హనుమచ్చాస్త్రి గారూ మందాకిని గారూ- చక్కని , మధురమైన పూరణలు . శంకరయ్య గారి అనుమతి తో , ఒక విషయం . సమాస సంఘటనములో , తెలుగు మీద సంస్కృతము రావచ్చును . సంస్కృతము మీద తెలుగు రాదు . ఉదాహరణకు , మర్రి చెట్టు అనవచ్చు , మర్రి వృక్షమూ అనవచ్చు . వట వృక్షము అని మాత్రమే అనవలసి ఉంటుంది . వట చెట్టు అని అనకూడదు . 'పూలన్ ' పదము తెలుగు కనుక ఆ పైన ప్రయోగించే ఏ పదమైనా , తెలుగే వుండేలా చూసుకోవాలి . ఇక్కడ సమాస సంఘటనము చేయలేము . ఇది ఒక సాధారణమైన పొరపాటు . ' చంపక పుష్పాలు ' అనవలసినదే తప్ప ' చంపక పూలు ' అనలేము ! ' సంధ్యా వేళ ' కూడ అలాంటిదే !
మందాకిని గారూ, మీ రండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. డాక్టరు గారి టానిక్కు పనిచేసింది. సంతోషం.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. డాక్టర్ గారి మందు మీకూ పనిచేసించి. సంతోషం.
డా. విష్ణు నందన్ గారు, మీ పూరణ "మృదు లీలా నవ పుష్పమాల"యై కవితాపరిమళాలను వెదజల్లుతున్నది. మహదానందం. మిత్రుల పూరణలలోని గుణదోష విచారణ చేసి(స్తు)నందుకు ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ, మీ మూడు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు. కాని "చంపువు" బహువచనం "చంపూ" అవుతుందా అని సందేహం.
డా.విష్ణునందన్ గారికి చక్కటి ప్రాథమిక సూత్రము వివరించినందులకు ధన్యవాదాలు. అదివరలో విన్నవించుకొన్న మనవి మరొక్కసారి, నిష్ణాతులైన మీవంటి వారు (మీరు, చింతా వారు, ఫణీంద్ర గారూ, శంకరయ్యగారూ, భైరవభట్ల వగైరా) ప్రతి సమస్యని తప్పక పూరించవలెనని, మీ సమయానుకూలాన్ని బట్టి. అందువలన మేము ఆ పద్యాలు చదివి పరిశీలించి మీరు చెప్పకనే చెప్పే పాఠాలు యెన్నో మాకే తెలియకుండా నేర్చుకొంటాము. నా స్వగతంలోంచి రెండు మాటలు. ప్రొఫెసర్.రాజారామన్ గారు (IISc, Bangalore) యెప్పుడూ 100 level courses చెప్పేవారు. నేను ఆయనని ఒకసారి అడిగాను. ఎందుకండీ అలా, అని. Basic courses చెప్పి నేర్పించటం ఒక challenge బాబూ అన్నారు. అట్లాగే, మా సంగీతం మాష్టారు. గొప్ప వయోలిన్ విద్వాంసులు - బాల పాఠాలు చెప్పటం ఎంతో కష్టమండి. ఏమీ తెలియని వారికి నేర్పించ గలిగినపుడే నా విద్యకి సార్థకత అనేవారు. అదేరకంగా శంకరయ్య మాష్టారు కూడా. వారి ఓపిక సదా ప్రశంసనీయం. కొందరు నిష్ణాతులు బాల పాఠాలు చెప్పలేక పోవచ్చు కానీ వారి పద్యాలే మాబోంట్లకు పాఠాలు.
మంద పీతాంబర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ, పూరణ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ, దోసెడు నీలోత్పలాలతో దేవీపూజ చేసారు. అద్భుతంగా ఉంది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. "శూలాయుధ పాణి శివుని సుదతిని కొలువన్" అంటే సరి.
మేలము లాడకు, సంధ్యా
రిప్లయితొలగించండివేళను దేవికి, జగాన విరిసిన పూలన్,
బేలా! పరిమళ మిచ్చెడి
పూలన్, దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్
శ్రీ లలితా, పరమేశ్వరి,
రిప్లయితొలగించండిశైలజ, శ్రీకంఠు రాణి, చండిని నియతిన్
మాలతి జాజీ చంపక
పూలన్;దేవిని గొలిచిన బుణ్యము దక్కున్!
బాలను, యమ్మల కమ్మను
రిప్లయితొలగించండిలీలగఁ జగముల సృజించు లేమను, నేనీ
వేళన్ కలువల, తామర
పూలన్, దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్
కాలానుగుణ్యమై , మృదు
రిప్లయితొలగించండిలీలా నవ పుష్ప చయములే విరబూసెన్ !
మాలన్ గూర్చగ వలె నీ
పూలన్; దేవిని గొలిచిన బుణ్యము దక్కున్ !!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ మందాకిని గారూ- చక్కని , మధురమైన పూరణలు .
రిప్లయితొలగించండిశంకరయ్య గారి అనుమతి తో , ఒక విషయం . సమాస సంఘటనములో , తెలుగు మీద సంస్కృతము రావచ్చును . సంస్కృతము మీద తెలుగు రాదు . ఉదాహరణకు , మర్రి చెట్టు అనవచ్చు , మర్రి వృక్షమూ అనవచ్చు . వట వృక్షము అని మాత్రమే అనవలసి ఉంటుంది . వట చెట్టు అని అనకూడదు . 'పూలన్ ' పదము తెలుగు కనుక ఆ పైన ప్రయోగించే ఏ పదమైనా , తెలుగే వుండేలా చూసుకోవాలి . ఇక్కడ సమాస సంఘటనము చేయలేము . ఇది ఒక సాధారణమైన పొరపాటు . ' చంపక పుష్పాలు ' అనవలసినదే తప్ప ' చంపక పూలు ' అనలేము ! ' సంధ్యా వేళ ' కూడ అలాంటిదే !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
__________________________________
మీలిత నేత్రను , శక్తిని
ఫాలాక్షుని సతిని , భక్తి - భావము తోడన్
మాలలుగ కూర్చి వన్నెల
పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్ !
__________________________________
02)
రిప్లయితొలగించండి__________________________________
శూలాయుధాది పాణిని
కాలంజరి ,గిరిక,కాళి - కౌశికి , మాతన్
మాలాలంకృత ధారిని
పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్ !
__________________________________
మేలము లాడకు, నిపుడీ
రిప్లయితొలగించండివేళను దేవికి, జగాన విరిసిన పూలన్,
బేలా! పరిమళ మిచ్చెడి
పూలన్, దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్
విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు.
మీరు చెప్పిన సవరణ కు కృతజ్ఞురాలిని.
మార్చాను.
వేలకు వేలను జంపిన
రిప్లయితొలగించండిపూలన్ దేవిని తలచిన బుగులే కలుగున్ !
వేళకు ఫలముల దళముల
పూలన్, దేవిని గొలిచిన పుణ్యము దక్కున్ !
03)
రిప్లయితొలగించండి__________________________________
బాలేందుమౌళి భార్యను
బాలను, భగవతి ,భవాని - భార్గవి ,భవ్యన్
శైలజ ,శివాని,శారద
పూలన్ దేవిని గొలిచిన - బుణ్యము దక్కున్ !
__________________________________
చాలిక లౌక్యపు కవితల్
రిప్లయితొలగించండికాలుని బాధ తొలుగుటకు కవులిక భక్తిన్
మేలగు పద్యంబుల చం
పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్!!
చంపూ = పద్య గద్యములతో కూడిన కావ్యము
విష్ణునందన్ గారూ! నియమమును సవివరముగా తెలిపినందులకు ధన్యవాదములు.సవరించి పూరించుచున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ లలితా, పరమేశ్వరి,
శైలజ, శ్రీకంఠు రాణి, చండిని ప్రాతః
కాలము నందున తెల్లని
పూలన్; దేవిని గొలిచిన బుణ్యము దక్కున్!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ రండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
డాక్టరు గారి టానిక్కు పనిచేసింది. సంతోషం.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
డాక్టర్ గారి మందు మీకూ పనిచేసించి. సంతోషం.
