ఎందరికో ఆరాధ్యదైవం, ఆధ్యాత్మిక గురువు,
మానవసేవే మాధవసేవ అంటూ ఎన్నో సమాజహితకార్యాలు చేసిన
భగవాన్ శ్రీ సత్యసాయి
శివైక్యం చెందడం బాధాకరం.
వారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........మానవసేవే మాధవసేవ అంటూ ఎన్నో సమాజహితకార్యాలు చేసిన
భగవాన్ శ్రీ సత్యసాయి
శివైక్యం చెందడం బాధాకరం.
వారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు.
అమరుడైన బాబా గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ....
రిప్లయితొలగించండిజీవ మున్నంత కాలము సేవ జేసి
ఆశ్ర యమయి యభాగ్యుల కార్తి దీర్చి
మతము కులములు లేకుండ మనసు నెపుడు
స్మరణ మందినవాడె యమరు డనదగు.
మానవుని సేవ జేసిన మాధవునకె
రిప్లయితొలగించండిసత్య మైనట్టి ప్రేమయే నిత్య మగును
సాయి జూపిన మార్గాన చని యిహమున
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
_________________________________
సత్య ధర్మము కొఱకిల - సత్య సాయి
అంకితమ్మొనరించెగా - ఆత్మ సాక్షి !
జనుల కోసమె బ్రతికిన - జగతి లోన
మరణ మందినవాఁడె య - మరుఁ డనఁ దగు !
__________________________________
నిత్య సేవయే నిజమైన సత్య మనెడు
రిప్లయితొలగించండిసత్య సాయికి సాటియౌ సాధు వెవరు?
ప్రేమ పంచగా నేగెనో నమర పురికి,
మరణ మందిన వాడె యమరు డనదగు!
తనకు తనవార లకునిల దారి చూపు
రిప్లయితొలగించండివారె లోకంబు లంతట వాస్తవమ్ము;
పరుల ఆర్తినిఁ దీర్చుచుఁబతికి తుదకు
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు
సాయిబాబా శివైక్యం చెందడం బాధాకరం.
రిప్లయితొలగించండివారి పై నాకున్న ప్రేమను ఈ విధముగా తెలియజేస్తున్నాను
అడగకమునుపే వరమిచ్చి నాత్మ బంధు
నందరి మదిలో నుండగ; నాత్మ పోయి
శివుని జేరగ మరణమంచు బిలువ నిజ
మరణ మందిన వాడె యమరు డనదగు.
అపర భాగీరథుడు సాయి ; అనవరతము
రిప్లయితొలగించండిమానవాభ్యుదయమ్ముకై మనిన వాడు,
శాంతి సత్య అహింసల చాటినాడు;
మరణమందిన వాడె యమరు డనదగు.
మరణమది లేని వారలమరులు గాన
రిప్లయితొలగించండిమరణమొందిన వారలమరులెటులగు?
మంచితనమునకు కలదే మరణమేమి?
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు!!
రాజు లెందరొ పాలించి రాలి నారు
రిప్లయితొలగించండిధనికు లెందరొ రాణించి దాటి నారు,
వారి నెవ్వరు మదినెంచు వారు? ధరను
పేర్కొన ఘన దానములిడి పేద యగుచు
మరణమందిన వాఁడె యమరుఁ డనఁ దగు.
" గురువు గారూ , మందాకిని గారూ ! ధన్య వాదములు "
రిప్లయితొలగించండినా పూరణ .....
రిప్లయితొలగించండిఆలుబిడ్డలతో సుఖ మందకుండఁ
జేరె సైన్యములో దేశసేవ కొఱకు
యోధుఁడై సరిహద్దులో యుద్ధమందు
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
"మతము కులములు లేకుండ మనసు నెపుడు" ఈపాదం "కులమతమ్ములు లేక ప్రజల మనముల" అని ఉంటే ఎలా ఉంటుంది?
మిస్సన్న గారూ,
సజ్జనులకు ఇహమందే మరణ మని చక్కగా పూరంచారు. బాగుంది. అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
సత్పురుషులకు జగతిలోనే మరణ మని మీరూ మిస్సన్న గారి బాట పట్టారు. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమధురంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
"వారె లోకంబు లంతట వాస్తవమ్ము" అనే పాదం "వారె మెండు లోకమ్మున వాస్తవమ్ము" అంటే ఎలా ఉంటుంది? మూడవ పాదంలో "దీర్చుచు బ్రతికి" అనండి.
వరప్రసాద్ గారూ,
మంచి పద్యం చెప్పారు. అభినందనలు. మీ పద్యానికి (బ్రాకెట్లలో) నా సవరణలు ...
అడగకమునుపే వరమి(చ్చె) నాత్మ బంధు
(వం)దరి మది నుండగ; నాత్మ పోయి
శివుని జేర మరణమంచు (చెప్పగ) నిజ
మరణ మందిన వాడె యమరు డనదగు.
నాగరాజు రవీందర్ గారూ,
మంచి పూరణ. అభినందనలు.
కొన్ని చిన్న లోపాలు.
(అతఁ డపర భగీరథుఁ డ)నవరతము
మానవాభ్యుదయమ్ముకై మనిన (సాయి)
శాం(త్యహింసల సత్యము) చాటినాడు;
మరణమందిన వాడె యమరు డనదగు.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
గురువు గారికి వందనములు. సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅత డపర భగీరథుడయ్యె; ననవరతము
మానవాభ్యుదయమ్ముకై మనిన సాయి
శాంత్యహింసల సత్యము చాటినాడు;
మరణమందిన వాడె యమరుడనదగు.
మాస్టరు గారూ! ధన్య వాదములు.మీరు సూచించిన సవరణ బాగుంది.దానికి చిన్న సవరణతో ...
రిప్లయితొలగించండిజీవ మున్నంత కాలము సేవ జేసి
ఆశ్ర యమయి యభాగ్యుల కార్తి దీర్చి
కులముమతములు లేకుండ నిలచి మదిని
స్మరణ మందినవాడె యమరు డనదగు!
guruni madini nimpukoni
రిప్లయితొలగించండిguru sevalo jeevanammu gadipi
guruni lo aikyammagutaku tanuvu chaalinchi
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు- kota srinivas
కోట శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండి‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. చాలా సంతోషం. మీ భావానికి నా పద్యరూపం ...
గురుని మదిలోననే నింపుకొన్నవాఁడు
గురుని సేవలో తన బ్రతుకును గడుపుచు
గురునిలో నైక్యమగుటకు కోరి కోరి
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు.