చిట్టి బుడతడు తా చిరంజీవి యయ్యె,సత్యవంతుడు జూడగ చచ్చి లేచె, శివుడు, శ్రీమాత, భక్తుల చెంత నుండధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
కాలఁ దన్నఁగఁ యముడను కదలె శివుఁడు;వరము లొసగిన యమరాజు వనిత పతికిమరల జీవన మిచ్చిఁదాఁమరలి పోయె ;ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె
గీత జూపిన మార్గమే గీటు రాయి పనుల బట్టియే వచ్చును ఫలిత మెపుడు వ్రాత యుండిన చాలదు చేత లేక ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
'తాత' వ్రాయుమ నంగను 'దాత' వ్రాసె!'దాత' వ్రాయవే యన్నను తాను వ్రాసె 'ధాత'! వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యెతమ్ము డౌటను కుర్రడు తగదు తిట్టఁ.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !01)_____________________________________భక్తి గలిగి యుండ - భయములే దిలలోన !స్థిరము , యశము గొనెను - చిరుత యొకడు సకల పాప హరుడు - శంభునే మదిగొల్చి !ధాత వ్రాసిన వ్రాతలె - తప్పు లయ్యె !______________________________________చిరుత = చిన్ని మార్కండేయుడు
తప్పక జరిగి తీరును ధాత చేతి వ్రాత, నిజమిది తెలియును పండితులకు ధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యెప్రీతిగఁ గన కంప్యూటరు జాతకమ్మె!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సర్వుల లలాట లిఖితంబు లుర్విఁ బనుపధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యెననుచు తృప్తి జెందకుము, కన౦గ నగునెకార్య కారణ బంధమ్ము కట్టె దుటను?
కవి మిత్రులకు నమస్కృతులు.అందరి పూరణలూ బాగున్నాయి. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.మా అత్తగారి దశదిన కర్మకాండ కోసం వరంగల్ వెళ్తున్నాను. రేపూ అక్కడే. అందువల్ల మీ పూరణలకు వెంటనే స్పందించలేకున్నాను. మన్నించండి.
చిట్టి బుడతడు తా చిరంజీవి యయ్యె,
రిప్లయితొలగించండిసత్యవంతుడు జూడగ చచ్చి లేచె,
శివుడు, శ్రీమాత, భక్తుల చెంత నుండ
ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
కాలఁ దన్నఁగఁ యముడను కదలె శివుఁడు;
రిప్లయితొలగించండివరము లొసగిన యమరాజు వనిత పతికి
మరల జీవన మిచ్చిఁదాఁమరలి పోయె ;
ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె
గీత జూపిన మార్గమే గీటు రాయి
రిప్లయితొలగించండిపనుల బట్టియే వచ్చును ఫలిత మెపుడు
వ్రాత యుండిన చాలదు చేత లేక
ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
'తాత' వ్రాయుమ నంగను 'దాత' వ్రాసె!
రిప్లయితొలగించండి'దాత' వ్రాయవే యన్నను తాను వ్రాసె
'ధాత'! వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె
తమ్ము డౌటను కుర్రడు తగదు తిట్టఁ.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
_____________________________________
భక్తి గలిగి యుండ - భయములే దిలలోన !
స్థిరము , యశము గొనెను - చిరుత యొకడు
సకల పాప హరుడు - శంభునే మదిగొల్చి !
ధాత వ్రాసిన వ్రాతలె - తప్పు లయ్యె !
______________________________________
చిరుత = చిన్ని మార్కండేయుడు
తప్పక జరిగి తీరును ధాత చేతి
రిప్లయితొలగించండివ్రాత, నిజమిది తెలియును పండితులకు
ధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యె
ప్రీతిగఁ గన కంప్యూటరు జాతకమ్మె!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసర్వుల లలాట లిఖితంబు లుర్విఁ బనుప
రిప్లయితొలగించండిధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యె
ననుచు తృప్తి జెందకుము, కన౦గ నగునె
కార్య కారణ బంధమ్ము కట్టె దుటను?
కవి మిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ బాగున్నాయి. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
మా అత్తగారి దశదిన కర్మకాండ కోసం వరంగల్ వెళ్తున్నాను. రేపూ అక్కడే. అందువల్ల మీ పూరణలకు వెంటనే స్పందించలేకున్నాను. మన్నించండి.