పదిలముగ తనను బెంచిన ముదమారగ తనను మెచ్చు - ముద్దుల గుమ్మే ! బదులుగ తన మంచి పనికి వదినను ముద్దడిగె మఱఁది - పదుగురు చూడన్ ! _______________________________________
వసంత్ కిశోర్ గారూ, మీ మొదటి పూరణలో "చల్దిముద్ద" అడగడం బాగుంది. మంచి పూరణ. రెండవ పూరణలో తల్లిలా పెంచిన వదినను ముద్దడగడం బాగుంది. అభినందనలు. * రవి గారూ, మీ "బువముద్ద" పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. "ఒకనా డొదిన కడ" అన్నప్పుడు "ఒదిన" సాధురూపం కాదు కదా! దానిని "ఒకనా, డుదయమున జని" అంటే ఎలా ఉంటుంది? * హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ బ్రహ్మాండంగా ఉన్నాయి. "కోవ - దినను" మంచి విరుపు. అభినందనలు. * గిరి గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. * ఫణిప్రసన్న కుమార్ గారూ, మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * లక్కరాజు వారూ, అజ్ఞాత గారూ, రాఘవ గారూ, ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
___________________________________
ముదమున పిల్లల కందర
కుదయమునే చల్ది గుడుపు - కోమలి ,చేరెన్
పదివత్స రముల కుర్రడు
వదినను ముద్దడిగె మఱఁది - పదుగురు చూడన్ !
___________________________________
ముదమగు మఱిదిని జూడగ
రిప్లయితొలగించండివదినకు. పసిబాలుడు మఱి . బాలుడు ఒకనా
డొదిన కడఁ జని ముఱిపెముఁ బు
వ దినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.
కిశోర్ గారూ! మీరు చల్ది అన్నం పెట్టారు కదా! నేను బడికి పంపిస్తాను.
రిప్లయితొలగించండికదలను నడకను బడికన
వదలకనే ముద్దు జేసి వాహనమున తా
వదలిన; మూతిని ముడుచుచు
వదినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్!
రవి గారూ!వదినను బువ దినను ముద్ద డిగించారు.పసివాడు కదా.. బువ్వ అనలేడులే.. బాగుంది.అభినందనలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీరు మఱదిని బడికి పంపించటం బాగుంది.
రిప్లయితొలగించండిరవిగారూ !
రిప్లయితొలగించండిమీ "బువ "చాలా రమ్యంగావుంది !
శాస్త్రీజీ !
సెన్సారు అభ్యంతరం లేని మీ ముద్దు
కమ్మగా ఉంది !
లక్కరాజు గారూ! కిశోర్ గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి02)
రిప్లయితొలగించండి_______________________________________
పదిలముగ తనను బెంచిన
ముదమారగ తనను మెచ్చు - ముద్దుల గుమ్మే !
బదులుగ తన మంచి పనికి
వదినను ముద్దడిగె మఱఁది - పదుగురు చూడన్ !
_______________________________________
సుదతిని సీమంతిని స
రిప్లయితొలగించండిన్ముదితను సుస్మితవదనను మురిపెమ్ముల దౌ
హృద హృత్పాలిని తమ్ముని
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్
గిరీజీ !
రిప్లయితొలగించండిఅద్భుతం ! మీ పూరణ !
తమ్ముడి వదినను అడిగినది ఆమె భర్తే గదా !
మరి చివరి పాదంలో " మరది "ఎవరు ?
మరదికి భర్త అనే అర్థం ఏమైనా ఉన్నదా ?
ముదముగ పుట్టిన రోజున
రిప్లయితొలగించండిపది యేడులు నిండినట్టి పార్థుని కొరకై
పదపడి నిడ లడ్డును,కో
వ;దినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్!
శాస్త్రీజీ !
రిప్లయితొలగించండిమీ కోవా ముద్దకూడా
తియ్యగా ఉన్నది !
రెండవ పాదం ...
రిప్లయితొలగించండిపది యేడులు నిండ,వదిన పార్థుని కొరకై
అని వుంటే ఇంకా వివరంగా వుంటుందనుకొంటాను.
కిశోర్ గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండికొంపదీసి మార్తాండ కథలు గానీ చదివారా ఏంటి?
రిప్లయితొలగించండికొన్ని నెలల తఱువాత..
రిప్లయితొలగించండి"మృదుకోమలి ముద్దుల చి
న్నది గారపుమూట బోసినవ్వుల బులిపె
న్నిధి" యంచు పట్టి చెక్కిట
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్
కిశోర్ గారు, మొదటి పద్యము వదిన నుడువని నర్మగర్భితము :-)
ఇతగాడెవడో ప్రతిసందర్భములోనూ పదుగురు చూసేటప్పుడే చుంబనాసక్తి కనబరుస్తున్నాడు...
సదనమున వండి సుదతియు
రిప్లయితొలగించండిముదమున నందరికి చేతిముద్దలు వేయన్
వదినా నాకొక ముద్దని
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్
ఫణిగారూ, మీ పూరణ అత్యుత్తమం. భలే. ముద్దుగా ఇంత ముద్ద పెట్టారు.
రిప్లయితొలగించండిరాఘవగారూ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ మొదటి పూరణలో "చల్దిముద్ద" అడగడం బాగుంది. మంచి పూరణ.
రెండవ పూరణలో తల్లిలా పెంచిన వదినను ముద్దడగడం బాగుంది. అభినందనలు.
*
రవి గారూ,
మీ "బువముద్ద" పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
"ఒకనా డొదిన కడ" అన్నప్పుడు "ఒదిన" సాధురూపం కాదు కదా! దానిని "ఒకనా, డుదయమున జని" అంటే ఎలా ఉంటుంది?
*
హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బ్రహ్మాండంగా ఉన్నాయి. "కోవ - దినను" మంచి విరుపు. అభినందనలు.
*
గిరి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
*
ఫణిప్రసన్న కుమార్ గారూ,
మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
లక్కరాజు వారూ, అజ్ఞాత గారూ, రాఘవ గారూ,
ధన్యవాదాలు.
మొదటిది పుట్టిన రోజో
రిప్లయితొలగించండివదినా! నా పిల్లవాడు వచ్చెను నీకై
"పెద తల్లి ప్రేమ మిన్న"ని,
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.
మిస్సన్న గారూ మంచి ట్విస్ట్ ఇచ్చారు.
రిప్లయితొలగించండిశంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ! పిల్లవాని కోసం మఱది చేత ముద్దు అడిగించిన విధం .. భేష్.. అభినందనలు.
గిరి గారూ! ఫణి గారూ! మంచి పూరణలు ... అభినందనలు.
మదనుడు సందడి చేసెనొ,
రిప్లయితొలగించండిమదిరా పానమున యన్న మరిచెనొ తనువున్
పదములు, పెదవులు తడబడ
వదినను ముద్దడిగె!!! మఱఁది పదుగురు చూడన్
లక్కరాజువారూ గోలి వారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశంకరార్యా, నా పద్యం మీ సవరణతో -
రిప్లయితొలగించండిముదమగు మఱిదిని జూడగ
వదినకు. పసిబాలుడు మఱి . పసిగొని ఒకనా
డుదయమునఁ జని ముఱిపెముఁ బు
వ దినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.
ఈ రోజు మేన్ ఆఫ్ ద మాచ్ ఫణిగారే.
వదలక గడుసాడపడచు
రిప్లయితొలగించండివదినను ముద్దడిగె, మఱఁది పదుగురు చూడన్
పదములకును ప్రణమిల్లెను,
ముదిత వివాహ దినమందు మోదము తోడన్!!
జిగురు సత్యనారాయణ గారూ మఱఁది ని పదుగురు తో కలిపేసారు. చూడటానికి బాగుంది.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండితన కొడుక్కు ముద్దివ్వ మని మరిది వదినను అడిగిన మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
పీతాంబర్ గారూ,
మరిది చూస్తుండగా అన్నయ్యే వదినను ముద్దడిగిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
రవి గారూ,
నా సవరణ మీకు నచ్చినందుకు సంతోషం.
"ఫణి" గారి పూరణ విషయంలో నా అభిప్రాయం అదే.
సత్యనారాయణ గారూ,
ఆడపడుచుతో ముద్దు అడిగించి మీరే గడుసుతనం చూపించారు. చాలా బాగుంది. అభినందనలు.
లక్కరాజు వారూ,
చాలా సంతోషం. మీ రిలాగే కవిమిత్రుల పూరణలను మెచ్చుకుంటె వారి ఉత్సాహం ద్విగుణీకృత మౌతుంది. కవిత్వానికి కావలసింది మెచ్చుకోలు, ప్రోత్సాహమే కదా. ధన్యవాదాలు.
నా పూరణ ....
రిప్లయితొలగించండిపద మంటి వీడుకొనియెన్
వదినను, ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్
మది మెచ్చు నన్న కూఁతురు
నుదయమ్మున నూరి కేఁగ నుండిన వేళన్.
రవిగారూ, శంకరార్యా!
రిప్లయితొలగించండిధన్యవాదాలు. అందరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. నా పద్యానికి రవిగారి పద్యమే కద స్ఫూర్తి!
శంకరార్యా! అన్నకూతురిని,వదినను వూరికి పంపుతున్న మరది పరంగా పూరించిన విధము చాలా బాగుంది.
రిప్లయితొలగించండిగురువుగారూ మీ పూరణ అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిపదుగురిలో సిగ్గు పడెడి
రిప్లయితొలగించండిముదితను జూపించి తనదు ముద్దుల గుమ్మన్,
"ఇదిగో! నీ చెల్లాయి" కి
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వదినమ పంచగ చేతిని
రిప్లయితొలగించండికదలుచు దద్యోజనమును గారాబముగా
కుదురుగ నోటిని తెరచుచు
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్