10, ఏప్రిల్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 282 (చిన్నిల్లున్ననె కలుగు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.
ఈ సమస్యను పంపిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  _____________________________________

  ఎన్నో యంతస్థులు, పలు
  వన్నెల చూర్ణంబు తోడ - పయి పయి పూతల్ !
  పన్నగ శయనుని దయచే
  చిన్నిల్లున్ననె కలుగు న- శేష సుఖంబుల్ !
  ______________________________________
  చిన్ని = మనోఙ్ఞమైన

  రిప్లయితొలగించండి
 2. పన్నుగ నద్దిల్లున్నను
  మన్నన గన లేము. మనిషి మనుగడ కొఱకై
  వెన్నెల దొరసానిఁ గలిగి
  చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.

  రిప్లయితొలగించండి
 3. కన్నా! ఇద్దరు ముగ్గురు
  ఉన్నచొ సంతాన మద్ది ఒప్పదు నీకున్!
  కన్నచొ ఒకరిద్దరితో
  చిన్నిల్లున్ననె! గలుగు నశేష సుఖంబుల్!

  రిప్లయితొలగించండి
 4. కన్నా! ముగ్గురు,నలుగురు
  ఉన్నచొ సంతాన మద్ది ఒప్పదు నీకున్!
  కన్నచొ ఒకరిద్దరితో
  చిన్నిల్లున్ననె!గలుగు నశేష సుఖంబుల్!

  రిప్లయితొలగించండి
 5. మొదటి పూరణలోని మొదటి పాదము సవరించి చేసిన రెండవ పూరణను గ్రహించవలసినదిగా మనవి.

  రిప్లయితొలగించండి
 6. 02)
  ____________________________________

  వెన్నునికి గలదు సత్యయు
  కన్నులు మూడగు శివునకు - గంగయు గలదే !
  చెన్నగు సుందరి తోడను
  చిన్నిల్లున్ననె కలుగు న - శేష సుఖంబుల్ !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 7. 03)
  ____________________________________

  కన్నీళ్ళు నింపు భార్యయు
  వెన్నెలలో విరహము , కడు - వేదన బెంచున్ !
  అన్నన్నా తప్పదు మరి
  చిన్నిల్లున్ననె , కలుగు న - శేష సుఖంబుల్ !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 8. 04)
  ____________________________________

  కన్నులకు నింపు గొల్పెడు
  అన్నులమిన్నున్న , నదియె - అతి భాగ్య మగున్ !
  మన్నన పెరుగును; చెన్నగు
  చిన్నిల్లున్ననె , కలుగు న - శేష సుఖంబుల్ !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 9. మున్నే కే భాగియ రా
  జన్నే సొల్లెన్ గద పెరిసా ఇలనొరు వీ
  డున్నా మగనికి పాత్తా
  చినిల్లునె గలుగు నశేష సుఖముల్

  కే భాగ్యరాజా తీసిన చిన్న వీడు అనే అరవపు చిత్రమొకటి ఉంది - దాన్ని చిన్న ఇల్లుగా తెనిగించారునుకుంటా..

  రిప్లయితొలగించండి
 10. వసంత్ కిశోర్ గారూ,
  చిన్నదాన్ని మనోజ్ఞమైనదిగ మార్చిన మీ మొదటి పూరణ మనోజ్ఞంగా ఉండక ఏం చేస్తుంది?
  మీ మిగిలిన మూడు పూరణలలో చిన్నిల్లును వ్యంగ్యార్థంలో ప్రయోగించారు. బాగుంది. అభినందనలు.

  చింతా రామకృష్ణారావు గారూ,
  రాజమహల్ లాంటి అద్దెకొంప కంటె చిన్నదైనా సొంతిల్లు ఉండాలని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

  హనుమచ్ఛాస్త్రి గారూ,
  చిన్న కుటుంబమే చింతలేనిదని వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గిరి గారూ,
  మణిప్రవాళంలో బాగా రాసారు. అభినందనలు. కాని కాస్త భావాన్ని కూడా వివరిస్తే బాగుండేది. నాకు తమిళం రాదు కదా.
  దాసరి గారి "పెద్దిల్లు-చిన్నిల్లు" అదేనేమో?

  రిప్లయితొలగించండి
 11. కన్నీళ్లె మిగులు చివరికి
  చిన్నిల్లున్ననె, కలుగు నశేషసుఖంబుల్
  మిన్నగ నాదరమొప్పుచు
  మన్ననఁ జేయు సతిగ నొక మగువ దొరికినన్!!

  రిప్లయితొలగించండి
 12. హన్నా ఇల్లాలుండగ
  చిన్నిల్లని యావ యేల సిగ్గది లేదా
  యన్నన్ నవ్వుచు నతడనె
  చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.

