !
ఆమెను విడచి మేము కూడా ఉండలేము !
అందుకే తిరిగి వచ్చాము " అని చెప్పి
అష్ట లక్ష్ములూ లోనికి వెళ్ళి పోయారట !
అదీ సంగతి !
03)
________________________________________
తనకిక ధైర్యమె దిక్కని
నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
వినయాంజలి తోడ విడిన
మనుజేంద్రుని వెంట మీరు - మరలిరి శుభులై !
________________________________________
కన్ను గానని కామము తో
రిప్లయితొలగించండిఒళ్ళు తెలియని మోహము తో
విరటుని కొలువు కూటం వరకూ
ద్రౌపది వెంటబడి వేధించిన కీచకుని
బారినుండి రక్షించు వారు లేరా యని
సభాసదులను ప్రార్థించిన సందర్భం :
04)
_________________________________________
కను గానని కామము తో
మనసాయెను నిను గని యని - మదవతి దరుమన్ !
వినుతించె కృష్ణ యంతట
నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
_________________________________________
05)
రిప్లయితొలగించండి_________________________________________
ఘనతర మగు కవనముతో
మన వాడగు గరికి పాటి - మనసులు దోచెన్ !
తన యవధానంబున ,నను
నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
_________________________________________
నా మొదటి పూరణకు ప్రేరణ ఈ పద్యం !
రిప్లయితొలగించండిఇది అన్నగారు సావిత్రి నటించిన "దేవత " సినిమా లోనిది !
చివరి రెండు పాదాలూ youtube వీడియో లో cut అయిపోయినవి !
గాన గంధర్వుడు ఘంటసాల వారు ఎంతో ఆర్ద్రత తో పాడారు !
ఎంత అంటే --ఆకాశ మంత ! చెప్పలేం వినాలి మరి !
వింటేనే తెలుస్తుంది !
_______________________________________
*సీ*
జగమెల్ల పరికించు - చల్లని జాబిల్లి
సుదతి సీతను నీవు - చూడ లేద !
ప్రతి చరా చరముల - పయనించు చిరు గాలి
జానకి నెట నైన - కాన లేద
కరుణతో విశ్వమ్ము - భరియించు భూమాత
చెలి జాడ నీవై న - తెలుపరాద
తరులార గిరులార - మెరయు తారక లార
పడతి ఏమయ్యెనో - పలుక రాద
తే*గీ
ఏది వైదేహి ? జానకి - ఏది ? సీత
లేనిదే, రాముడే లేడూ - లేడ టంచు
[కరకు గుండెలు **** - మారు మోగ
ఎలుగెత్తి పిలిచె నా రాఘవుండు
హా సీతా ---------హా సీతా--------]
నా పూరణలు .......
రిప్లయితొలగించండి(1)
(కౌరవసభలో శ్రీకృష్ణుఁని హెచ్చరిక .....)
వినుఁడు సుయోధన దుశ్శా
సన కర్ణా ధ్యఘవిచార శాలుర మిమ్మున్
ఘన పాండవాగ్ని కాల్చును
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
(2)
చని క్రీడా మైదానం
బున నాడెడివారి నెల్లఁ బొడగని యంటిన్
"మన `కోచు` పిలిచె మీలో
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్."
మాస్టరు గారూ!ధన్యవాదములు. మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ఐదు పూరణలూ పంచరత్నాలై శోభిస్తున్నాయి.
మొదటి పూరణలో రాముడు, రెండవ పూరణలో రాధ, నాల్గవ పూరణలో ద్రౌపది ప్రస్తావన బాగుంది.
మూడవ పూరణ అద్భుతంగా ఉంది.
ఇక ఐదవ పూరణ ఉత్తమోత్తమం. అందులో "నను" చేర్చిన విధానం బాగుంది.
వేసుకొండి "ఐదు వీరతాళ్ళు" మూడవ పూరణకు మూడు, ఐదవ పూరణకు రెండు .......
శంకరార్యా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
మీ రెండు పూరణలూ బహు చక్కగా నున్నవి !
వసంత మహోదయా మీ పూరణముల న్నియును రత్నముల వలె ప్రకాశించు చున్నవి.
రిప్లయితొలగించండిగురువుగారూ భయ పడ్డంతా అయింది.
రిప్లయితొలగించండిఏది జరగ కూడదను కొన్నానో అదే జరింగింది.
క్లిష్టమైన పద్యాలకు అర్థం చెప్పమంటే ఎలాగండీ (నవ్వుతూ).
మీరే మంద బుద్ధులైతే మాలాటి మందమంద బుద్ధుల గతేంటి?
ఏదో బానే ఉంది కదా అని పద్యం వ్రాసేశా నంతే............
అయినా నా భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.
నాకూ, నానిగాడికీ, నైనాకూ, నీనాకూ నానో కారంటే చాలా ఇష్టమై పోయింది.
వాళ్ళకా విషయం చెప్తూ నానో మోజులో పడ్డారని నేను మిమ్మల్ని ఏమీ అనను. నన్నూ, మిమ్మల్నీ కూడా నానో పడేసింది అని చెప్పాను అంతే.
సింపుల్.
ఏం బాలేదా సారూ?
మిస్సన్న గారూ ఇప్పటికి నా బుర్రలో లైటు వెలిగింది. ఈ నానీ కవితలేమీ అర్ధం కావటల్లా. ఇప్పటికి ఒకటి అర్ధమయింది చెవి నలిపి చెపితే.
రిప్లయితొలగించండిలక్కరాజు వారూ బుర్ర మండి పోయేలా తెగ గోకేసు కొంటేనే కానీ
రిప్లయితొలగించండిఆ పద్యం వ్రాయ లేక పోయాను. మీరు చెవి నలిపేసు కోవడంలో వింత ఏముంది? ధన్యవాదాలు.
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
నానో గుట్టు విడి పోయింది !
హమ్మయ్య ! ధన్యులం !
కిశోర మహోదయా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి