4, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 276 (ఖర నామాబ్దమున)

కవి మిత్రులారా,
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్.

24 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరికీ ఉగాది శుభా కాంక్షలు !

    01)
    ________________________________________

    పరమంబగు పరమాత్మను
    దరిసించుటె, సకల జీవ - దళముల యందున్
    భరతమున సహజమే గద !
    ఖర నామాబ్దమున నొప్పు - గాడిద పూజల్ !
    ________________________________________

    దళము = సమూహము
    భరతము = భారత దేశము

    రిప్లయితొలగించండి
  2. కవి మిత్రు లందరకు,వీక్షకులందరకు శ్రీ ఖర ఉగాది శుభాకాంక్షలు.
    శంకరం మాస్టరు గారికి ధన్య వాదములు, ఉగాది శుభాకాంక్షలు.


    ఖర వత్సరమందు హిమశి
    ఖర వాసుడు,పురహర, లయ కారుడు, శశిశే
    ఖరుడును!ఖరకర కులజుడు,
    ఖర దూషణ రావణారి! కలుముల నిడుగా!

    రిప్లయితొలగించండి
  3. వచ్చె నుగాదిపండుగ శుభంబని యింటను క్రొత్త బట్టలన్
    తెచ్చెను నాన్న యందరికి! తీయని బువ్వల జేసె నమ్మయున్!
    పచ్చగ కట్టె తోరణము ద్వారమునందున నన్న! షడ్రుచుల్
    మెచ్చుగ మేళవించి బహు మేలగు పచ్చడి జేసె నక్కయున్!

    గురువుగారికీ మిత్రులందరికీ తెలుగు వత్సరాది శుభా కాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మరిచిరె వసుదేవుని కథ
    తరింప నాపదను గాడిద పదములంటెన్
    నరులకు లౌక్యము ముఖ్యము
    ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!!

    రిప్లయితొలగించండి
  5. ఖర నామ వత్సరంబిది!
    పరికించగ దీని రూపు ప్రతిమను జేయన్
    ఖరమే! యనగా గాడిద!
    ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!

    రిప్లయితొలగించండి
  6. గురువు గారికీ, మిత్రులందరికీ ఉగాది మరియు "ఖర" నామ సంవత్సర శుభాకాంక్షలు


    చెరసాలలోన బుట్టెను
    వరదుడు వనమాలి శౌరి ; వసుదేవు డటన్
    ఖర పాదములం బట్టెను
    ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్ !

    రిప్లయితొలగించండి
  7. హర హర గాడిద కొడుకన,
    పరవశ మందుచు యడిగెను పరమశివునితా
    అరువది వర్షము లందొక
    ఖరనామాబ్దమున నొప్పు గాడిద పూజల్

    రిప్లయితొలగించండి
  8. కంది శంకరయ్య గారికి.. సహ బ్లాగు మిత్రులకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    శ్రీకరంబుగ నేతెంచె శ్రీఖ రమ్ము!
    పాడి, పంటలు మెండగు,పండగింక!
    సకల జనులకు శుభములు సత్యమిదియె!
    వెంకటప్పయ్య మాటలు వేద మనఘ!

    (ఏదో ఉగాది అనీ.. సరదాగా రాసాను మిత్రులు అన్యధా భావించకండి)

    రిప్లయితొలగించండి
  9. ఖర సూనులదే రాజ్యం
    బరయగ మన దేశ మందు నౌనవి నిజమే
    పరికింప నిట్టి పల్కులు
    ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్.

    రిప్లయితొలగించండి
  10. వర కట్నము గోరెడు నవ
    వరులకు , చెడు పాలకులకు,వాచాలురకున్ ,
    జరుపవలె జనులు మెచ్చగ
    ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!!!

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రుల పూరణలు అన్నీ శుభ 'ఖర ' యుతంగా వున్నవి.
    అభినందనలు.
    మందాకిని గారూ! ప్ 'రా 'సలు మరిచారండీ!
    కవి మిత్రులకు మనవి!
    నాబ్లాగును ఒకసారి వీక్షించి మీ అమూల్యమైన అబిప్రాయములు తెలుపవలసినదిగా కోరుచున్నాను. నా పేరు పై క్లిక్ చేస్తే నా బ్లాగ్ లోకి ప్రవేశించవచ్చు.

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి మిత్రు లందఱికీ ఉగాది శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  13. బిరబిర పలుకుము కరమా,
    ఖరమా, వత్సరమిదేమి? గాడిద పూజల్
    మరిఁజేసెనొకఁడు , తప్పా?
    ఖర నామాబ్ధమునఁ! నొప్పు గాడిదపూజల్

    శాస్త్రి గారు,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రు లందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారని భావిస్తున్నాను. అమెరికా మిత్రుల వేడుకలు ఇప్పుడు మొదలవుతాయి కదా. శుభమస్తు!

    వసంత్ కిశోర్ గారూ,
    అన్ని ప్రాణులలో ఉన్న భగవంతుణ్ణి మీరు గాడిదలో దర్శించారు. సంతోషం. శుభాకాంక్షలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    గాడిదకొడుకులను గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    శిరాకదంబం రావు గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  15. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ లౌక్యమైన పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    మీరూ జిగురు వారి బాటే పట్టారు. పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.

    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    వర మడిగిన గాడిద గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీ వేదవాక్కుకు ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    దుష్టచిత్తులను గాడిదలతో పోల్చిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు. మీ సంబరాలు ఇప్పుడే మొదలవుతాయి కదా.
    "నలుగురు కూర్చుని నవ్వే వేళల
    నా పే రొకపరి తలవండి"

    మందాకిని గారూ,
    మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు. కందపద్యం నడక మీకు బాగా పట్టుబడింది. సంతోషం.

    రిప్లయితొలగించండి
  16. మిత్రుల అందఱి పూరణలు అద్భుతంగా ఉన్నాయి. గురువర్యా ! మిమ్మలను స్మరించకుండా మనస్సులో మీకు నమస్కరించకుండా ఒక రోజూ నాకు గడవదు. మిత్రులందఱి గురించి కూడా తలుస్తాను. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  17. విద్యాసాగర్ అందవోలుమంగళవారం, ఏప్రిల్ 05, 2011 8:10:00 AM

    శ్రీ శంకరయ్య గారికీ మరియూ కవి మిత్రులందరికీ
    ఉగాది శుభాకాంక్షలు.

    శ్రీ ఖర నామ వత్సరమిది శ్రీకరమయి
    శుభము లిచ్చు మీకు శోభ కూర్చు,
    ఆయురారోగ్యంబులిచ్చి మిమ్మాదుకొనగ
    వేడు కొందు మదిని వేంకటేశు.

    విద్యాసాగర్ అందవోలు

    రిప్లయితొలగించండి
  18. విద్యాసాగర్ గారూ,
    ధన్యవాదాలు.
    మీ పద్యంలో 1, 3 పాదాలలో ఆటవెలది లక్షణాలు కొద్దిగా లోపించాయి. (బ్రాకెట్లలో) నా సవరణ......
    శ్రీ ఖ(రాబ్ద) మిది(యె) శ్రీకరమయి (వచ్చె)
    శుభము లిచ్చు మీకు శోభ కూర్చు,
    ఆయు (సుస్థత లిడి యందఱ బ్రోవగ)
    వేడు కొందు మదిని వేంకటేశు.

    రిప్లయితొలగించండి
  19. ఖర సంవత్సరమునకిల
    ఖర నామము గెల్చె ఖరము గారవ మొప్పన్
    ఖర సంతానమ్మునకిక
    ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్

    "ఖర సంతానము" = గాడిద కొడుకులు

    రిప్లయితొలగించండి