  (చిన్నింటికి భాగ్య రాజా ఇచ్చిన అర్థంలో)

  అన్నా పెద్దిల్లేలా
  మిన్నంటే ధరల నేడు మీకన వినకన్
  యెన్నో యప్పుల పాల్బడె
  చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.

  ( ఖరీదు తక్కువలో చిన్నిల్లు మేలనే భావంలో)

  అన్నా పెద్ద కుటుంబము
  విన్నావా కలతలకును వేదిక యన్నన్
  మన్నించి గ్రహించె హితవు
  ' చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్ '.

  (చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబమనే యర్థంలో)

  రిప్లయితొలగించండి
 13. శంకరయ్య గారు,
  ఇదిగో, రవి గారి వివరణ చూడండి..

  మిస్సన్న గారు కూడా వసంత్ కిశోర్ గారి వలె ఒక సమస్యకి పల్పూరణ లందిస్తూంటే ఒంటిపూరకులం మా గతేంటి?


  Ravi E.N.V. - నా వ్యాఖ్యానం. :)

  మున్నే = ఇదివరకు
  కే భాగియ రాజన్నే = k. భాగ్యరాజా అన్నయ్య
  సొల్లెన్ గద = చెప్పె గదా (ఇక్కడ సొన్నాన్, అడ - అని ఉంటే బావుంటుంది)
  పెరిసా = పెద్దగా
  ఇలనొరు = భూమిపై ఒక (ఊరిల్ - అంటే బావుంటదేమో)
  వీడున్నా = ఇల్లున్నా
  మగనికి పాత్తా = మగనికి చూడగా
  చివరి పాదం మామూలే

  రిప్లయితొలగించండి
 14. గిరి గారూ మీ తమిళ పద్యానికి అర్ధము వివరించి నందులకు ధన్యవాదములు. ఈ తరము వారు తమిళ సినిమాలు బాగున్నాయని చూస్తూ తమిళములో ప్రావీణ్యు లవుతున్నారుట. సింగపూరులో కూడా తమిళ ప్రభావ మెక్కువే కదా ! మీరిలా నాలుగు పద్యాలు వ్రాస్తే మాకూ వచ్చేస్తుందేమో తమిళము. బాగా సొళ్ళారు ! మరి మా అనుభవము :

  ఉన్నను రెండంతస్థులు
  కన్నులకున్ గానబడరు కన్నయు, చిన్నన్
  పిన్నలు మసలగ కన్నుల
  చిన్నిల్లున్ననె కలుగు నశేష సుఖంబుల్ !

  రిప్లయితొలగించండి
 15. సత్యనారాయణ గారూ,
  చిన్నిల్లుంటే చివరికి కన్నీళ్ళే అంటూ చక్కగా పూరించారు. అభినందనలు.

  హన్నా, మిస్సన్న!
  గిరి గారు చెప్పినట్లు "చుపా రుస్తుం" లాగా మీ విశ్వరూపాన్ని త్రేతాగ్నుల వంటి మూడు పూరణలతో చూపించారు. మూడూ ముచ్చటగా ఉన్నాయి. ధన్యవాదాలు.

  గిరి గారూ,
  ధన్యవాదాలు. మీ ద్వారా "రవి" గారికి కూడా!

  నరసింహ మూర్తి గారూ,
  నిజమే! పెద్దింట్లో ఎవరి గదుల్లో వారే ... ఎవరి పరిధి వారిదే! ఒకరి కొకరు కనిపించడమే గగనం. అదే చిన్నిల్లయితే ఆ కోలాహలం, ఆప్యాయతలే వేరు ... మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. గిరిగారూ వసంత కిశోర్ గారి పూరణలు పాతాళ గంగా ప్రవాహం.
  నావి మునిసిపల్ కుళాయి ధార.

  గుర్వుగారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. క : చిన్నదగు ఇంట ఇల్లాలు
  జున్నును తిన్నట్లు యుండు, జుంటి మధురమే
  నిన్ను వెదక శత ఆయువు ,
  చిన్నిల్లు న్నెనె కలుగు న శేష సుఖంబుల్ !

  రిప్లయితొలగించండి
 18. అన్నియు నొక చోటుండును,
  తన్నుకు లాడుట కుదరదు, తక్కువ పన్నుల్,
  కన్నియె లే లేకున్నను
  చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్

  రిప్లయితొలగించండి
 19. పన్నులు తక్కువ పరులకు
  కన్నులు కుట్టవు నతిథులు కానగ రారోయ్
  సున్నము తక్కువ పట్టున్
  చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్

  రిప్లయితొలగించండి


 20. అన్నుల మిన్నగ లచ్చియు
  మిన్నగ పంటలను కూర్చు మేదిని వలయున్
  మన్నిక గాచెప్పెదెనయ
  చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్‌!


  జిలేబి

  రిప్లయితొలగించండి