10, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (లంచము మేయువారలె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
లంచము మేయువారలె క
ళంకవిదూరులు నీతివర్తనుల్.
ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _________________________________________

    మంచికి లేదు కాలమిట - మారెను నీతికి యర్థమే సుమా !
    ఎంచగ నేటి కాలమున - ఎక్కువ నెవ్వరు దోచు కొందురో
    సంచిత మైన పాపములు; - సంపద నెవ్వరు దాచు కొందురో
    లంచము మేయు వారలె, క - ళంక విదూరులు ,నీతి వర్తనుల్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  2. వసంత్ కిశోర్ గారూ,
    ఇంతవేగంగా స్పందించినందుకు ధన్యవాదాలు.
    ప్రస్తుత లోకరీతిని చక్కగా వివరిస్తూ మంచి పూరణ చేసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. గురువర్యులకు, అందఱికీ వందనములు.

    వసంత కిశోర్ జీ బహు చక్కని పూరణ చేసారు.

    కొంచెము నైన సిగ్గు దమ కుండదొ లజ్జయు మంటఁ గల్సెనో
    మించిన యాశ దాస్యమున మెప్పుగఁ గూర్చగ శ్రీలు సంపదల్
    వంచుచు శీర్షముల్, తలల వంపులె మేలుగఁ గాంచువారలన్
    లంచము మేయు వారలె కళంక విదూరులు నీతి వర్తనుల్ !!!

    రిప్లయితొలగించండి
  4. సంచిత పాప కర్మమిది సజ్జనపాళికి. సద్విదూరులై
    పొంచి వసించు దుర్జనులు పూజ్యుల నెంచి హసించు. లంచముల్
    మంచిది కాదు మీకనిన మానము ప్రాణము తీయు!చూడగా
    లంచము మేయు వారలె కళంక విదూరులు నీతి వర్తనుల్!

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా !
    ధన్యవాదములు !

    మూర్తీజీ !
    ధన్యవాదములు !
    మీ పూరణ కూడా చక్కగా నున్నది !

    చింతా వారి పూరణ కూడా బహు చక్కగ నున్నది !

    రిప్లయితొలగించండి
  6. 02)
    _________________________________________

    కాంచగ దేశమం దిపుడు - కారణ మొందెను నీతియన్నదే !
    ఎంచరు పాపమంచు మది - నేలనొ యీ విపరీత పోకడల్ !
    వంచన చేసి లోకమును - బంధుల మిత్రుల నేక రీతిగా
    చంచల మైన సంపదలె - శాశ్వత మంచు దలంచి నిత్యమున్
    లంచము మేయు వారలె,క - ళంక విదూరులు ,నీతి వర్తనుల్ !
    _________________________________________

    కారణ = మరణము

    _________________________________________

    రిప్లయితొలగించండి
  7. నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రామకృష్ణా రావు గారూ,
    మీ పూరణ ప్రశస్తమై అలరిస్తున్నది. ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    పంచపాదిగా మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. నరసింహ మూర్తి గారూ,
    సవరణ తరువాత మీ పద్యం కవితా సుగంధంతో గుబాళిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ చింతా రామకృష్ణా రావు గారి పూరణ మనోహరముగా ఉంది. కిశొర్ జీ ధన్యవాదములు, కాని రాత్రి పడుకొన్నాక నా పూరణ నాకే నచ్చ లేదు. ఇంచుక సవరించాను.

    ఇంచుక నైన సిగ్గు దమ కేలని లజ్జను ఆహుతిచ్చుచున్
    మించిన యాశ దాసులయి మెప్పుగఁ బొందగ శ్రీలు సంపదల్
    వంచన మార్గ మందు తల వంపులు మేలుగఁ గాంచు వారలన్
    లంచము మేయు వారలె కళంక విదూరులు నీతి వర్తనుల్ !

    రిప్లయితొలగించండి
  10. కాంచగ భారతావనిని కర్కము రీతిగ పట్టెనో గదా
    లంచము మేయువారలె, కళంకవిదూరులు నీతివర్తనుల్
    కుంచిత మార్గ దూరులను కొంచము నైనను కానజాలమో,
    త్రుంచగ లంచగొండులను తొందర చేయుము భారతీయుడా!!

    కర్కము = ఎండ్రి

    రిప్లయితొలగించండి
  11. వంచన జేయువారలె ప్రపంచమునందునదెందు జూడగా
    లంచము మేయువారలె, కళంకవిదూరులు నీతివర్తనుల్
    సంచితపుణ్యకీర్తులును సంతసమంద నధర్మ దైత్యు నే
    డంచితరీతి బోరితివి అన్నహజారె! నమస్సు నీకయా!

    రిప్లయితొలగించండి
  12. వంచనజేయు కౌరవులు వందగ జూడగ యుండిరే గదా
    లంచము మేయువారలె!కళంక విహీనులు,నీతివర్తనుల్
    యెంచగ పాండు పుత్రువలె యేవురె యుండిరి, ఐననేమిలే
    త్రుంచగ బూను 'అన్న 'లకు తోడుగ యుండును ధర్మ దేవతే!

    (అన్న = అన్నా హజారే)

    రిప్లయితొలగించండి
  13. సత్యనారాయణ గారూ,
    సందేశాత్మకమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    నే నూహించిన అన్నా హజారే ప్రస్తావన మీనుండి వచ్చినందుకు సంతోషం. కాలోచితమైన పూరణ మీది. అభినందనలు.
    "ప్రపంచమునందునదెందు జూడగా" అనేదాన్ని "ప్రపంచమునం దెటనైన జూడగా" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  14. గడ్డిని జూచియే గలుగు గాడిద కైనను సంతసం సుమీ ౧
    గడ్డిని జూపగా వెనుక గన్నులు మూసియే సంతకంబులన్
    గడ్డియె గడ్డు కాలమును గూర్చి మినై దెలుపంగ మానవుల్
    లంచము మేయు వారలెక ళంక విదూరులు నీతి వర్తనుల్ !

    గడ్డి = లంచము

    రిప్లయితొలగించండి
  15. గడ్డిని జూచియే గలుగు గాడిద కైనను సంతసం సుమీ ౧
    గడ్డిని జూపగా వెనుక గన్నులు మూసియే సంతకంబులన్
    గడ్డియె గడ్డు కాలమును గూర్చి మినై దెలుపంగ మానవుల్
    లంచము మేయు వారలెక ళంక విదూరులు నీతి వర్తనుల్ !

    గడ్డి = లంచము

    రిప్లయితొలగించండి
  16. శంకరయ్య గారూ, మీ సవరణ చాలా ఉత్తమంగా ఉన్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. పెద్దలు చింతా రామ కృష్ణా రావు గారి పూరణ నీతి బోధకంగా అలరారుతోంది.
    మిత్రులఅందరి పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి.

    మించిన రావు పంచుకొన మేలగు స్కాములు దండు కొందమా
    యెంచగ లక్ష కోట్ల నిక నిచ్చుచు స్పెక్ట్రము నంచు పెద్దలే
    వంచన చేసినా రకట! వంచి శిరమ్ముల కృంగ పౌరులున్!
    లంచము మేయువారలె కళంకవిదూరులు నీతివర్తనుల్!

    రిప్లయితొలగించండి
  18. వరప్రసాద్ గారూ,
    మీ ప్రయత్నం మెచ్చుకోదగింది. అభినందనలు.
    అయితే కొన్ని అల్పదోషాలు .... వ్యావహారిక అనుస్వార రూపం (సంతసం) పద్యరచనలో వాడరాదు. ముప్రత్యయం (ము, మ్ము, ంబు) తోనే ప్రయోగించాలి. "మినై దెలుపంగ" అర్థం కాలేదు. వీలు వెంబడి సవరిస్తాను.

    మిస్సన్న గారూ,
    వారాంతపు సమస్యకు వారాంతంలోనే పూరణ పంపారు. సంతోషం!
    మనోహరమైన పూరణ మీది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. శంకరాభరణం వృత్త సమస్య

    "లంచము మేయువారలె కళంకవిదూరులు నీతివర్తనుల్"

    వంచరు శీర్షముల్ మొలలు వంచన చేయరు నమ్మువారినిన్
    కొంచెము భేదమున్ గనరు గోముగ జూతురు పిన్న పెద్దలన్
    లంచము లిచ్చెదర్ సరిగ లాభము లెంచక ముఖ్యమంత్రికిన్
    లంచము మేయువారలె క
    ళంకవిదూరులు నీతివర్తనుల్

    (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

    రిప్లయితొలగించండి