డా. విష్ణు నందన్ గారు,
మీ పూరణ "మృదు లీలా నవ పుష్పమాల"యై కవితాపరిమళాలను వెదజల్లుతున్నది. మహదానందం.
మిత్రుల పూరణలలోని గుణదోష విచారణ చేసి(స్తు)నందుకు ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.
కాని "చంపువు" బహువచనం "చంపూ" అవుతుందా అని సందేహం.
డా.విష్ణునందన్ గారికి చక్కటి ప్రాథమిక సూత్రము వివరించినందులకు ధన్యవాదాలు. అదివరలో విన్నవించుకొన్న మనవి మరొక్కసారి, నిష్ణాతులైన మీవంటి వారు (మీరు, చింతా వారు, ఫణీంద్ర గారూ, శంకరయ్యగారూ, భైరవభట్ల వగైరా) ప్రతి సమస్యని తప్పక పూరించవలెనని, మీ సమయానుకూలాన్ని బట్టి. అందువలన మేము ఆ పద్యాలు చదివి పరిశీలించి మీరు చెప్పకనే చెప్పే పాఠాలు యెన్నో మాకే తెలియకుండా నేర్చుకొంటాము. నా స్వగతంలోంచి రెండు మాటలు. ప్రొఫెసర్.రాజారామన్ గారు (IISc, Bangalore) యెప్పుడూ 100 level courses చెప్పేవారు. నేను ఆయనని ఒకసారి అడిగాను. ఎందుకండీ అలా, అని. Basic courses చెప్పి నేర్పించటం ఒక challenge బాబూ అన్నారు. అట్లాగే, మా సంగీతం మాష్టారు. గొప్ప వయోలిన్ విద్వాంసులు - బాల పాఠాలు చెప్పటం ఎంతో కష్టమండి. ఏమీ తెలియని వారికి నేర్పించ గలిగినపుడే నా విద్యకి సార్థకత అనేవారు. అదేరకంగా శంకరయ్య మాష్టారు కూడా. వారి ఓపిక సదా ప్రశంసనీయం. కొందరు నిష్ణాతులు బాల పాఠాలు చెప్పలేక పోవచ్చు కానీ వారి పద్యాలే మాబోంట్లకు పాఠాలు.
రిప్లయితొలగించండినేలకు,నింగికి,నిప్పుకు,
రిప్లయితొలగించండిగాలికి,నీటికిని మూడు కాలమ్ములకున్
లీలా రూపము, గూర్చుము
పూలన్;దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏలా సరసుల వనముల
రిప్లయితొలగించండినేలా నిర్జన ములందు నేలా రాళ్ళన్
యేలా వెదకెదు? మదులను
పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్.
హాలా హలమును మ్రింగిన
రిప్లయితొలగించండిశూలాయుధ పాణి శివుని సతినిల కొలువన్ !
నీలోత్పలములు దోసెడు
పూలన్ దేవిని గొలిచిన బుణ్యము దక్కున్ !
అక్కయ్యగారూ,
రిప్లయితొలగించండిమనోజ్ఞమైన పూరణ.
రెండో పాదం కొంచెం సరి చూడాలేమో.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
పూరణ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
దోసెడు నీలోత్పలాలతో దేవీపూజ చేసారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది.
"శూలాయుధ పాణి శివుని సుదతిని కొలువన్" అంటే సరి.
కాలము రీతులు మారెన్
రిప్లయితొలగించండిపాలించెడి నేతలనిక వదలక నెపుడున్
మాలల తోడన్, తెగడక
పూలన్ దేవిని, గొలిచినఁ బుణ్యము దక్కున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరాభరణం సమస్య - 317
రిప్లయితొలగించండి"పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్"
ఆలూ, చేపలు తినుచును
నాలుక పై నెత్రు జూపి నర్తన మిడెడిన్
కాళీ ఘాటున వెలసిన
పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)