అందరికీ వందనములు గురువు గారూ ధన్య వాదములు మీ సవరణలు అద్భుతం ! పని వత్తిడి వల్ల నేను సమస్యా పూరణంకు దూరంగా ఉన్నాను. సార్ నాకు తొహర అంటె ఏమిటొ చెప్పండి. ఇది నేను శ్రీ రామదాసు గారి చరిత్ర పుస్తకంలో చూసాను. రెండు పాదాలు ఉన్నవి, చివర || ఇది|| అంటూ వున్నది.
మందాకిని గారూ, మీ రెండు పూరణలూ బగున్నాయి. మొదటి పూరణలో బాబాయిని, రెండవ పూరణలో బబా అనే పేరున్న వ్యక్తిని భజనకు పంపారు. బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ, మీరు రజనీ బాబాను భజనకు పంపారు. పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
సనత్ శ్రీపతి గారూ, పద్యం గంగాప్రవాహంలా సాగింది. మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
వరప్రసాద్ గారూ, ఆ పదం ఇంతకు ముందు విన్నదే. కాని స్థూలంగా అర్థం ఇది అని తెలియదు. హిందీలో "దోహా" అని ఉంది. బహుశా "తొహరా" దోహాకు రూపాంతరం కావచ్చు. మిత్రు లెవరైనా స్పందిస్తారో వేచి చూడాలి.
బూబమ్మ నేను గలసియు బాబా సినిమాకు బిలువ - బాబో యంచున్ బాబా సినిమా వద్దని బాబాయే భార్యతోడ - భజనకు వెడలెన్ ! ___________________________________ బూబమ్మ , బాబా = నా స్నేహితులు
టాబూ యనిన మిగుల గా రాబము గల చక్రపాణి - రమ్మని పిలువన్ బాబోయ్ టాబూ వలదని బాబాయే భార్య తోడ - భజనకు వెడలెన్ ! ___________________________________ టాబూ = సినిమా నటి చక్రపాణి = మా తండ్రి గారి స్నేహితుడు బాబా = తండ్రి (అనే అర్థంలో)
బాబోయ్ మిస్సన్ గారూ ! సేబాసౌ పద్య రచన - చిత్రం మీదే ! మా బాగా వ్రాసేరే !!! బాబా మీకిచ్చు గాక - బంగర్గొల్సే ! ***** శంకరార్యా ! దీనిని సర్వగురు కందం అనవచ్చా ?
చంద్ర శేఖర్ గారూ! ' మిస్ ' అన్న గారు కదా! మిస్సన్న గారిని అపార్థం చేసుకుంటే యెలా! యెవరో ఒకరు మిస్సన్న గారి వైపు వకాల్తా పుచ్చు ' కోక పోతే 'యెలా! నేను మిస్సన్న గారి వైపే!
శాస్త్రిగారూ, మీ "కోక పొతే" హాస్యం పండింది. చాలా నవ్వుకొన్నాను. మిస్సన్న గారు నాకూ మిత్రులే. ఆయన హాస్యాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. మిత్రులు డా.గన్నవరపు మూర్తి గారు చెప్పినట్లు, "కవిత్వంలోనైనా మందు కొట్టి, కాలు జారపోతే ఎలాగండీ!" అని. మరి అంతేకదా "ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ...".
అందరికీ శతసహస్ర వందనాలు. ఈనాటి పూరణల, వ్యాఖ్యల వెల్లువ నాకు అపరిమితానందాన్ని కలిగించింది. పూరణలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, చంద్రశేఖర్, మందాకిని, మంద పీతాంబర్, సనత్ శ్రీపతి, వసంత కిశోర్, లక్కరాజు శివరామకృష్ణారావు, మిస్సన్న, జిగురు సత్యనారాయణ, రాజేశ్వరి నేదునూరి గారలకు ధన్యవాదాలు. అందరూ ఆహ్లాదకరమైన చర్చలో పాల్గొని "శంకరాభరణం" బ్లాగుకు వన్నె తెచ్చారు. ఎలాగూ గుణదోష చర్చ జరిగినందున నేను సమయాభావంతో విడివిడిగా పూరణలను వ్యాఖ్యానించడం లేదు. మరోసారి అందరికీ ధన్యవాదాలు.
బాబానే నమ్మడు మరి
రిప్లయితొలగించండిమాభారతి పిన్ని మగడు, మహిమ యదేమో!
వీబూది దాల్చి నేడిటు
బాబాయే;భార్య తోడ భజనకు వెడలెన్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ బాబోయ్ మీ బాబాయ్ పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
ఉన్న ఒక్క బాబాయిని మీరు లాక్కెళ్తే మిగతావారి కెవరు దిక్కు?
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
లక్కరాజు గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరార్యా! ధన్యవాదములు.
కవిమిత్రులకు నాకు అందరకు 'బాబాయే ' దిక్కగుగాక.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆబగ తిని పేకాటకు
రిప్లయితొలగించండిడాబుగ వెడలగను పిన్ని టప్పున లాగెన్
బాబు సహోదరుఁ,నాతడు
బాబాయే,-భార్యతోడ భజనకు వెడలెన్.
రాబోననినేఁదెలిపితి
రిప్లయితొలగించండిబాబే నాలోకమందు; భజనకొ, గుడికో
పోబోనిక క్షమి యించనఁ
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్
బాబా గుడికిన్ రజనీ
రిప్లయితొలగించండిబాబాయే భార్య తోడ భజనకు వెడెలెన్,
రాబోవు కాలమందున
బాబా మార్గమె జనులకు భాగ్యము గూర్చున్!
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిగురువు గారూ ధన్య వాదములు మీ సవరణలు అద్భుతం ! పని వత్తిడి వల్ల నేను సమస్యా పూరణంకు దూరంగా ఉన్నాను.
సార్ నాకు తొహర అంటె ఏమిటొ చెప్పండి. ఇది నేను శ్రీ రామదాసు గారి చరిత్ర పుస్తకంలో చూసాను. రెండు పాదాలు ఉన్నవి, చివర || ఇది|| అంటూ వున్నది.
గురువుగారూ నాకో సందేహం. ఒక సందర్భంలో మీర్ ప ఫ లకు ప్రాస చెల్లదని చెప్పారు.
రిప్లయితొలగించండిఅలా అయితే బ భ లకు ప్రాస చెల్లుతుందా.
బాబా తల్లియు తండ్రియు
రిప్లయితొలగించండిబాబా యే సఖుడు భక్త బంధువు జూడన్
బాబా దివ్యత్వమ్మది
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిబ, భ లకు కూడా ప్రాస చెల్లదు.
హనుమచ్ఛాస్త్రి, మందాకిని గారలు "భార్య"ను తెచ్చిన విషయాన్ని నేను గమనించలేదు.
బాబాయట పే రతనికి
రిప్లయితొలగించండిబాబా కేమో యిరువురు భార్యలు; యెపుడూ
బాబాకిక జగడములే;
బాబా యే భార్యతోడ భజనకు వెడలెన్?
మార్చేశాను గురువుగారూ, మిస్సన్నగారూ ,
రిప్లయితొలగించండితప్పును సూచించినందుకు ధన్యవాదాలు.
నా పూరణ ....
రిప్లయితొలగించండిమా బావ పేరు సాయీ
బాబా; పిలిచెదము మేము "బాబా!" యనుచున్,
సేబాసని జనులు పొగడ
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్.
చమ్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
మీ రెండు పూరణలూ బగున్నాయి.
మొదటి పూరణలో బాబాయిని, రెండవ పూరణలో బబా అనే పేరున్న వ్యక్తిని భజనకు పంపారు. బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
మీరు రజనీ బాబాను భజనకు పంపారు. పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
సనత్ శ్రీపతి గారూ,
పద్యం గంగాప్రవాహంలా సాగింది. మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
వరప్రసాద్ గారూ,
ఆ పదం ఇంతకు ముందు విన్నదే. కాని స్థూలంగా అర్థం ఇది అని తెలియదు. హిందీలో "దోహా" అని ఉంది. బహుశా "తొహరా" దోహాకు రూపాంతరం కావచ్చు. మిత్రు లెవరైనా స్పందిస్తారో వేచి చూడాలి.
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
___________________________________
బాబా లిర్వుర పూన్చిన
బాబా నెక్కేగినాను - బాబా గుడికే
బాబా సందర్శింపగ !
బాబాయే భార్యతోడ - భజనకు వెడలెన్ !
___________________________________
బాబా = గుఱ్ఱము = బండి
దంపతులైన రెండు గుఱ్ఱాలను కట్టిన బండి మీద
బాబాను దర్శించడానికి నేను బాబా గుడికి వెళ్తే
నాతోపాటూ నాబాబా(గుఱ్ఱం)కూడా తన భార్యతో
భజనకు వచ్చిందని నా భావం !
02)
రిప్లయితొలగించండి___________________________________
బాబాయే షిరిడి ! పిదప
బాబాయే పుట్టపర్తి - వరలెను విభుడై !
ఏ బంధం లేకెటులను
బాబాయే భార్యతోడ - భజనకు వెడలెన్ ???
___________________________________
03)
రిప్లయితొలగించండి___________________________________
బూబమ్మ నేను గలసియు
బాబా సినిమాకు బిలువ - బాబో యంచున్
బాబా సినిమా వద్దని
బాబాయే భార్యతోడ - భజనకు వెడలెన్ !
___________________________________
బూబమ్మ , బాబా = నా స్నేహితులు
04)
రిప్లయితొలగించండి___________________________________
బాబూ సినిమా కొద్దుర !
బాబా భజనలు సలిపిన - భాగ్యము గలుగున్ !
బాబూ మాతో రమ్మని
బాబాయే భార్యతోడ - భజనకు వెడలెన్ !
___________________________________
05)
రిప్లయితొలగించండి___________________________________
టాబూ యనిన మిగుల గా
రాబము గల చక్రపాణి - రమ్మని పిలువన్
బాబోయ్ టాబూ వలదని
బాబాయే భార్య తోడ - భజనకు వెడలెన్ !
___________________________________
టాబూ = సినిమా నటి
చక్రపాణి = మా తండ్రి గారి స్నేహితుడు
బాబా = తండ్రి (అనే అర్థంలో)
06)
రిప్లయితొలగించండి___________________________________
బాబాయే భగవంతుడు
బాబాయే తల్లి దండ్రి - భాగ్యం బిలలో !
బాబాయే సర్వంబని
బాబాయే భార్య తోడ - భజనకు వెడలెన్ !
___________________________________
బాబాయి అనే అర్థంలో
బూబమ్మ నేను గలసియు
రిప్లయితొలగించండిబాబా సినిమాకు బిలువ - బాబో యంచున్
బాబా సినిమా వద్దని
బాబాయే భార్యతోడ - భజనకు వెడలెన్ !
--------
వసంత కిశోర్ గారూ Terrific.
చిన్న సవరణతో :
రిప్లయితొలగించండి07)
___________________________________
బాబా యను దొంగ , కపటి
బాబా వేషంబు వేసి - బన్నము బరపున్ !
ఛీ ! బాబా ! ఛీ ! యన్నను
బాబాయే భార్య తోడ - బారుకు వెడలెన్ !
___________________________________
బన్నము = మోసము
బాబా = దొంగ సన్యాసి (అనే అర్థంలో)
రావు గారూ !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిశహబాష్ !
అబ్బా మిస్సన్న గారూ ఏమి ట్రిక్ వేసారండి !
రిప్లయితొలగించండిమిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిచివరి పాదం
"బాబా గొలుసిచ్చుననెడి - భావన మదిలో"
అంటే సరిగ్గా ఉంటుంది గదా
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండియతి ?
బాబూ! నాస్తికు డౌ మా
రిప్లయితొలగించండిబాబాయే భార్యతోడ భజనకు వెడలెన్
సేబాసు! కిటుకు తెలుసా?
బాబా గొలుసిచ్చు ననెడి వాంఛను మదిలో.
తప్పుకు చింతిస్తూ, దిద్దుకొన్నాను.
కానీ సంతోషం ఏమిటంటే అందరూ భలే కాచుకొని కూర్చున్నారు.
బాబోయ్ మిస్సన్ గారూ !
రిప్లయితొలగించండిసేబాసౌ పద్య రచన - చిత్రం మీదే !
మా బాగా వ్రాసేరే !!!
బాబా మీకిచ్చు గాక - బంగర్గొల్సే !
*****
శంకరార్యా !
దీనిని సర్వగురు కందం అనవచ్చా ?
వసంత మహోదయా సూచనకు ధన్య వాదాలు,
రిప్లయితొలగించండిలక్క రాజు వారూ ధన్యవాదాలు.
మందాకినీ గారూ ధన్యవాదాలు.
తప్పును సరిజేశా.
కిశోర మహోదయా భలే ఉంది నామీద పద్యం! సేబాసు!.
రిప్లయితొలగించండిలేబాలను చేపట్టెన్
రిప్లయితొలగించండిపూబాల యనుచు వలపున పూర్తిగ మునిగెన్
నేబారుకు పోయెదనను
బాబాయే-భార్యతోడ భజనకు వెడలెన్.
చిరుజల్లు: ఎంతవారలైన కాంత దాసులే (పెళ్ళైన క్రొత్తల్లో).
మిస్సన్న మహాశయా
రిప్లయితొలగించండి"వాంఛ" కన్నా" భావన" బలం గదా !?
..."కానీ సంతోషం ఏమిటంటే అందరూ భలే కాచుకొని కూర్చున్నారు"-మరి, దేన్నీ మిస్సవ్వని మిస్సన్నగారే మిస్ అయితే ఇంకేమయినా వుందా, కొంపలు ముణిగిపోవూ!
రిప్లయితొలగించండినా కయితే "వాంఛ" నచ్చింది. గట్టిగా కావాలని అనుకోటం. "భావన" ఏముంది జస్ట్ ఊహించటం.
రిప్లయితొలగించండిరకరకాలుగా ' బాబా(యి)ని భజనకు పంపిన ' కవి మిత్రులందరకు అభినందనలు.ఉదయం అనుమానిస్తూనే' భా' వాడాను. తప్పును తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన మిస్సన్న గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో మరల .....
బాబానే నమ్మడు మరి
మా బాలా పిన్ని మగడు, మహిమ యదేమో!
వీబూది దాల్చి నేడిటు
బాబాయే;భార్య తోడ భజనకు వెడలెన్!
చంద్ర శేఖరుని మాటను కాదనే ధైర్యం నాకు లేదు !!!
రిప్లయితొలగించండివసంత మహోదయా! రావు గారి భావనతో ఏకీ భావిస్తున్నాను.
సవరించిన తర్వాత
మందాకిని గారి పద్యం, హనుమచ్చాస్త్రి గారి పూరణ
చాలా బావున్నాయి.
కిశోర్ మహోదయుని పద్య పరంపర సరేసరి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రశేఖరా !
రిప్లయితొలగించండిమిస్సన్న గారు మిస్సును మిస్సవ్వలేదని
ఒప్పుకుంటున్నారు !
ఎవరా మిస్సు ? ఏమాకథ ?
తెలుసుకోవచ్చా ?
అందరి బాబాయిలు ఏమో గాని, మా బాబాయి మాత్రము చాలా చిలిపి....
రిప్లయితొలగించండిబాబాయికి పర కాంతల
ఫోబియ, గుడిలో భజనకు పోరీలంతా
డాబుగ వచ్చునని తెలిసి
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్!!
జిగురు సత్యనారాయణ గారూ బాబాయి పాపం భార్యతో భజనకి వెళ్తూన్నాదండీ చెడు ఆలోచనలన్నీ మనస్సులో పెడుతున్నారు. సౌందర్యా పోషణ అంత చెడ్డదేమీ కాదనుకొండీ.
రిప్లయితొలగించండిమిస్సన్నగారూ, ఒప్పుకొంటే సరిపోతుంది గదా, తేలికగా తప్పించు కోవచ్చు అన్నట్లుంది.పోనీలెండి ఆ రకంగా నయినా ఒప్పు 'కోక' తప్పలేదు:-)
రిప్లయితొలగించండివసంత మహోదయా! ఏం చెప్పమంటారూ, యెన్ని కథలని చెప్పమంటారూ! కడుపు చించుకొంటే 'మిస్' అయి ఎక్కడ పడుతుందో అని భయం (నవ్వుతూ)!
చంద్ర శేఖర్ గారూ! ' మిస్ ' అన్న గారు కదా! మిస్సన్న గారిని అపార్థం చేసుకుంటే యెలా! యెవరో ఒకరు మిస్సన్న గారి వైపు వకాల్తా పుచ్చు ' కోక పోతే 'యెలా! నేను మిస్సన్న గారి వైపే!
రిప్లయితొలగించండిబాబాయి లందరు కలసి
రిప్లయితొలగించండిబూ బమ్మల బేబమ్మల తలచి భయమే వీడన్ !
మా భాను పిన్ని మగడు
బాబాయే భార్య తోడ భజనకు వెడలెన్ !
శాస్త్రిగారూ, మీ "కోక పొతే" హాస్యం పండింది. చాలా నవ్వుకొన్నాను. మిస్సన్న గారు నాకూ మిత్రులే. ఆయన హాస్యాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. మిత్రులు డా.గన్నవరపు మూర్తి గారు చెప్పినట్లు, "కవిత్వంలోనైనా మందు కొట్టి, కాలు జారపోతే ఎలాగండీ!" అని. మరి అంతేకదా "ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ...".
రిప్లయితొలగించండిఅందరికీ శతసహస్ర వందనాలు.
రిప్లయితొలగించండిఈనాటి పూరణల, వ్యాఖ్యల వెల్లువ నాకు అపరిమితానందాన్ని కలిగించింది.
పూరణలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, చంద్రశేఖర్, మందాకిని, మంద పీతాంబర్, సనత్ శ్రీపతి, వసంత కిశోర్, లక్కరాజు శివరామకృష్ణారావు, మిస్సన్న, జిగురు సత్యనారాయణ, రాజేశ్వరి నేదునూరి గారలకు ధన్యవాదాలు.
అందరూ ఆహ్లాదకరమైన చర్చలో పాల్గొని "శంకరాభరణం" బ్లాగుకు వన్నె తెచ్చారు. ఎలాగూ గుణదోష చర్చ జరిగినందున నేను సమయాభావంతో విడివిడిగా పూరణలను వ్యాఖ్యానించడం లేదు.
మరోసారి అందరికీ ధన్యవాదాలు.
బూబమ్మల మేలు కొరకు
రిప్లయితొలగించండిబాబా గారికి గురువిట భాగ్యపు నగరిన్
బీబీ తోడుత రాగా
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్
రిప్లయితొలగించండితోబా తోబా అంటూ
బీబీ నీవే జిలేబి వీయని యనుచున్
కాబూలీవాలా మా
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్!
జిలేబి