17, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (చైత్రపు శోభలం గన)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
చైత్రపు శోభలం గన న
సహ్యము గాదె రసజ్ఞ కోటికిన్.
సమస్యను సూచించిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  __________________________________________

  పత్రము లేత చూతముల - పాటల కోయిల , మల్లె మొగ్గలున్
  చిత్రపు వన్నెల న్మిగుల - చేతన నొప్పెడి వృక్ష జాలముల్
  చైత్రపు శోభలం గన ! న - సహ్యము గాదె రసఙ్ఞ కోటికిన్
  రాత్రిని, తిత్తి కూత; ఘన - రావము లొల్కెడు మైకు పల్కులున్ !
  __________________________________________
  తిత్తి = తీతువు పిట్ట

  రిప్లయితొలగించండి
 2. 02)
  _________________________________________

  చిత్ర విచిత్రమౌ మిగుల - చిన్నెల వన్నెల పండ్ల సంపదల్
  నేత్రము జూడగన్ మదిని - నెమ్మది గల్గెడు పుష్ప జాతులున్
  చైత్రపు శోభలంగన ! న - సహ్యము గాదె రసఙ్ఞ కోటికిన్
  గాత్రము సప్తమంబుగను - గార్దభ గానము విన్నయంతనే
  _________________________________________
  నెమ్మది = సంతోషము

  రిప్లయితొలగించండి
 3. చిత్రము యేమి లేదు మరి చిత్తము పొంగును యేరికైన నా
  చైత్రపు శోభలన్ గన; నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
  చిత్ర విచిత్ర శబ్దముల చీదర కూతల పిచ్చి గంతులన్
  చిత్రణ జేసి గీతముల చిత్రములందున జూపుచుండినన్.

  రిప్లయితొలగించండి
 4. 'చిత్రము యేమి లేదు ' లో య డాగమం రాకూడదేమో కదా!చిత్రమదేమి లేదు అంటే సరిపోతుందేమో! మాస్టరు గారూ! సందేహం తీరుస్తారా?

  రిప్లయితొలగించండి
 5. చిత్రమదేమొగాని నవ చేలముఁ గట్టిన సుందరాంగియై,
  పత్రపు కెంపులౌ చిగురుపల్లవ ముల్,సుమ సౌరభమ్ముతో,
  చైత్రము యెంత యందముగ సందడి చేసినఁ;సందిలందకన్,
  చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

  రిప్లయితొలగించండి
 6. శాస్త్రి గారు,
  ఉత్తునకు అచ్చు పరంబగుట వలన సంధి యౌను. మీరు సూచించినట్లుగానే పాదపూరక సహాయమంది చిత్రమదేమి లేదని అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 7. గిరి గారూ! సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 8. రాత్రినిఁ గాలిరాదికను, రాగల రోజులఁ, యాగిపోవు;నే
  మాత్రముఁపంకముల్ తిరుగు? మల్లెలు, జాజులు పూచినంతనే
  ధాత్రినిఁ; దేహమంతయును దాల్చును బో,చెమటల్ చిరాకుగా;
  చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

  రిప్లయితొలగించండి
 9. ఆత్రపు తేనెటీగ చని యామని తేనెలు త్రాగు వేళలో
  పాత్రత గల్గు పుష్పపు సువాసన హెచ్చుగ వచ్చు, హృద్యమౌ
  చైత్రపు శోభలం గన; నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
  కుత్రిమ పూలమాలలను క్రొత్తగ తెచ్చి యలంకరింపగన్!!

  రిప్లయితొలగించండి
 10. కృత్రిమ జంత్రవాద్యముల క్రేంకృతు లద్దిన రూపజవ్వనుల్
  నేత్రపు శాపముల్ నటుల నీచపు చేష్టలు రోతఁ సల్పవే
  చిత్రపు దర్శకేంద్రుని కుచిత్తముఁ మొల్చిన చెత్తపాటలన్
  చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్.

  రిప్లయితొలగించండి
 11. చైత్రపు శోభలం గనగఁ జయ్యన నేగుము పల్లె టూళ్ళకున్,
  నేత్రపు విందుగన్ ప్రకృతి, నేస్తము కోయిల తీపి పాటలున్,
  రాత్రుల మల్లె సందడులు రాజిలు! పట్టణ వాసి కెట్లగున్
  చైత్రపు శోభలం గన? నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్!

  రిప్లయితొలగించండి
 12. గాత్రము యెండు టాయె ,మరి గానగ రాదొక నీటి చుక్కయున్,
  నేత్రము మండుటాయె మరి , నేరుగ జూడగ ఎండలాయె, వై
  చిత్రము యేమిటో ,వరుస చిత్రము లన్నియు తేలిపోయె ,నీ
  చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

  రిప్లయితొలగించండి
 13. చైత్రము చిత్రమే మరియు చైత్రము దెచ్చు వసంత మాధురుల్
  ఆత్రము గన్చిగుర్చు పసిడాకులు కంటికి నింపుగ ల్గునా
  చైత్రపు శోభలం గన, నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
  లోత్రము గార్చు, ఈరసము లుట్టి పడె౦డి మోడనన్!

  రిప్లయితొలగించండి
 14. ఎదురుచూపుల ఆత్రము కూడా సహ్యము కానిదే..

  గాత్రము రాగతాళముల,గాన విశేషమహత్తునన్ ,బృహ
  న్మైత్రి ఘటిల్లు చెన్నపురమందు వసంత సభాస్థలుల్ మహ
  చ్చైత్ర శోభలన్ గన, నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
  శ్రోత్ర రసాయనాగమము చూడ్కులవత్తుల వెట్ట జేయుటల్

  రిప్లయితొలగించండి
 15. వసంత్ కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

  హనుమచ్ఛాస్త్రి గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మీ రన్నది నిజమే. అక్కడే కాదు "పొంగును యేరికైన" అన్నచోట కూడా యడాగమం రావద్దు. "పొంగునె/ పొంగుర" అంటే సరి.

  మందాకిని గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నాయి. చైత్రపు శోభలను నిజంగానే అసహ్యంగా మార్చేసారు. అభినందనలు.
  "చైత్రము యెంత" ఇక్కడ యడాగమం రావద్దు కదా. "చైత్ర మదెంత" అంటే సరి.

  సతనారాయణ గారూ,
  మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రవి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. పీతాంబర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "గాత్రము యెండు, చిత్రము యేమిటో" అన్నప్పుడు యడాగమం రావద్దు కదా. "గాత్రము లెండు, చిత్ర మదేమిటో" అందాం.

  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  కాని "టైపాట్లు" ఉన్నాయి. చివరి పాదంలో గణాలు సరిపోలేదు.

  గిరి గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. రాత్రుల పండువెన్నెలలు రాగము తీసెడి రంకు కోకిలల్
  మైత్రినటించు తెమ్మెరలు మారుడు యౌవన దేహకాంతులున్
  శాత్రవులౌచు చిత్తముల సాంతముగా విరహాగ్ని రేపగా
  చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

  రిప్లయితొలగించండి
 18. ఫణిప్రసన్న కుమార్ గారూ,
  సహింపరాని విరహాగ్నిని వివరిస్తూ చక్కని పూరణ నందించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. మిత్రుఁడు లేఁతవాఁడగుట మీనపతాకుఁడు సందడించఁగా
  గాత్రకచేరి సేసెడి పికాళి వినంగఁ దలంపనొక్కొ? యీ
  చైత్రపు శోభలం గనన? సహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
  క్షాత్రము సేసినన్ నవవసంతుఁడు డెందము నెంత కొట్టినన్?

  రిప్లయితొలగించండి
 20. మిత్రులు హోలి యాడుటకు మిక్కిలి పోరును జేయగా ఛిఛీ
  శత్రులు భంగు త్రాగుచును జంపులు జేయుచు భంగ్ర నాడగా
  చిత్రపు కోకిలల్ మదిని చిత్తుగ చేయ కుహూకుహూలతో
  చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

  రిప్లయితొలగించండి