17, ఏప్రిల్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 288 (కల్ల లాడువాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.
సమస్యను పంపిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  __________________________________

  జనుల కీడు జేయు - జగజేత కన్నను
  దొంగ బతుకు , బతుకు - దొరల కన్న
  మంచి మనసు గలిగి - మనుజుల హితముకై
  కల్ల లాడు వాడు - ఘనుడు భువిని !
  __________________________________

  రిప్లయితొలగించండి
 2. ధన్యవాదాలు గురువుగారూ.
  ధనము నొసంగి దాసియు ముదంబునరాణిని మెచ్చెనప్పుడున్
  ఈ సమస్య ఇవ్వ గలరా?

  రిప్లయితొలగించండి
 3. పాత పోస్ట్ లో వ్యాఖ్యను పొరపాటుగ ఇక్కడ పెట్టాను. మన్నించండి.


  నిరత నామ జపము, నిర్మల భక్తితో
  రామ చరితఁ యందె, రాశి గలుగు
  రచనఁదాను చేసి, రామదర్శనమున
  కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.

  రిప్లయితొలగించండి
 4. మనసు నందు కరుణ,మంచితనము గల్గి;
  కూడు గూడు గుడ్డ తోడు నీడ
  లేని వారి జూడ;పూని సాయ పడుట
  కల్లలాడు వాడె,ఘనుడు భువిని.

  రిప్లయితొలగించండి
 5. కిశొర్ గారూ!మనుజ హితమునకు కల్లలాడించారు బాగుంది.
  మందాకిని గారూ!రామ దర్శనమునకల్లలాడించారు బాగుంది.ఉభయులకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. మందాకిని గారూ
  చక్కగా నున్నది !
  శాస్త్రిగారూ !
  బహు చక్కగా నున్నది !

  02)
  ____________________________________

  సర్వ దుఃఖ మయము - సంసార మనియెంచి
  సర్వ పాప ములను - సమయ జేయు
  సత్య మైన దైవ - సన్నిధి జేరుట
  కల్లలాడు వాడె - ఘనుడు భువిని !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 7. శుక్ర నీతి:
  ======
  ఆడు వారియందు, నమ్మాయి పెండ్లికిన్,
  ప్రాణ మాన యర్థ రక్షణ లను,
  సాధు పురుష జంతు సంరక్ష వేళలన్
  కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.

  రిప్లయితొలగించండి
 8. మన్ను తినగ నేను చిన్నవాడనె తల్లి?
  అన్న పలుకు నమ్మకమ్మ నీవు
  నన్ను నమ్మవమ్మ నా నోరుఁ గనుమని
  కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని!!

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ!శుక్ర నీతి బాగా చెప్పారండి.
  జి యస్ యన్ గారూ!చిన్ని కృష్ణుని చూపించారండి !
  ఉభయులకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. మాస్టరు గారూ !నా బ్లాగు ను వీక్షించి అభినందనలు తెలిపినందులకు ధన్యవాదములు.మీరు అనుమతిస్తే శంకరాభరణం నందు నేను చేసిన పూరణలను కూడా నా బ్లాగునందు ఉంచవలేనని భావించుచున్నాను. మీరిచ్చుచున్న ప్రోత్సాహమునకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 11. ధోని జట్టు తుదకు టోర్నమెంటులలోన
  ఆడి గెలిచి చూపె వాడి తనది
  చేయకున్న రన్లు చెలరేగి, గెలుచుట
  కల్ల; ఆడు వాడే ఘనుడు భువిని

  రిప్లయితొలగించండి
 12. (చిన్న సవరణతో)

  ధోని జట్టు తుదకు టోర్నమెంటులలోన
  ఆడి గెలిచి చూపె వాడి తనది
  చేయకున్న రన్లు చెలరేగి, గెలుచుట
  కల్ల; ఆడు వాడె ఘనుడు భువిని

  రిప్లయితొలగించండి
 13. సత్యవంతుడిలను సకలసంపన్నుడు
  మరియు ధర్మ సూక్ష్మ మెరిఁగి నిత్య
  స్వార్ధరహితుఁడై సుజన రక్షణార్ధము
  కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. సత్య మెపుడు బల్కు ,సార్వ భౌముండైన,
  కాటి కాప రాయె నాటి దినము !
  నేటి కాల మందు కాటి భూముల నమ్మి
  కల్ల లాడు వాడు ఘనుడు భువిన !

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్నగారి బ్రాండు తెలిసిపోయింది. వారి పై పద్యం చదివాక వరూధిని వశమయ్యారంటే యెవరు మాత్రం నమ్మరు, మహానుభావా! నా కామెంట్ అజ్ఞాత గా పోస్టు చేస్తున్నాను. కనుక్కోండి ఎవరో చూద్దాం!

  రిప్లయితొలగించండి
 17. అజ్ఞాత గారూ ఆ మాత్రం కనుగొన లేనా.
  బుద్ధి:కర్మానుసారిణీ అంటారు.
  మీ మనసెంత సేపూ అటే లాగేస్తోంటే
  మీరు మాత్రం ఏం చేస్తారులెండి పాపం.

  రిప్లయితొలగించండి
 18. ఏం చేస్తాం లెండీ పాపం, మన:చంచల: అన్నారుగా!-అదే అజ్ఞాత.

  రిప్లయితొలగించండి
 19. వసంత్ కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ కడు రమ్యంగా ఉన్నాయి. అభినందనలు.
  నాకు తెలిసినంత వరకు "జగజ్జేత" అనాలేమో? "జగజేత"ను "జగజెట్టి" చేస్తే ...... ?

  మందాకిని గారూ,
  మనోహరమైన పూరణ మీది. అభినందనలు.

  హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  వారిజాక్షులందు వైవాహికము లందుఁ
  బ్రాణవిత్తమానభంగమందుఁ
  జకితగోకులాగ్రజన్మరక్షణ మందు
  బొంకవచ్చు నఘము వొంద దధిప!
  అన్న శుక్రనీతిని సమస్యాపూరణకు చక్కగా వినియోగించుకున్నారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. సత్యనారాయణ గారూ,
  కృష్ణలీలను చక్కగా ఆవిష్కరిస్తూ మంచి పూరణ చేసారు. అభినందనలు.

  రవీందర్ గారూ,
  మంచి విరుపుతో సమస్యను అద్భుతంగా పూరించారు. అభినందనలు.
  "ధో-టో"లకు యతి చెల్లదు. "ధోని జట్టు చెలగి తుద టోర్నమెంటులో" అందాం.

  చంద్రశేఖర్ గారు,
  మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  "నిత్య స్వార్ధరహితుఁడై" అన్నప్పుడు "త్య" గురు వౌతుంది. "సతము స్వార్ధరహితుఁడై" అందాం.

  పీతాంబర్ గారూ,
  మీ పూరణ సర్వశ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. శాస్త్రి గారూ, వసంతకిశోర్ గారూ,గురువుగారూ,
  ధన్యవాదాలు.
  మిగిలిన పూరణలన్నీ కూడా బాగున్నాయి, వైవిధ్యతతో !
  అభినందనలు.

  రిప్లయితొలగించండి