తల్లికి యొత్తిడి యింటను చెల్లికి లగ్నంబు నక్క సీమంతంబున్ ఎల్లరు మురియగను కవలపిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే.
చెల్లక మన సంస్కృతి విడియొల్లని సహ జీవనంబె యున్నతమనుచున్ చిల్లర తనమున తిరుగగ పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే!!
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !01)_____________________________________తల్లియు తండ్రియు వదలినచిల్లర వారిని కరుణను - జేర్చిన గృహమున్ఉల్లము కరుగగ మెల్లన !పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే!_____________________________________
మిస్స్సన్నగారూహించిన కవలపిల్లలు,జి యస్ యన్ గారూహించిన చిల్లరపిల్లల పూరణలు చాలా బాగున్నవి.ఉభయులకు అభినందనలు.నేనూ ట్విన్స్ వైపే... చెల్లికి పెళ్ళగు నీనెలమెల్లగ తన నెలలు నిండె, మేనక డాక్టర్, పిల్లలు ట్విన్సని జెప్పెను, పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!
కిశోర్ గారూ! పూరణ కరుణ రసాత్మకంగా వుంది.ఇంకొంచెం వివరంగా వుంటే బాగుంటుంది.అభినందనలు.
మిస్సన్న గారూ,చెల్లెలి పిండ్లికి ముందే అక్కకు కవలలు కలిగారన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.సత్యనారాయణ గారూ,అతిస్వేచ్ఛ వల్ల అనర్థాన్ని మీ పూరణలో చక్కగా తెలిపారు. బాగుంది. అభినందనలు.వసంత్ కిశోర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.హనుమచ్ఛాస్త్రి గారూ,మీరూ మిస్సన్న గారి బాట పట్టినా పద్యం వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.
శంకరార్యా! ధన్యవాదములు.
పిల్లలు లేరని వగచెడితల్లులు గలరే, గనంగ ధరలో! ఎవఁడో పుల్లయ మోసము చేయఁగపిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!
శాస్త్రిగారూ !ధన్య వాదములు !అనాథ పిల్లల్ని ఇంటికి తెచ్చి సుమతి పెంచుకుంటున్నదని నా భావం !కందంలో ఇంతకన్నా సాధ్యం కాదేమో !మీ పూరణా మందాకిని గారి పూరణాముచ్చటగా నున్నవి !
కీశోర్ జీ !ధన్యవాదములు.మందాకిని గారూ! యెవడో పుల్లయ్య పై చెప్పిన కందం చదువుట కందంగా వుంది.అభినందనలు.
తెల్లని కాంతి నలుదెసలజల్లు ఉదయభానుని గని చకితం బవగాఝల్లుమనె తనువు కుంతికిపిల్లలు కలిగిరి సుమతికి పెండ్లికి ముందే ! (మధ్యాహ్నం నుండి "నెట్" లేని కారణంగా ఇప్పుడు కుదిరింది.)
అందమైన పూరణలను మరింత ఆనందంగా పూరిస్తూ , శంకరుని గళమున మనోజ్ఞంగా అలంకరిస్తూ ఆప్యాయతాను రాగాలను పంచుతున్న ప్రియమైన సోదరులకు , సోదరి మందాకినీ గారికి నూతన సంవత్సర ఖర నామ ఉగాది శుభా కాంక్షలు.
చెల్లెలి పెండ్లికి సుమతిని మెల్లగ రమ్మనగ నేను మీరిన నెలలన్ చల్లగ వచ్చెను కబురది: "పిల్లలు గలిగిరి సుమతికి" పెండ్లికి ముందే
ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లరి జేయుచును సుమతి పిల్లులు రెండింట్ని తెచ్చి పెంచగ ముదమున్ కొల్లలు కొల్లలు పిల్లులపిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే
తల్లికి యొత్తిడి యింటను
రిప్లయితొలగించండిచెల్లికి లగ్నంబు నక్క సీమంతంబున్
ఎల్లరు మురియగను కవల
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే.
చెల్లక మన సంస్కృతి విడి
రిప్లయితొలగించండియొల్లని సహ జీవనంబె యున్నతమనుచున్
చిల్లర తనమున తిరుగగ
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
_____________________________________
తల్లియు తండ్రియు వదలిన
చిల్లర వారిని కరుణను - జేర్చిన గృహమున్
ఉల్లము కరుగగ మెల్లన !
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే!
_____________________________________
మిస్స్సన్నగారూహించిన కవలపిల్లలు,జి యస్ యన్ గారూహించిన చిల్లరపిల్లల పూరణలు చాలా బాగున్నవి.ఉభయులకు అభినందనలు.నేనూ ట్విన్స్ వైపే...
రిప్లయితొలగించండిచెల్లికి పెళ్ళగు నీనెల
మెల్లగ తన నెలలు నిండె, మేనక డాక్టర్,
పిల్లలు ట్విన్సని జెప్పెను,
పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!
కిశోర్ గారూ! పూరణ కరుణ రసాత్మకంగా వుంది.ఇంకొంచెం వివరంగా వుంటే బాగుంటుంది.అభినందనలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిచెల్లెలి పిండ్లికి ముందే అక్కకు కవలలు కలిగారన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
సత్యనారాయణ గారూ,
అతిస్వేచ్ఛ వల్ల అనర్థాన్ని మీ పూరణలో చక్కగా తెలిపారు. బాగుంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
మీరూ మిస్సన్న గారి బాట పట్టినా పద్యం వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపిల్లలు లేరని వగచెడి
రిప్లయితొలగించండితల్లులు గలరే, గనంగ ధరలో! ఎవఁడో
పుల్లయ మోసము చేయఁగ
పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!
శాస్త్రిగారూ !
రిప్లయితొలగించండిధన్య వాదములు !
అనాథ పిల్లల్ని ఇంటికి తెచ్చి సుమతి
పెంచుకుంటున్నదని నా భావం !
కందంలో ఇంతకన్నా సాధ్యం కాదేమో !
మీ పూరణా
మందాకిని గారి పూరణా
ముచ్చటగా నున్నవి !
కీశోర్ జీ !ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమందాకిని గారూ! యెవడో పుల్లయ్య పై చెప్పిన కందం చదువుట కందంగా వుంది.అభినందనలు.
తెల్లని కాంతి నలుదెసల
రిప్లయితొలగించండిజల్లు ఉదయభానుని గని చకితం బవగా
ఝల్లుమనె తనువు కుంతికి
పిల్లలు కలిగిరి సుమతికి పెండ్లికి ముందే !
(మధ్యాహ్నం నుండి "నెట్" లేని కారణంగా ఇప్పుడు కుదిరింది.)
అందమైన పూరణలను మరింత ఆనందంగా పూరిస్తూ , శంకరుని గళమున మనోజ్ఞంగా అలంకరిస్తూ ఆప్యాయతాను రాగాలను పంచుతున్న ప్రియమైన సోదరులకు , సోదరి మందాకినీ గారికి నూతన సంవత్సర ఖర నామ ఉగాది శుభా కాంక్షలు.
రిప్లయితొలగించండిచెల్లెలి పెండ్లికి సుమతిని
రిప్లయితొలగించండిమెల్లగ రమ్మనగ నేను మీరిన నెలలన్
చల్లగ వచ్చెను కబురది:
"పిల్లలు గలిగిరి సుమతికి" పెండ్లికి ముందే
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అల్లరి జేయుచును సుమతి
రిప్లయితొలగించండిపిల్లులు రెండింట్ని తెచ్చి పెంచగ ముదమున్
కొల్లలు కొల్లలు పిల్లుల
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే