29, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 323 (చీర విడిచి వెడలెఁ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడి.

41 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    01)
    _________________________________

    చీర నొకటి కొన్న - చీర ఉచిత మన్న
    సంతసమున గొనెను - సందె వేళ
    చీర చిరుగు జూచి - ఛీ ఛీ యనంచును
    చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి
    _________________________________

    రిప్లయితొలగించండి
  2. గుడికి వెడలి వచ్చి,వడివడి ఫలహా
    రమును తిన్న పిదప,రాత్రి కొన్న
    జీన్సు ప్యాంటు వేసి,సినిమాను జూడగ
    చీర విడిచి వెడలె;చిగురు బోడి.

    రిప్లయితొలగించండి
  3. సిరినిఁ గూడి యాడు శ్రీనివాసుని వేగ
    కావుమంచునార్తి కరముఁ జీర
    విడిచి వెడలెఁ జిగురుఁబోఁడిని పురమును
    వడిగ కరినిఁ బ్రోవ వరదుడపుడు

    రిప్లయితొలగించండి
  4. కిశోర్ గారూ! చిరిగిన 'చీర విడిచి వెడలడం' బాగుంది. ఒక సందేహం. యేమైనా కట్టిందా!

    రిప్లయితొలగించండి
  5. అన్న వదిన తోడ,అదవికేగగ తాను
    కలికి ఊర్మిళ నట-గట్టి నార
    చీర-విడిచి వెడలె జిగురు బోడిని నాడు
    లక్ష్మణుండు సుగుణ లక్షణుండు.

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రిగారూ !
    ధన్యవాదములు !

    సందేహ మెందుకు
    ఈ తరం సినిమాకే గాదు
    షాపింగుకు కూడా
    జీన్స్ పాంటుతోనే వెళ్తున్నారు !

    చీర విడవమంటే ఊర్మిళను విడిచేరే !!!
    బావుంది !

    ఫణిగారూ !
    చిగురు బోడినేగాక పురమును కూడా వీడడం
    బావుంది !

    రిప్లయితొలగించండి
  7. కిశోర్ గారూ! చిరిగిన 'చీర విడిచి వెడలడం' బాగుంది. ఒక సందేహం. యేమైనా కట్టిందా!
    --------------------
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ఇదిగో మీ ప్రశ్నకి నా సమాధానం
    మీవి, వసంత కిషోర్ గారి పద్య పాదాల్లోనే.

    చీర నొకటి కొన్న - చీర ఉచిత మన్న
    సంతసమున గొనెను - సందె వేళ
    జీన్సు ప్యాంటు వేసి,సినిమాను జూడగ
    చీర విడిచి వెడలె;చిగురు బోడి.

    సరదాకి మీ ఇద్దరి పద్యపాదాలు కలిపాను. ఏమీ అనుకోకండి.

    రిప్లయితొలగించండి
  8. కిశోర్ గారూ! ధన్యవాదములు.
    లక్కరాజు గారూ! మొత్తానికి మా రెండు రెండు నాలుగు పాదాలను లక్క అతికించినట్లు చక్కగా అతికించారండీ!కూర్చిన విధం, సమాధానం చాలా బాగుంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నన్ను తన్ని తరిమేయ్యకుండా మీకు నచ్చింది అన్నందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  10. చీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడిఁగనుము
    యనిన యులికిపడెనుయతివయపుడు
    శిశిరమందుకొత్తచిగురుల కైయాకు
    రాల్చు లతలఁజూపెరమణి సఖుడు

    పాతయాకుల చీరను వదిలి కొత్తచిగురుల లేతరంగు చీరకై శిశిరాన్ని వదలి ఆమని వైపు వెళ్ళే లతలను చూసిన వారి కొంటె మాటలవి.

    రిప్లయితొలగించండి
  11. శూర శంతనుఁగనె సుకుమార యోజన
    గంధి సుంత వలపు గ్రమ్మె నంత
    ఓడ నడుపు వలజ ఓరచూపుల చాప
    చీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడి.
    సూచన: చాపచీర = తెరచాప.

    రిప్లయితొలగించండి
  12. 02)
    _________________________________

    కొలువు కూట మందు - కోమలి చీరను
    కోరి లాగ సాగె - కూళు డంత
    మంచి వస్త్రములను - మాధవు డివ్వంగ
    చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి !

    _________________________________

    రిప్లయితొలగించండి
  13. సెల్లు చెవిన బెట్టి, చీర పాకె ట్లతో
    నతివ బస్సు నెక్కె, నాత్రమునను,
    భాగ్య నగర మందు బస్సులో సీటుపై
    చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి!

    రిప్లయితొలగించండి
  14. నా పూరణ ...

    లతలు పువ్వు లాకులను నేసినట్టిదౌ
    క్రొత్త చీర కొనఁగఁ గోరె నింతి;
    ధరను చూచి గుండె దడదడ లాడఁగా
    చీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడి.

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    ఇప్పటికి చేరిన మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ఉదయం సమస్య నిచ్చి కాచిగూడలో ఒక మిత్రుణ్ణి కలవడానికి వెళ్తూ బస్సులో నా పూరణ పద్యం రాసాను. తీరా ఇంటికి వచ్చి చూస్తే "దుకాణంలో చీర విడిచిన" మీ పూరణ కనిపించింది. మీ పూరణ చాలా బాగుంది.
    మీ పూబోడి చిరుగును చూస్తే నా యింతి ధరను చూసింది. అంతే తేడా.
    అయినా ఎలాగూ రాసాను కదా అని నా పూరణనూ ప్రకటించాను.

    రిప్లయితొలగించండి
  16. ప్రాసయతి విషయమై పెద్దలు నన్ను ఎన్నిసార్లు సరిదిద్దినా మందబుద్దినై అవే తప్పులు చేస్తున్నాను. మన్నించాలి. పైనున్న నా పద్యం లో 'విడిచి - బోడిని' లకు ప్రాసయతి కుదరదు. పద్యాన్ని తిరిగి వ్రాస్తున్నాను.

    సిరినిఁ గూడి యాడు శ్రీనివాసుని వేగ
    కావుమంచునార్తి కంజరమ్ము
    జీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడిని యంత
    వడిగ కరినిఁ బ్రోవ వారిశుండు

    రిప్లయితొలగించండి
  17. కొన్న చీరఁజూపఁగోమలి వెడలెను,
    పుట్టినింటి కచట; పొలతి చెల్లె
    మురిసె చీరఁగాంచి, ముదమార నప్పుడు
    చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి!

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్యాంటు వేసికొనడానికి చీర విడిచిన పూరణ బాగుంది. నార చీర గట్టి, భార్యను విడిచిన రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    మంచి ఊహ. బాగుంది. కాని మూడవ పాదంలో యతి తప్పించి. దోషాన్ని తప్పించే ప్రయత్నం చేసాను కాని వీలు కాలేదు.

    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు. ఇక మీరూ పద్యాలు రాయడం మొదలుపెడితే బాగుంటుంది.

    మందాకిని గారూ,
    అద్భుతమైన ఊహతో పూరణ చేసారు. అభినందనలు.
    మళ్ళీ యడాగమాల ఆగడాలు.
    "చీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడిఁగను(మ)
    యనిన (ను)లికిప(డియె న)తివ యపుడు."

    చంద్ర శేఖర్ గారూ,
    మీ "చాపచీర" పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. మంద పీతాంబర్ గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ నాలుగు పద్యాలు భావకవితా శోభలతో అలరిస్తున్నాయి. ధన్యవాదాలు.
    అయితే మూడవ పద్యంలో "మంజీర"కు విభక్తి ప్రత్యయాలు లోపించాయి.

    ఫణిప్రసన్న కుమార్ గారూ,
    ఇప్పుడు ఓ.కే. అవునూ ... "వారిశుడు" పదాన్ని ఎక్కడ పట్టారు స్వామీ?

    మందాకిని గారూ,
    ఇది చక్కని పూరణ. అభినందనలు.
    మరి చెల్లెలు చీర చూసి వడిచి వెళ్ళిందా? లేక అక్క చెల్లెలి కోసం చీర విడిచి వెళ్ళిందా? చిగురుబోడి అక్కాచెల్లెళ్ళలో ఎవరు?

    రిప్లయితొలగించండి
  20. గురువుగారు
    మరీ మరీ ధన్యవాదాలు.
    యడాగమాల ఆగడాలు :))

    కొన్నచీరఁజూపఁగోమలి వెడలెను పుట్టినింటికి. అచట పొలతి చెల్లెలు ఉన్నది. కొత్త చీర గాంచి మురిసినది. అప్పుడు నీవే కట్టుకొమ్మని ముదమార చెల్లికై యా చిగురుబోడి తను కొన్న చీర వదిలి వెళ్ళినది.

    రిప్లయితొలగించండి
  21. శంకరయ్యగారూ,
    ధన్యవాదాలండీ. ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువు నుండీనండీ. అదే నా పాలిటి కామధేనువూ, కల్పతరువూనూ.

    రిప్లయితొలగించండి
  22. రంగులు విరజిమ్ము బంగరు మెరుగుల
    చీర విడిచి, వెడలె జిగురుబోడి,
    జనక పుత్రి సీత - వనవాసమును చేయ;
    నార చీర గట్టి నాథుతోడ.

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా ! ధన్యవాదములు.షాపులో చీరను కొనకుండా వదలివేయడం బాగుంది. కవి మిత్రు లందరూ రకరకాలుగా చీర విడిచి వెళ్ళేట్టు చేశారు.అందరకూ అభినందనలు.మిస్సన్నగారికి రెట్టింపు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. ధన్యవాదాలు, మాస్టారూ. యాదృచ్చికంగా శంతనుడు-మత్స్యగంధి ఘట్టం తలపుకు వచ్చింది.

    రిప్లయితొలగించండి
  25. భర్త మీద యలిగి పంతముగ నాసుదతి
    పట్టు చీర కొనగ గుట్టు గాను
    పర్సు తెరచి చూడ పైకమ్ము మరువగ
    చీర విడిచి వెడలె జిగురు బోడి

    రిప్లయితొలగించండి
  26. కాంత యొకతె వచ్చి"కంజీర" మీటుచున్,
    పాడదొడగె మంచి పాటలెన్నొ!
    "యిచ్చి వెళ్ళు" మనగ బుచ్చిబాబు; అట కం
    జీర విడిచి వెడలె జిగురుబోడి.

    రిప్లయితొలగించండి
  27. పర్సు తెరచి చూడ పైకమ్ము మరువగ
    చీర విడిచి వెడలె జిగురు బోడి
    -----------------
    రాజేశ్వరి గారూ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ ధన్యవాదాలు.
    మీ పూరణ చాలా బాగుంది.
    నా మూడవ పద్యాన్ని ఉపసంహరించుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  29. చాలు నింక రమ్ము చాలించి వాసంత
    యామినీ విహార మర్ధ రాత్రి
    ప్రొద్దు పోయె నంచు ముద్దుగా చెలికాడుఁ
    జీర, విడిచి వెడలెఁ జిగురుఁబోఁడి,
    ***********************************************
    మలయ మారుతమ్ము, మత్త కోకిల పాట,
    మల్లె పొదల తావి, మధుప కేళి,
    వాహినీ తరంగ మోహినీ ఝరుల మం-
    జీరఁ, విడిచి వెడలెఁ జిగురుఁబోఁడి
    ***********************************************
    పుట్టినిల్లు వదలి మెట్టినింటకు జేరి
    యొద్ది కంగ వధువు యొడిని గట్టు
    జీరఁ విడిచి వెడలెఁ, జిగురుఁబోఁడిని గను!
    పతియె దైవ మింక పడతి కెన్న.

    రిప్లయితొలగించండి
  30. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.
    లక్కరాజు వారూ మీ చమత్కారం చాలా బాగుంది.
    గురువుగారన్నట్లు మీరు కూడా పద్య రచన ప్రారంభించ వచ్చును.
    చంద్రశేఖరుల చాపచీర ప్రయోగం చాల బాగుంది.
    రవీందర్ గారి కంజీర కూడా బాగుంది.

    రిప్లయితొలగించండి
  31. శంకరార్యా !
    ధన్యవాదములు !

    మిత్రులందరి పూరణలూ
    ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  32. గూడు వదలి వచ్చు సీతాకోక చిలుక
    నిజంగానే చీర విడిచిన వీర వనిత
    కాదంటారా ???
    03)
    _________________________________

    గుడ్డు నుండి పుట్టు - గొంగళి పురుగంత
    మేత , మేసి మేసి - మేసి మేసి
    గూడు కట్టు పిదప - గోడనో, ఏడనో
    చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి !
    _________________________________

    రిప్లయితొలగించండి
  33. అలాగే కుబుసము విడిచే పాము కూడా
    చీర విడిచిన చిన్నదే !
    ఔనంటారా !!!

    04)
    _________________________________

    పడగ విప్పి యాడు - ఫణి రాణి చూడగ
    పరవశమును బొందు - మురళి విన్న !
    కోరి విడుచు తనదు - కూసంబు ! కనగాను
    చీర విడిచి వెడలె - జిగురుఁబోఁడి !
    _________________________________

    రిప్లయితొలగించండి
  34. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    పైకం మరచి వచ్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "పంతముగ నాసుదతి" అన్నప్పుడు గణదోషం. "పంతముగ నాయింతి" అంటే సరి!

    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    వసంత కిశోర్ గారూ,
    మీ గొంగళి పురుగు మేత మేసి మేసి మేసి మేసి సీతాకోక చిలుకైతే మీరేమో పద్యాలు వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి కవికిశోరులు కవిరాజు లవుతున్నారు. చాలా సంతోషం.
    కుబుసం విడిచిన ఫణిరాజు పూరణ కూడా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి