28, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 322 (కప్పఁ దినెడి పాము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. మిస్సయన్నగారి మెరుపులు యౌరౌర!
  చంద్ర శేఖ రేంద్ర చౌద్యమేమొ!
  నేడు చూడ గాను నేస్తుల యినతీరు!
  కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె

  అయ్యా ! ఇది సరదా వ్యాఖ్యానమే గాని పూరణ కాదు. రోజూ పద్యాలు వచ్చే పేరుతో వాదనలు వినిపించి ఇలా రాశాను.
  అన్యధా భావించకండి.

  రిప్లయితొలగించండి
 2. ఈ మధ్య టి.వి.లో ఒక కార్యక్రమంలో చికెను ఇష్టంగా తింటున్న రామ చిలుకను చూపించారు.

  జనులు,జీవులన్ని జస్టుఫర్ ఛేంజని
  వెజ్జు,నాను వెజ్జు ప్లేసు మారె!
  చిలుక పండ్ల నొదలి చికెను దినదొడగె
  కప్ప దినెడి పాము కసవు మెసగె!

  రిప్లయితొలగించండి
 3. మందాకిని గారూ,
  కప్పకు, పాముకు నేస్తం కట్టారు. బాగుంది. మరి కప్ప ఎవరు? పా మెవరు?

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ "జస్ట్ ఫర్ చేంజ్" పూరణ చమత్కార భరితంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. దారి దోపిడీలు దారుణ హత్యలు
  మరగి నట్టి బోయ; మారె రామ
  నామ మహిమ కవిగ నాడు; విచిత్రమె!
  కప్ప దినెడి పాము కసవు మెసగె!

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  ___________________________________

  మంచి నడత వలయు - మంత్రివర్యులటన్న
  నేడు జూడ , వారు - నేర గాళ్ళె !
  గుడిని మేయు నొకడు; - గుడిలోని లింగమ్ము
  కలిపి మింగ గలుగు - ఘనులు గలరు !
  మేయడాని కేమి - మితమన్నదే లేదు !
  కప్పఁ దినెడి పాము - కసవు మెసఁగె !

  రిప్లయితొలగించండి
 6. కలసి రాని వేళ కల్మాడి ప్రభృతుల్
  కటకటం బడిరదె కటకటాల
  ఎంతవార లైన నీశ్వరు కెరుకె! ఔ!
  కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె.

  రిప్లయితొలగించండి
 7. "పాండురంగ మహత్మ్యం" సినిమాలో
  అన్నగారు (పుండరీకుడు):

  02)
  ___________________________________

  చందమామ వంటి - చక్కనమ్మ మరచి
  తళుకు లాడి వెంట - తరలి నాడు !
  పుండరీకు డపుడు - పోకిరియై , నాడు !
  కప్పఁ దినెడి పాము - కసవు మెసఁగె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 8. ఏక చక్ర పురములో పాండవులు :

  03)
  ___________________________________

  పంచ భక్ష్య ములను - పరమాన్నములతోడ
  ప్రతి దినమును మెసవు - పాండు సుతులు !
  తిరిప మెత్తి క్షుత్తు - తీర్చుకొనిరి ; నాడు !
  కప్పఁ దినెడి పాము - కసవు మెసఁగె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 9. రోజూ" పద్యాలు"వచ్చే పేరుతో "వాదనలు "

  గురువుగారూ!

  అలాక్కాదండీ! పాముల సహజ ఆహారం కప్పలైతే మీ సమస్యలో కసవు మేసింది
  కవిసోదరుల ."స హజరీతి పద్యపాటవ వైభవం" అయితే నిన్నటి చిఱుయలకలు "సమస్యపూరణంలోని అసహజ స్థితి" అని భావము

  రిప్లయితొలగించండి
 10. రాయల సీమలో రాగి సంకటి మెసవిన
  శ్రీ నాథ కవి సార్వ బౌముడు :

  04)
  ___________________________________

  సిరిని పేరున గల - శ్రీనాథ కవిరాజు
  విభుల తోడ గుడిచె - విందులెన్నొ !
  చివరి రోజు లందు - సిరి పోయె , శని పట్టె !
  రాగి జావ త్రాగె - భోగ మనుచు !
  విధియె జేయు నెన్నొ - వింతల నిలలోన
  కప్పఁ దినెడి పాము - కసవు మెసఁగె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 11. "విధియె జేయు నెన్నొ - వింతల నిలలోన" -- వింతలు అంటే ఏమన్నా యతి ప్రాసల తప్పు అవుతందని అంటారా వసంత కిశోర్ గారూ. వింతలు అని చదువుకుంటుంటే బాగుందని పిస్తోంది.

  రిప్లయితొలగించండి
 12. కాటి కాపరిగా మారిన హరిశ్చంద్ర చక్రవర్తి :

  05)
  ___________________________________

  తానొకటి దలచిన - దైవమొకటి దల్చు !
  కాల మంత కఠిన - కర్కశంబు !
  సాటి లేని మేటి - సార్వ భౌము డిలను
  కూడు గూడు తోడు - వీడె నకట !
  కాటి కాపు కాసె - కాసింత ముద్దకై
  కప్పఁ దినెడి పాము - కసవు మెసఁగె !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 13. రావుగారూ !
  అక్కడ ఉన్నదదే !
  వింతలను + ఇలలోన = వింతల నిలలోన

  రిప్లయితొలగించండి
 14. "విధియె జేయు నెన్నొ - వింతలు ఇలలోన" అని చదువుకుంటే బాగున్నట్లు అనిపిస్తోంది. "నెన్నో వింతల" కన్నా "నెన్నో వింతలు" బాగున్నట్లు అనిపించింది నాకు.

  రిప్లయితొలగించండి
 15. రోజు కొక్క ప్రాణి మోజుగా లాగించె,
  భయము కలుగ జేసి, బకుడు నాడు.
  భీమ సేను డతని భీకరంబుగజంప ,
  కప్పు దినెడు పాము కసవు మెసగె !

  రిప్లయితొలగించండి
 16. భారతమ్ము నెంత భాసిలె విద్యలు,
  యాదిగుర్వుగాను యలరె నొక్కొ!
  దేవభాషనొదలి దేశము చెడెనయా,
  కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె !

  రిప్లయితొలగించండి
 17. చెత్త తోటి బొమ్మ చేసేటి పనివాడు;
  కప్ప బొమ్మ జేసి, కడప మీద
  బెట్టి మరచెనపుడె, బేరమొచ్చివెదుక
  కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె.

  రిప్లయితొలగించండి
 18. పగటి పూట కనగ ఫక్కుమనె చుక్కలు
  నిశిని గాంచి నంత నెండ వేడి
  గలుగు వింత లెన్నొ కలియుగంపు మహిమ
  కప్ప దినెడి పాము కసవు మెసగె !

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు ధన్యవాదాలు. వసంతకిశోర్ గారు పద్యధార కురిపించారు- పాలిటిక్స్ నుంచి పాండవులు, శ్రీనాథుడినుంచి సత్య హరిశ్చంద్రుడి దాకా. పూరణలు బాగున్నాయి.

  రిప్లయితొలగించండి
 20. లంచగొండి పరులు , లాలూచి పడువారు
  *గడ్డి తినుటకు వెనుకాడ బోరు !
  చిత్రమేమి గాదు! చెప్పడానికి నేడు
  కప్ప దినెడి పాము కసవు మెసగె !

  (* నానా గడ్డి కరిచెదరు కదా ! )

  రిప్లయితొలగించండి
 21. దెనుగు భాష మనది తేనేలొలుకు ననగ
  పరుల భాష కొఱకు పరుగు లిడుచు
  నేల విడిచి సాము నేరీతి చేయదగు
  కప్ప దినెడి పాము కసవు మెసగె !

  రిప్లయితొలగించండి
 22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మనోహరంగా ఉంది మీ "రామ నామ మహిమ" పూరణం. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  ఎక్కడెక్కడి కథలను గుర్తుకు తెస్తున్నారు? పురాణాల పూరణలు బహు పసందుగా ఉన్నాయి. అభినందనలు.
  "వింతల నిలలోన" అనడమే బాగుంది.

  మిస్సన్న గారూ,
  పూరణకు మంచి విషయాన్ని ఎన్నుకొని మెప్పించారు. బాగుంది. అభినందనలు.
  "ప్రభృతుల్" అంటే సగణం అవుతున్నది. "ప్రభృతులు" అంటే నలమై గణదోషం పోతుంది. "శంకరు కెరుకె" కన్నా "శంకరు డెరుగు" అంటే బాగుంటుందేమో?

  మందాకిని గారూ,
  "స్పర్ధయా వర్ధతే విద్యా" అన్నారు. వాదనలు ఉంటేనే సందేహ నివృత్తి జరుగుతుంది. మనోల్లాస కాలక్షేపం కూడా. ఏమంటారు?

  రిప్లయితొలగించండి
 23. లక్కరాజు వారూ,
  మీరు వెంటవెంటనే వ్యాఖ్యానిస్తూ చురుకుగా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.
  వసంత కిశోర్ గారి సమాధానంతో మీ సందేహం తీరిందనుకుంటాను.

  మంద పీతాంబర్ గారూ,
  చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  మందాకిని గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  అయితే అవసరం లేని చోట్ల యడాగమాలను "ఒ"దిలి పెట్టరా? మీ పద్యానికి నా సవరణలు (బ్రాకెట్లలో) ...
  భారత(మున) నెంత భాసి(ల్లెనో) విద్య
  (లా)దిగు(రువు గాగ) యలరె నొక్కొ!
  దేవభాష(ను విడి) దేశము చెడెనయా,
  కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె !

  రిప్లయితొలగించండి
 24. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పూరణలోని చమత్కారం బాగుంది. అభినందనలు.
  చిన్న సవరణలు ....
  చెత్త తో(డ) బొమ్మ చే(సెడు) పనివాడు;
  కప్ప బొమ్మ జేసి, కడప మీద
  బెట్టి మరచెనపుడె, బేర (మొకటి వచ్చె)
  కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
  కాకుంటే కొన్ని చిన్న లోపాలు.
  "ఫక్కుమనె చుక్కలు " అన్నప్పుడు గణదోషం. "పగలు తారల గన ఫక్కున నవ్వెను" అందాం.
  రెండవ పూరణలో నా సవరణలు (బ్రాకెట్లలో) ...
  (తె)నుగు భాష మనది తే(నె లొల్కు) ననగ
  పరుల భాష కొఱకు పరుగు లిడుచు
  నేల విడిచి సాము నేరీతి చే(తురు)
  కప్ప దినెడి పాము కసవు మెసగె !

  రిప్లయితొలగించండి
 25. మిత్రులందరి పూరణలూ
  ముచ్చటగా నున్నవి !

  చంద్రశేఖరా !
  ధన్యవాదములు !

  శంకరార్యా !
  ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 26. గురువుగారూ,
  నిజమే .విద్యలు, యాది వస్తోందని గమనించనేలేదు."ఒ"దిలేస్తాను.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి